ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధాలు, జీపీఎస్ పరికరాలు | terrorists have gps systems and fire arms, says dgp sumedh singh saini | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధాలు, జీపీఎస్ పరికరాలు

Published Mon, Jul 27 2015 6:22 PM | Last Updated on Sun, Sep 3 2017 6:16 AM

ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధాలు, జీపీఎస్ పరికరాలు

ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధాలు, జీపీఎస్ పరికరాలు

దీనానగర్ పోలీసు స్టేషన్ మీద దాడిచేసిన ఉగ్రవాదులు భారీ ఎత్తున ఆయుధాలతో పాటు జీపీఎస్ పరికరాలు కూడా తీసుకొచ్చారు. ఈ విషయాన్ని పంజాబ్ డీజీపీ సుమేధ్ సింగ్ సైని తెలిపారు. ఉగ్రవాదులను హతమార్చేందుకు వచ్చిన బృందాలకు ఆయన స్వయంగా నాయకత్వం వహించారు. మొత్తం ఎన్కౌంటర్ ముగిసిన తర్వాత.. సైని విలేకరులతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...

  • ఉగ్రవాదులు పాకిస్థాన్లోని నరోవల్ ప్రాంతం నుంచి వచ్చారు
  • సుమారు 11 గంటల పాటు మొత్తం ఆపరేషన్ జరిగింది
  • ఆపరేషన్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి.
  • ఉగ్రవాదుల కాల్పుల్లో డిటెక్టివ్ ఎస్పీ బల్జీత్ సింగ్, ముగ్గురు హోంగార్డులు మరణించారు.
  • ముగ్గురు సామాన్య పౌరులను ఉగ్రవాదులు చంపేశారు.
  • దీనానగర్ పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ గాయపడ్డారు
  • వాళ్ల వద్ద భారీ సంఖ్యలో ఫైర్ ఆర్మ్లు, గ్రెనేడ్లు ఉన్నాయి
  • ఉగ్రవాదుల వద్ద జీపీఎస్ సిస్టంలు కూడా ఉన్నాయి
  • ఈ దాడి వెనక లష్కరే తాయిబా ఉండొచ్చు
  • ఇప్పటివరకు ఏ గ్రూపూ తాము దాడి చేసినట్లు చెప్పుకోలేదు
  • ఈ మొత్తం విషయం మీద లోతుగా దర్యాప్తు చస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement