pathaknot airbase
-
ముగిసిన ఆపరేషన్; ఐదుగురు ఉగ్రవాదుల హతం
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసిన ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చినట్టు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఆర్మీ, భద్రత బలగాలను రాజ్‌నాథ్ అభినందించారు. కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. జవాన్లు, భద్రత బలగాల తెగువ గర్వకారణమని మోదీ ప్రశంసించారు. కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు.. సైన్యం, భద్రత బలగాలను అభినందించారు. ఈ ఆపరేషన్‌లో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. శనివారం పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై దాడి చేసిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు హతమార్చగా, ఈ దాడిలో ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. -
ఉగ్రవాదులు పాక్ నుంచే వచ్చారు!
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి పాకిస్తాన్ గూఢచార్య సంస్థ (ఐఎస్ఐ), జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ పథకం రచించినట్టు భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచే వచ్చారని, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఆస్తులను చాలావరకు ధ్వంసం చేసేందుకు కుట్ర పన్నారని, ముఖ్యంగా విమానాలు, హెలికాప్టర్లను లక్ష్యంగా చేసుకున్నట్టు సమాచారం. ఉగ్రవాదులు పఠాన్‌కోట్ నుంచి పాకిస్తాన్‌కు ఫోన్ కాల్స్ చేసినట్టు నిఘా సంస్థలు గుర్తించాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉగ్రవాదులు నాలుగుసార్లు ఫోన్ చేశారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఒకడు తన తల్లితో ఫోన్ లో మాట్లాడుతూ.. ఆత్మాహుతి దాడిలో పాల్గొంటున్నట్టుగా చెప్పినట్టు ఫోన్ సంభాషణల్లో వెల్లడైంది. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఏడుగురు ఉగ్రవాదులు దాడిచేస్తున్నట్టు ఆ ఫోన్ కాల్లో ప్రస్తావించాడు. పంజాబీ, ముల్తానీ భాషల్లో సంభాషణలు సాగాయి. ఉగ్రవాదులు పాకిస్తాన్‌లోని ముల్తాన్, బహవల్పూర్ నుంచి వచ్చినట్టు ఫోన్ కాల్స్ ద్వారా నిఘా వర్గాలు గుర్తించాయి. డిసెంబర్ 30న ఉగ్రవాదులు రెండు కార్లలో వచ్చినట్టు సమాచారం. శనివారం పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు సిబ్బంది మరణించగా, ఐదుగురు ఉగ్రవాదులను సైనికులు హతమార్చారు. -
పఠాన్‌కోట్ ఉగ్రదాడిపై ఎవరేమన్నారంటే..
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదదాడిని కేంద్ర ప్రభుత్వం, విపక్షాలు ముక్తకంఠంతో ఖండించాయి. దాయాది పాకిస్తాన్ కూడా ఈ దాడులను ఖండించింది. ఉగ్రవాద చర్యలను నిర్మూలించడంలో భారత్‌తో కలసి పాక్ చేస్తుందని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయం పేర్కొంది. ఈ దాడి నేపథ్యంలో భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రత సలహాదారుతో అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ దాడిపై ఎవరేమన్నారంటే.. పాకిస్తాన్‌తో మనం శాంతిని కోరుకుంటున్నా, పాక్ నుంచి ఆరంభించే దాడులకు దీటుగా సమాధానమిస్తాం. మన భద్రత దళాలు గర్వకారణం. రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి పఠాన్‌కోట్ ఉగ్రవాదదాడిని తీవ్రంగా ఖండించాలి. ఈ దాడిలో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన సైనికులకు సెల్యూట్. అరుణ్ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి ఉగ్రవాద చర్యల నిర్మూలనకు పంజాబ్ పోలీసుల సహకారంతో కేంద్ర భద్రత బలగాలు పనిచేస్తున్నాయి. కిరెన్ రిజ్జూ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. రాహుల్ గాంధీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు ప్రస్తుతం విదేశాంగ విధానాన్ని ప్రశ్నించడం సరికాదు. ఉగ్రవాదులతో పోరాటంలో మన సైనికులకు అండగా నిలవాలి. లాలూ ప్రసాద్, ఆర్జేడీ చీఫ్ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమైన వారం తర్వాత ఈ దాడి జరగడం అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తాం. అహ్మద్ పటేల్, కాంగ్రెస్ కశ్మీర్ తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులు పంజాబ్‌ను లక్ష్యంగా చేసుకోవడం దేశానికి ముప్పు- సంజయ్ రౌత్, శివసేన -
రక్షణ మంత్రితో త్రివిధ దళాధిపతుల భేటీ
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఉగ్రవాదదాడి నేపథ్యంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్.. త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రత సలహాదారుతో అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. శనివారం సౌత్‌బ్లాక్‌లో పారికర్‌తో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ , ఎయిర్‌ఫోర్స్ చీఫ్ అరూప్ రహా, నేవీ చీఫ్ రాబిన్ దోవన్ భేటీ అయ్యారు. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి ఘటనపై త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రత సలహాదారు.. రక్షణ మంత్రికి వివరించనున్నారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ మీద దాడిచేసిన నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చగా, ఈ దాడిలో ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. -
నలుగురు ఉగ్రవాదుల హతం
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ మీద దాడిచేసిన నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. శనివారం తెల్లవారుజామున 2.30-3.00 గంటల ప్రాంతంలో ఎయిర్‌బేస్ వద్దకు చేరుకున్న ఉగ్రవాదులు అప్పటినుంచి కాల్పులు మొదలుపెట్టగా, ఉదయం 8.30 ప్రాంతానికల్లా నలుగురినీ భద్రతా దళాలు హతమార్చినట్లు సమాచారం అందింది. ఉగ్రవాదుల దాడిలో భారత వైమానిక దళానికి చెందిన ఇద్దరు సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే, దాడికి వచ్చినది నలుగురేనా, అంతకంటే ఎక్కువ మందా అన్న విషయం మాత్రం ఇంకా స్పష్టం కావడం లేదు. పాక్ నుంచి.. పక్కా ప్లాన్‌తో.. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌కు 20-30 కిలోమీటర్ల దూరంలోనే పాక్ సరిహద్దు ఉంది. శుక్రవారం నాడు సరిహద్దుకు ఒక కిలోమీటరు దూరంలో పంజాబ్ కేడర్‌కు చెందిన ఒక ఎస్పీపై ఉగ్రవాదులు దాడి చేసి, ఆయన వాహనం లాక్కున్నారు. ఎయిర్‌బేస్‌కు ఒకటిన్నర కిలోమీటరు దూరం వరకు వాళ్లు వాహనంలోనే వచ్చారు. ఆ తర్వాత డ్రైవర్‌ను కూడా పొడిచారు. ఎయిర్‌బేస్ మీద దాడి చేయాలన్ని నిర్దిష్ట లక్ష్యంతోనే వచ్చారు. మొత్తం ఉగ్రవాదుల రూట్ ప్లాన్‌ను భద్రతా దళాలు ఛేదించాయి. జైషే మహ్మద్ లేదా లష్కరే తాయిబా ఉగ్రవాదుల హస్తంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పట్టుబడిన మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారితో ఉగ్రవాదులకు లింకులు ఉండొచ్చని భావిస్తున్నారు. దాడికి ముందు సంబంధిత అధికారి ఫోన్ వాడినట్లు గుర్తించారు.