isis terrorists
-
ఐసిస్ ఉగ్రభూతం మళ్లీ విజృంభిస్తుందా?
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) ఉగ్రసంస్థ మొదట్నుంచీ సిరియా కేంద్రంగానే తన ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తోంది. బషర్ అల్ అసద్ నియంత పాలనలో ఇన్నాళ్లూ ఉక్కుపిడికిలి కింద నలిగిపోయి కటిక పేదరికంలో మగ్గిపోయిన సిరియన్లు ఇకనైనా మంచి రోజులు వస్తాయని సంబరపడుతున్నారు. అయితే ఈ ఆనందక్షణాలు కలకాలం అలాగే నిలిచి ఉంటాయో లేదోనన్న భయాలు అప్పుడే కమ్ముకుంటున్నాయి.అసద్ పాలన అంతమయ్యాక పాలనాపగ్గాలు అబూ మొహమ్మద్ అల్ జొలానీ చేతుల్లోకి వెళ్తున్నాయి. ఈయన దేశాన్ని కర్కశపాలన నుంచి విముక్తి ప్రసాదించిన నేతగా ప్రస్తుతానికి స్థానికులు కీర్తిస్తున్నా ఆయన చరిత్రలో చీకటికోణాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే జొలానీ మూలాలు అల్‌ఖైదా ఉగ్రసంస్థలో ఉన్నాయి. ఐసిస్ ఉగ్రసంస్థతో మంచి దోస్తీ చేసి తర్వాత తెగదెంపులు చేసుకున్నా.. ఇప్పుడు మళ్లీ పాత మిత్రులకు ఆహ్వానం పలికితే సిరియాలో ఐసిస్ ఉగ్రభూతం మళ్లీ జడలు విప్పుకుని కరాళ నృత్యం చేయడం ఖాయమని అంతర్జాతీయ యుద్ధ, రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జొలానీతో సుస్థిరత పాలన సాధ్యమా?ఉగ్రమూలాలున్న వ్యక్తికి యావత్‌దేశాన్ని పాలించేంత శక్తియుక్తులు ఉన్నాయా? అనే సందేహాలు అందరికీ వస్తున్నాయి. 2011లో వెల్లువలా విస్తరించిన అరబ్ ఇస్లామిక్ విప్లవం ధాటికి ఈజిప్ట్, లిబియా, టునీషియా, యెమెన్లలో ప్రభుత్వాలు కూలిపోయాయి. దేశ మత, విదేశాంగ విధానాలు మారిపోయాయి. ఇప్పుడు హయత్ తహ్రీర్ అల్ షామ్(హెచ్‌టీఎస్) చీఫ్ హోదాలో జొలానీ సిరియాలోని తిరుగుబాటుదారులు, వేర్వేరు రెబెల్స్ గ్రూప్‌లను ఏకతాటి మీదకు తేగలరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అల్‌ఖైదాతో గతంలో సత్సంబంధాలు ఉన్న హెచ్‌టీఎస్‌ను అమెరికా, ఐక్యరాజ్యసమితి గతంలోనే ఉగ్రసంస్థగా ప్రకటించాయి.ఉగ్రసంస్థగా ముద్రపడిన సంస్థ.. ఐసిస్‌ను నిలువరించగలదా అన్న మీమాంస మొదలైంది. రాజకీయ శూన్యతను తమకు అనువుగా మార్చుకుని ఐసిస్ మళ్లీ చాపకింద నీరులా విస్తరించే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. 2019 నుంచి అమెరికా ఇచ్చిన సైనిక, ఆర్థిక సహకారంతో సిరియాలో పెద్దగా విస్తరించకుండా ఐసిస్‌ను బషర్ అసద్ కట్టడిచేయగలిగారు. సిరియా సామాజిక, ఆర్థిక, రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసిన అంతర్యుద్ధానికి తెరపడిన నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని మొహమ్మెద్ ఘాజీ జలానీ.. హెచ్‌టీఎస్ చీఫ్ జొలానీతో అధికార మార్పిడికి పూర్తి సుముఖత వ్యక్తంచేశారు.అయితే అధికారం చేతికొచ్చాక రెబెల్స్‌లో ఐక్యత లోపిస్తే పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందని అంతా భయపడుతున్నారు. దేశం మొత్తమ్మీద జొలానీ పట్టుసాధించని పక్షంలో ఇన్నాళ్లూ దూరం దూరంగా చిన్న చిన్న ప్రాంతాలకు పరిమితమైన ఐసిస్ అత్యంత వేగంగా విస్తరించే సామర్థ్యాన్ని సముపార్జించగలదు. అసద్ పాలన అంతం తర్వాత ఆరంభమైన ఈ కొత్త శకం అత్యంత రిస్క్‌తో, ఏమౌతుందో తెలియని గందరగోళ పరిస్థితులను సృష్టిస్తోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యలు చూస్తుంటే క్షేత్రస్తాయిలో పరిస్థితి ఎంతటి డోలాయమానంగా ఉందో ఇట్టే అర్ధమవుతుంది. ఐసిస్ ప్రభావమెంత?బషర్ అసద్ కాలంలోనూ ఆయనకు వాయవ్య సిరియాపై పట్టులేదు. అక్కడ ఐసిస్ ప్రభావం ఎక్కువ. ఈ వాయవ్య ప్రాంతంలో 900కుపైగా అమెరికా సైనికులు ఉన్నా సరిపోవడం లేదు. ఈ జనవరి–జూన్కాలంలో ఇరాక్, సిరియాల్లో ఐసిస్ 153 దాడులు చేసిందని అమెరికా సెంట్రల్ కమాండ్ గణాంకాల్లో వెల్లడైంది. ఐసిస్‌ను అంతమొందించేందుకు అమెరికా తరచూ గగనతల దాడులు చేస్తోంది. ఐసిస్ ఉగ్రవాదులు, సానుభూతిపరులు, స్థావరాలే లక్ష్యంగా ఇటీవలే 75 చోట్ల దాడులుచేసింది. కొన్ని ప్రాంతాలను తుర్కియే దన్నుతో ‘సిరియన్ నేషనల్ ఆర్మీ’ పాలిస్తోంది. అమెరికా నుంచి సాయం పొందుతున్న కుర్ద్‌ల బలగాలు కొన్నిచోట్ల పాలిస్తున్నాయి. ఐసిస్ ఉగ్రసంస్థ కొంత ప్రాంతాన్ని ఏలుతోంది. హెచ్‌టీ ఎస్ తిరుగుబా టుదారులు, విపక్షాల ఫైటర్లు ఇంకొన్ని ప్రాంతాలను తమ అధీనంలో ఉంచుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ఐసిస్ను ఎలా కట్టడిచేశారు?హెచ్‌టీఎస్ గ్రూప్‌కు మొదట్నుంచీ అల్‌ఖైదాతో సంబంధాలున్నాయి. అయితే 2016లో అల్‌ఖైదాతో హెచ్‌టీఎస్ తెగదెంపులు చేసుకుంది. అయితే 2011 నుంచే సిరియాలో ఐసిస్ విస్తరిస్తోంది. మాస్కులు ధరించిన ఐసిస్ ఉగ్రవాదులు అమాయక బందీలను తల నరికి చంపేసిన వీడియోలు అంతర్జాతీయ మీడియాలో ప్రత్యక్షమయ్యాక ఐసిస్ ఎంత నిర్దయగల సంస్థో ప్రపంచానికి తెలిసివచ్చింది. 2014 నుంచే సిరియాలో ఐసిస్‌ను అంతం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో 2016లో అమెరికా కొంతమేర సఫలీకృతమైంది.కుర్ద్, తుర్కియే బలగాలకు ఆయుధ సాయం అందించి మరింత విస్తరించకుండా అమెరికా వాయవ్య సిరియాకు మాత్రమే ఐసిస్‌ను పరిమితం చేయగలిగింది. 2018లో ఐసిస్ పని అయిపోయిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ 2019లో మళ్లీ దాడులతో ఐసిస్ తనలో చావ చచ్చిపోలేదని నిరూపించుకుంది. అయితే ఐసిస్ ప్రభావం కొనసాగినంతకాలం అంతర్యుద్ధం తప్పదని మేధోసంస్థ గల్ఫ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ అబ్దుల్అజీజ్ అల్ సగేర్ వ్యాఖ్యానించారు. 2003లో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ పతనం, లిబియా నియంత గఢాఫీ 2011లో అంతం తర్వాత ఆయా దేశాల్లో పౌరయుద్ధాలు మొదలయ్యా యని ఆయన ఉదహరించారు.ఐసిస్‌ను నిలువరించే సత్తా జొలానీకి ఉందా?హెచ్‌టీఎస్ వంటి తిరుగుబాటు సంస్థకు నేతృత్వం వహించినా జొలానీ ఏనాడూ హింసాత్మక ఘటనల్లో ప్రత్యక్ష పాత్ర ఉన్నట్లు కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. విప్లవయోధుడు చెగువేరా తరహాలో తానూ సిరియా విముక్తి కోసం పోరాడుతున్న ఆధునిక తరం యోధునిగా తన వేషభాషల్లో వ్యక్తంచేసేవారు. అతివాద సంస్థకు నేతృత్వం వహిస్తూనే ఉదారవాద నేతగా కనిపించే ప్రయత్నంచేశారు. ఐసిస్ వంటి ముష్కరమూకతో పోరాడాలంటే మెతక వైఖరి పనికిరాదని విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘ ఐసిస్ అధీనంలోని వాయవ్య సిరియాలో ఎవరైనా తమను విమర్శిస్తే వారిని చిత్రహింసలకు గురిచేయడం, జైళ్లో పడేయడం, చంపేయడం అక్కడ మామూలు.ఈ దారుణాలను సిరియా పగ్గాలు చేపట్టాక జొలానీ నిలువరించగలగాలి’’ అని న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే సోఫాన్ గ్రూప్ ఉగ్రవ్యతిరేక వ్యవహారాల నిపుణుడు కోలిన్ అన్నారు. ‘‘ అసద్‌ను గద్దె దింపేందుకు అమెరికా బిలియన్ల డాలర్లను ఖర్చుచేసింది. ఇప్పుడు కొత్త ఆశలు చిగురించినా ఐసిస్ నుంచి సవాళ్లు ఉన్నాయి’’ అని ట్రంప్ అన్నారు. జొలానీ పాలనాదక్షత, అంతర్జాతీయ సమాజం నుంచి ఆర్థిక, ఆయుధ అండదండలు అందితే, వాటిని సద్వినియోగం చేసుకుంటే సిరియాలో మళ్లీ శాంతికపోతాలు ఎగురుతాయి. లేదంటే మళ్లీ ఐసిస్ ముష్కరమూకలు సిరియన్ల కలలను కకావికలం చేయడం ఖాయం. -
ఉగ్ర ముఠాపై పంజా!
వారు మంచి ఉద్యోగాలు, వృత్తుల్లో ఉన్నవారు.. అందరి మధ్య ఉంటూనే అవసరమైనప్పుడు దాడి చేసి, కలకలం సృష్టించి.. మళ్లీ ఏమీ తెలియనట్టు ఉండిపోయేలా ఉగ్రవాద శిక్షణ పొందుతున్న వారు.. ఇంకా అవసరమైతే బాంబులతో విధ్వంసానికీ వెనకాడనివారు.. హైదరాబాద్‌లో దాడులకు సిద్ధమై చాప కింద నీరులా ప్లాన్ అమలుకు సిద్ధమయ్యారు. మధ్యప్రదేశ్ ఏటీఎస్, రాష్ట్ర నిఘా విభాగం కలసి ఈ కుట్రను భగ్నం చేశాయి. సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), రాష్ట్ర నిఘా వర్గాలు సంయుక్తంగా హైదరాబాద్‌లో మంగళవారం చేపట్టిన ఆపరేషన్‌లో ఐదుగురు హిజ్బూ ఉత్ తహరీర్ (హెచ్‌యూటీ) సంస్థ ఉగ్రవాద అనుమానితులు చిక్కారు. ఈ మాడ్యుల్‌కు సూత్రధారిగా ఉన్న మహ్మద్ సలీం.. ఓ మెడికల్ కాలేజీలో డిపార్ట్మెంట్ హెడ్‌గా పనిచేస్తుండగా, పట్టుబడినవారిలో ఒక దంత వైద్యుడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండటం కలకలం రేపుతోంది. ఈ ఐదుగురినీ ఏటీఎస్ అధికారులు పీటీ వారెంట్‌పై భోపాల్‌కు తరలించారు. ఇదే సమయంలో మధ్యప్రదేశ్‌లోనూ ఏటీఎస్ అధికారులు మరో 11 మంది హెచ్‌యూటీ సంస్థ సభ్యులను అరెస్టు చేశారు. వారందరినీ అక్కడి కోర్టులో హాజరుపర్చగా.. ఈ నెల 19వ తేదీ వరకు వారిని ఏటీఎస్ కస్టడీకి అప్పగించింది. ఐసిస్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా.. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్కు అనుబంధంగా హెచ్‌యూటీ సంస్థ పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు, ఉగ్రవాదులకు సానుభూతిపరులను తయారుచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్న ఈ సంస్థ.. భారత్ సహా 50కిపైగా దేశాల్లో ఉనికిలో ఉంది. మన దేశంలో దీనిపై నిషేధం లేదు. కొంతకాలం నుంచి హెచ్‌యూటీ సంస్థ ఎక్కడికక్కడ మాడ్యూల్స్‌ను తయారు చేసుకుంటూ విస్తరిస్తోంది. తమకు ఆకర్షితులైన వారికి శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఆర్మ్డ్ వింగ్‌ను ఏర్పాటు చేసుకుంది. సోషల్ మీడియాలో గ్రూపులనూ నిర్వహిస్తోంది. కేడర్‌కు ప్రమాదకర ఆయుధాల వినియోగంతోపాటు రసాయన, జీవాయుధాల (కెమికల్, బయోలాజికల్) దాడులు చేసేలా.. వీటికి సంబంధించి ఎవరికి వారు మెటీరియల్ సిద్ధం చేసుకునేలా తర్ఫీదు ఇస్తోంది. మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ మాడ్యూల్.. భోపాల్‌కు చెందిన యాసీర్ హెచ్‌యూటీలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. తనతో కలసి చదువుకున్న సౌరభ్‌రాజ్ వైద్యను మతం మార్చుకుని, హెచ్‌యూటీలో చేరేలా ప్రోత్సహించాడు. మహ్మద్ సలీంగా పేరుమార్చుకున్న సౌరభ్.. 2019లో హైదరాబాద్‌లోని గోల్కొండ బాబాబజార్ మోతీ మహల్‌కు వలస వచ్చాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కాలేజీలో ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా ఉద్యోగంలో చేరాడు. మరోవైపు కొన్నేళ్ల కింద ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన దేవీప్రసాద్ పాండ కొన్నేళ్ల క్రితమే మతం మార్చుకుని అబ్దుర్ రెహ్మాన్గా మారాడు. గోల్కొండలోని ధన్కోక ప్రాంతంలో నివాసం ఉంటూ.. ఓ సాఫ్ట్వేర్ సంస్థలో క్లౌడ్ సర్వీస్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇక హైదరాబాద్‌లోని హఫీజ్‌బాబా నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ బస్క వేణుకుమార్ కూడా కొన్నేళ్ల క్రితం మతం మార్చుకుని మహ్మద్ అబ్బాస్ అలీగా మారాడు. సలీం ఈ ఇద్దరితోపాటు గోల్కొండ బడాబజార్‌కు చెందిన దంత వైద్యుడు షేక్ జునైద్, జగద్గిరిగుట్ట మగ్దూంనగర్‌కు చెందిన మహ్మద్ హమీద్, జవహర్‌నగర్‌లోని శివాజీనగర్‌కు చెందిన మహ్మద్ సల్మాన్‌లను ఆకర్షించాడు. తనతో సహా ఆరుగురితో హెచ్‌యూటీ మాడ్యూల్‌ను ఏర్పాటు చేశాడు. మరోవైపు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో యాసీర్ నేతృత్వంలో 11 మంది మరో మాడ్యూల్ కార్యకలాపాలు ప్రారంభించింది. మూడు నెలల పాటు నిఘా పెట్టి.. యాసీర్, సలీంల మాడ్యూల్స్ ఉగ్రవాద దాడులకు సిద్ధమవుతున్న విషయంపై మధ్యప్రదేశ్ ఏటీఎస్ అధికారులకు మూడు నెలల క్రితం జాతీ నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. అప్పటి నుంచి తెలంగాణ నిఘా వర్గాల సాయంతో ఏటీఎస్ అధికారులు వీరిపై కన్నేసి ఉంచారు. అన్ని అంశాలను నిర్ధారించుకుని.. మంగళవారం తెల్లవారుజామున అటు భోపాల్‌లో, ఇటు హైదరాబాద్‌లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. భోపాల్‌లో 11 మంది పట్టుబడగా.. హైదరాబాద్‌కు చెందిన మాడ్యూల్లో మహ్మద్ సల్మాన్ మినహా ఐదుగురిని పట్టుకున్నారు. మహ్మద్ సలీం ఇంటి నుంచి రెండు ఎయిర్గన్లు, పిల్లెట్స్, కత్తులు, గొడ్డళ్లతోపాటు ఉగ్రవాద సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఐదుగురిని పీటీ వారెంట్‌పై భోపాల్‌కు తరలించారు. పరారీలో ఉన్న మహ్మద్ సల్మాన్ కోసం రాష్ట్ర పోలీసులు గాలిస్తున్నారు. నిషేధం విధించేలా.. హెచ్‌యూటీ సంస్థపై 2021లో తమిళనాడులో ఓ కేసు నమోదైంది. దాన్ని దర్యాప్తు చేసిన ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)’గతేడాది అభియోగపత్రాలు దాఖలు చేసినట్టు అధికారులు తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ సంస్థపై నిషేధం విధించేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్టు వెల్లడించారు. అనంతగిరి అడవుల్లో క్యాంప్.. హైదరాబాద్‌లో రెక్కీ.. యాసీర్, సలీంల నేతృత్వంలోని 17 మంది ప్రత్యేకంగా రాకెట్ చాట్ యాప్ ద్వారా సంప్రదింపులు జరిపారు. తుపాకులు, కత్తులు, గొడ్డళ్లను వినియోగించి ఎవరికి వారుగా ‘లోన్ వూల్ఫ్ ఎటాక్స్ (ఒంటరిగానే ఎవరిపైనైనా దాడిచేసి కలకలం రేపడం)’చేయాలని.. అవసరమైనప్పుడు బాంబులు తయారు చేసి జనసమ్మర్థ ప్రాంతాల్లో విరుచుకుపడాలన్నది వీరి పథకం. ఇందుకోసం అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాలతో పోరాడిన ఐసిస్ మాడ్యుల్స్‌ను ఆదర్శంగా తీసుకున్నారు. రెండు మాడ్యూల్స్‌కు చెందిన 17 మంది కొన్నినెలల కింద వికారాబాద్ అనంతగిరి అడవుల్లో క్యాంపు నిర్వహించారు. ఎవరిని టార్గెట్‌గా ఎంచుకోవాలి? ఏ విధంగా దాడులకు దిగాలనేది చర్చించుకున్నారు. తర్వాత హైదరాబాద్ నగరంలో రెక్కీ చేశారు. పలు కీలక ప్రాంతాల్లో డ్రోన్లతోనూ రెక్కీ చేసి.. దాడులకు సన్నాహాలు చేసుకున్నారు. ఆన్లైన్ ద్వారా సంప్రదింపుల్లో ఉంటూ దాడులకు మెటీరియల్‌ను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఐసిస్ కన్నా ప్రమాదకరంగా హెచ్‌యూటీ! ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు అనుబంధంగా హిజ్బ్ ఉత్ తెహ్రీర్ (హెచ్‌యూటీ) సంస్థ పనిచేస్తున్నట్టు ప్రచారమున్నా.. దాని మూలాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 1952లో ఇజ్రాయెల్‌లోని జేరుసలేంలో స్థాపితమైన ఈ సంస్థ.. ప్రస్తుతం లండన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. యూరప్‌తోపాటు ఆసియాలోని ముస్లిం ప్రభావిత దేశాలకు విస్తరించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియాలో దీని ఉనికి ఎక్కువ. నేరుగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడకపోవడంతో చాలా దేశాల్లో దీనిపై నిషేధమేదీ లేదు. అయితే ఐసిస్ ఉగ్రవాద సంస్థ పతనం అనంతరం ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు హెచ్‌యూటీ ప్రయత్నిస్తున్నట్టు అంతర్జాతీయ నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ సంస్థ ఐసిస్ కన్నా ప్రమాదకరంగా మారుతోందని.. రసాయన, జీవాయుధాల వినియోగంపై కేడర్‌కు శిక్షణ ఇస్తోందని హెచ్చరించాయి. భారత్‌లో హెచ్‌యూటీ కార్యకలాపాల విస్తరణపై అంతర్జాతీయ భద్రతా సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందిందని సమాచారం. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా నిఘా పెట్టినట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. -
ఐసిస్ కుట్ర కేసు..15 మంది దోషులకు శిక్ష
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల విస్తరణకు ప్రయత్నించిన ఐసిస్ (ఐఎస్ఐఎస్) కుట్ర కేసులో దోషులుగా తేలిన 15 మందికి శిక్ష ఖరారుచేస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ పర్వీన్‌సింగ్ తీర్పు వెలువరించారు. నిందితులపై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలు మోపుతూ వివిధ సెక్షన్ల కింద ఎన్ఐఏ 2015 డిసెంబరులో కేసు నమోదు చేసింది. వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి ముస్లిం యువకులను రిక్రూట్ చేసుకోవడం ద్వారా భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించాలని నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్ కుట్రపన్నింది. దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో తనిఖీలు చేసి 19 మంది నిందితులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఐసిస్ కోసం పని చేయడానికి, ఉగ్రవాద చర్యలకు పాల్పడటానికి కొందరు యువతను వీరంతా జునూద్–ఉల్–ఖిలాఫా–ఫిల్–హింద్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. సిరియాలో ఉన్న ఐసిస్ మీడియా చీఫ్ యూసుఫ్–అల్–హిందీ అలియాస్ షఫీ అర్మర్ అలియాస్ అంజన్భాయ్ ఆదేశాలతో భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాల విస్తరణ కోసం వీరు పనిచేశారు. ఐసిస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్టుచేసిన తరువాత, వారి కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. వారి ఇతర సహచరులను గుర్తించి, తదుపరి ప్రణాళికలను కనిపెట్టి.. ఇప్పటికే ఐసిస్‌లో చేరడానికి వెళ్లిన పలువురు సానుభూతిపరులను మధ్యప్రాచ్యంలోని వివిధ ప్రదేశాలలో అడ్డగించి తిరిగి భారత్‌కు రప్పించారు. ఎన్ఐఏ నిర్వహించిన దర్యాప్తుతో భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఐసిస్ సభ్యులకు ఆశ్రయం దొరకడం ఆగిపోయింది. దర్యాప్తు పూర్తయిన తరువాత, 2016–2017లో 16 మంది నిందితులపై ఎన్ఐఏ చార్జిషీట్లు దాఖలు చేసింది. 16.10.2020న 15 మంది నిందితులను దోషులుగా నిర్ధారించి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయమూర్తి కఠినమైన జైలు శిక్ష, జరిమానా విధించారు. ఇందులో నఫీజ్ ఖాన్‌కు పదేళ్ల శిక్షతో పాటుగా రూ.1,03,000 జరిమానా విధించారు. ముదబ్బీర్ ముష్తాక్ షేక్‌కు ఏడేళ్ల జైలు, రూ.65,000 జరిమానా విధించారు. అబూ అనాస్‌కు ఏడేళ్ల జైలు, రూ.48 వేల జరిమానా, ముఫ్తీ అబ్దుస్ సమీకి ఏడేళ్ల జైలు, రూ.50,000 జరిమానా, అజార్ ఖాన్‌కు ఆరేళ్ల జైలు, రూ.58,000 జరిమానా విధించారు. అమ్జాద్ ఖాన్‌కు ఆరేళ్ల జైలు రూ.78,000 జరిమానా విధించారు. షరీఫ్ మొయినుద్దీన్, ఆసిఫ్ అలీ, మహ్మద్ హుస్సేన్, సయ్యద్ ముజాహిద్, నజ్ముల్ హుడా, మహ్మద్ ఒబేదుల్లా, ఎండీ అలీమ్, ఎండీ అఫ్జల్, సోహైల్ అహ్మద్‌కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.38 వేల జరిమానా చొప్పున విధించారు. దోషుల్లో నలుగురు హైదరాబాదీలు.. ఈ కేసులోని 15 మందిలో నలుగురు హైదరాబాదీలు ఉన్నారు. టోలిచౌకికి చెందిన ఒబేదుల్లాఖాన్ (కంప్యూటర్ స్పేర్‌పార్ట్స్ దు కాణం), షరీఫ్ మొయినుద్దీన్‌ఖాన్ (ఎలక్ట్రిక ల్ కాంట్రాక్టర్), మాదాపూర్‌కు చెందిన అబూ అనాస్ (సాఫ్ట్వేర్ ఉద్యోగి), నఫీజ్‌ఖాన్ 2016 జనవరిలో అరెస్టయ్యారు. అప్ప ట్లో వీరి నుంచి పేలుడు పదార్థాలు, తుపాకీలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. -
ఐసిస్ అడ్డాగా ఐటీ రాజధాని..!
బెంగళూరు / బనశంకరి: దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరం ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. భారత్‌లో అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి సిరియాలో ఉగ్ర శిక్షణ తీసుకున్న ఐదుగురు ఐసిస్ ఉగ్రవాదులు బెంగళూరులో తిష్టవేసినట్లు ఎన్ఐఏ అధికారులు నిర్ధారించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నగర వాసుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. (చదవండి: వీవీ అల్లుడికి ఎన్ఐఏ నోటీసులు) ఆ ఏడుగురు ఎక్కడ.. గతనెలలో అరెస్ట్ అయిన నగరంలోని ఎంఎస్.రామయ్య ఆసుపత్రిలో డాక్టరుగా ఉన్న బసవనగుడి నివాసి అనుమానిత ఐసీస్ ఉగ్రవాది డాక్టర్ అబ్దుల్ రెహమాన్ ఇచ్చిన సమాచారంతో గుర్రప్పనపాళ్యలోని బిస్మిల్లానగరలో ఎన్ఐఏ అధికారులు తనిఖీ చేపట్టగా ఏడుగురు యువకులు కొంతకాలంగా కనిపించలేదని తేలింది. వీరంతా సౌదీ అరేబియా ద్వారా ఇరాన్ సరిహద్దుకు చేరుకుని అక్కడి నుంచి సిరియాకు వెళ్లినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ‘మేకింగ్ ఆఫ్ ఫ్యూచర్’ అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఈ అనుమానిత ఉగ్రవాదులు ఓల్డ్ మద్రాస్ రోడ్డులోని ఓ ఇంట్లో శిక్షణ తీసుకున్నట్లు ఎన్ఐఏ గుర్తించినట్లు సమాచారం. ఎన్ఐఏ అరెస్ట్ చేసిన డాక్టర్ అబ్దుల్ రెహమాన్ బెంగళూరులో ఉగ్రవాద కార్యకలాపాలను పెంచి పోషించడంలో కీలకంగా వ్యవహరించినట్లు ఎన్ఐఏ విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. చదువుకున్న యువతను ఐసీస్‌లో చేర్చుకొని శిక్షణ ఇచ్చేందుకు ఇక్బాల్ జమీర్, అబ్దుల్ రెహమాన్ బ్యాంకు ఖాతాలకు భారీగా నగదు జమ అయినట్లు ఎన్ఐఏ విచారణలో వెలుగు చూసినట్లు సమాచారం. -
సహరన్‌పూర్‌లో తొలి ‘ఉగ్ర’ సమావేశం!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)కు అనుబంధంగా ఏర్పడిన ‘జునూద్ అల్ ఖలీఫా ఫిల్ హింద్’ (జేకేహెచ్) మాడ్యూల్‌కు సంబంధించిన తొలి సమావేశం ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో జరిగిందని జాతీయ దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. ఈ మీటింగ్‌కు నగరం నుంచి నఫీజ్ ఖాన్ వెళ్లాడని తేల్చింది. ఈ వివరాలను ఎన్ఐఏ తన అభియోగపత్రాల్లో పొందుపరిచింది. ఈ కేసులోనే తొమ్మది మందిని దోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీలోని న్యాయస్థానం శనివారం తీర్పు ఇచ్చింది. వీరిలో హైదరాబాద్‌కు చెందిన నఫీజ్ ఖాన్ సహా ముగ్గురు ఉన్న విషయం విదితమే. 2016 జనవరిలో సిటీలో చిక్కిన నఫీస్ ఖాన్ ఈ మాడ్యుల్లో అత్యంత కీలకమైన ఉగ్రవాదిగా అధికారులు నిర్ధారించారు. సిరియా కేంద్రంగా అన్సార్ ఉల్ తౌహిద్ సంస్థను ఏర్పాటు చేసి, ఐసిస్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న షఫీ ఆర్మర్ అలియాస్ యూసుఫ్ హింద్ (కర్ణాటకలోని భత్కల్ వాసి) ఆదేశాలతోనే ఈ మాడ్యుల్ పని చేస్తున్నట్లు ధ్రువీకరించారు. ఫేస్బుక్ ద్వారా ఇతడికి పరిచయమైన ముంబై నివాసి ముదబ్బిర్ ముస్తాఖ్ షేక్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రిజ్వాన్ అలియాస్ ఖాలిద్‌లకు ‘జునూద్’ విస్తరణ బాధ్యతల్ని అప్పగించాడు. సహరన్‌పూర్‌లో మీటింగ్... ఈ మాడ్యుల్‌కు చీఫ్‌గా వ్యవహరించిన ముదబ్బీర్ ఆన్లైన్ ద్వారానే ‘జునూద్’ను విస్తరించాడు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌కు చెందిన నఫీస్ ఖాన్‌తో 2014లో పరిచయం ఏర్పడింది. అబు జరార్ పేరుతో మాడ్యుల్లో చేరి, చాకచక్యంగా వ్యవహరిస్తున్న నఫీజ్ ఖాన్‌ను ఈ మాడ్యుల్ ఆర్థిక లావాదేవీలు పర్యవేక్షించే ఫైనాన్స్ చీఫ్‌గా ముదబ్బీర్ నియమించాడు. మాడ్యుల్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతో ముదబ్బీర్ 2015 జనవరిలో యూపీలో ఉన్న సహరన్పూర్ ప్రాంతంలో తొలి సమావేశం ఏర్పాటు చేశాడు. అప్పట్లో అక్కడ మత ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని మీటింగ్‌కు ఎంచుకున్నారు. ఇందులో పాల్గొన్న ఐదుగురిలో నఫీస్ ఖాన్ అలియాస్ అబు జరార్ సైతం ఉన్నాడు. వాస్తవానికి ఈ సమావేశంలోనే మాడ్యుల్లోని ప్రతి ఒక్కరికీ ప్రాంతాల వారీ గా ‘ఉగ్రబాధ్యతలు’ అప్పగించాలని భావించారు. అయితే షఫీ ఆర్మర్ ఆదేశాల మేరకు ఆ ప్రక్రియను వాయిదా వేసుకున్నారు. ఈ సమావేశం నుంచి తిరిగి వచ్చిన తర్వాతే నఫీస్ నగరానికి చెందిన ఒబేదుల్లా ఖాన్, మహ్మద్ షరీఫ్ మొహియుద్దీన్, అబు అన్స్‌లను ఉగ్రవాదబాట పట్టించాడు. ఈ మాడ్యు ల్ సహరన్‌పూర్‌తో పాటు హైదరాబాద్, లక్నో, టమ్కూర్‌లో పలుమార్లు సమావేశమైందని, క్యాడర్‌కు ఆయుధాల వినియోగం, పేలుడు పదార్థాల తయారీకి సంబంధించి బెంగళూరు, టమ్కూరు, లక్నోల్లోని అటవీ ప్రాంతాల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసేందుకు కుట్రపన్నిందని ఎన్ఐఏ నిర్థారించింది. నిఘాకు దొరకని యాప్స్‌తో... ముష్కరమూకల వినియోగం పెరిగిన నేపథ్యంలో నిఘా వర్గాలు ఫేస్బుక్, వాట్సాప్ తదితర సోషల్‌మీడియాలపై కన్నేసి ఉంచుతున్నాయి. దీన్ని పసిగట్టిన ‘జునూద్’ మాడ్యుల్ సమాచార మార్పిడికి కొత్త యాప్స్‌ను వినియోగించింది. అంతగా ప్రాచుర్యంలోకి రాని ఆడ్రాయిడ్ యాప్స్ ‘ట్రిలియన్’, ‘సురిస్పోట్’లను తమ సెల్ఫోన్లలోకి డౌన్లోడ్ చేసుకుని వ్యవహారాలు కొనసాగించామని ఎన్ఐఏ అధికారులకు ఉగ్రవాదులు వెల్లడించారు. ‘జునూద్’ కార్యకలాపాలను విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న ముదబ్బీర్ ముంబైతో పాటు ఢిల్లీ, గుజరాత్, బీహార్, పశ్చిమ బెంగాల్, అలహాబాద్, ఉత్తరాఖండ్, ఆజామ్ఘర్ ప్రాంతాల్లో మీడియా వింగ్స్ ఏర్పాటు చేశాడు. దీనికోసం ఆయా ప్రాంతాల్లో ఓ వర్గానికి చెందిన విద్యాధికుల్ని, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారిని ఎంచుకుని ఉగ్రవాద బాటపట్టించే ప్రయత్నం చేశాడు. ఈ వివరాలు జాతీయ దర్యాప్తు సంస్థ తమ అభియోగపత్రాల్లో పొందుపరిచింది. -
ఉగ్రదాడులపై హెచ్చరించిన యూఎన్
న్యూఢిల్లీ: కేరళ, కర్ణాటకల్లో ఐసిస్ ఉగ్రవాదులు గణనీయమైన సంఖ్యలో ఉన్నట్లు ఐరాస నివేదిక హెచ్చరించింది. భారత ఉపఖండ టెర్రర్ గ్రూపులోని అల్-ఖైదా.. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్లకు చెందిన దాదాపు 150 నుంచి 200 మంది ఉగ్రవాదులను కలిగి ఉందని పేర్కొంది. వీరిలో ఎక్కువ మంది కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నట్లు తెలిపింది. అల్‌ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ ప్రస్తుత నాయకుడు ఒసామా మహమూద్ తమ మాజీ నాయకుడు అసీమ్ ఉమర్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ ప్రాంతాల్లో ప్రతీకార చర్యలకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు యూఎన్ నివేదికలో హెచ్చరించింది. -
రాజధానిలో కలకలం: ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. ఢిల్లీ స్పెషల్ పోలీసులు ముగ్గురు ఉగ్రవాదులను గురువారం అరెస్ట్ చేశారు. ఐసిస్ సానుభూతిపరులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో కలకలం రేగింది. ఢిల్లీలోని వజీరాబాద్ ప్రాంతంలో గురువారం ఉదయం జరిగిన ఓ ఎన్కౌంటర్ తర్వాత ఐఎస్ఐఎస్తో సంబంధాలున్న ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడినట్టు ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. కాగా బుధవారం రాత్రి తమిళనాడు పోలీసులు జిహాదీ ఉగ్రవాద ముఠాను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే నేపాల్ నుంచి కొందరు అనుమానితులు అక్రమంగా దేశంలోకి ప్రవేశించినట్లు ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం. దీంతో సరిహద్దుల్లో రక్షణ సిబ్బంది అప్రమత్తమైంది. -
ఉత్పాతాల ఛాయలో...
ఇవి పశ్చిమాసియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం, బ్రెజిల్ అంతర్గత పోరుకు నిదర్శనాలు! వీటిని ఫ్రేమ్‌లో బంధించిన సాహసి.. కరోల్ గూజి! ప్రపంచ ప్రఖ్యాత ఫొటో జర్నలిస్ట్. సంక్లిష్ట జీవితాలను కెమెరాతో ప్రపంచానికి చూపించి.. ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్ పురస్కారాన్ని పొందారు.. ఒకటి.. రెండు కాదు నాలుగు సార్లు. ఈ ఘనత సాధించిన తొలి జర్నలిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు. పనికి జెండర్ కాదు సామర్థ్యం ముఖ్యమని నిరూపించారు. నేపథ్యం.. అరవై మూడేళ్ల కరోల్.. అమెరికా వాస్తవ్యురాలు. చిన్నప్పుడే తండ్రి చనిపోతే తల్లి రెక్కల కష్టంతో పెరిగారు. తల్లి ఆర్థిక బాధ్యతలను పంచుకోవడానికి నర్స్‌గా ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ సమయంలోనే కరోల్ ఫ్రెండ్ ఒకతను ఆమెకు ఎస్ఎల్ఆర్ కెమెరాను కానుకగా ఇచ్చాడు. అది ఆమె లక్ష్యాన్ని ఫోకస్ చేసింది. ఫొటోజర్నలిస్ట్ కావాలని ఫొటోగ్రఫీ కోర్స్‌లో జాయిన్ అయ్యారు. ‘ది మియామీ హెరాల్డ్’లో ఇంటర్న్‌గా అవకాశం వచ్చింది. తర్వాత 1988లో ‘ది వాషింగ్టన్ పోస్ట్’లో స్టాఫ్ ఫొటోగ్రాఫర్‌గా ఉద్యోగం దొరికింది. 2014 వరకు అక్కడే ఉన్నారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ ఫొటో జర్నలిస్ట్‌గా జగమంత వేదిక చేసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, సంఘర్షణ పరిస్థితుల మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టారు? కళ్లముందు జరుగుతున్న నిజాలను లోకానికి తెలియజేయాలి. అవి ప్రకృతి వైపరీత్యాలైనా(హైతీ), సంఘర్షణాత్మక ప్రాంతాల్లోని పరిస్థితులనైనా. ఆ బాధితుల పట్ల మిగిలిన ప్రపంచానికున్న బాధ్యతను గుర్తు చేయాలి. ఫొటో జర్నలిస్ట్‌గా అది నా రెస్పాన్స్‌బులిటీ. అందుకే ఆ వాస్తవాల చుట్టే తిరుగుతున్నా ఇప్పటికీ. సవాళ్లు? నేను వచ్చిన కొత్తలో ఈ రంగంలో మహిళలు చాలా చాలా తక్కువ. అంతర్జాతీయ సమస్యల మీద రాసేవాళ్లు మరీ తక్కువ. ఇప్పుడలా లేదు. చాలా మారిపోయింది. చాలామంది అమ్మాయిలు ఈ కెరీర్‌ను ఎంచుకుంటున్నారు. మంచి పరిణామం. అయినా పని విషయంలో జెండర్ కాదు, సామర్థ్యాన్ని చూడాలి. వృత్తి పట్ల నిబద్ధతను చూడాలి. దేన్నయినా జనరలైజ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కో దృక్పథం. మహిళలకు భిన్నమైన జీవితానుభవాలుంటాయి. ఆ అనుభవాల్లోంచి వాళ్ల దృష్టికోణం ఏర్పడుతుంది. ఆ మాటకొస్తే మనం నివసించే ప్రాంతం, వాతావరణం, సంస్కృతి.. వీటన్నిటి ప్రభావమూ మన ఆలోచనల మీద ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్లే భిన్నమైన వాళ్లు. ఈ భిన్నత్వంతోనే ప్రపంచం బ్యాలెన్స్ అవుతోంది. తుపాకులు, బాంబుల మోతలో కెమెరాతో సైలెంట్‌గా ఎలా? బేసిగ్గా నేను వార్ ఫొటోగ్రాఫర్‌ని కాను. కాబట్టి ఫ్రంట్‌లైన్ ఎక్స్‌పీరియెన్స్ ఏమీ నాకు లేదు. కాని ఈ మధ్య ఐఎస్ఐఎస్ కాన్ఫ్లిక్ట్ జోన్‌కి వెళ్లాను. ఆ విధ్వంసం తర్వాత ఉండే ఎమోషనల్ డ్రామా నన్ను బాగా కలచివేసింది, భయపెట్టింది. సూసైడ్ బాంబర్స్‌గా తండ్రులు చనిపోతారు. తల్లులు గాయాలతో పడి ఉంటారు. తల్లిదండ్రుల కోసం ఆ పిల్లలు పెట్టే ఆర్తనాదాలు.. వెంటాడుతుంటాయి. ఆడవాళ్ల పరిస్థితుల్లో తేడాలు గమనించారా? మీరెక్కడ ఉన్నారన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. సపోజ్ నా విషయానికి వస్తే.. మిగతా వాళ్లతో పోలిస్తే అమెరికన్ ఉమన్‌గా నాకు చాలా స్వేచ్ఛ ఉంటుంది. కొన్ని దేశాల సంస్కృతి వేరు. తగ్గట్టే స్త్రీల స్థితీ వేరుగానే ఉంటుంది. ఇప్పుడు పరిస్థితులు చాలా మారినా లింగ వివక్ష, మహిళల పట్ల వేధింపులు మాత్రం తగ్గలేదు. మహిళలు, పిల్లలు ఇంకా వల్నరబులే. దీని మీద మెయిన్ స్ట్రీమ్ మీడియా దృష్టి పెట్టాలి. మహిళల దృక్పథంలో మనందరం పనిచేయాలి. భావప్రకటనా స్వేచ్ఛ ప్రపంచంలోని దాదాపు అన్ని చోట్లా ప్రమాదంలోనే ఉంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమిది. తమ హక్కుల గురించి మాట్లాడేందుకు, జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛను మించిన ఆయుధాల్లేవు. ముఖ్యంగా ఆడవాళ్లకు. వీటి మీద ఆంక్షలు పెడుతూ ప్రజలకు నిజాలు తెలియనీయకుండా చేస్తున్నాయి ప్రభుత్వాలు. జర్నలిస్ట్‌లు.. జర్నలిస్ట్‌లు, ఫొటోజర్నలిస్ట్లు.. ఎవరైనా సరే.. నిజాలను వెలికి తీయాలి. మీ పనే మీ గురించి చెబుతుంది. పని.. విశ్వజనీనమైన భాష. – సరస్వతి రమ ఫొటోలు: నోముల రాజేశ్‌రెడ్డి ►ఇండియా పర్యటన ఇదే మొదటిసారి కాదు. చాలాసార్లు వచ్చాను అసైన్మెంట్స్ మీద. మదర్ థెరిస్సా అంతిమయాత్రనూ కవర్ చేశాను. హైదరాబాద్‌కు రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. ట్రాఫిక్ తప్ప అంతా బాగుంది (నవ్వుతూ)ఈ దేశం విజువల్‌గా బ్రైట్ అండ్ బ్యూటిఫుల్. పీపుల్ ఆర్ సో స్వీట్. -
మొజాంబిక్‌లో దాడి.. 16 మంది మృతి
మపుటో: తూర్పు ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో ఇస్లామిక్ తీవ్రవాదులు మంగళవారం 16 మందిని హతమార్చిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మొజాంబిక్‌లోని కాబో డెల్గాడో అనే ముస్లిం ఆధిక్య ప్రాంతంలో ఇస్లామిక్ తీవ్రవాదులు 2017 అక్టోబర్ నుంచి దాడులకు పాల్పడుతున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు కనీసం 200 మంది ప్రజలను చంపేశారు. వేలాది మంది ప్రజలు ఇళ్లు వదిలిపారిపోయారు. తాజాగా మంగళవారం మిత్సుబిషి ట్రక్కులో ప్రయాణికులు, సరుకులను వేసుకుని వెళ్తుండగా తీవ్రవాదులు దాడి చేశారు. ఇంట్లో తయారు చేసుకొచ్చిన పేలుడు పదార్థాలను తీవ్రవాదులు ట్రక్కుపై విసిరి, అనంతరం కాల్పులు ప్రారంభించారు. వాహనంలోనే ఎనిమిది మంది చనిపోయారనీ, కిందకు దిగి పారిపోతుండగా కాల్చడంతో మరో ఏడు మంది కూడా మరణించారనీ, మరో వ్యక్తి బుధవారం చనిపోయాడిన స్థానిక వ్యక్తి చెప్పారు. అఫ్గాన్‌లో కారుబాంబు దాడి కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో శుక్రవారం ఉదయం అమెరికా కాన్వాయ్ లక్ష్యంగా జరిగిన కారు బాంబు ఆత్మాహుతి దాడిలో నలుగురు పౌరులు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. అమెరికా భద్రతాదళ సిబ్బందిలోనూ నలుగురికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు చెప్పారు. గత రెండ్రోజుల్లో కాబూల్‌లో జరిగిన రెండో ఆత్మాహుతి దాడి ఇది. కాబూల్‌లోని యాకతోత్‌లోని భవనాలను అమెరికా, నాటో బలగాలు భద్రతగా ఉంటాయి. అక్కడికి దగ్గర్లోనే అఫ్గానిస్తాన్ జాతీయ భద్రతా దళాల భవనాలు కూడా ఉంటాయి. అమెరికా దళాల వాహనశ్రేణి వెళ్తుండగా తాలిబన్ ఉగ్రవాది కారుతో వెళ్లి ఢీకొట్టాడు. -
కేరళలో హై అలర్ట్
తిరువనంతపురం: శ్రీలంక నుంచి లక్షద్వీప్ దీవులకు వస్తున్న ఓ బోట్లో పదిహేను మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారం కలకలం రేపింది. దీంతో కేరళ, లక్షద్వీప్ తీర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నేవీ, కోస్ట్ గార్డ్, కోస్టల్ పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. నిఘా వర్గాల సమాచారంతో తీర ప్రాంతాల్లో నౌకలను, విమానాలను సిద్ధం చేసినట్లు నేవీ అధికారి ఒకరు తెలిపారు. శ్రీలంకలో వరుస బాంబు దాడుల తర్వాత హెచ్చరికలు రావడం, కేరళలో ఐఎస్ ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేశారనే సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేరళకు చెందిన కొంతమంది ఐసిస్‌తో కలిసి పనిచేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. శ్రీలంకలో ఏప్రిల్ 21న జరిగిన బాంబు దాడుల్లో 250 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘాతుకానికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ పేర్కొంది. -
కలకలం సృష్టిస్తోన్న ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్ : మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులు దాక్కున్నారనే అనుమానంతో పలువురి ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి పలు ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాద కోణంలో 8 మంది అనుమానితుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. ఈ మేరకు కింగ్స్ కాలనీలో భారీగా పోలీసులు మోహరించారు. గతంలో పట్టుబడ్డ బాసిత్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పక్కా ఆధారాలతోనే అనుమానితులను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మాడ్యుల్ ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన యువకులు ఢిల్లీలో భారీ విధ్వంసాలకు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం వారు రసాయనాలను, డబ్బులను సమకూర్చుకుంటున్నారు. గతంలోనే.. ఢిల్లీలోని ఆర్ఎస్సెస్ నాయకుడి హత్యకు కుట్రలు పన్నారని.. ఈమేరకు వారికి ఐసిస్ నుంచి ఆదేశాలు అందాయని తెలుస్తోంది. ఆర్ఎస్సెస్ నాయకుడి హత్యకు ఢిల్లీ వెళ్లిన బాసిత్, నలుగురు యువకులకు ఏకే 47లను ఐసిస్ సమకూర్చింది. ఢిల్లీలో ఆ నలుగురు యువకులను అరెస్ట్ చేయడంతో.. ప్లాన్ విఫలమైంది. దీంతో బాసిత్ హైదరాబాద్‌కు తిరిగొచ్చేశాడు. హైదరాబాద్‌లో బాసిత్ పాటు మరో ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఒకరిని అదుపులోకి.. ఉదయం నుంచి ఎన్ఐఏ అధికారులు నిర్వహించిన సోదాల్లో ఓ యువకుడి (తహన్)ని అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తహన్‌ను గచ్చిబౌలిలోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించినట్టు తెలుస్తోంది. -
ఐసిస్‌పై లక్ష మిసైళ్లు
ఐసిస్.. సిరియా, ఇరాక్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదాడులు నిర్వహించి వేలాదిమందిని పొట్టనపెట్టుకున్న రాక్షసమూక. పశ్చిమాసియా దేశాలైన సిరియా, ఇరాక్‌లో గణనీయమైన భూభాగాన్ని అక్రమించుకుని ఖలీఫత్ పేరిట 2014లో ఏకంగా సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆయిల్, ఇతర సహజవనరుల్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ ఆ సొమ్ముతో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద భావజాలానికి మద్దతుగా నిలిచింది. మైనారిటీ మతస్తుల్ని బందీలుగా చేసుకుని గొంతు కోసి హతమార్చడం, తమ భావజాలాన్ని వ్యతిరేకించే సొంత మతస్తుల్ని సజీవ దహనం చేయడం వంటి దారుణ చర్యలతో వణుకు పుట్టించింది. అయితే ఇదంతా గతం. 2014లో ఐసిస్‌ను అణచివేసేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా భారీ ఎత్తున వైమానిక దాడులకు ఆదేశాలిచ్చారు. చివరికి 2017, అక్టోబర్‌లో ఐసిస్ ఉగ్రవాదులు నక్కిన చివరి నగరమైన రక్కాను సంకీర్ణ సేనలు స్వాధీనం చేసుకోవడంతో ఐసిస్‌ను ఓడించేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ప్రకటించారు. అయితే నిజంగానే ఐసిస్‌ను పూర్తిగా అణచేశారా? భవిష్యత్‌లో ఉగ్రదాడులు చేయడానికి వీల్లేకుండా దాన్ని ఆర్థికమూలాల్ని పూర్తిగా నాశనం చేశారా? అంటే జవాబు కాదనే వినిపిస్తోంది. ఈ విజయం తాత్కాలికమే: జమాత్–అల్–తావీద్–వల్–జీహాద్ (జేటీజే) పేరుతో 1999లో ఏర్పడ్డ ఈ సంస్థ.. క్రమక్రమంగా పశ్చిమాసియాలో పట్టు పెంచుకోవడం ప్రారంభించింది. లాడెన్ నేతృత్వంలోని అల్‌కాయిదాకు విధేయత ప్రకటించుకున్న జేటీజే.. 2003లో ఇరాక్‌పై–అమెరికా యుద్ధంలో పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా దాడులకు పాల్పడింది. 