
పంజాబ్‌లో ఉగ్రదాడి: నలుగురు ఉగ్రవాదుల హతం
పంజాబ్: పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై శనివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో వచ్చి విచక్షణ రహితంగా దాడులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరుపుతున్నారు. జవాన్లు, ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న ఈ భీకర దాడుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్టు తెలిసింది.
రెండు రోజుల క్రితమే ఎయిర్‌బేస్‌లోకి నలుగురు ఉగ్రవాదులు ప్రవేశించినట్టు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం రెడ్ అలర్డ్ ప్రకటించింది.