
6 నెలల పాటు మీడియాతో మాట్లాడను: కేంద్ర మంత్రి
పనాజీ (గోవా): కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆరు నెలల పాటు మీడియాతో మాట్లాడనని ఆయన వ్యాఖ్యలు చేశారు. గోవాలోని పనాజీలో ఏర్పాటుచేసిన మూడురోజుల కార్యక్రమంలో భాగంగా ఆయన అక్కడికి వెళ్లారు. పనాజీకి సమీపంలోని మండూరు గ్రామంలో ప్రభుత్వ కార్యక్రమానికి శనివారం హాజరైన ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలతో విసిగిపోయారు.
కశ్మీర్ లోని సోపోర్ పట్టణంలో జరిగిన మిలిటెంట్ల హత్యలు, రఫెల్ ఒప్పందం అంశాలపై విలేకరులు పారికర్ను ప్రశ్నించగా ఆవేశానికి లోనైన ఆయన ఆరు నెలల పాటు మీడియాతో మాట్లాడనన్నారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న మంత్రి ఇటువంటి వ్యాఖ్య చేయడంతో పలు మీడియాలలో ఆయనపై విమర్శశలు వెల్లువెత్తుతున్నాయి.