'నేను క్రమశిక్షణ గలవాడిని.. అదే నమ్ముతా' | I am a disciplined Swayamsevak: Parrikar | Sakshi
Sakshi News home page

'నేను క్రమశిక్షణ గలవాడిని.. అదే నమ్ముతా'

Published Sat, Sep 17 2016 1:28 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

'నేను క్రమశిక్షణ గలవాడిని.. అదే నమ్ముతా'

'నేను క్రమశిక్షణ గలవాడిని.. అదే నమ్ముతా'

పనాజీ: తాను ఒక క్రమశిక్షణగల స్వయం సేవక్నని, కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. గోవా  ఎన్నికల నేపథ్యంలో ఆరెస్సెస్కు చెందిన మరో నేత సుభాష్ వెలింకార్ మరో పార్టీ తీసుకురానున్నారని వచ్చిన ఊహాగానాలపై ఆయన పెద్దగా స్పందించలేదు. ఇది ప్రజాస్వామ్యంగల దేశం అని, ఎవరైనా ఏ పార్టీ అయినా పెట్టవచ్చని, ఏ పార్టీలోనైనా ఉండొచ్చని, ఇక్కడ చాలా పార్టీలు ఉన్నాయని, ఆప్ కూడా ఉందని పారికర్ గుర్తు చేశారు.

గోవాలోని ఆరెస్సెస్ లో జరుగుతున్న పరిణామాలపై ఆయన స్పందించేందుకు నిరాకరించారు. అయితే, తాను ఒక క్రమ శిక్షణ గల స్వయం సేవక్ నని చెప్పుకున్నారు. తాను ఎప్పటికీ ఆరెస్సెస్ నీ అనుసరిస్తుంటానని, ఎప్పటికీ అదే చేస్తానని అన్నారు. తన దృష్టిలో క్రమ శిక్షణే ప్రధానం అని, దానినే ఎక్కువగా నమ్ముతానని తెలిపారు. ఆరెస్సెస్పై తన స్పందన కావాలంటే ముందు వెళ్లి ఆరెస్సెస్నే కలవాలని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement