air force base
-
నాసా ‘ఐస్’ సక్సెస్
లాస్ ఏంజిలెస్: ప్రపంచవ్యాప్తంగా కరిగిపోతున్న మంచుపై అధ్యయనం చేయడానికి నాసా అత్యాధునిక స్పేస్ లేజర్ ఆధారిత ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. ఐస్‌శాట్–2గా పిలుస్తున్న ఈ ఉపగ్రహాన్ని డెల్టా–2 రాకెట్ కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి శనివారం విజయవతంగా నింగిలోకి మోసుకెళ్లింది. ఈ ప్రయోగానికి సుమారు రూ. 7 వేల కోట్లు వ్యయం చేసినట్లు నాసా వెల్లడించింది. భూతాపం, సముద్ర నీటి మట్టాల పెరుగుదలపై కచ్చితమైన అంచనాలు పొందేందుకు ఈ ఉపగ్రహం దోహదపడుతుందని భావిస్తున్నారు. 2003లో ప్రయోగించిన ఐస్‌శాట్ ఉపగ్రహం 2009 వరకు సేవలందించింది. గ్రీన్లాండ్, అంటార్కిటికా తీర ప్రాంతాల్లో మంచు పలకలు పలచనవుతున్న సంగతిని అది వెలుగులోకి తెచ్చింది.తాజాగా పంపిన ఐస్‌శాట్–2లో లేజర్ సాంకేతికతను వాడుతున్నారు కాబట్టి గ్రీన్లాండ్, అంటార్కిటికాల్లోని అత్యంత సూక్ష్మ మందమైన మంచు పలకల్లో వస్తున్న మార్పులను అంచనావేయడానికి సరిపడ సమాచారాన్ని సమకూరుస్తుంది. -
చివరి ఘట్టానికి చేరిన ఆపరేషన్ పఠాన్‌కోట్
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్
హైదరాబాద్ : పంజాబ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రయాణికులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కాగా ఉన్నతాధికారులు దేశంలోని అన్ని విమానాశ్రయాలకు హైఅలర్ట్‌ను ప్రకటించారు. పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ పై శనివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో వచ్చి దాడులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరుపుతున్నారు. జవాన్లు, ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న ఈ భీకర దాడుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్టు తెలిసింది. -
పంజాబ్‌లో ఉగ్రదాడి: ఇద్దరు ఉగ్రవాదుల హతం
-
పంజాబ్‌లో ఉగ్రదాడి: నలుగురు ఉగ్రవాదుల హతం
పంజాబ్: పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై శనివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో వచ్చి విచక్షణ రహితంగా దాడులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరుపుతున్నారు. జవాన్లు, ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న ఈ భీకర దాడుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్టు తెలిసింది. రెండు రోజుల క్రితమే ఎయిర్‌బేస్‌లోకి నలుగురు ఉగ్రవాదులు ప్రవేశించినట్టు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం రెడ్ అలర్డ్ ప్రకటించింది. -
పాక్ వైమానిక స్థావరంపై ‘ఉగ్ర’దాడి
29 మంది మృతి; జవాన్ల ఎదురుదాడిలో 13 మంది మిలిటెంట్ల హతం పెషావర్: పాకిస్తాన్లో తాలిబాన్ ఉగ్రవాదులు భద్రతా బలగాలకు గట్టి సవాల్ విసిరారు. ఖైబర్ పంక్తూన్‌క్వా రాష్ట్ర రాజధాని పెషావర్ సమీపంలోని బదాబర్ వైమానిక స్థావరంపై శుక్రవారం దాడికి తెగబడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన 13 మంది ఉగ్రవాదులు పెషావర్‌కు 6 కి.మీ దూరంలో ఉన్న ఈ స్థావరంలో, స్థావరం లోపలి మసీదుపై విచక్షణా రహితంగా కాల్పులు, గ్రెనేడ్ పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక ఆర్మీ కెప్టెన్, ఇద్దరు సైనికులు, 23 మంది పాక్ వైమానిక దళ సిబ్బంది, ముగ్గురు పౌరులు(మొత్తం 29 మంది) మృతిచెందారు. భద్రతా బలగాలు ఎదురుదాడి చేసి మొత్తం 13 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ ఘటనలో పదిమంది జవాన్లు సహా 29 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు పేలుడు పదార్థాల జాకెట్లు ధరించి బృందాలుగా విడిపోయి రెండు మార్గాల్లో ప్రవేశించారు. సెక్యూరిటీ పోస్ట్‌పై దాడి చేసి, అక్కడున్న ఇద్దరు వాయుసేన సాంకేతిక అధికారులను చంపేశారు. మసీదులో ప్రార్థన చేసుకుంటున్నవారిపై దాడి చేశారు. క్షతగాత్రులను సైనిక ఆస్పత్రికి, లేడీ రీడింగ్ ఆస్పత్రికి తరలించామని ఆర్మీ ప్రతినిధి అసీం బాజ్వా తెలిపారు. స్థావరంలో ఉగ్రవాదులెవరైనా దాక్కుని ఉన్నారేమోనని ఆపరేషన్ సాగిస్తున్నామన్నారు. సోదాల్లో ఇప్పటి వరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ క్షతగాత్రులను పరామర్శించారు. ఈ దాడికి పాల్పడింది తమ ఆత్మాహుతి మిలిటెంట్లేనని తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ప్రకటించింది. మిలిటెంట్లు 50 మంది జవాన్లను చంపేశారని పేర్కొంది. అయితే అధికారులు ధ్రువీకరించలేదు. బదాబర్ స్థావరం ప్రస్తుతం వినియోగంలో లేదు. వాయుసేన సిబ్బంది, ఉద్యోగులకు నివాస స్థలంగా వాడుతున్నారు. గత డిసెంబర్లో పెషావర్‌లోని ఆర్మీ స్కూల్‌పై జరిగిన దాడిలో 150 మంది చనిపోవడం తెలిసిందే. ఇదిలా ఉండగా, పాక్ పంజాబ్ రాష్ట్రంలోని కమ్రా వైమానిక స్థావరంపై దాడికి పన్నిన కుట్రను భగ్నం చేసి, ఒక మానవ బాంబర్‌ను అరెస్టు చేశామని కరాచీ పోలీసులు శుక్రవారం తెలిపారు. -
'ఎయిర్ ఫోర్స్ స్థావరంపై ఉగ్ర దాడి'
-
'పాక్ ఎయిర్ ఫోర్స్ స్థావరంపై ఉగ్ర దాడి'
పెషావర్: పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాక్ వైమానిక దళ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని భారీ దాడులకు దిగారు. ఈ ఘటనలో మొత్తం 30 మంది చనిపోగా వారిలో పౌరులు 17 మంది, ఉగ్రవాదులు 13మంది ఉన్నారు. తొలుత ఉగ్రవాదులు పెషావర్‌కు వాయవ్య దిశగా ఉన్న బాదాబర్ ఎయిర్‌బేస్‌లోకి చొరబడ్డారు. లోపలికి రావడమే ఆలస్యం...... రాకెట్ లాంఛర్లతో విరుచుకు పడ్డారు. మెషిన్ గన్లతో విచక్షరహితంగా కాల్పులు జరిపారు. అయితే ఈ ఉగ్రదాడిని పాకిస్థాన్ సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. మిగిలినవారిని ఏరిపారేసేందుకు పాక్ సైన్యం తీవ్రంగా శ్రమిస్తోంది. బాదాబర్ ఎయిర్‌బేస్‌పై దాడికి ఉగ్రవాదులు పక్కాగా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఎయిర్‌బేస్ పరిసర ప్రాంతాల్లో టెర్రరిస్టులు నిన్ననే మకాం వేసినట్లు సమాచారం. బస్సుల్లో వచ్చిన ముష్కరులు గత రాత్రి వైమానిక దళ స్థావరానికి సమీపంలో ఉన్న ఇళ్లల్లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. ఈ తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో గేటు నెంబర్ -2 గుండా ఎయిర్‌బేస్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు... మొదట ఎయిర్‌బేస్ గార్డ్ రూమ్‌పై దాడి చేశారు. అనంతరం రాకెట్ లాంఛర్లతో వైమానిక స్థావరంపై దాడికి పాల్పడ్డారు.గడిచిన కొద్ది వారాల్లో టెర్రరిస్టులు జరిపిన అతిపెద్ద ఉగ్ర దాడి ఇదే కావడం గమనార్హం.