రక్షణ మంత్రితో త్రివిధ దళాధిపతుల భేటీ
న్యూఢిల్లీ: పంజాబ్లోని పఠాన్కోట్ ఉగ్రవాదదాడి నేపథ్యంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్.. త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రత సలహాదారుతో అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. శనివారం సౌత్బ్లాక్లో పారికర్తో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ , ఎయిర్ఫోర్స్ చీఫ్ అరూప్ రహా, నేవీ చీఫ్ రాబిన్ దోవన్ భేటీ అయ్యారు.
పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి ఘటనపై త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రత సలహాదారు.. రక్షణ మంత్రికి వివరించనున్నారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ మీద దాడిచేసిన నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చగా, ఈ దాడిలో ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.