వామ్మో.. ఢిల్లీలో జోకులా? : కేంద్ర మంత్రి | I am a bit afraid to crack jokes in Delhi, says Manohar Parrikar | Sakshi
Sakshi News home page

వామ్మో.. ఢిల్లీలో జోకులా? : కేంద్ర మంత్రి

Published Sat, Jul 9 2016 6:24 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

వామ్మో.. ఢిల్లీలో జోకులా? : కేంద్ర మంత్రి - Sakshi

వామ్మో.. ఢిల్లీలో జోకులా? : కేంద్ర మంత్రి

పనాజీ: ప్రధాని నరేంద్ర మోదీ తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని చెప్పినప్పుడు తాను అక్కడి నుంచి జారుకున్నానని చెప్పిన మనోహర్ పారికర్.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జోకులు పేల్చాలంటే తనకు చాలా భయంగా ఉంటుందన్నారు. రాజధాని పనాజీలోని గోవా ఇంజినీరింగ్ కాలేజీ గోల్డెన్ జూబ్లీ వేడుకలో పాల్గొన్నారు.  ఆయన శనివారం గోవాలో పర్యటించిన సందర్భంగా కొన్ని విషయాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

సొంత ప్రాంతం గోవాలో ఉంటే తనకు నిజంగానే స్వాతంత్ర్యం వచ్చినట్లుగా ఉంటుందన్నారు. ఢిల్లీలో అలాంటి పరిస్థితి కనిపించదని పేర్కొన్నారు. ఇక్కడ స్వేచ్ఛగా ఎలాంటి జోకులైనా తాను పేల్చగలనని, అంత స్వేచ్ఛ గోవాలో దొరుకుతుందని చెప్పారు. అయితే ఢిల్లీలో పొరపాటుగా జోకులు వేయాలన్నా భయమేస్తుందని, ఆ జోకులను ఎవరైన వక్రీవరిస్తారని అభిప్రాయపడ్డారు. ఏదైనా మాట తన నోటి నుంచి వస్తే చాలు వెంటనే ఆ వ్యాఖ్యలపై దుమారం రేపి ఆ విషయాలు మీడియాకు లీక్ చేస్తారని మనోహర్ పారికర్ వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement