ఉగ్రవాదులనే భయపెట్టిన బస్సు డ్రైవర్! | Bus driver scared terrorists at dinanagar | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదులనే భయపెట్టిన బస్సు డ్రైవర్!

Published Mon, Jul 27 2015 6:03 PM | Last Updated on Sat, Sep 29 2018 5:33 PM

ఉగ్రవాదులనే భయపెట్టిన బస్సు డ్రైవర్! - Sakshi

ఉగ్రవాదులనే భయపెట్టిన బస్సు డ్రైవర్!

పౌరుషానికి మారుపేరైన పంజాబ్లో.. ఒక బస్సు డ్రైవర్ సాహసం అనేక మంది ప్రాణాలను కాపాడింది. పంజాబ్ రోడ్వేస్కు చెందిన నానక్ చంద్ అనే బస్సు డ్రైవర్ ఉగ్రవాదులను చూసి ఏమాత్రం భయపడలేదు. వాళ్లు బస్సు మీద కాల్పులు జరిపినప్పుడు.. నానక్ చంద్ ధైర్యంగా వాళ్ల మీదకు బస్సును పోనిచ్చాడు. దాంతో మొత్తం నలుగురు ఉగ్రవాదులూ వెనకడుగు వేశారు. దాంతో వెంటనే బస్సును పక్కకు మళ్లించిన డ్రైవర్.. దాన్ని వేగంగా అవతలకు తీసుకెళ్లిపోయాడు.

బస్సు మీద ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ప్రయాణికులు ఎవరైనా గాయపడి ఉంటారన్న ఆలోచనతో బస్సును నేరుగా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లిపోయాడు. దాంతో అక్కడే క్షతగాత్రులకు చికిత్స జరిగింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. బస్సులో 75 మంది ప్రయాణికులు ఉన్నారని, వాళ్ల ప్రాణాలు కాపాడటం ముఖ్యమని భావించడంతో బస్సును ఆపలేదని చెప్పాడు. డ్రైవర్ అప్రమత్తతే మొత్తం 75 మంది ప్రాణాలనూ కాపాడిందని పంజాబ్ రోడ్వేస్ జనరల్ మేనేజర్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement