ఆ ఉగ్రవాదులు వీళ్లే! | terrorists spotted on cctv footage | Sakshi
Sakshi News home page

ఆ ఉగ్రవాదులు వీళ్లే!

Published Tue, Jul 28 2015 4:34 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM

ఆ ఉగ్రవాదులు వీళ్లే!

ఆ ఉగ్రవాదులు వీళ్లే!

పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లా దీనానగర్ పోలీసు స్టేషన్ మీద దాడిచేసిన ఉగ్రవాదులు కెమెరాలో చిక్కారు. వాళ్లు వస్తున్న దృశ్యాలు మీడియా చేతికి చిక్కాయి. సోమవారం తెల్లవారుజామున 4.55 గంటల సమయంలో దీనానగర్ పోలీసు స్టేషన్ వద్దకు వాళ్లు ముగ్గురూ హాయిగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఆ ఫుటేజి ఇప్పుడు బయటపడింది.

ఉగ్రవాదులు ముందుగానే ప్లాన్ చేసుకుని, జీపీఎస్ పరికరాల సాయంతో దీనానగర్ పోలీసు స్టేషన్ ఎక్కడుందో కచ్చితంగా తెలుసుకుని మరీ అక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో ఆయుధాలు ధరించి, జీపీఎస్ పరికరాల సాయంతో వాళ్లు ఈ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ముందుగా సెంట్రీ డ్యూటీ చేస్తున్న పోలీసు మీద కాల్పులు జరిపారు. తర్వాత మొత్తం 11 గంటల పాటు జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement