punjab terror attack
-
ఎస్పీకి పాలిగ్రాఫ్ పరీక్షలు?
పఠాన్‌కోట్ ఉగ్రదాడి విషయంలో గురుదాస్‌పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్‌కు పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఆయన నుంచి నిజాలు రాబట్టాలంటే ఈ టెస్టు చేయాలని ఎన్ఐఏ భావిస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు తన కారును హైజాక్ చేసి, తనను కొట్టి పారేశారని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. వాళ్లు తన సెల్‌ఫోన్ కూడా లాక్కోవడంతో తనకు ఏం చేయాలో అర్థం కాలేదని అన్నారు. తాను తరచు పఠాన్‌కోట్‌లోని గురుద్వారాకు వెళ్తుంటానని, అలా వెళ్లి వస్తుంటేనే తన కారును హైజాక్ చేశారని సల్వీందర్ చెప్పారు. అయితే, గురుద్వారా కేర్‌టేకర్ సోమరాజ్ మాత్రం, ఆయనను తొలిసారి డిసెంబర్ 31నే చూశానని అన్నారు. సల్వీందర్ గతంలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. దానిపై ఐజీ స్థాయి అధికారి ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు కూడా సల్వీందర్ చెబుతున్న విషయాలకు ఒకదానికి, మరోదానికి పొంతన కుదరడం లేదు. అందుకే ఆయనను బెంగళూరు లేదా ఢిల్లీ తీసుకెళ్లి పాలిగ్రాఫ్ టెస్టు చేయించాలని భావిస్తున్నట్లు ఎన్ఐఏకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే.. అందుకు సల్వీందర్ తన అంగీకారం తెలిపారా లేదా అన్న విషయం మాత్రం ఇంతవరకు తెలియలేదు. తన వ్యక్తిగత వాహనానికి నీలిరంగు సైరన్ లైటు పెట్టుకోకూడదని తెలిసినా, ఆయన ఎందుకు పెట్టుకున్నారన్న అంశంపై కూడా ఎన్ఐఏ విచారణ చేస్తోంది. ఆ వాహనంలోనే ఉగ్రవాదులు పోలీసు చెక్‌పోస్టులను ఎలాంటి ఇబ్బంది లేకుండా దాటేశారు. ఈ కేసు గురించి తనకేమీ తెలియదని.. తాను కూడా వాళ్ల బాధితుడినేనని మాత్రమే ఇంతవరకు సల్వీందర్ చెబుతూ వస్తున్నారు. సల్వీందర్‌ను సస్పెండ్ చేయలేదని మాత్రం పంజాబ్ డీజీపీ సురేష్ అరోరా చెప్పారు. -
ఫేస్బుక్లో అమరుడిపై వ్యాఖ్యలు.. అరెస్టు
పఠాన్‌కోట్‌లో వీరోచితంగా పోరాడి అమరుడైన ఎన్ఎస్జీ కమాండో లెఫ్టినెంట్ కల్నల్ ఈకే నిరంజన్ గురించి ఫేస్బుక్లో అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు కేరళలోని ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన అన్వర్ సాదిఖ్ (24) అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు చెవయూర్ పోలీసులు తెలిపారు. అతడు నకిలీ పేరుతో ఫేస్బుక్ ఐడీ క్రియేట్ చేసుకున్నాడని, మధ్యమం అనే దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నట్లు చెప్పాడని అన్నారు. అయితే తమ పత్రికలో అలాంటివాళ్లు ఎవరూ లేరని పత్రిక వర్గాలు తెలిపాయి. దాంతో పోలీసులు విచారణ జరిపి, సాదిఖ్‌ను అరెస్టు చేశారు. అతడు ఫేస్బుక్లో చేసిన వ్యాఖ్యలు దేశవ్యతిరేకంగా ఉన్నాయని, అయితే తాను చేసింద నేరమన్న విషయం తనకు తెలియదని అతడు చెబుతున్నాడని చెప్పారు. ఫేస్బుక్లో సాదిఖ్ చేసిన వ్యాఖ్యలు లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ను అవమానించేలా ఉన్నాయి. వీటితో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. -
వాళ్ల వద్ద ఏకే 47లు, జీపీఎస్: ఎస్పీ
-
ఆపరేషన్ ముగిసినట్లేనా?
పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదులను ఏరివేసే ఆపరేషన్ మొత్తం ముగిసినట్లేనా? ఇక అక్కడ ఉగ్రవాదులు ఎవరూ లేరని కచ్చితంగా నిర్ధారణకు వచ్చినట్లేనా? తాజా పరిణామాలు చూస్తే అవుననే అనుకోవాలి. రక్షణమంత్రి మనోహర్ పారిక్కర్, ఆర్మీ చీఫ్‌తో పాటు ఎయిర్ చీఫ్ మార్షల్ కూడా మంగళవారం పఠాన్‌కోట్ వెళ్తున్నారు. ఇంత ఉన్నతస్థాయి బృందం అక్కడకు వెళ్తోందంటే.. ఆ ప్రాంతం మొత్తం క్లీన్‌గా ఉన్నట్లేనని సైనిక వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో మందుపాతరల లాంటివి ఏమైనా పెట్టారా అనే విషయం మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌బేస్ మొత్తం 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండటంతో.. ఈ మొత్తం ప్రాంతాన్ని గాలించడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టేలా ఉంది. భద్రతా లోపాలు ఉన్నాయి.. కాగా, భద్రాతపరమైన లోపాల వల్లే ఈ ఉగ్రదాడి జరిగిందని కేంద్రం అంతర్గత సమావేశాల్లో అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. నిఘా హెచ్చరికలను పెద్దగా పట్టించుకోలేదని, అలాగే అపహరణకు గురైన ఎస్పీ చెప్పిన విషయాన్ని కూడా సీరియస్‌గా తీసుకోకపోవడం వల్లే ఉగ్రవాదులు అక్కడివరకు రాగలిగారని అంటున్నారు. ఇందుకు బాధ్యులపై చర్యలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి. మంగళవారం ఉదయం మరోసారి హోంశాఖ ఉన్నతాధికారులతో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. -
ఆపరేషన్ ముగిసినట్లేనా?
-
ఉగ్రదాడి వెనుక కుట్రకోణం!
-
వాళ్ల వద్ద ఏకే 47లు, జీపీఎస్: ఎస్పీ
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ మీద దాడి చేసిన ఉగ్రవాదులను ఆ దాడికి ముందే చూసిన ఏకైక వ్యక్తి.. గురుదాస్‌పూర్ జిల్లా ఎస్పీ సల్వీందర్ సింగ్. ముందురోజే ఉగ్రవాదులు ఆయనమీద దాడిచేసి, ఆయన కారు లాక్కుని అందులోనే పఠాన్‌కోట్ వరకు వెళ్లారు. తొలుత ఎవరో దోపిడీ దొంగల పని అనుకున్నా.. తర్వాత మాత్రం వాళ్లే ఉగ్రవాదులని తెలిసింది. ఎస్పీ సల్వీందర్ సింగ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఉన్నట్టుండి తమ కారుకు అడ్డంగా కొందరు రావడంతో కారు ఆపామని, నలుగురైదుగురు వ్యక్తులు తన వద్దకు వచ్చారని ఆయన చెప్పారు. వెనక్కి జరగమని గట్టిగా చెప్పారన్నారు. వాళ్లు మిలటరీ జాకెట్లు వేసుకుని ఉన్నా.. టెర్రరిస్టులేనని అర్థం అయ్యిందన్నారు. ఉర్దూలో మాట్లాడుతూ తమను బాగా వెనకసీటు వద్దకు పంపేసి.. తమ ముఖాలను కూడా కిందకు వంచేశారన్నారు. పైకి చూసినా, ఏమైనా మాట్లాడినా కాల్చిపారేస్తామని బెదిరించినట్లు తెలిపారు. వాళ్ల వద్ద ఏకే-47 తుపాకులు ఉన్నాయని, జీపీఎస్ పరికరాలు కూడా ఉండటంతో పఠాన్‌కోట్ దారి తనను అడగలేదని తెలిపారు. వాళ్లు ఉర్దూ, హిందీ, పంజాబీ భాషల్లో మాట్లాడారని, తన మొబైల్ ఫోన్ కూడా లాక్కున్నారని అన్నారు. తన కళ్లకు గంతలు కట్టేశారని, దాంతో తర్వాత వాళ్లు ఏ ఫోన్లో మాట్లాడారో, ఏం జరిగిందో చూడలేకపోయానని అన్నారు. వాళ్లు తమ కమాండర్‌తో మాట్లాడినట్లు అర్థమైందని, సలాం, ఆలేకుం సలాం అన్నారని సల్వీందర్ చెప్పారు. అయితే.. వాళ్లకు తాను జిల్లా ఎస్పీనని తెలియదని కూడా ఆయన తెలిపారు. -
ఉగ్రదాడి వెనుక కుట్రకోణం!
ఉగ్రవాదులు భారత సైనిక దుస్తుల్లో అసలు పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ వరకు ఎలా రాగలిగారు? లోపల మ్యాప్ మొత్తం వాళ్ల వద్దకు ఎలా వచ్చింది? లోపల ఉన్నవాళ్లు ఎవరైనా ఉగ్రవాదులకు ఉప్పందించారా? సరిగ్గా ఇవే అనుమానాలు సామాన్య ప్రజల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వరకు అందరికీ వచ్చాయి. దాంతో దాడి వెనుక కుట్రకోణంపై దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ మూడు కేసులు నమోదు చేసింది. జనవరి ఒకటోతేదీన దాడి ప్రారంభం దగ్గర నుంచి అన్ని కోణాల్లోనూ దీనిపై దర్యాప్తు చేయిస్తున్నట్లు ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ శరద్ కుమార్ తెలిపారు. ఐజీ ర్యాంకులో ఉన్న ఓ అధికారి నేతృత్వంలోని 20 మంది సభ్యుల బృందం ఇప్పటికే పఠాన్‌కోట్ చేరుకుంది. ఆరుగురు ఉగ్రవాదుల ఫొటోలు, పేర్లు ఈ బృందం వద్ద ఉన్నాయని, వాళ్ల హ్యాండ్లర్లను కూడా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని శరద్ కుమార్ చెప్పారు. మూడు కేసుల్లో తొలుత ఎస్పీ సల్వీందర్ సింగ్‌పై దాడి అంశాన్ని పరిశీలిస్తారు. రెండో కేసులో టాక్సీ డ్రైవర్ ఇకాగర్ సింగ్ హత్యను దర్యాప్తు చేస్తారు. ఇక మూడోది.. అత్యంత ముఖ్యమైనది ఎయిర్‌బేస్ మీద ఉగ్రదాడి కేసు. -
ముష్కరులు హతం
పఠాన్‌కోట్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదుల ఏరివేత ♦ ఆరుకు పెరిగిన ఉగ్రవాదుల సంఖ్య.. ఎయిర్‌బేస్‌లో కొనసాగుతున్న ఆపరేషన్ ♦ వైమానిక స్థావరంలో అణువణువూ కూంబింగ్ చేస్తాం: భద్రతా బలగాలు ♦ వ్యూహాత్మక వైమానిక దళ ఆస్తులకు భారీ నష్టమేదీ జరగలేదని వెల్లడి ♦ పఠాన్‌కోట్‌పై దాడి మాదే: పాక్‌లోని యునెటైడ్ జిహాదీ కౌన్సిల్ ప్రకటన ♦ అది పాక్ ముష్కరుల నుంచి దృష్టి మళ్లించే ఎత్తుగడన్న రక్షణ నిపుణులు ♦ ప్రధాని అధ్యక్షతన జాతీయ భద్రతా మండలి భేటీ.. ఉగ్రదాడులపై చర్చ పఠాన్‌కోట్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై శనివారం తెల్లవారు జామున ఉగ్రవాదుల దాడితో మొదలైన సైనిక చర్య వరుసగా మూడో రోజు సోమవారమూ కొనసాగింది. ఎయిర్‌బేస్‌లో వైమానికదళ సిబ్బంది నివసించే రెండంతస్తుల భవనంలో ఉగ్రవాదులు దాక్కున్నారు. వారిని ఏరివేసేందుకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్, వైమానిక దళం, సైనిక విభాగాలకు చెందిన భద్రతా బలగాలు రాకెట్ లాంచర్ల వంటి భారీ ఆయుధ సంపత్తితో ఆపరేషన్‌ను తీవ్రం చేశాయి. ఆదివారం రాత్రి కూడా హెలికాప్టర్లతో గాలింపు, పహారా కొనసాగించిన భద్రతా దళాలు.. సోమవారం ప్రధాన యుద్ధ శక్తులన్నిటినీ ఈ ఆపరేషన్ కోసం మోహరించాయి. పంజాబ్ పోలీసులు, నిఘా సంస్థలు కూడా కూడా సహకారమందించాయి. పొద్దున్నుంచీ సాయంత్రం దాక వరుస విరామాలతో పలుమార్లు కాల్పులు, పేలుళ్లు వినిపించాయి. ఉగ్రవాదులు దాక్కున్న భవనం భారీ పేలుడుతో దద్దరిల్లింది. రాత్రయ్యాక.. భవనంలో దాక్కున్న ఇద్దరు ఉగ్రవాదులూ హతమైనట్లు భధ్రతా దళాలు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించాయి. అయితే.. ఈ ఆపరేషన్‌లో హతమైన ఉగ్రవాదుల సంఖ్యపైనా, అమరులైన భద్రతా సిబ్బంది సంఖ్య పైనా తొలి రోజు శనివారం నుంచీ భిన్నమైన వార్తలు వెలువడుతున్నాయి. స్థావరంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు ఎంతమంది అన్న సంఖ్యపై స్పష్టత లేనప్పటికీ.. మొత్తం ఆరుగురని ఆదివారం నాడు ఆపరేషన్ నిర్వహిస్తున్న అధికారులు పేర్కొన్నారు. శనివారం నాడే నలుగురు ఉగ్రవాదులు హతమవగా.. సోమవారం రాత్రికి మరో ఇద్దరిని హతమార్చటంతో ఉగ్రవాదులను మొత్తంగా నిర్మూలించినట్లు పరిగణిస్తున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం కానీ, ఆపరేషన్‌లో పాల్గొంటున్న అధికారులు కానీ.. ఎయిర్‌బేస్‌లో ఉగ్రవాదులెవరూ ప్రాణాలతో లేరని, ఆపరేషన్ముగిసిందని ప్రకటించటానికి సిద్ధంగా లేరు. భద్రమని తేల్చే వరకూ ఆపరేషన్... ‘‘కూంబింగ్, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్థావరంలోని సిబ్బంది అందరినీ, ఆస్తులన్నిటినీ, నిర్మాణాలన్నిటినీ ప్రత్యక్షంగా క్షుణ్నంగా తనిఖీ పూర్తిచేసి ఎయిర్‌బేస్ భద్రంగా ఉందని నిర్ధారించుకునే వరకూ ఆపరేషన్ కొనసాగుతుంది’’ అని ఎన్ఎస్జీ ఐజీ మేజర్ జనరల్ దుషాంత్సింగ్ సోమవారం సాయంత్రం పఠాన్‌కోట్‌లో విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆయన అంతకుముందు కూడా ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ కమొడోర్ జె.ఎస్.దామూన్, బ్రిగేడియర్ అనుపీందర్సింగ్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎయిర్‌బేస్‌లోని వ్యూహాత్మక వైమానిక దళ ఆస్తులకు భారీ నష్టమేదీ వాటిల్లలేదని చెప్పారు. ‘‘వైమానిక దళ స్థావరం చాలా విశాలమైన ప్రదేశం. వైమానిక దళానికి చెందిన వ్యూహాత్మక ఆస్తులు ఇందులో ఉన్నాయి. ఐఏఎఫ్ సిబ్బంది కుటుంబాలు, పాఠశాలలు కూడా ఇందులో ఉన్నాయి.. ఇదొక మినీ నగరం. వైమానిక దళానికి చెందిన వ్యూహాత్మక ఆస్తులను లక్ష్యంగా చేసుకోవటానికి ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో పూర్తిగా సిద్ధమై వచ్చారు’’ అని ఐఏఎఫ్ అధికారి వివరించారు. ఈ ఉగ్రవాదులు సుశిక్షితులు.. భారీ ఆయుధాలు... పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి దిగిన ఉగ్రవాదులు సుశిక్షితులని.. వైమానిక స్థావరంలో ఉన్న మిగ్ 21 ఫైటర్ విమానాలు, ఎంఐ 25 యుద్ధ హెలికాప్టర్లను ధ్వంసం చేసే లక్ష్యంతో బలమైన ఆయుధ సంపత్తితో వచ్చారని.. అందుకే వారిని ఏరివేసే ఆపరేషన్ సుదీర్ఘంగా సాగుతోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 2008లో ముంబైలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులకన్నా కూడా ఈ ఉగ్రవాదులు మరింత సుశిక్షితులని చెప్పాయి. ఉగ్రవాదులు ఏకే47 రైఫిళ్లు, అండర్ బారెల్ గ్రెనేడ్ లాంచర్లు (యూబీజీఎల్), 52 ఎంఎం మోర్టార్లు, జీపీఎస్ వ్యవస్థలు వెంట తెచ్చుకుని దాడికి దిగారని తెలిపాయి. అలాగే.. మరణాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలనిప్రధాని మోదీ, రక్షణమంత్రి పారికర్‌లు ఇచ్చిన కచ్చితమైన సూచనలు కూడా ఆపరేషన్ మూడు రోజుల పాటు కొనసాగటానికి కారణమని వివరించాయి. ‘ఉగ్ర’ వేటపై ప్రధాని సమీక్ష...: పఠాన్‌కోట్, అఫ్గానిస్తాన్‌లలో ఉగ్రవాదుల దాడులు, వారిని నిలువరించేందుకు భద్రతా బలగాల ఆపరేషన్లపై ప్రధాని మోదీ సోమవారం జాతీయ భద్రతా మండలి భేటీ నిర్వహించి చర్చించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్గోవల్, విదేశాంగ కార్యదర్శి జైశంకర్‌లతో పాటు.. భద్రతపై కేబినెట్ కమిటీ సభ్యులైన రక్షణమంత్రి మనోహర్‌పారికర్, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. రెండు చోట్ల కొనసాగుతున్న ఆపరేషన్ల గురించి ఉన్నతాధికారులు మోదీకి వివరించారు. దాడి చేసింది మా వాళ్లే: యూజేసీ శ్రీనగర్: ‘పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది మా నేషనల్ హైవే స్క్వాడ్’ అని యూజేసీ అధికార ప్రతినిధిగా చెప్పుకుంటూ సయ్యద్ సదాకత్ హుస్సేన్ అనే వ్యక్తి కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో మీడియాకు ఈ-మెయిల్ పంపించారు. అయితే.. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల సంఖ్య వివరాలేవీ చెప్పలేదు. అయితే.. యూజీసీ పేరుతో వచ్చిన ఈ-మెయిల్ విశ్వసనీయతపై భారత భద్రతా నిపుణులు సందేహం వ్యక్తంచేశారు. ఈ దాడి పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ పనేనని బలంగా భావిస్తున్నారు. ఉగ్రదాడి పాక్ నుంచి జరుగుతోందన్న అంశం నుంచి దృష్టి మరల్చే ఎత్తుగడలో భాగంగా యూజేసీ పేరును తెరపైకి తెచ్చారని అభిప్రాయపడుతున్నారు. ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చిన వారు కాదని.. కశ్మీర్‌కు చెందిన వారని చూపించే ప్రయత్నంలో భాగమని భావిస్తున్నారు. స్మగ్లర్ల అండతో చొరబాటు! పఠాన్‌కోట్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు.. డ్రగ్స్ స్మగ్లర్ల సాయంతో భారత్‌లో ప్రవేశించి ఉండొచ్చని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాదులు వాడిన ఆయుధాలను వారు భారత్‌లోకి చొరబడకముందే పాక్ నుంచి దేశంలోకి తరలించి ఉండొచ్చని భావిస్తున్నారు. నకిలీ భారత కరెన్సీ, మాదకద్రవ్యాలు, ఆయుధాలను అక్రమ రవాణా చేసే వ్యవస్థీకృత ముఠాలు.. సరిహద్దుకు ఇరువైపులా ఉగ్రవాదులకు సాయపడి ఉండొచ్చని చెప్తున్నారు. ఆయుధాలను కూడా చాలా ముందుగానే డ్రగ్స్ స్మగ్లర్ల ద్వారా భారత్‌లోకి తరలించి.. ఒకచోట దాచివుంచితే ఉగ్రవాదులు సరిహద్దు దాటి వచ్చివాటిని తీసుకుని దాడికి దిగి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ స్మగ్లింగ్ ముఠాల్లో కొందరు భద్రతా సిబ్బంది పాత్రను కొట్టేయలేమని..నిఘా వర్గాలు పేర్కొన్నాయి. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి తెగబడిన ఉగ్రవాదుల్లో మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మూడో రోజైన సోమవారం హతమార్చాయి. దీంతో మొత్తం హతులైన ఉగ్రవాదుల సంఖ్య ఆరుకు పెరిగింది. అయితే.. ఎయిర్‌బేస్‌లో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. స్థావరాన్ని పూర్తిగా జల్లెడ పడుతూ ఎన్ఎస్జీ, సైన్యం, వైమానిక దళ బృందాలు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. స్థావరం పూర్తిగా సురక్షితమని నిర్ధారించుకునే వరకూ ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టంచేశాయి. పఠాన్‌కోట్‌లో దాడి చేసింది తామేనని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న యునెటైడ్ జిహాదీ కౌన్సిల్ అనే పలు కశ్మీరీ ఉగ్రవాద సంస్థల కూటమి సోమవారం ప్రకటించింది. ఒకవైపు పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదులతో భారత బలగాలు పోరాడుతుండగానే ఆదివారం రాత్రి అఫ్గానిస్తాన్‌లోని మజారే షరీఫ్‌లో భారత దౌత్యకార్యాలయంపైనా ఉగ్రవాదులు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఉగ్రవాదులను కార్యాలయం వెలుపలే నిలువరించిన భద్రతా బలగాలు.. ముగ్గురు ముష్కరులను హతమార్చాయి. మరో ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు సమీపంలోని ఒక భవనంలో దాక్కుని కాల్పులు జరుపుతుండటంతో వారిపై అఫ్గాన్ భద్రతా బలగాలు, కమాండోలు సైనిక చర్య చేపడుతున్నాయి. భారత దౌత్య కార్యాలయంలో సిబ్బంది అంతా క్షేమంగానే ఉన్నారు. ఇటు పఠాన్‌కోట్.. అటు మజారే షరీఫ్‌లో భారత్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన నేపథ్యంలో.. భారత్ - పాక్‌ల మధ్య జరగాల్సిన విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం తొలుత ఉన్నత స్థాయి సమావేశం, ఆ తర్వాత జాతీయ భద్రతా మండలి సమావేశం నిర్వహించి పఠాన్‌కోట్, మజారే షరీఫ్ దాడులు, సైనిక చర్యలు, ఇతర పరిణామాలపై చర్చించారు. -
సిబ్బంది క్వార్టర్స్‌లో నక్కిన ఉగ్రవాదులు
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో సిబ్బంది క్వార్టర్స్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు దాగి ఉండొచ్చని, వాళ్లను అంతం చేసేందుకు ఆపరేషన్ కొనసాగుతోందని ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్ఎస్జీ దళాలకు చెందిన సీనియర్ అధికారులు తెలిపారు. ఎన్ఎస్జీకి చెందిన మేజర్ జనరల్ దుష్యంత్ సింగ్, మరో ఇద్దరు అధికారులు సోమవారం మధ్యాహ్నం ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. ఇప్పటికి నలుగురు ఉగ్రవాదులను హతమార్చామని, వాళ్లు భారీ ఆయుధ సంపత్తితో వచ్చారని చెప్పారు. ఇది చాలా పెద్ద ఎయిర్ బేస్ అని, దాదాపు ఓ నగరం అంత వైశాల్యం ఉంటుందని వివరించారు. ఇందులో వ్యూహాత్మక ఆయుధాలతో పాటు సిబ్బంది నివాసాలు, స్కూళ్లు కూడా ఉన్నాయని.. ఇక్కడి ఆస్తులకు గానీ, ఆయుధాలకు గానీ ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ చాలా మంచి సినర్జీతో సాగుతోందని, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎన్ఎస్జీ, పంజాబ్ పోలీస్ కలిసి చేస్తున్నాయని చెప్పారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని.. అది పూర్తయితే గానీ వివరాలు ఏవీ చెప్పలేమని అన్నారు. ఇప్పటివరకు నలుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. జనవరి 1 నుంచి తాము అప్రమత్తంగా ఉన్నామని, నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో ఆర్మీ కూడా 8 దళాలను మోహరించిందని అన్నారు. గరుడ్ దళంతో తొలుత ఉగ్రవాదులు తలపడ్డారని, తర్వాత ఆర్మీ, గరుడ్, ఎన్ఎస్జీల సంయుక్త దాడుల వల్ల వాళ్లు కొంత ఏరియాకే పరిమితం అయ్యారని అన్నారు. ఆదివారం రాత్రి కూడా శానిటైజేషన్ జరిగిందని, అయితే ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది నివాసం ఉండే రెండు అంతస్థుల భవనంలో దాక్కుని ఉగ్రవాదులు అక్కడి నుంచి కాల్పులు జరిపారని చెప్పారు. వాళ్లను అక్కడికే పరిమితం చేసి, క్వార్టర్లలో ఉండే సిబ్బంది కుటుంబాలను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు కమాండ్ ఆస్పత్రిలోను, పఠాన్ కోట్లోను మంచి వైద్యం అందిస్తున్నామన్నారు. ఎయిర్‌బేస్‌లో ఉన్న ఆస్తులను ధ్వంసం చేయాలనే కుట్రతో ఉగ్రవాదులు వచ్చారని, అయితే ఇప్పుడు మాత్రం ఆస్తులన్నీ సురక్షితంగానే ఉన్నాయని తాను హామీ ఇవ్వగలనని అన్నారు. -
ఎయిర్‌బేస్‌లో కొనసాగుతున్న కాల్పులు
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ప్రాంతంలో ఉన్న ఎయిర్‌బేస్ వద్ద కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం తెల్లవారుజామున ఉగ్రదాడి ప్రారంభమైంది. ఇప్పటివరకు ఆరుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక పౌరుడు, ఏడుగురు జవాన్లు అమరులయ్యారు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కూడా రెండు బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దాంతో మరో ఇద్దరు ఉగ్రవాదులు ఇంకా లోపల నక్కి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అసలు ఆపరేషన్ ఎలా కొనసాగుతోందన్న విషయాన్ని భద్రతా దళాలు గోప్యంగా ఉంచుతున్నాయి. తొలిరోజు నలుగురిని, రెండో రోజు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. గత మూడు రోజులుగా ఆపరేషన్ కొనసాగుతోంది. తొలిరోజు నలుగురిని, రెండోరోజు ఎయిర్ బేస్ లోపలి నుంచి ఇద్దరు కాల్పులు జరిపారు. దాంతో ఇద్దరు నిన్న చనిపోయారు. ఇంకో ఇద్దరు ఎయిర్ బేస్ లోపల ఉన్నారని తెలుస్తోంది. దీంతో అసలు ఇక్కడకు వచ్చిన మొత్తం ఉగ్రవాదులు ఎంతమంది అన్న విషయం స్పష్టం కావడం లేదు. శుక్రవారం నాడు ఎస్పీ వాహనంపై దాడిచేసింది ఐదుగురే అయినా.. ఇతర మార్గాల్లో కూడా ఉగ్రవాదులు వచ్చి ఉంటారని, వీళ్లంతా పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ సమీపంలో కలిసి ఉంటారని భావిస్తున్నారు. అక్కడ ప్రస్తుతం ఆర్మీ హెలికాప్టర్లతో పాటు బుల్డోజర్లను కూడా ఉపయోగిస్తున్నారు. పెద్ద ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మరికొన్ని గంటల పాటు ఇది కొనసాగే అవకాశం ఉంది. -
ముగిసిన ఆపరేషన్; ఐదుగురు ఉగ్రవాదుల హతం
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసిన ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చినట్టు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఆర్మీ, భద్రత బలగాలను రాజ్‌నాథ్ అభినందించారు. కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. జవాన్లు, భద్రత బలగాల తెగువ గర్వకారణమని మోదీ ప్రశంసించారు. కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు.. సైన్యం, భద్రత బలగాలను అభినందించారు. ఈ ఆపరేషన్‌లో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. శనివారం పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై దాడి చేసిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు హతమార్చగా, ఈ దాడిలో ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. -
ఉగ్రవాదులు పాక్ నుంచే వచ్చారు!
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి పాకిస్తాన్ గూఢచార్య సంస్థ (ఐఎస్ఐ), జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ పథకం రచించినట్టు భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచే వచ్చారని, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఆస్తులను చాలావరకు ధ్వంసం చేసేందుకు కుట్ర పన్నారని, ముఖ్యంగా విమానాలు, హెలికాప్టర్లను లక్ష్యంగా చేసుకున్నట్టు సమాచారం. ఉగ్రవాదులు పఠాన్‌కోట్ నుంచి పాకిస్తాన్‌కు ఫోన్ కాల్స్ చేసినట్టు నిఘా సంస్థలు గుర్తించాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉగ్రవాదులు నాలుగుసార్లు ఫోన్ చేశారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఒకడు తన తల్లితో ఫోన్ లో మాట్లాడుతూ.. ఆత్మాహుతి దాడిలో పాల్గొంటున్నట్టుగా చెప్పినట్టు ఫోన్ సంభాషణల్లో వెల్లడైంది. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఏడుగురు ఉగ్రవాదులు దాడిచేస్తున్నట్టు ఆ ఫోన్ కాల్లో ప్రస్తావించాడు. పంజాబీ, ముల్తానీ భాషల్లో సంభాషణలు సాగాయి. ఉగ్రవాదులు పాకిస్తాన్‌లోని ముల్తాన్, బహవల్పూర్ నుంచి వచ్చినట్టు ఫోన్ కాల్స్ ద్వారా నిఘా వర్గాలు గుర్తించాయి. డిసెంబర్ 30న ఉగ్రవాదులు రెండు కార్లలో వచ్చినట్టు సమాచారం. శనివారం పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు సిబ్బంది మరణించగా, ఐదుగురు ఉగ్రవాదులను సైనికులు హతమార్చారు. -
పఠాన్‌కోట్ ఉగ్రదాడిపై ఎవరేమన్నారంటే..
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదదాడిని కేంద్ర ప్రభుత్వం, విపక్షాలు ముక్తకంఠంతో ఖండించాయి. దాయాది పాకిస్తాన్ కూడా ఈ దాడులను ఖండించింది. ఉగ్రవాద చర్యలను నిర్మూలించడంలో భారత్‌తో కలసి పాక్ చేస్తుందని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయం పేర్కొంది. ఈ దాడి నేపథ్యంలో భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రత సలహాదారుతో అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ దాడిపై ఎవరేమన్నారంటే.. పాకిస్తాన్‌తో మనం శాంతిని కోరుకుంటున్నా, పాక్ నుంచి ఆరంభించే దాడులకు దీటుగా సమాధానమిస్తాం. మన భద్రత దళాలు గర్వకారణం. రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి పఠాన్‌కోట్ ఉగ్రవాదదాడిని తీవ్రంగా ఖండించాలి. ఈ దాడిలో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన సైనికులకు సెల్యూట్. అరుణ్ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి ఉగ్రవాద చర్యల నిర్మూలనకు పంజాబ్ పోలీసుల సహకారంతో కేంద్ర భద్రత బలగాలు పనిచేస్తున్నాయి. కిరెన్ రిజ్జూ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. రాహుల్ గాంధీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు ప్రస్తుతం విదేశాంగ విధానాన్ని ప్రశ్నించడం సరికాదు. ఉగ్రవాదులతో పోరాటంలో మన సైనికులకు అండగా నిలవాలి. లాలూ ప్రసాద్, ఆర్జేడీ చీఫ్ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమైన వారం తర్వాత ఈ దాడి జరగడం అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తాం. అహ్మద్ పటేల్, కాంగ్రెస్ కశ్మీర్ తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులు పంజాబ్‌ను లక్ష్యంగా చేసుకోవడం దేశానికి ముప్పు- సంజయ్ రౌత్, శివసేన -
రక్షణ మంత్రితో త్రివిధ దళాధిపతుల భేటీ
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఉగ్రవాదదాడి నేపథ్యంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్.. త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రత సలహాదారుతో అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. శనివారం సౌత్‌బ్లాక్‌లో పారికర్‌తో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ , ఎయిర్‌ఫోర్స్ చీఫ్ అరూప్ రహా, నేవీ చీఫ్ రాబిన్ దోవన్ భేటీ అయ్యారు. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి ఘటనపై త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రత సలహాదారు.. రక్షణ మంత్రికి వివరించనున్నారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ మీద దాడిచేసిన నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చగా, ఈ దాడిలో ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. -
దాడికి తెగబడింది ఎంతమంది?
పఠాన్‌కోట్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. నలుగురు ఉగ్రవాదులను ఏరివేశాం... ఎన్కౌంటర్ ముగిసిందని అధికారులు ప్రకటించిన కాసేపటికే మరోసారి కాల్పుల ఘటన మరింత ఉద్రిక్తతను రాజేసింది. రెండుసార్లు భారీ ఎత్తున పేలుడు శబ్దాలు కూడా వినిపించాయి. ఆపరేషన్ ఇంకా ముగియలేదని, ఐదో టెర్రరిస్టు కోసం ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు ప్రకటించారు. దీంతో దాడికి వచ్చినది ఎంత మంది ఉగ్రవాదులన్న చర్చ మొదలైంది. ఆరుగురి వరకు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అధికారులు స్వాట్ బృందాన్ని సంఘటనా స్థలానికి తరలించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న బృందం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, డిఐజీ సహా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు ఉగ్రవాదుల దాడికి నిరసనగా స్థానికులు ఆందోళనకు దిగారు. అటు ఉగ్రవాదుల, భద్రతాదళాల మధ్య జరిగిన కాల్పుల్లో అసువులు బాసిన భద్రతా దళాల జవానుల సంఖ్య మూడుకు పెరిగింది. తీవ్రంగా గాయపడిన జవాను చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. పంజాబ్‌లోని కీలకమైన ప్రాంతాన్ని ఎంచుకున్న ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారమే దాడికి దిగినట్టు స్పష్టమవుతోందని శివసేన ఆరోపించింది. ఇది జాతికి పెద్ద హెచ్చరిక అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. కశ్మీర్ తర్వాత పాక్ ఉగ్రవాదులు పంజాబ్‌ను టార్గెట్‌గా ఎంచుకున్నారన్నారు. పాక్ ఉగ్రదాడులకు వారి భాషలోనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. -
ఉగ్రదాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి
పఠాన్‌కోట్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ దగ్గర ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో అసువులు బాసిన భద్రతాదళాల జవాన్ల సంఖ్య రెండుకు పెరిగింది. డిఫెన్స్ సర్వీస్ కోర్కు చెందిన మరో జవాన్ చనిపోయినట్టు తెలుస్తోంది. ఉగ్రదాడిని తిప్పికొట్టే క్రమంలో వీరమరణం పొందిన వారికి సంఖ్య మూడుకు చేరింది. దీంతో దాడికి వచ్చినది నలుగురేనా, అంతకంటే ఎక్కువమందే ఉన్నారా అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అటు ఎన్కౌంటర్ ముగిసిందని ప్రకటించిన వెంటనే మరోసారి కాల్పుల ఘటన మరింత ఉద్రికత్తను రాజేసింది. దీంతో అధికారులు స్వాట్ బృందాన్ని ఘటనా స్థలానికి తరలించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న బృందం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. పంజాబ్‌లోని కీలకమైన ప్రాంతాన్ని ఎంచుకున్న ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారమే దాడికి దిగినట్టు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఒక గరుడ్ కమాండో, భద్రతా దళానికి చెందిన ఒక జవాను మరణాన్ని అధికారులు ధ్రువీకరించారు. ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఈ భీకర ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. -
ఉగ్రదాడిలో కమాండో, జవాన్ వీరమరణం
-
ఉగ్రదాడిలో కమాండో, జవాన్ వీరమరణం
పఠాన్‌కోట్: పంజాబ్ లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ దగ్గర ఉగ్రవాదుల, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక గరుడ్ కమాండో, భద్రతాదళానికి చెందిన మరో జవాను వీరమరణం పొందారు. మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఈ భీకర ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. దీంతో దేశ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. శనివారం తెల్లవారుజామున దాడిచేసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిని తిప్పికొట్టే ప్రయత్నంలో ఇద్దరు సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక గరుడ్ కమాండో, మరొక జవాను ఉన్నట్టు ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. స్థానికంగా ఉద్రిక్తతను రాజేసిన ఈ ఘటనలో భద్రతా దళాలు నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. అయితే, దాడికి వచ్చినది నలుగురేనా, అంతకంటే ఎక్కువమందే ఉన్నారా అన్న విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. ఉగ్రవాదుల దాడిపై హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ఈదాడిని మన జాతీయ భద్రతా దళాలు, జవాన్లు, పంజాబ్ పోలీసులు విజయవంతంగా తిప్పికొట్టాయని వెల్లడించారు. పాకిస్తాన్ మన పొరుగు దేశం.. భారతదేశం శాంతిని కోరుకుంటోందన్నారు. కానీ తమ దేశంపై జరిగే దాడులను ఉపేక్షించమని, ధీటుగా సమాధానం చెప్పి తీరుతామని స్పష్టం చేశారు. గతరాత్రి పఠాన్ కోట్ - పాకిస్తాన్ మధ్య జరిగిన నాలుగు ఫోన్ కాల్స్ ను ట్రేస్ చేశామని భద్రతా అధికారులు తెలిపారు. పఠాన్‌కోట్, పాక్ మధ్య ఈ కాల్స్ జరిగినట్టు తమకు సమాచారం ఉందని వెల్లడించారు. కాగా ఇరుదేశాల మధ్య శాంతిసాధనకోసం ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలాంటి ఘటన జరగడం విచారకరమని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ అన్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్
హైదరాబాద్ : పంజాబ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రయాణికులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కాగా ఉన్నతాధికారులు దేశంలోని అన్ని విమానాశ్రయాలకు హైఅలర్ట్‌ను ప్రకటించారు. పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ పై శనివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో వచ్చి దాడులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరుపుతున్నారు. జవాన్లు, ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న ఈ భీకర దాడుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్టు తెలిసింది. -
ఎన్ఎస్జీ, గరుడ కమాండోల మోహరింపు
-
నలుగురు ఉగ్రవాదుల హతం
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ మీద దాడిచేసిన నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. శనివారం తెల్లవారుజామున 2.30-3.00 గంటల ప్రాంతంలో ఎయిర్‌బేస్ వద్దకు చేరుకున్న ఉగ్రవాదులు అప్పటినుంచి కాల్పులు మొదలుపెట్టగా, ఉదయం 8.30 ప్రాంతానికల్లా నలుగురినీ భద్రతా దళాలు హతమార్చినట్లు సమాచారం అందింది. ఉగ్రవాదుల దాడిలో భారత వైమానిక దళానికి చెందిన ఇద్దరు సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే, దాడికి వచ్చినది నలుగురేనా, అంతకంటే ఎక్కువ మందా అన్న విషయం మాత్రం ఇంకా స్పష్టం కావడం లేదు. పాక్ నుంచి.. పక్కా ప్లాన్‌తో.. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌కు 20-30 కిలోమీటర్ల దూరంలోనే పాక్ సరిహద్దు ఉంది. శుక్రవారం నాడు సరిహద్దుకు ఒక కిలోమీటరు దూరంలో పంజాబ్ కేడర్‌కు చెందిన ఒక ఎస్పీపై ఉగ్రవాదులు దాడి చేసి, ఆయన వాహనం లాక్కున్నారు. ఎయిర్‌బేస్‌కు ఒకటిన్నర కిలోమీటరు దూరం వరకు వాళ్లు వాహనంలోనే వచ్చారు. ఆ తర్వాత డ్రైవర్‌ను కూడా పొడిచారు. ఎయిర్‌బేస్ మీద దాడి చేయాలన్ని నిర్దిష్ట లక్ష్యంతోనే వచ్చారు. మొత్తం ఉగ్రవాదుల రూట్ ప్లాన్‌ను భద్రతా దళాలు ఛేదించాయి. జైషే మహ్మద్ లేదా లష్కరే తాయిబా ఉగ్రవాదుల హస్తంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పట్టుబడిన మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారితో ఉగ్రవాదులకు లింకులు ఉండొచ్చని భావిస్తున్నారు. దాడికి ముందు సంబంధిత అధికారి ఫోన్ వాడినట్లు గుర్తించారు. -
ఎన్ఎస్జీ, గరుడ్ కమాండోల మోహరింపు
భారత భద్రతాదళాల్లోనే అత్యున్నత నైపుణ్యం కలిగిన ఎన్ఎస్జీ, భారత వైమానిక దళానికి చెందిన గరుడ్ కమాండో ఫోర్స్ దళాలు ఉగ్రవాదులపై కౌంటర్ ఎటాక్‌లో పాల్గొంటున్నాయి. పంజాబ్ ఎయిర్‌బేస్ మీద పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిని తిప్పికొట్టేందుకు ఈ బలగాలతో పాటు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ దళాలను అక్కడ మోహరించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మొత్తం ఆపరేషన్‌ను సమన్వయం చేస్తున్నారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఉగ్రదాడి మొదలు కాగా, 6-6.30 గంటల మధ్యలో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు లోపల ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వాళ్లను కూడా ఇప్పటికే హతమార్చారా.. లేదా అన్న విషయం మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. ఉదయం 8 గంటల తర్వాత పెద్దగా కాల్పుల శబ్దాలు వినిపించడం లేదని ఎయిర్‌బేస్‌కు అత్యంత సమీపంలో ఉన్న జాతీయ మీడియా చానళ్ల ప్రతినిధులు చెబుతున్నారు. హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించామని, ఇప్పటికే అక్కడున్న భద్రతా దళాలకు వాటిని సహాయంగా అందుబాటులో ఉంచుతున్నామని డీఐజీ విజయ్ ప్రతాప్ సింగ్ చెప్పారు. ఉగ్రవాదులను పఠాన్‌కోట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోని డొమెస్టిక్ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేశామని, దాంతో టెక్నికల్ ఏరియా మొత్తం సురక్షితంగా ఉందని తెలిపారు. మరోవైపు.. ఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్నతాధికారులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. మొత్తం పరిస్థితిని అత్యున్నత స్థాయిలో సమీక్షిస్తున్నారు. ఉగ్రదాడి కారణంగా పంజాబ్‌లోని లూథియానా ప్రాంతంలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. -
ఉగ్రదాడి: ఎయిర్‌బేస్ సిబ్బందిలో ఒకరి మృతి
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు చేసిన దాడిలో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సిబ్బందిలో ఒకరు మరణించగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వాళ్లను ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. జవాన్లు, ఉగ్రవాదులకు మధ్య తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో మొదలైన కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. తొలుత శుక్రవారం నాడు ఒక ఎస్పీపై దాడిచేసి ఆయన వాహనాన్ని లాక్కున్న ఉగ్రవాదులు.. ఆ వాహనంలోనే ఎయిర్‌బేస్ సమీపంలోకి చేరుకున్నారు. ఏడుగురు ఉగ్రవాదులు ప్రవేశించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఎయిర్‌బేస్‌లోని మిగ్ 29, హెలికాప్టర్లపై దాడికి ఉగ్రవాదులు ప్రయత్నించినా, కేవలం ఎయిర్‌బేస్‌లోని సివిల్ ప్రాంతానికి మాత్రమే వారిని భద్రతా దళాలు పరిమితం చేయగలిగాయి. ఫైటర్ జెట్లకు గానీ, చాపర్లకు గానీ ఎలాంటి నష్టం లేదని ఆర్మీ ప్రకటించింది. ఇప్పటికే అక్కడ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ దళాలు మోహరించాయి. ఉగ్రవాదులు భారత సైనిక యూనిఫాంలో వచ్చినా, వారిని వెంటనే పసిగట్టి ఎన్ఎస్జీ జవాన్లు కాల్పులు జరిపారు. దాంతో వాళ్లలో ఇద్దరు హతమయ్యారు. -
ఎస్పీపై దాడి చేసింది ఈ ఉగ్రవాదులే!
పంజాబ్ కేడర్‌కు చెందిన ఒక ఎస్పీని ఉగ్రవాదులు శుక్రవారం నాడు తీవ్రంగా కొట్టి.. ఆయన వాహనాన్ని లాక్కున్నారు. ఆ వాహనం ఎయిర్‌బేస్‌కు 1.5 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి సమీపంలో ఉన్న గ్రామంలో వదిలేసి ఉంది. అందులోనే ఉగ్రవాదులు వచ్చి ఉంటారని ఇప్పుడు అందరూ భావిస్తున్నారు. తొలుత ఎవరైనా దోపిడీ దొంగలు ఈ పనికి పాల్పడి ఉంటారని అనుకున్నారు. దొంగలు పంజాబ్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారిని దోచుకున్నారనే మీడియా కథనాలు కూడా వచ్చాయి. ఆ ఘటనను ఎవరూ పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. కానీ.. ఇప్పుడు మాత్రం ఎస్పీపై దాడి చేసింది ఉగ్రవాదులేనన్న విషయం స్పష్టమైంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ మీద దాడికి ప్రయత్నించిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌లోని బహావల్పూర్ నుంచి వచ్చినట్లు స్పష్టమైంది. దీన్ని బట్టి పాక్ ఉగ్రవాద మూకలు ఇంకా భారతదేశాన్ని తమ టార్గెట్ చేయడం మానలేదని అర్థమవుతోంది. పఠాన్‌కోట్ ప్రాంతం కూడా పాక్ సరిహద్దుకు దగ్గరగానే ఉండటంతో, భారత ఆర్మీ యూనిఫాం ధరించి ఏకే 47లతో వచ్చారు. గతంలో కూడా నలుగురు ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి సరిహద్దు దాటి పంజాబ్‌లోకి వచ్చి, పోలీసు స్టేషన్ మీద దాడిచేసిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు కూడా ఇద్దరు అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో వాళ్లు పఠాన్‌కోట్ చేరుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది. -
పంజాబ్‌లో ఉగ్రదాడి: నలుగురు ఉగ్రవాదుల హతం
పంజాబ్: పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై శనివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో వచ్చి విచక్షణ రహితంగా దాడులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరుపుతున్నారు. జవాన్లు, ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న ఈ భీకర దాడుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్టు తెలిసింది. రెండు రోజుల క్రితమే ఎయిర్‌బేస్‌లోకి నలుగురు ఉగ్రవాదులు ప్రవేశించినట్టు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం రెడ్ అలర్డ్ ప్రకటించింది. -
వెల్లువెత్తుతున్న సందర్శకులు
ఉగ్రవాదులు దాడిచేసిన దీనానగర్ పోలీసు స్టేషన్ ఎలా ఉందో చూసేందుకు సందర్శకులు వెల్లువెత్తుతున్నారు. వివిధ ప్రభుత్వ సంస్థలతోపాటు రాజకీయ నాయకులు కూడా ఈ స్టేషన్‌కు వస్తున్నారు. ఇక సామాన్య ప్రజల విషయం చెప్పనే అక్కర్లేదు. గురుదాస్‌పూర్ జిల్లా కేంద్రానికి 16 కిలోమీటర్లు, పఠాన్‌కోట్‌కు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో ప్రజలు మాత్రం తమ సాధారణ జీవనాన్ని పునరుద్ధరించుకున్నారు. అయితే.. అటువైపు వెళ్లేవాళ్లు మాత్రం ఒక్కసారి అక్కడ ఆగి, పోలీసు స్టేషన్‌ను చూసి వెళ్లిపోతున్నారు. భారీగా ఆయుధాలతో వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు భద్రతాదళాలతో దాదాపు 11 గంటల పాటు తలపడిన ప్రదేశం ఇదేనా అన్నట్లు చూస్తున్నారు. తమ గ్రామంలో ఇలాంటి ఘోరం జరుగుతుందని ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదని కమల్ అనే స్థానికుడు చెప్పారు. ఆయన ఈ ఘోరానికి ప్రత్యక్ష సాక్షి. అసలు తమ గ్రామాన్నే ఉగ్రవాదులు ఎందుకు ఎంచుకున్నారో తెలియడం లేదని, ఈ ఘటనలో గాయపడినవాళ్లు, మరణించిన వాళ్లు కూడా సామాన్యులు, నిరుపేదలేనని ఆయన అన్నారు. మరోసారి ఇలాంటివి జరగకూడదని ప్రార్థిస్తున్నామన్నారు. బుధవారం ఉదయం కొందరు సీనియర్ పోలీసు అధికారులతో కలిసి పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కూడా ఈ స్టేషన్‌ను సందర్శించారు. -
పంజాబ్ ఉగ్రదాడి LET ఉగ్రవాదుల పనే
-
'ఉద్యోగాలు ఇస్తేనే అంత్యక్రియలు చేస్తాం'
కపుర్తలా: దీనాపూర్ లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన డిటెక్టివ్ ఎస్పీ బల్జీత్ సింగ్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయన కుటుంబ సభ్యులు నిరాకరించారు. తమ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేదాకా అంత్యక్రియలు నిర్వహించబోమని స్పష్టం చేశారు. తమ కుమారుడికి ఎస్పీ ర్యాంకు, ఇద్దరు కుమార్తెలకు తహశీల్దార్ ఉద్యోగాలు ఇవ్వాలని బల్జీత్ సింగ్ భార్య కల్వంత్ కౌర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చే దాకా దహన సంస్కారాలు చేయబోమన్నారు. తమ మామ అచ్చార్ సింగ్ చనిపోయిన తర్వాత తన భర్తకు ఉద్యోగం కోసం రెండేళ్లు వేచిచూడాల్సి వచ్చిందని ఆమె గుర్తు చేసుకున్నారు. పోలీసు ఇన్స్ పెక్టర్ గా పనిచేసిన అచ్చర్ సింగ్ 1984 నాటి సిక్కు అల్లర్లలో మృతి చెందారు. అయితే బల్జీత్ సింగ్ కుటుంబం డిమాండ్ గురించి తమకు తెలియదని ఉన్నతాధికారులు తెలిపారు. పంజాబ్ గురుదాస్ పూర్ జిల్లాలోని దీనాపూర్ లో సోమవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఎస్పీ బల్జీత్ సింగ్ మృతి చెందారు. -
ఆ ఉగ్రవాదులు వీళ్లే!
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా దీనానగర్ పోలీసు స్టేషన్ మీద దాడిచేసిన ఉగ్రవాదులు కెమెరాలో చిక్కారు. వాళ్లు వస్తున్న దృశ్యాలు మీడియా చేతికి చిక్కాయి. సోమవారం తెల్లవారుజామున 4.55 గంటల సమయంలో దీనానగర్ పోలీసు స్టేషన్ వద్దకు వాళ్లు ముగ్గురూ హాయిగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఆ ఫుటేజి ఇప్పుడు బయటపడింది. ఉగ్రవాదులు ముందుగానే ప్లాన్ చేసుకుని, జీపీఎస్ పరికరాల సాయంతో దీనానగర్ పోలీసు స్టేషన్ ఎక్కడుందో కచ్చితంగా తెలుసుకుని మరీ అక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో ఆయుధాలు ధరించి, జీపీఎస్ పరికరాల సాయంతో వాళ్లు ఈ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ముందుగా సెంట్రీ డ్యూటీ చేస్తున్న పోలీసు మీద కాల్పులు జరిపారు. తర్వాత మొత్తం 11 గంటల పాటు జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. -
ప్రాణాలు కాపాడిన ఆ ముగ్గురు హీరోలు
దీనానగర్: సత్పాల్, దర్శన్ కుమార్, నానక్ చాంద్‌లు మొన్నటి వరకు అందరిలాగే సాధారణ పౌరులు. వారు నేడు హీరోలు. సమయస్ఫూర్తి, ధైర్య సాహసాలు ప్రదర్శించి వందలాది మంది అమాయకుల ప్రాణాలను రక్షించిన ప్రాణదాతలు. పంజాబ్‌లోని దీనానగర్‌లో సోమవారం దాదాపు పదకొండు గంటలపాటు విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఏడుగురు ప్రాణాలను తీసిన ముష్కరులను తుదకు పోలీసులు మట్టుబెట్టిన విషయం తెల్సిందే. ఆ రోజు ఉదయం ఐదున్నర గంటలకే దీనానగర్‌లో ప్రవేశించిన ముగ్గురు టెర్రిరిస్టులు వందలాది మంది ప్రాణాలు బలిగొనేందుకు ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలోని పఠాన్‌కోట్-అమృత్సర్ రైల్వే స్టేషన్ల మధ్యనున్న వంతెనపై ఐదు బాంబులను అమర్చడం, రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి వంతెన మీది నుంచి వెళ్లడానికి సరిగ్గా ఐదు నిమిషాల ముందు రైలును ఆపేయడం ద్వారా వందలాది మంది ప్రాణాలను రక్షించడమూ తెల్సిందే. రైల్వే గేట్‌మేన్ సత్పాల్, రైల్వే ఉద్యోగి దర్శన్ కుమార్‌లు ఇందుకు కారణం. ‘నేను రోజులాగే పాల ప్యాకెట్ తెచ్చుకునేందుకు రైల్వే వంతెన సమీపం నుంచి వెళుతున్నాను. నాకు అనుమానాస్పదంగా వంతెనపై వైర్లు కనిపించాయి. వెంటనే నేను ఓ యువకుడి ద్వారా రైల్వే సిబ్బందికి సమాచారం పంపించాను. అప్పుడు డ్యూటీలో వున్న దర్శన్ కుమార్ తక్షణమే స్పందించారు. ఆయన వంతెన వద్దకు రైల్వే గార్డ్‌ను పంపించి అప్పుడు అటువైపు వస్తున్న రైలును ఆపించి ఎంతోమందికి ప్రాణదాతయ్యారు. ‘దాదాపు 250 మంది ప్రయాణికులతో పర్మానంద్ రైల్వే స్టేషన్ నుంచి ఓ ప్యాసెంజర్ రైలు బయల్దేరిన విషయాన్ని తెలుసుకున్నాను. వెంటనే ఆ రైలును వంతెనకు ఆవలనే ఆపాల్సిందిగా చెప్పి గార్డ్‌ను పంపించాను. సకాలంలో గార్డ్ అక్కడికి చేరుకొని రైలును ఆపేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిపోయింది’ అని దర్శన్‌కుమార్ మంగళవారం మీడియాతో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత అటువైపుగా వచ్చే అన్ని రైళ్ల రాకపోకలను నిలిపివేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను రక్షించగలిగామని ఆయన చెప్పారు. మరో హీరో పంజాబ్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్ డ్రైవర్ నానక్ చాంద్. ఆయన ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి 70 మంది బస్సు ప్రయాణికులను రక్షించారు. ఆ రోజు సంఘటన గురించి ఆయన మాటల్లోనే.... ‘నేను జీవితంలో ఏదోరోజు టెర్రరిస్టులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. సైనిక దుస్తుల్లో చేతిలో తుపాకీ పట్టుకొని, ముఖానికి ముసుగు ధరించిన వ్యక్తి హఠాత్తుగా బస్సు ముందుకొచ్చాడు. తుపాకీతో బస్సుపైకి కాల్పులు జరిపి, బస్సును ఆపాల్సిందిగా సైగ చేశాడు. ముఖానికి ముసుగు ధరించాడంటే అతను సైనికుడు కాదు, టైస్టు అయివుంటాడని భావించాను. బస్సును ఆపకుండా అతివేగంగా అతని వైపు తీసుకెళ్లాను. అతను చివరి నిమిషంలో పక్కకు తప్పుకున్నాడు. అదే వేగంతో బస్సును పరుగెత్తించి గురుదాస్‌పూర్ పట్టణంవైపు 20 కిలోమీటర్లు తీసుకెళ్లాను. టైస్టు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు’ అని నానక్ చంద్ వివరించారు. ఆ రోజు బమియల్ నుంచి చండీగఢ్‌కు వెళుతున్న బస్సుకు నానక్ చంద్ డ్రైవర్‌గా ఉన్నారు. -
వచ్చినది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులా?
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా దీనానగర్ పోలీసు స్టేషన్ వద్ద కాల్పులు జరిపి ఏడుగురి మృతికి కారణమైనది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసు స్టేషన్లోకి చొరబడే ముందు వాళ్లు ఐఎస్ఐఎస్ అనుకూల నినాదాలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లష్కరే తాయిబా ప్రోద్బలంతో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాడిచేసే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాయి. -
లాంగ్ లివ్ డెమోక్రసీ
(సాక్షి వెబ్ ప్రత్యేకం) పాకిస్థాన్ సరిహద్దుకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలో దీనానగర్.. ఉదయాన్నే తుపాకీ కాల్పులతో ఉలిక్కిపడింది. సాయంత్రానికి తుపాకీ కాల్పుల శబ్దాలు ఆగిపోయాయి. ముగ్గురు తీవ్రవాదులు చనిపోయారు. ముగ్గురు అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఒక ఎస్పీ సహా నలుగురు పోలీసులు అమరులయ్యారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పంజాబ్ మరోసారి ఉగ్రవాదం దెబ్బకి విలవిల్లాడింది. 11 గంటల పాటు సాగిన 'ఎన్కౌంటర్' ఎన్నో ప్రశ్నలని మరోసారి తెరపైకి తెచ్చింది. అమర్నాథ్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో జమ్మూ - కశ్మీర్ సరిహద్దు పొడవునా భారత సైన్యం అప్రమత్తంగా ఉంది. చొరబాటు దాదాపు అసాధ్యమైంది. అందుకే ఉగ్రవాదులు తమ దృష్టిని పంజాబ్ సరిహద్దు వైపు మళ్లించి.. తమ ఉనికిని మళ్లీ చాటుకున్నారు. లష్కర్ ఏ తాయిబా, జైష్ ఏ మహ్మద్ సంస్థల హస్తం ఉందని నిఘావర్గాల నమ్మకం. దాడికి పాకిస్థాన్ మద్దతు ఉందని, ఆయుధాలు, గ్రనేడ్లు అందుకు సాక్ష్యాలని ప్రభుత్వం విశ్వసిస్తోంది. మళ్లీ పడగ విప్పడానికి ప్రయత్నిస్తున్న ఖలిస్థాన్ వేర్పాటువాదులకి ఈ సంఘటనకు సంబంధం లేదనేది ప్రాథమిక సమాచారం. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో భారతదేశం ఎలాంటి సంబంధాన్ని కోరుకుంటుంది? ఇలాంటి సంఘటనలు జమ్ము - కశ్మీర్లో సర్వసాధారణం. కానీ గతంలో ఇంతకన్నా పెద్ద సంఘటనలు జరిగాయి. సాక్షాత్తు భారతదేశ పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏం చేయగలిగాం? ముంబై వీధుల్లో పేలుళ్ల తర్వాత ఏం చేయగలిగాం? దావూద్ ఇబ్రహీంను వెనక్కి తీసుకొచ్చేందుకు దౌత్యపరంగా ఏమైనా చేయగలిగామా? పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడటం మానడం మినహా. కార్గిల్‌లో చొరబాట్లు గుర్తించేందుకే ఎంతో సమయం తీసుకున్నాం. అందుకు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాం. కాకతాళీయంగా నిన్నటి రోజునే (ఆదివారం) కార్గిల్ విజయ్ దివస్ జరుపుకున్నాం. నేడు (సోమవారం) ఉదయాన్నే ఈ సంఘటన. పెషావర్‌లో స్కూల్ పిల్లల ఊచకోతను ప్రపంచం దిగ్భ్రాంతితో చూసినప్పుడు ఉగ్రవాదాన్ని అణచివేస్తామని పాక్ పాలకులు ఎప్పటి లాగానే బీరాలు పోయారు. ఎంతవరకు అణచగలిగారో ప్రపంచానికి తెలుసు. పాములకు పాలు పోయడమే తెలుసు. ఆ పాములను పక్కన ఉన్న పుట్టల్లోకి ఉసిగొల్పి అవి కాటేస్తుంటే చూడటమే తెలుసు. ఇపుడు కూడా అదే జరుగుతుంది. ఆధారాలు కావాలంటారు. చూపిస్తే ఇవి సరిపోవు. మరికొన్ని ఆధారాలు కావాలంటారు. దౌత్యవేత్తల మాటల గారడిలో అమాయకుల ప్రాణాలకు ఏ మాత్రం విలువ ఉంటుందో తెలిసిందే. చాయ్ పే చర్చ, నావ్ పే చర్చ.. అవసరమైతే ఇంకో చర్చ.. కొనసాగుతూనే ఉంటాయి. 'ఈ దుస్సాహసాన్ని సహించేది లేదు. గట్టిగా బుద్ధి చెబుతాం' లాంటి ప్రకటనలు వినపడుతూనే ఉంటాయి. ఒకవైపు పోలీసులు తీవ్రవాదులతో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతుంటే నేడు అదే సమయంలో చట్టసభల్లో సభ్యులు క్రమశిక్షణతో మెలగాలనే అంశంపై రాద్ధాంతం. రోజంతా అదే రభస. మీరు ఉన్నపుడు దాడులు జరగలేదా? అంటే మీరున్నపుడూ.. అంటూ మరో ఎదురుదాడి. తుపాకుల మోత కూడా ఈ మాటల దాడుల ముందు చిన్నబోయింది. ఇది శాంతి భద్రతల సమస్యా? లేక దౌత్యపరమైన సమస్యా? దేశ అస్తిత్వాన్ని సవాలు చేసే పెనుముప్పా? ఎదుర్కోవడం ఎలా? ఎంతకాలం ఈ దాగుడు మూతలు? ఒకసారి ఖలిస్థాన్.. ఇపుడు పాకిస్థాన్.. రేపు మరేదో సమస్య. జమ్మూ - కశ్మీర్ సమస్యకు పరిష్కారం ఉందా? అక్కడి యువత, ప్రజల కోరికలేమిటి? వారి అస్తిత్వానికి సంబంధించిన సమస్యలను పట్టించుకుంటున్నామా? రాజకీయ అవసరాల కోసం ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటూ వస్తున్నామా? సిరియా, ఇరాక్లను భయపెడుతూ ప్రపంచానికి సవాలు విసురుతున్న ఐఎస్ఐఎస్ జెండాలు జమ్మూ - కశ్మీర్ వీధుల్లో కాలనాగుల్లా భయపెడుతున్న రాబోయే పెనుముప్పును కావాలనే పట్టించుకోవడం మానేస్తున్నామా? ఈ వారాంతం వరకు పార్లమెంటులో వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు.. కాలం గడచిపోతుంది. ఇంకో రోజు.. ఇంకోచోట తుపాకులు గర్జిస్తాయి. గ్రనేడ్లు పేలుతాయి. అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మళ్లీ ఇదే సీన్ రిపీట్ అవుతుంది. ఈ క్రమంలో 'కొలేటరల్ డామేజ్' కింద అమాయకులు బలైపోతూనే ఉంటారు. అందుకే ..........లాంగ్ లివ్ డెమోక్రసీ -
బాంబులకు 200 మీటర్ల దూరంలో ఆగిన రైలు!
