గోవాపై నాకో డ్రీమ్‌ ఉంది: పారికర్‌ | i have a dream about Goa: Parrikar | Sakshi
Sakshi News home page

గోవాపై నాకో డ్రీమ్‌ ఉంది: పారికర్‌

Published Sun, Dec 4 2016 9:18 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

గోవాపై నాకో డ్రీమ్‌ ఉంది: పారికర్‌ - Sakshi

గోవాపై నాకో డ్రీమ్‌ ఉంది: పారికర్‌

పనాజీ: తనకు గోవా విషయంలో ఒక డ్రీమ్‌ ఉందని, గతంలో తాను అనుకున్నవి చేశానని, మరోసారి బీజేపీకి పట్టం కడితే ఆ డ్రీమ్‌ కూడా నెరవేరుస్తానని కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ అన్నారు. ‘సంతోష పట్టిక’ లో గోవా వెనుకబడిందని, దానిని అమాంతంగా పెంచేయాలన్నదే తన కొత్త కల అని ఆయన చెప్పారు.

‘మేం(బీజేపీ) సామాజిక రంగానికి బాగా పనిచేశాం. మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేశాం. కానీ, ఒకటి మాత్రం ఇంకా చేయాల్సి ఉంది. నాకు గతంలో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని, సామాజిక రంగానికి సంబంధించి పనిచేయాలని ఒక కల ఉండేది. అది నెరవేరింది. కానీ, ఇప్పుడు అదే స్థాయిలో గోవాలో సంతోషాలు వెల్లివిరిసేలా చేయాలి. హ్యాపినెస్‌ ఇండెక్స్‌లో గోవాను ముందుకు తీసుకెళ్లాలి. ఇది చేయాలంటే మరోసారి బీజేపీకి అధికారం అప్పగించండి. డబ్బు మీకు సంతోషాన్ని ఇవ్వదు. సంతోషకరమైన పరిస్థితుల గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని గురించి గోవా అసెంబ్లీలో 2001లో బడ్జెట్‌ ప్రవేశ​ పెట్టే సమయంలో నేను చెప్పాను. రాష్ట్రంలోని ప్రజలంతా సంతోషంగా లేనంతవరకు ఇక రాష్ట్రానికి అవసరమైనవి ఏవీ లేవని చెప్పలేం. ఇది చేయాలంటే నాకు మీ మద్దతు కావాలి’ అని పారికర్‌ గోవా ప్రజలను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement