four terrorists killed
-
జమ్మూ కశ్మీర్లో కాల్పులు.. నలుగురు హతం
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్లో మరోసారి తుపాకుల మోతమోగింది. ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో నాలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. జమ్మూ కశ్మీర్ కుల్గాం జిల్లాలోని గుద్దర్ గ్రామ సమీప దేవ్సర్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు కుల్గాం పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. దేవ్సర్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం అందటంతో భద్రత దళాలు, స్థానిక పోలీసులు వారి కోసం గాలించారు. ఈ క్రమంలో పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నాలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం ఆ ప్రాంతంతో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. గడిచిన వారం రోజుల్లో దక్షిణ కశ్మీర్లో ఇది నాలుగో ఎన్కౌంటర్ కావటం గమనార్హం. ఇక ఈ నాలుగు ఎదురు కాల్పుల్లో భద్రతా దళాలు 14 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఏప్రిల్ మాసంలో చోటుచేసుకున్న అన్ని ఎన్కౌంటర్లలో 26 మంది మృతి చెందారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తంగా 58 మంది ఉగ్రవాదులు భద్రతా దళాల చేతిలో మృతి చెందినట్లు తెలుస్తోంది. -
‘కాళేశ్వరం’లో ఉగ్ర అలజడి!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో శుక్రవారం ఉగ్రవాదులు చొరబడ్డారన్న వార్త కలకలం రేపింది! ఆక్టోపస్ బృందం 46 మందితో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో పాల్గొంది. అన్నారంలోని సరస్వతి, మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీ ప్రాంతాల్లో ఆక్టోపస్‌కు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతి చెందారు. తుపాకులు, బాంబుల మోతతో అన్నారం, మేడిగడ్డ పరిసర పొలాల్లోని రైతులు, ప్రజలు ఉలిక్కిపడ్డారు. అయితే ఇదంతా ఆక్టోపస్ బృందం మాక్‌డ్రిల్ అని తర్వాత తెలుసుకున్న జనం ఊపిరి పీల్చుకున్నారు -
దాడికి తెగబడింది ఎంతమంది?
పఠాన్‌కోట్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. నలుగురు ఉగ్రవాదులను ఏరివేశాం... ఎన్కౌంటర్ ముగిసిందని అధికారులు ప్రకటించిన కాసేపటికే మరోసారి కాల్పుల ఘటన మరింత ఉద్రిక్తతను రాజేసింది. రెండుసార్లు భారీ ఎత్తున పేలుడు శబ్దాలు కూడా వినిపించాయి. ఆపరేషన్ ఇంకా ముగియలేదని, ఐదో టెర్రరిస్టు కోసం ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు ప్రకటించారు. దీంతో దాడికి వచ్చినది ఎంత మంది ఉగ్రవాదులన్న చర్చ మొదలైంది. ఆరుగురి వరకు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అధికారులు స్వాట్ బృందాన్ని సంఘటనా స్థలానికి తరలించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న బృందం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, డిఐజీ సహా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు ఉగ్రవాదుల దాడికి నిరసనగా స్థానికులు ఆందోళనకు దిగారు. అటు ఉగ్రవాదుల, భద్రతాదళాల మధ్య జరిగిన కాల్పుల్లో అసువులు బాసిన భద్రతా దళాల జవానుల సంఖ్య మూడుకు పెరిగింది. తీవ్రంగా గాయపడిన జవాను చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. పంజాబ్‌లోని కీలకమైన ప్రాంతాన్ని ఎంచుకున్న ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారమే దాడికి దిగినట్టు స్పష్టమవుతోందని శివసేన ఆరోపించింది. ఇది జాతికి పెద్ద హెచ్చరిక అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. కశ్మీర్ తర్వాత పాక్ ఉగ్రవాదులు పంజాబ్‌ను టార్గెట్‌గా ఎంచుకున్నారన్నారు. పాక్ ఉగ్రదాడులకు వారి భాషలోనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. -
ఉగ్రదాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి
పఠాన్‌కోట్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ దగ్గర ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో అసువులు బాసిన భద్రతాదళాల జవాన్ల సంఖ్య రెండుకు పెరిగింది. డిఫెన్స్ సర్వీస్ కోర్కు చెందిన మరో జవాన్ చనిపోయినట్టు తెలుస్తోంది. ఉగ్రదాడిని తిప్పికొట్టే క్రమంలో వీరమరణం పొందిన వారికి సంఖ్య మూడుకు చేరింది. దీంతో దాడికి వచ్చినది నలుగురేనా, అంతకంటే ఎక్కువమందే ఉన్నారా అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అటు ఎన్కౌంటర్ ముగిసిందని ప్రకటించిన వెంటనే మరోసారి కాల్పుల ఘటన మరింత ఉద్రికత్తను రాజేసింది. దీంతో అధికారులు స్వాట్ బృందాన్ని ఘటనా స్థలానికి తరలించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న బృందం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. పంజాబ్‌లోని కీలకమైన ప్రాంతాన్ని ఎంచుకున్న ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారమే దాడికి దిగినట్టు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఒక గరుడ్ కమాండో, భద్రతా దళానికి చెందిన ఒక జవాను మరణాన్ని అధికారులు ధ్రువీకరించారు. ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఈ భీకర ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. -
ఉగ్రదాడిలో కమాండో, జవాన్ వీరమరణం
-
ఉగ్రదాడిలో కమాండో, జవాన్ వీరమరణం
పఠాన్‌కోట్: పంజాబ్ లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ దగ్గర ఉగ్రవాదుల, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక గరుడ్ కమాండో, భద్రతాదళానికి చెందిన మరో జవాను వీరమరణం పొందారు. మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఈ భీకర ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. దీంతో దేశ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. శనివారం తెల్లవారుజామున దాడిచేసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిని తిప్పికొట్టే ప్రయత్నంలో ఇద్దరు సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక గరుడ్ కమాండో, మరొక జవాను ఉన్నట్టు ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. స్థానికంగా ఉద్రిక్తతను రాజేసిన ఈ ఘటనలో భద్రతా దళాలు నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. అయితే, దాడికి వచ్చినది నలుగురేనా, అంతకంటే ఎక్కువమందే ఉన్నారా అన్న విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. ఉగ్రవాదుల దాడిపై హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ఈదాడిని మన జాతీయ భద్రతా దళాలు, జవాన్లు, పంజాబ్ పోలీసులు విజయవంతంగా తిప్పికొట్టాయని వెల్లడించారు. పాకిస్తాన్ మన పొరుగు దేశం.. భారతదేశం శాంతిని కోరుకుంటోందన్నారు. కానీ తమ దేశంపై జరిగే దాడులను ఉపేక్షించమని, ధీటుగా సమాధానం చెప్పి తీరుతామని స్పష్టం చేశారు. గతరాత్రి పఠాన్ కోట్ - పాకిస్తాన్ మధ్య జరిగిన నాలుగు ఫోన్ కాల్స్ ను ట్రేస్ చేశామని భద్రతా అధికారులు తెలిపారు. పఠాన్‌కోట్, పాక్ మధ్య ఈ కాల్స్ జరిగినట్టు తమకు సమాచారం ఉందని వెల్లడించారు. కాగా ఇరుదేశాల మధ్య శాంతిసాధనకోసం ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలాంటి ఘటన జరగడం విచారకరమని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ అన్నారు. -
నలుగురు ఉగ్రవాదుల హతం
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ మీద దాడిచేసిన నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. శనివారం తెల్లవారుజామున 2.30-3.00 గంటల ప్రాంతంలో ఎయిర్‌బేస్ వద్దకు చేరుకున్న ఉగ్రవాదులు అప్పటినుంచి కాల్పులు మొదలుపెట్టగా, ఉదయం 8.30 ప్రాంతానికల్లా నలుగురినీ భద్రతా దళాలు హతమార్చినట్లు సమాచారం అందింది. ఉగ్రవాదుల దాడిలో భారత వైమానిక దళానికి చెందిన ఇద్దరు సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే, దాడికి వచ్చినది నలుగురేనా, అంతకంటే ఎక్కువ మందా అన్న విషయం మాత్రం ఇంకా స్పష్టం కావడం లేదు. పాక్ నుంచి.. పక్కా ప్లాన్‌తో.. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌కు 20-30 కిలోమీటర్ల దూరంలోనే పాక్ సరిహద్దు ఉంది. శుక్రవారం నాడు సరిహద్దుకు ఒక కిలోమీటరు దూరంలో పంజాబ్ కేడర్‌కు చెందిన ఒక ఎస్పీపై ఉగ్రవాదులు దాడి చేసి, ఆయన వాహనం లాక్కున్నారు. ఎయిర్‌బేస్‌కు ఒకటిన్నర కిలోమీటరు దూరం వరకు వాళ్లు వాహనంలోనే వచ్చారు. ఆ తర్వాత డ్రైవర్‌ను కూడా పొడిచారు. ఎయిర్‌బేస్ మీద దాడి చేయాలన్ని నిర్దిష్ట లక్ష్యంతోనే వచ్చారు. మొత్తం ఉగ్రవాదుల రూట్ ప్లాన్‌ను భద్రతా దళాలు ఛేదించాయి. జైషే మహ్మద్ లేదా లష్కరే తాయిబా ఉగ్రవాదుల హస్తంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పట్టుబడిన మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారితో ఉగ్రవాదులకు లింకులు ఉండొచ్చని భావిస్తున్నారు. దాడికి ముందు సంబంధిత అధికారి ఫోన్ వాడినట్లు గుర్తించారు.