ట్రంప్-మోదీ దోస్తీపై సయీద్ ఫైర్!
ట్రంప్ సర్కార్ ఒత్తిడితో ఉగ్రవాద సూత్రధారి హఫీజ్ సయీద్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ అధికారులు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ముంబై దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దావా (జేయూడీ) అధినేత అయిన సయీద్‌ను పాక్ పోలీసులు ఆదివారం రాత్రి గృహనిర్బంధంలో ఉంచారు.
అయితే, లాహోర్‌లోని తన నివాసంలోనే గృహనిర్బంధంలో ఉన్న సయీద్ ఒక వీడియో ఫుటేజ్‌ను విడుదల చేశాడు. అమెరికా-భారత్ మధ్య అనుబంధం బలపడుతుండటమే తన హౌజ్ అరెస్టుకు కారణమని ఆయన ఈ వీడియోలో నిందించాడు. తనను అరెస్టు చేయాలని పాక్ ప్రభుత్వంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి తెచ్చారని, తద్వారా భారత ప్రధాని మోదీతో ఆయన తన స్నేహాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు జేయూడీ అధికారి అహ్మద్ నదీమ్ మాట్లాడుతూ కూడా ఇదేవిధంగా అమెరికా, భారత్‌పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అమెరికా, భారత్‌లను సంతృప్తిపరిచేందుకు సయీద్‌ను పాక్ ప్రభుత్వం అరెస్టు చేసిందని, జేయూడీ కార్యాలయం వద్ద భారీగా బలగాలను మోహరించి తమను భయపెడుతున్నదని ఆయన విమర్శించారు.
దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి
(అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..)
(ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్)
(ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు)
(ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!)
(అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి)
(ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా?)
(ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!)
(ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!)
(వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా)