three Service Chiefs
-
త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : భారత్- పాక్ సరిహద్దులో ఉద్రిక్తల నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ మేరకు త్రివిధ దళాధిపతులతో ఆయన సమావేశమయ్యారు. లోక్ కల్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని నివాసంలో బుధవారం త్రివిధ దళాధిపతులు మోదీతో భేటీ అయ్యారు. సరిహద్దు వద్ద పరిస్థితులపై ఆరా తీశారు. సన్నద్ధత గురించి అడిగి తెలుసుకున్నారు. తాజా పరిస్థితులను రావత్ మోదీకి వివరించారు. భారత పైలట్ అభినందన్ క్షేమంపై కూడా మోదీ ఆరాతీశారని సమాచారం. పాక్ కబంధ హస్తాల్లో చిక్కున్న భారత పైలట్‌ను క్షేమంగా, త్వరగా విడిపించే అంశంపై వారితో చర్చించినట్లు తెలుస్తోంది. సరిహద్దులో తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై ప్రధాని వారితో చర్చించినట్లు సమాచారం. -
రక్షణ మంత్రితో త్రివిధ దళాధిపతుల భేటీ
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఉగ్రవాదదాడి నేపథ్యంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్.. త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రత సలహాదారుతో అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. శనివారం సౌత్‌బ్లాక్‌లో పారికర్‌తో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ , ఎయిర్‌ఫోర్స్ చీఫ్ అరూప్ రహా, నేవీ చీఫ్ రాబిన్ దోవన్ భేటీ అయ్యారు. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి ఘటనపై త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రత సలహాదారు.. రక్షణ మంత్రికి వివరించనున్నారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ మీద దాడిచేసిన నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చగా, ఈ దాడిలో ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.