
వచ్చినది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులా?
పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లా దీనానగర్ పోలీసు స్టేషన్ వద్ద కాల్పులు జరిపి ఏడుగురి మృతికి కారణమైనది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
పోలీసు స్టేషన్లోకి చొరబడే ముందు వాళ్లు ఐఎస్ఐఎస్ అనుకూల నినాదాలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లష్కరే తాయిబా ప్రోద్బలంతో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాడిచేసే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాయి.