ఉగ్రవాదులు భారత సైనిక దుస్తుల్లో అసలు పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ వరకు ఎలా రాగలిగారు? లోపల మ్యాప్ మొత్తం వాళ్ల వద్దకు ఎలా వచ్చింది? లోపల ఉన్నవాళ్లు ఎవరైనా ఉగ్రవాదులకు ఉప్పందించారా? సరిగ్గా ఇవే అనుమానాలు సామాన్య ప్రజల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వరకు అందరికీ వచ్చాయి. దాంతో దాడి వెనుక కుట్రకోణంపై దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ మూడు కేసులు నమోదు చేసింది.
జనవరి ఒకటోతేదీన దాడి ప్రారంభం దగ్గర నుంచి అన్ని కోణాల్లోనూ దీనిపై దర్యాప్తు చేయిస్తున్నట్లు ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ శరద్ కుమార్ తెలిపారు. ఐజీ ర్యాంకులో ఉన్న ఓ అధికారి నేతృత్వంలోని 20 మంది సభ్యుల బృందం ఇప్పటికే పఠాన్‌కోట్ చేరుకుంది. ఆరుగురు ఉగ్రవాదుల ఫొటోలు, పేర్లు ఈ బృందం వద్ద ఉన్నాయని, వాళ్ల హ్యాండ్లర్లను కూడా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని శరద్ కుమార్ చెప్పారు. మూడు కేసుల్లో తొలుత ఎస్పీ సల్వీందర్ సింగ్‌పై దాడి అంశాన్ని పరిశీలిస్తారు. రెండో కేసులో టాక్సీ డ్రైవర్ ఇకాగర్ సింగ్ హత్యను దర్యాప్తు చేస్తారు. ఇక మూడోది.. అత్యంత ముఖ్యమైనది ఎయిర్‌బేస్ మీద ఉగ్రదాడి కేసు.
ఉగ్రదాడి వెనుక కుట్రకోణం!
Published Tue, Jan 5 2016 8:07 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
Advertisement
Advertisement