ముగిసిన ఆపరేషన్; ఐదుగురు ఉగ్రవాదుల హతం | All five terrorists killed in Pathankot operation, says Rajnath Singh | Sakshi
Sakshi News home page

ముగిసిన ఆపరేషన్; ఐదుగురు ఉగ్రవాదుల హతం

Published Sat, Jan 2 2016 7:50 PM | Last Updated on Sun, Sep 3 2017 2:58 PM

ముగిసిన ఆపరేషన్; ఐదుగురు ఉగ్రవాదుల హతం

ముగిసిన ఆపరేషన్; ఐదుగురు ఉగ్రవాదుల హతం

న్యూఢిల్లీ: పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్పై దాడి చేసిన ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చినట్టు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న ఆర్మీ, భద్రత బలగాలను రాజ్నాథ్ అభినందించారు. కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. జవాన్లు, భద్రత బలగాల తెగువ గర్వకారణమని మోదీ ప్రశంసించారు.

కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు.. సైన్యం, భద్రత బలగాలను అభినందించారు. ఈ ఆపరేషన్లో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. శనివారం పఠాన్కోట్లోని ఎయిర్బేస్పై దాడి చేసిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు హతమార్చగా, ఈ దాడిలో ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement