Defence minister Manohar Parrikar
-
పబ్లిసిటీ కావాలంటే నగ్నంగా డ్యాన్స్ చెయండి!
రక్షణమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు పణజి: గోవా మీడియాలోని ఓ వర్గంపై రక్షణమంత్రి మనోహర్ పరిక్కర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పబ్లిసిటీ కోసం అనవసరంగా వాగడం కంటే సదరు మీడియా దుస్తులిప్పి నగ్నంగా డ్యాన్స్ చేయడం మేలు అని, అదే తాను సలహా ఇస్తానని పేర్కొన్నారు. ఉత్తర గోవాలోని సత్తారి సబ్ జిల్లాలో సోమవారం బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మీడియా తన పరిమితులను గుర్తించడం లేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. '1968లో వాటర్‌గేట్ కుంభకోణం సందర్భంగా ఒక ఎడిటర్ (అమెరికా అధ్యక్షుడు) రిచర్డ్ నిక్సన్‌కు సలహాలు ఇస్తూ పెద్ద సంపాదకీయం రాయడం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు అదే నిక్సన్ కోసం మరాఠీలో సంపాదకీయాలు రాస్తామంటే ఎలా? అతను అమెరికన్. కొందరు వ్యక్తులు తమ పరిమితులను గుర్తించడం లేదు. వారు తరచూ గోల చేస్తున్నారు. వారికి నేనిచ్చే సలహా ఏమిటంటే.. దుస్తులు విప్పి నగ్నంగా నర్తించండి. అప్పుడు ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది' అని స్థానిక దినపత్రికపై ఆయన మండిపడ్డారు. వెయ్యికాపీలు కూడా అమ్ముడుపోని సదరు దినపత్రిక అంతర్జాతీయ స్థాయిలో సంపాదకీయాలు రాసి పబ్లిసిటీ పొందాలని తాపత్రయపడుతున్నదని ఎద్దేవా చేశారు. -
గోవాపై నాకో డ్రీమ్ ఉంది: పారికర్
పనాజీ: తనకు గోవా విషయంలో ఒక డ్రీమ్ ఉందని, గతంలో తాను అనుకున్నవి చేశానని, మరోసారి బీజేపీకి పట్టం కడితే ఆ డ్రీమ్ కూడా నెరవేరుస్తానని కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ‘సంతోష పట్టిక’ లో గోవా వెనుకబడిందని, దానిని అమాంతంగా పెంచేయాలన్నదే తన కొత్త కల అని ఆయన చెప్పారు. ‘మేం(బీజేపీ) సామాజిక రంగానికి బాగా పనిచేశాం. మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేశాం. కానీ, ఒకటి మాత్రం ఇంకా చేయాల్సి ఉంది. నాకు గతంలో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని, సామాజిక రంగానికి సంబంధించి పనిచేయాలని ఒక కల ఉండేది. అది నెరవేరింది. కానీ, ఇప్పుడు అదే స్థాయిలో గోవాలో సంతోషాలు వెల్లివిరిసేలా చేయాలి. హ్యాపినెస్ ఇండెక్స్‌లో గోవాను ముందుకు తీసుకెళ్లాలి. ఇది చేయాలంటే మరోసారి బీజేపీకి అధికారం అప్పగించండి. డబ్బు మీకు సంతోషాన్ని ఇవ్వదు. సంతోషకరమైన పరిస్థితుల గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని గురించి గోవా అసెంబ్లీలో 2001లో బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో నేను చెప్పాను. రాష్ట్రంలోని ప్రజలంతా సంతోషంగా లేనంతవరకు ఇక రాష్ట్రానికి అవసరమైనవి ఏవీ లేవని చెప్పలేం. ఇది చేయాలంటే నాకు మీ మద్దతు కావాలి’ అని పారికర్ గోవా ప్రజలను కోరారు. -
హలో చెప్పరు.. కాల్చిపారేయండి!
‘మీ వెనక మేమున్నాం. ఎవరైనాసరే, ఆయుధాలతో కనిపిస్తే.. వాళ్లొచ్చి హలో చెబుతారనే అనుకోవద్దు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా విచక్షణా రహితంగా కాల్చిపారేయండి’ అని సైనికుల్లో ధైర్యం నూరిపోశానని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ చెప్పారు. కశ్మీర్ సహా సరిహద్దుల్లో కాపలా కాస్తున్న జవాన్లు.. శత్రువులను మట్టుపెట్టేందుకు ఫుల్ పవర్స్ ఉన్నాయని, ఆ మేరకు మోదీ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీచేసిందని ఆయన గుర్తుచేశారు. ఆదివారం సాయంత్రం గోవాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పమాట్లాడిన పరీకర్.. కాంగ్రెస్ హయాంలో జవాన్ల కాళ్లకు బంధనాల్లాంటి నిబంధనలు ఉండేవని అన్నారు. ‘కాంగ్రెస్ హయాంలో విచిత్రమైన నిబంధనలు ఉండేవి. సాయుధులు ఎదురుపడిన సందర్భంలో ముందుగా వాళ్లు కాల్పులు జరిపితేగానీ మన జవాన్లు కాల్చకూడదనే రూల్ ఉండేది. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నిబంధనలో మార్పులు చేశారు. ఎవరైనాసరే, తుపాకులు, మారణాయుధాలతో సంచరిస్తే వారిని జవాన్లు కాల్చిపారేయొచ్చని సూచించారు. ఇది సైనికుల మనోస్థైర్యాన్ని రెట్టిపు చేసింది’అని పరీకర్ వ్యాఖ్యానించారు. కీలకమైన రక్షణ శాఖ నిర్వహణ అంత సులువేమీ కాదని, శాఖ పనితీరును అర్థం చేసుకోవడానికి కనీసం ఎనిమిది నెలలు పట్టిందని మంత్రి చెప్పారు. పాక్ చెరలోని భారత జవాన్ క్షేమం! పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత సైన్యం సర్జికల్ దాడులు చేసిన తర్వాతి రోజుల్లో పొరపాటున దాయాది సరిహద్దుల్లోకి వెళ్లిన భారత జవాన్ చందు చౌహాన్ జాడపై రక్షణ మంత్రి పరీకర్ కీలక సమాచారం వెల్లడించారు. చందు చౌహాన్ పాక్ లోనే సజీవంగా, క్షేమంగా ఉన్నాడని, అతని విడుదలకు అవసరమైన అన్ని చర్యలు వేగవంతం చేసినట్లు మంత్రి చెప్పారు. సోమవారం ముంబై తీరంలో ఐఎన్ఎస్ చెన్నై నౌకను జలాల్లోకి ప్రవేశపెట్టిన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
స్కైవేల నిర్మాణాలకు సహకరిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన స్కైవేలకు కంటోన్మెంట్ పరిధిలో భూసేకరణకు సంబంధించి ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో రాష్ట్ర అధికారులు బుధవారం పరీకర్‌తో సమావేశమయ్యారు. ప్రభుత్వం చేపట్టిన రెండు స్కైవేల నిర్మాణాలకు కంటోన్మెంట్ పరిధిలో ఉన్న సుమారు 100 ఎకరాల స్థలం అవసరమని, ఈ భూమి సేకరణకు ఉన్న సమస్యలను పరిష్కరించాలని కేటీఆర్ బృందం విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రాంతంలో భూమి కేటాయిస్తే స్కైవేల నిర్మాణాలకు కంటోన్మెంట్ పరిధిలోని భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పరీకర్ చెప్పినట్లు కేటీఆర్ మీడియాతో తెలిపారు. రెండు స్కైవేల నిర్మాణానికి ప్యారడైజ్ సర్కిల్ నుంచి కొంపల్లి వరకు (ఇందులో 3.8 కి.మీ పరిధిలో కంటోన్మెంట్ భూమి ఉంది), జూబ్లీ బస్టాప్ నుంచి షామీర్ పేట వరకు (ఇందులో 10 కి.మీ పరిధిలో కంటోన్మెంట్ భూమి ఉంది) స్కైవేల నిర్మాణాలను తలపెట్టామన్నారు. వీటి నిర్మాణానికి కంటోన్మెంట్ పరిధిలోని సుమారు 100 ఎకరాల స్థలం అవసరమవుతుందని చెప్పారు. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా రక్షణ శాఖ మంత్రిని కోరినట్లు చెప్పారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. ‘కంటోన్మెంట్లో రహదారుల మూసివేతపై కూడా ఈ సందర్భంగా చర్చించాం. ఇక్కడ వంద అడుగుల రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించా లని కోరాం. ఈ మూడు రహదారులకు సంబంధించి భూమి బదలాయింపు కింద ఔటర్ రింగ్ రోడ్డు బయట భూమి ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పాం. దీనిపై సీఎంతో చర్చించి స్పష్టత ఇస్తామని హామీఇచ్చాం. వారం లోపు ఈ సమస్యను పరిష్కరిస్తాం’ అని కేటీఆర్ అన్నారు. పరీకర్‌ను కలసిన వారిలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎంఏ అండ్ యూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్, ఆర్అండ్బీ ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ తదితరులున్నారు. -
'నేను క్రమశిక్షణ గలవాడిని.. అదే నమ్ముతా'
పనాజీ: తాను ఒక క్రమశిక్షణగల స్వయం సేవక్నని, కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. గోవా ఎన్నికల నేపథ్యంలో ఆరెస్సెస్‌కు చెందిన మరో నేత సుభాష్ వెలింకార్ మరో పార్టీ తీసుకురానున్నారని వచ్చిన ఊహాగానాలపై ఆయన పెద్దగా స్పందించలేదు. ఇది ప్రజాస్వామ్యంగల దేశం అని, ఎవరైనా ఏ పార్టీ అయినా పెట్టవచ్చని, ఏ పార్టీలోనైనా ఉండొచ్చని, ఇక్కడ చాలా పార్టీలు ఉన్నాయని, ఆప్ కూడా ఉందని పారికర్ గుర్తు చేశారు. గోవాలోని ఆరెస్సెస్ లో జరుగుతున్న పరిణామాలపై ఆయన స్పందించేందుకు నిరాకరించారు. అయితే, తాను ఒక క్రమ శిక్షణ గల స్వయం సేవక్ నని చెప్పుకున్నారు. తాను ఎప్పటికీ ఆరెస్సెస్ నీ అనుసరిస్తుంటానని, ఎప్పటికీ అదే చేస్తానని అన్నారు. తన దృష్టిలో క్రమ శిక్షణే ప్రధానం అని, దానినే ఎక్కువగా నమ్ముతానని తెలిపారు. ఆరెస్సెస్‌పై తన స్పందన కావాలంటే ముందు వెళ్లి ఆరెస్సెస్నే కలవాలని ఆయన వ్యాఖ్యానించారు. -
'యుద్ధ క్షేత్రంలో మహిళా బెటాలియన్లు పెంచం'
న్యూఢిల్లీ: భారత ఆర్మీ యుద్ధ క్షేత్రంలో ప్రత్యేక మహిళా బెటాలియన్లను పెంచే ఆలోచనేది తమకు ప్రస్తుతం లేదని రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. మంగళవారం ఆయన ఈ మేరకు రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 'ప్రస్తుత భారత ఆర్మీలో మహిళా బలగాన్ని పెంచే ప్రతిపాదన ఏదీ లేదు. అలాగే ఇండియన్ ఆర్మీలో పురుషులు, మహిళల మధ్య ఎలాంటి వివక్ష లేదు. పనిచేసే పరిస్థితుల్లో.. ప్రమోషన్లలో, జీతభత్యాల చెల్లింపుల్లో, సౌకర్యాల కల్పనలో పురుష సైనికులకు ఇస్తున్నట్లుగానే మహిళా సైనికులకు చెల్లిస్తున్నాం' అని ఆయన చెప్పారు. -
వామ్మో.. ఢిల్లీలో జోకులా? : కేంద్ర మంత్రి
పనాజీ: ప్రధాని నరేంద్ర మోదీ తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని చెప్పినప్పుడు తాను అక్కడి నుంచి జారుకున్నానని చెప్పిన మనోహర్ పారికర్.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జోకులు పేల్చాలంటే తనకు చాలా భయంగా ఉంటుందన్నారు. రాజధాని పనాజీలోని గోవా ఇంజినీరింగ్ కాలేజీ గోల్డెన్ జూబ్లీ వేడుకలో పాల్గొన్నారు. ఆయన శనివారం గోవాలో పర్యటించిన సందర్భంగా కొన్ని విషయాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. సొంత ప్రాంతం గోవాలో ఉంటే తనకు నిజంగానే స్వాతంత్ర్యం వచ్చినట్లుగా ఉంటుందన్నారు. ఢిల్లీలో అలాంటి పరిస్థితి కనిపించదని పేర్కొన్నారు. ఇక్కడ స్వేచ్ఛగా ఎలాంటి జోకులైనా తాను పేల్చగలనని, అంత స్వేచ్ఛ గోవాలో దొరుకుతుందని చెప్పారు. అయితే ఢిల్లీలో పొరపాటుగా జోకులు వేయాలన్నా భయమేస్తుందని, ఆ జోకులను ఎవరైన వక్రీవరిస్తారని అభిప్రాయపడ్డారు. ఏదైనా మాట తన నోటి నుంచి వస్తే చాలు వెంటనే ఆ వ్యాఖ్యలపై దుమారం రేపి ఆ విషయాలు మీడియాకు లీక్ చేస్తారని మనోహర్ పారికర్ వివరించారు. -
రక్షణ మంత్రితో త్రివిధ దళాధిపతుల భేటీ
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఉగ్రవాదదాడి నేపథ్యంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్.. త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రత సలహాదారుతో అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. శనివారం సౌత్‌బ్లాక్‌లో పారికర్‌తో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ , ఎయిర్‌ఫోర్స్ చీఫ్ అరూప్ రహా, నేవీ చీఫ్ రాబిన్ దోవన్ భేటీ అయ్యారు. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి ఘటనపై త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రత సలహాదారు.. రక్షణ మంత్రికి వివరించనున్నారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ మీద దాడిచేసిన నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చగా, ఈ దాడిలో ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. -
భారత్‌కు యునెస్కో అవార్డు
జాతీయం వన్ పెన్షన్ అమలుకు కేంద్రం నిర్ణయం మాజీ సైనికులకు ఒక ర్యాంకు-ఒక పెన్షన్ విధానాన్ని త్వరలో అమలుచేస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ సెప్టెంబరు 5న ప్రకటించారు. దీన్ని 2014 జూలై నుంచి వర్తింపచేస్తామని కేంద్రం ప్రకటించింది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.8000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల మేర భారం పడనుంది. దాదాపు 24 లక్షల మంది మాజీ సైనికోద్యోగులు ఉన్నారు. గతంలో ఉన్న ఒక ర్యాంకు-ఒక పెన్షన్ విధానాన్ని మూడో పే కమిషన్ నివేదికల ఆధారంగా 1973లో అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. డెహ్రాడూన్‌లో ప్రపంచ సహజ పరిరక్షణ కేంద్రం సహజ వారసత్వ ప్రాంతాల రక్షణలో భాగంగా తొలి ప్రపంచ సహజ పరిరక్షణ కేంద్రం డెహ్రాడూన్‌లో ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలపై సెప్టెంబరు 2న భారత్, యునెస్కోలు సంతకాలు చేశాయి. ఈ కేంద్రాన్ని డెహ్రాడూన్‌లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)లో ఏర్పాటు చేస్తారు. దీన్ని ప్రపంచ స్థాయి సహజ వారసత్వ సంపద, నిర్వహణ, శిక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం ఎనిమిది దేశాల్లో యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రాలు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు పనిచేస్తున్నాయి. కాగా సహజ వారసత్వ పరిరక్షణ కోసం యునెస్కో ఏర్పాటు చేసిన తొలి కేంద్రం ఇదే. డెహ్రాడూన్‌లోని కేంద్రం ఆసియా, పసిఫిక్ ప్రాంతాలతో పాటు 50 దేశాల్లోని పరిరక్షించదగ్గ సహజ వారసత్వ ప్రదేశాలను గుర్తిస్తుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 227 వారసత్వ ప్రాంతాలు ఉండగా అందులో 59 సహజ వారసత్వ ప్రాంతాలు. ఇండియాలో 32 వారసత్వ ప్రదేశాలు ఉండగా అందులో తొమ్మిది సహజ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. మణిపూర్ హింసలో 8 మంది మృతి మణిపూర్‌లో గిరిజన విద్యార్థి సంఘాలు సెప్టెంబరు 1న నిర్వహించిన బంద్ హింసాత్మకంగా మారి 8 మంది మృతికి దారితీసింది. చురచాంద్పూర్ పట్టణంలో జరిగిన ఆందోళనలో నలుగురు పోలీసుల కాల్పుల్లో మరణించారు. అనేక పట్టణాల్లో కర్ఫ్యూ విధించారు. ఆగస్టు 31న శాసనసభ ఆమోదించిన మణిపూర్ భూ రెవెన్యూ, సంస్కరణల(సవరణ) బిల్లు-2015కు వ్యతిరేకంగా గిరిజన విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ బిల్లు గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూమి కొనుగోలు హక్కు కల్పిస్తుంది. స్థానిక గిరిజన తెగలు ఇన్నర్‌లైన్ పర్మిట్ (ఐఎల్పీ) విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆర్థికం కరెన్సీ నోట్లకు కొత్త నంబరింగ్ విధానం! నకిలీ కరెన్సీ నోట్ల నియంత్రణ దిశగా రూ.1000, రూ.500 నోట్లలో కొత్త నంబరింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భావిస్తోంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని ముద్రా ప్రైవేట్ లిమిటెడ్, సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లకు సూచించింది. ఈ కొత్త నోట్లు వచ్చే ఏడాది మే నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఫార్చ్యూన్ గ్లోబల్ జాబితాలో ఐఓసీ ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో భారత్‌కు చెందిన అతిపెద్ద చమురు రిటైల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కి 119వ స్థానం దక్కింది. ఇది 2015 సంవత్సరానికి గ్లోబల్ 500 రెవెన్యూలో అతిపెద్ద భారతీయ సంస్థగా ఫార్చ్యూన్ జాబితాలో నిలిచింది. గత 20 ఏళ్లుగా ఐఓసీ ఈ జాబితాలో చోటుదక్కించుకుంటోంది. ఇంతవరకు ఏ భారతీయ కంపెనీ కూడా ఫార్చ్యూన్ జాబితాలో ఐఓసీని అధిగమించలేదు. రాష్ట్రీయం ఈ-ప్రగతి ప్రాజెక్టుకు ఏపీ కేబినెట్ ఆమోదంప్రభుత్వ యంత్రాంగం కంప్యూటరీకరణకు ఉద్దేశించిన ఈ-ప్రగతి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సెప్టెంబరు 5న ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 33 శాఖలు, 315 డిపార్ట్మెంట్లు, 745 ఈ-సేవలను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకొస్తారు. సింగపూర్ కంపెనీ, విప్రోల సంయుక్త భాగస్వామ్యంతో మూడు దశల్లో ప్రాజెక్టును పూర్తిచేస్తారు. ఇందుకు మొత్తం రూ.2,358 కోట్లు ఖర్చుచేస్తారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,528 కోట్లు సమకూర్చుతుంది. ప్రజాప్రతినిధుల గౌరవవేతనం పెంపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని పెంచుతూ సెప్టెంబరు 7న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు వల్ల జడ్పీ చైర్మన్ వేతనం రూ.7,500 నుంచి రూ.40 వేలకు పెరిగింది. అలాగే జడ్పీటీసీ సభ్యుల వేతనం రూ.2,250 నుంచి ఆరువేలకు, ఎంపీపీలకు రూ.1,500 నుంచి రూ.6,000కు, ఎంపీటీసీ సభ్యుల వేతనం రూ. 750 నుంచి రూ.3,000కు, సర్పంచ్ల వేతనం రూ.వెయ్యి నుంచి రూ.3 వేలకు పెరిగింది. తెలంగాణా భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి ప్రజా కవి కాళోజీ నారాయణరావు జన్మదినమైన సెప్టెంబరు 9న తెలంగాణా భాషా దినోత్సవంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సెప్టెంబరు 6న ప్రకటించారు. ఆ రోజున రాష్ట్రమంతటా తెలంగాణా భాషా చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణా భాషపై చర్చాగోష్టులు, రచనలు, ఉపన్యాసాలు, కవితల్లో పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణ భాషకు, సాహిత్యానికి సేవ చేసిన వారికి కాళోజీ పేరున స్మారక పురస్కారం అందజేస్తారు. వర్షాలకు ఏపీలో 22 మంది మృతి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సెప్టెంబరు 6న కురిసిన వర్షాకు, పిడుగుపాటుకు 22 మంది మరణించారు. ప్రాణ నష్టంతో పాటు వివిధ జిల్లాల్లో ఆస్తి నష్టం కూడా సంభవించింది. మరణించిన వారికి ప్రభుత్వం రూ.4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అవార్డులు భారత్‌కు యునెస్కో అవార్డు కేరళలోని త్రిసూర్‌లో గల వడక్కునాథన్ ఆలయ పరిరక్షణకు తీసుకున్న చర్యలకు గానూ భారత్‌కు ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) మొత్తం 5 దేశాలలోని(భారత్, చైనా, లావోడిపిఆర్, ఆస్ట్రేలియా, థాయిలాండ్) 12 ప్రాజెక్టులకు వివిధ కేటగిరీల్లో 2015 సంవత్సరానికి అవార్డులను ప్రకటించింది. ఝంపా లాహిరికి నేషనల్ హ్యుమానిటీస్ మెడల్భారతీయ అమెరికన్, పులిట్జర్ బహుమతి గ్రహీత ఝంపా లాహిరికి 2014 సంవత్సరానికి ప్రతిష్టాత్మక అమెరికా నేషనల్ హ్యుమానిటీస్ మెడల్ లభించింది. మానవ సంబంధాలను అద్భుత రీతిలో ఆవిష్కరించినందుకు ఈ అవార్డుకు ఆమెను ఎంపికచేసినట్లు అమెరికా అధ్యక్ష భవనం ప్రకటించింది. ఆమె తన రచనల ద్వారా భారతీయ అమెరికన్ల అనుభవాలను అద్భుతంగా ఆవిష్కరించినట్లు తెలిపింది. ఈ అవార్డును ఆమెకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సెప్టెంబరు 10న బహూకరిస్తారు. అంతర్జాతీయం శ్రీలంక ప్రతిపక్ష నేతగా సంపన్‌థన్ మూడు దశాబ్దాల తర్వాత శ్రీలంక పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా తమిళ నేత ఆర్.సంపన్‌థన్ నియమితులయ్యారు. తమిళ్ నేషనల్ అలయన్స్ (టీఎన్ఏ) నేత ప్రతిపక్ష నాయకుడిగా నియమితులైనట్లు స్పీకర్ కరు జయసూరియా సెప్టెంబరు 3న ప్రకటించారు. సంపన్‌థన్ 22 సంవత్సరాలకు పైగా ఎంపీగా పనిచేశారు. తొలి తమిళ ప్రతిపక్ష నాయకుడిగా 1977 నుంచి 1983 వరకు తమిళ్ యునెటైడ్ లిబరేషన్ ఫ్రంట్ (టీయూఎల్‌ఎఫ్)కు చెందిన ఎ.అమృతలింగమ్ పనిచేశారు. చైనా సైనిక పాటవ ప్రదర్శన రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయం సాధించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా తన సైనిక పాటవాన్ని సెప్టెంబరు 2న బీజింగ్‌లోని తియన్మెన్ స్క్వేర్ వద్ద ప్రదర్శించింది. యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు వంటి ఆయుధాలను చైనా ప్రదర్శించింది. రష్యా, పాకిస్తాన్ సహా 17 దేశాల నుంచి వచ్చిన వెయ్యి మంది సైనికులు కూడా ఈ కవాతులో పాల్గొన్నారు. చైనా పౌరులు, విదేశీ అతిథులు ఈ ప్రదర్శనను వీక్షించారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తోపాటు వేదికపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ వి.కె.సింగ్ సహా 30 దేశాల నేతలు ఈ ప్రదర్శనను తిలకించారు. బహదుర్ డాంగీ మృతి ప్రపంచంలో అతి పొట్టి మనిషిగా గిన్నిస్ రికార్డుల్లో ఉన్న నేపాల్‌కు చెందిన చంద్ర బహదూర్ డాంగీ (75) అమెరికాలో సెప్టెంబరు 4న అనారోగ్యంతో మరణించారు. 2012 గిన్నిస్ రికార్డు ప్రకారం డాంగీ ఎత్తు 54.6 సెంటీమీటర్లు. క్రీడలు అపూర్వికి షూటింగ్లో రజతం ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్లో భారత షూటర్ అపూర్వి చండేలా రజత పతకం సాధించింది. సెప్టెంబరు 5న మునిచ్‌లో జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో అపూర్వి రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకుంది. అహ్మది ఎల్హాన్ (ఇరాన్) స్వర్ణ పతకం సాధించింది. సెర్బియాకు చెందిన ఆండ్రియాకు కాంస్య పతకం దక్కింది. జోష్న చిన్నప్పకు ఇండియన్ స్క్వాష్ టైటిల్ ఇండియన్ స్క్వాష్ సర్క్యూట్లో జోష్న చిన్నప్ప (భారత్) మహిళల టైటిల్ గెలుచుకుంది. ముంబైలో సెప్టెంబరు 6న జరిగిన పోటీలో హబీబా మహ్మద్ (ఈజిప్టు)ను జోష్న ఓడించింది. పురుషుల టైటిల్‌ను ఆడ్రియన్ వాలెర్(ఇంగ్లండ్) గెలుచుకున్నాడు. మహేశ్ మంగోంకర్ (భారత్)ను వాలెర్ ఓడించారు. హామిల్టన్‌కు ఇటాలియన్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ ఇటాలియన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. మొంజా (ఇటలీ) లో సెప్టెంబరు 6న జరిగిన రేసులో మెర్సిడెజ్ డ్రైవర్ హామిల్టన్ విజేతగా నిలువగా, ఫెరారీ డ్రైవర్ వెటల్ రెండో స్థానం సాధించాడు. ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఆసియా సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగో స్థానం దక్కింది. బ్యాంకాక్‌లో సెప్టెంబరు 6న ముగిసిన పోటీల్లో కజకిస్తాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్తాన్ రెండో స్థానంలో, థాయిలాండ్ మూడో స్థానంలో నిలిచాయి. ఈ ఈవెంట్ ద్వారా అక్టోబరులో జరగనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు భారత్ నుంచి ఆరుగురు బాక్సర్లు అర్హత సాధించారు. శ్రీలంక టెస్ట్‌లో భారత్ విజయం భారత్-శ్రీలంక మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. సెప్టెంబరు 1న కొలంబోలో ముగిసిన మూడో టెస్ట్‌ను భారత్ గెలుచుకోవడంతో సిరీస్ 2-1తో భారత్‌కు దక్కింది. 22 ఏళ్ల తర్వాత భారత్ శ్రీలంకలో టెస్ట్ సిరీస్ గెలుచుకుంది. గతంలో 1993లో శ్రీలంకపై అజహర్ నేతృత్వంలో 1-0తో టెస్ట్ సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా అశ్విన్ నిలిచాడు. -
6 నెలల పాటు మీడియాతో మాట్లాడను: కేంద్ర మంత్రి
పనాజీ (గోవా): కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆరు నెలల పాటు మీడియాతో మాట్లాడనని ఆయన వ్యాఖ్యలు చేశారు. గోవాలోని పనాజీలో ఏర్పాటుచేసిన మూడురోజుల కార్యక్రమంలో భాగంగా ఆయన అక్కడికి వెళ్లారు. పనాజీకి సమీపంలోని మండూరు గ్రామంలో ప్రభుత్వ కార్యక్రమానికి శనివారం హాజరైన ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలతో విసిగిపోయారు. కశ్మీర్ లోని సోపోర్ పట్టణంలో జరిగిన మిలిటెంట్ల హత్యలు, రఫెల్ ఒప్పందం అంశాలపై విలేకరులు పారికర్‌ను ప్రశ్నించగా ఆవేశానికి లోనైన ఆయన ఆరు నెలల పాటు మీడియాతో మాట్లాడనన్నారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న మంత్రి ఇటువంటి వ్యాఖ్య చేయడంతో పలు మీడియాలలో ఆయనపై విమర్శశలు వెల్లువెత్తుతున్నాయి.