ఉగ్రదాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి
పఠాన్‌కోట్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ దగ్గర ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో అసువులు బాసిన భద్రతాదళాల జవాన్ల సంఖ్య రెండుకు పెరిగింది. డిఫెన్స్ సర్వీస్ కోర్‌కు చెందిన మరో జవాన్ చనిపోయినట్టు తెలుస్తోంది. ఉగ్రదాడిని తిప్పికొట్టే క్రమంలో వీరమరణం పొందిన వారికి సంఖ్య మూడుకు చేరింది. దీంతో దాడికి వచ్చినది నలుగురేనా, అంతకంటే ఎక్కువమందే ఉన్నారా అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
అటు ఎన్కౌంటర్ ముగిసిందని ప్రకటించిన వెంటనే మరోసారి కాల్పుల ఘటన మరింత ఉద్రికత్తను రాజేసింది. దీంతో అధికారులు స్వాట్ బృందాన్ని ఘటనా స్థలానికి తరలించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న బృందం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. పంజాబ్లోని కీలకమైన ప్రాంతాన్ని ఎంచుకున్న ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారమే దాడికి దిగినట్టు తెలుస్తోంది.
కాగా ఇప్పటికే ఒక గరుడ్ కమాండో, భద్రతా దళానికి చెందిన ఒక జవాను మరణాన్ని అధికారులు ధ్రువీకరించారు. ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఈ భీకర ఎన్కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి.