నలుగురు ఉగ్రవాదుల హతం
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ మీద దాడిచేసిన నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. శనివారం తెల్లవారుజామున 2.30-3.00 గంటల ప్రాంతంలో ఎయిర్‌బేస్ వద్దకు చేరుకున్న ఉగ్రవాదులు అప్పటినుంచి కాల్పులు మొదలుపెట్టగా, ఉదయం 8.30 ప్రాంతానికల్లా నలుగురినీ భద్రతా దళాలు హతమార్చినట్లు సమాచారం అందింది. ఉగ్రవాదుల దాడిలో భారత వైమానిక దళానికి చెందిన ఇద్దరు సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే, దాడికి వచ్చినది నలుగురేనా, అంతకంటే ఎక్కువ మందా అన్న విషయం మాత్రం ఇంకా స్పష్టం కావడం లేదు.
పాక్ నుంచి.. పక్కా ప్లాన్‌తో..
పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌కు 20-30 కిలోమీటర్ల దూరంలోనే పాక్ సరిహద్దు ఉంది. శుక్రవారం నాడు సరిహద్దుకు ఒక కిలోమీటరు దూరంలో పంజాబ్ కేడర్‌కు చెందిన ఒక ఎస్పీపై ఉగ్రవాదులు దాడి చేసి, ఆయన వాహనం లాక్కున్నారు. ఎయిర్‌బేస్‌కు ఒకటిన్నర కిలోమీటరు దూరం వరకు వాళ్లు వాహనంలోనే వచ్చారు. ఆ తర్వాత డ్రైవర్‌ను కూడా పొడిచారు. ఎయిర్‌బేస్ మీద దాడి చేయాలన్ని నిర్దిష్ట లక్ష్యంతోనే వచ్చారు. మొత్తం ఉగ్రవాదుల రూట్ ప్లాన్‌ను భద్రతా దళాలు ఛేదించాయి. జైషే మహ్మద్ లేదా లష్కరే తాయిబా ఉగ్రవాదుల హస్తంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పట్టుబడిన మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారితో ఉగ్రవాదులకు లింకులు ఉండొచ్చని భావిస్తున్నారు. దాడికి ముందు సంబంధిత అధికారి ఫోన్ వాడినట్లు గుర్తించారు.