స్థలం.. పరమానంద్ రైల్వే స్టేషన్ రాష్ట్రం.. పంజాబ్ ఘటన.. రైలు పట్టాలపై బాంబులు సందర్భం.. దీనానగర్ పోలీసు స్టేషన్‌పై ఉగ్రదాడి హీరోలు.. పరమానంద్ గ్రామస్థులు అమృతసర్- పఠాన్‌కోట్ మార్గంలో పరమానంద్ అనేది ఓ చిన్న రైల్వేస్టేషన్. అయితే అది ప్రధానమార్గం కావడంతో అటువైపుగా చాలా రైళ్లు వెళ్తుంటాయి. సోమవారం ఉదయం కూడా ఓ ప్యాసింజర్ రైలు అటువైపుగా వెళ్తోంది. మరికొద్ది సెకన్లు దాటితే ఆ రైలు బ్రిడ్జి మీదకు వెళ్లేది.. బాంబులు పేలి రైలు తునాతునకలు అయిపోయేది, అనేక ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయేవి. కానీ గ్రామస్థులు అప్రమత్తంగా వ్యవహరించి, బాంబులను గుర్తించారు. దాంతో సరిగ్గా బాంబులకు 200 మీటర్ల దూరంలో రైలు ఆగిపోయింది. అందులో ఉన్నవాళ్లంతా సురక్షితంగా ఉన్నారు. రైలు ఎందుకు ఆగిందో తెలియని వాళ్లు.. ఆ తర్వాత విషయం తెలిసి ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. పరమానంద్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉన్న రైలు బ్రిడ్జి మీద ఉగ్రవాదులు 5 బాంబులను అమర్చారు. వాటిని గ్రామస్థులు గుర్తించి వెంటనే అధికారులను అప్రమత్తం చేయడంతో.. బాంబులకు కొద్ది దూరంలో రైలు ఆగిపోయింది. ఆ మార్గంలో వెళ్లాల్సిన అన్ని రైళ్లను అధికారులు ఎక్కడికక్కడే ఆపేశారు. పంజాబ్ సాయుధ పోలీసు బలగంలోని బాంబు నిర్వీర్య దళాలు వచ్చి ఆ బాంబులను డిఫ్యూజ్ చేశాయి. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధాలు, జీపీఎస్ పరికరాలు
దీనానగర్ పోలీసు స్టేషన్ మీద దాడిచేసిన ఉగ్రవాదులు భారీ ఎత్తున ఆయుధాలతో పాటు జీపీఎస్ పరికరాలు కూడా తీసుకొచ్చారు. ఈ విషయాన్ని పంజాబ్ డీజీపీ సుమేధ్ సింగ్ సైని తెలిపారు. ఉగ్రవాదులను హతమార్చేందుకు వచ్చిన బృందాలకు ఆయన స్వయంగా నాయకత్వం వహించారు. మొత్తం ఎన్కౌంటర్ ముగిసిన తర్వాత.. సైని విలేకరులతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... ఉగ్రవాదులు పాకిస్థాన్‌లోని నరోవల్ ప్రాంతం నుంచి వచ్చారు సుమారు 11 గంటల పాటు మొత్తం ఆపరేషన్ జరిగింది ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో డిటెక్టివ్ ఎస్పీ బల్జీత్ సింగ్, ముగ్గురు హోంగార్డులు మరణించారు. ముగ్గురు సామాన్య పౌరులను ఉగ్రవాదులు చంపేశారు. దీనానగర్ పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ గాయపడ్డారు వాళ్ల వద్ద భారీ సంఖ్యలో ఫైర్ ఆర్మ్‌లు, గ్రెనేడ్లు ఉన్నాయి ఉగ్రవాదుల వద్ద జీపీఎస్ సిస్టంలు కూడా ఉన్నాయి ఈ దాడి వెనక లష్కరే తాయిబా ఉండొచ్చు ఇప్పటివరకు ఏ గ్రూపూ తాము దాడి చేసినట్లు చెప్పుకోలేదు ఈ మొత్తం విషయం మీద లోతుగా దర్యాప్తు చస్తాం -
ఉగ్రవాదులనే భయపెట్టిన బస్సు డ్రైవర్!
పౌరుషానికి మారుపేరైన పంజాబ్‌లో.. ఒక బస్సు డ్రైవర్ సాహసం అనేక మంది ప్రాణాలను కాపాడింది. పంజాబ్ రోడ్‌వేస్‌కు చెందిన నానక్ చంద్ అనే బస్సు డ్రైవర్ ఉగ్రవాదులను చూసి ఏమాత్రం భయపడలేదు. వాళ్లు బస్సు మీద కాల్పులు జరిపినప్పుడు.. నానక్ చంద్ ధైర్యంగా వాళ్ల మీదకు బస్సును పోనిచ్చాడు. దాంతో మొత్తం నలుగురు ఉగ్రవాదులూ వెనకడుగు వేశారు. దాంతో వెంటనే బస్సును పక్కకు మళ్లించిన డ్రైవర్.. దాన్ని వేగంగా అవతలకు తీసుకెళ్లిపోయాడు. బస్సు మీద ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ప్రయాణికులు ఎవరైనా గాయపడి ఉంటారన్న ఆలోచనతో బస్సును నేరుగా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లిపోయాడు. దాంతో అక్కడే క్షతగాత్రులకు చికిత్స జరిగింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. బస్సులో 75 మంది ప్రయాణికులు ఉన్నారని, వాళ్ల ప్రాణాలు కాపాడటం ముఖ్యమని భావించడంతో బస్సును ఆపలేదని చెప్పాడు. డ్రైవర్ అప్రమత్తతే మొత్తం 75 మంది ప్రాణాలనూ కాపాడిందని పంజాబ్ రోడ్‌వేస్ జనరల్ మేనేజర్ చెప్పారు. -
కొనసాగుతున్న గాలింపు చర్యలు
ఉగ్రవాద దాడిని సమర్థంగా ఎదుర్కొన్న భద్రతా దళాలు.. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. అయితే, ఇంకా ఎక్కడైనా ఉగ్రవాదులు నక్కి ఉన్నారేమోనన్న అనుమానంతో దీనానగర్, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. గురుదాస్‌పూర్ జిల్లా మొత్తం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం పది గంటల పాటు కొనసాగిన ఎదురు కాల్పుల్లో మొత్తం 9 మంది మరణించారు. మృతుల్లో పంజాబ్ డిటెక్టివ్ విభాగం ఎస్పీ బల్జీత్ సింగ్ కూడా ఉన్న విషయం తెలిసిందే. కాగా, గురుదాస్‌పూర్ ఎదురుకాల్పుల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం సాయంత్రం జాతీయ భద్రతా సలహాదారుతోను, కేంద్ర హోం శాఖ కార్యదర్శితోను సమావేశం కానున్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు. ఇక ఈ అంశంపై పార్లమెంటులో మంగళవారం నాడు రాజ్‌నాథ్ సింగ్ ఓ ప్రకటన చేయనున్నారు.