2014 నాటికి ఇరాక్, సిరియాల్లో గణనీయమైన భూభాగాన్ని స్వాధీనం చేసుకుని సంస్థ పేరును ఐసిస్‌గా మార్చుకుంది. అప్పట్నుంచి ప్రపంచవ్యాప్తంగా సిరియా, ఇరాక్, ఫ్రాన్స్, బెల్జియం సహా 29 దేశాల్లో 140 ఉగ్రదాడులకు పాల్పడి వేలాది మందిని పొట్టనపెట్టుకుంది. కశ్మీర్‌లోనూ అల్లరిమూకలు ఐసిస్ జెండాలు ప్రదర్శించంపై భారత నిఘా సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ఓ రక్షణ సంస్థ నివేదిక ప్రకారం సంకీర్ణ సేనలు ఐసిస్ అధీనంలోని 29,741 స్థావరాలపై ఇప్పటివరకూ 1,07,814 మిస్సైళ్లను, బాంబుల్ని ప్రయోగించాయి. ఈ దాడుల్లో 60,000 మంది ఉగ్రవాదులు, 6,321 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఓవైపు అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు, మరోవైపు రష్యా, ఇరాన్, సాయంతో పోరాడుతున్న సిరియన్ బలగాలు ఐసిస్ కబంధ హస్తాల నుంచి చాలా పట్టణాలకు విముక్తి కల్పించాయి. అయితే ఈ విజయం తాత్కాలికమేననీ, ఇరుపక్షాల మధ్య దీర్ఘకాలిక పోరాటానికి ఇది ఆరంభమేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటివరకూ అఫ్గాన్‌లో 17 మంది అమెరికన్ కమాండర్లు మారినా పరిస్థితి మారకపోవడాన్ని గుర్తుచేస్తున్నారు. సోషల్ మీడియానే ఆయుధం: సంకీర్ణ సేనలు, రష్యా, ఇరాన్ బలగాల వరుస దాడులతో కుదేలయినప్పటికీ ఈ ప్రాంతంలో ఐసిస్ తన ప్రాబల్యాన్ని పూర్తిగా కోల్పోలేదని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. అమెరికా, యూరప్ దేశాలపై ఆత్మాహుతి దాడులతో విరుచుకుపడాలని సామాజిక మాధ్యమాల ద్వారా యువతకు ఉగ్రవాదులు విషాన్ని నూరిపోస్తున్నారని తెలిపారు. సరికొత్తగా గెరిల్లా యుద్ధ తంత్రాన్ని అనుసరిస్తున్నారన్నారు. ఇందులోభాగంగా యుద్ధాలు, ప్రభుత్వ అసమర్ధత కారణంగా ఉపాధి లేకుండా నిరుద్యోగులుగా ఉన్న యువతను భారీగా భర్తీ చేసుకుంటూ ఐసిస్, ఇతర ఉగ్రసంస్థలు శక్తిమంతంగా మారేందుకు యత్నిస్తున్నాయని చెప్పారు. ఉగ్రమూకల్ని అణచివేయడంలో సైనిక చర్య ద్వారా తాత్కాలిక ఫలితాలను మాత్రమే సాధించగలమనీ, దీర్ఘకాలంలో పరిస్థితిలో ఎలాంటి మార్పు రాబోదన్నారు. ఈ దేశాల్లో సామాజిక, ఆర్థిక, పర్యావరణ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని పరిష్కారానికి యత్నించినప్పుడు సానుకూల ఫలితాలు వస్తాయన్నారు. ► సంకీర్ణ సేనలు లక్ష్యంగా చేసుకున్న ఐసిస్ స్థావరాలు 29,741 ► ఐసిస్‌పై ప్రయోగించిన మిస్సైళ్లు, బాంబులు 1,07,814 ► హతమైన ఉగ్రవాదులు 60,000 ► చనిపోయిన పౌరులు 6,321 ► ఐసిస్ పంజా విసిరిన దేశాలు 29 ► ప్రపంచవ్యాప్తంగా జరిపిన ఉగ్రదాడులు 140 ► ఐసిస్ వద్ద ఆధునిక మెషీన్గన్ల నుంచి రసాయన ఆయుధాల వరకు ► ఇటీవలే బల్గేరియా నుంచి ఓ శక్తివంతమైన మిసైల్‌ను కూడా ఐసిస్ సేకరించిందన్న అమెరికా -
స్వదేశానికి ‘ఇరాక్ మృతదేహాలు’
అమృత్సర్/కోల్‌కతా: ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన 39 మంది భారతీయుల్లో 38 మృతదేహాలను ప్రత్యేక విమానంలో కేంద్రం సోమవారం భారత్‌కు తీసుకొచ్చింది. మరొక మృతదేహం ఎవరిదనే విషయం కచ్చితంగా నిర్ధారణ కాకపోవటంతో దాన్ని ఇరాక్‌లోనే ఉంచారు. మృతదేహాలను తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ఆదివారం ఇరాక్ వెళ్లడం తెలిసిందే. 38 మృతదేహాల్లో 27 పంజాబ్‌కు, నాలుగు హిమాచల్ ప్రదేశ్‌కు చెందినవి కావడంతో ఆ 31 మృతదేహాలను అమృత్‌సర్‌లోని విమానాశ్రయంలో బంధువులకు అప్పగించారు. మిగిలిన ఏడింటిని కోల్‌కతా, పట్నా విమానాశ్రయాల్లో ఆప్తులకు అధీన పరిచారు. వీరంతా దాదాపు సంవత్సరం క్రితమే చనిపోయారనీ, భూమిలో పాతిపెట్టిన శవాలను ఇటీవల వెలికి తీసి తెచ్చినందున ఇప్పుడు ఈ శవపేటికలను తెరవడం మంచిది కాదని వీకే సింగ్ సూచించారు. శవాలను పాతిపెట్టిన స్థలంలో విషపదార్థాలు ఉండేవనీ, అలాగే మృతదేహాలను ఎంబామింగ్ చేసి శవపేటికల్లో పెట్టడంతో వాటిని తెరవడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. -
ఐసిస్ కలకలం
ఈ రాష్ట్రానికి ఏమైంది...ఒకవైపు మావోలు..మరోవైపు ఐఎస్ తీవ్రవాదులు..విధ్వంసాలకు కుట్ర’. నాలుగు రోజుల్లో పట్టుబడిన నిందితుల నేపథ్యం ప్రభుత్వాన్ని ప్రజలను ఈ రకంగా భయాందోళనకు గురి చేస్తోంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఒకప్పుడు తమిళనాడు దేశంలోనే శాంతి భద్రతల సమస్యలు, తీవ్రవాద కార్యకలాపాలు లేని ప్రాంతంగా పేరుగాంచింది. ఆధ్యాత్మిక చింతన, గుళ్లు గోపురాలతో నిండిన రాష్ట్రంలో కరుడుగట్టిన వ్యక్తులకు తావులేదని భావించేవారు. అయితే కొన్నేళ్లలో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తీవ్రవాద కార్యకలాపాలకు అవసరమైన మనుషులు తమిళనాడులో సులభంగా దొరుకుతారు అనే భావన జాతీయ, అంతర్జాతీయ తీవ్రవాదులు సైతం వేళ్లూనుకుపోయింది. యువతకు బ్రెయిన్ వాష్ చేసి ముఠాలో చేర్చుకోవడంలో కొందరు వ్యక్తులు నిమగ్నమై ఉండడం ఆందోళనకరమైన అంశం. దశరథన్, సెన్బగవళ్లి అనే మావో దంపతులు తమ దళంలోకి యువతను చేర్చుకునే ప్రయత్నంలోనే ఈనెల 10వ తేదీన తిరువళ్లూరులో పట్టుబడడం గమనార్హం. సుమారు 15 ఏళ్ల క్రితం అప్పటి, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని హతమార్చేందుకు తిరుమల అలిపిరి మార్గంలో మంతుపాతర పేల్చిన సంఘటనలో ఈ మావో దంపతులు నిందితులని పోలీసుల విచారణలో తేలింది. దీంతో సదరు మావోలు ఏపీపై గురిపెట్టినట్లు అనుమానిస్తున్నారు. మావో దంపతులతో పాటు రహస్య సమావేశానికి హాజరై పారిపోయిన పదిమంది మావోల కోసం తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అడవుల్లో క్యూ బ్రాంచ్ పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు. ఐఎస్ కలకలం: మావోల కోసం ఒకవైపు కూంబింగ్ జరగుతుండగా చెన్నైలో సోమవారం రాత్రి ఐఎస్ తీవ్రవాది దొరకడం, మరో ఐదుగురి కోసం గాలించడం గమనార్హం. సిరియా, ఇరాక్‌లోని కొంత ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న ఐఎస్ తీవ్రవాదులు ప్రత్యేక దేశాన్ని ప్రకటించుకోవాలని పోరాడుతున్నారు. ఐఎస్ తీవ్రవాదులకు, ఇతర దేశాల సైనికులకు మధ్య హోరాహోరీగా పోరుసాగుతోంది. ఈ పోరు కోసం మరింత బలగాలను సిద్ధం చేసుకునేందుకు ఐఎస్ తీవ్రవాద సంస్థ ఇతర దేశాలపై కన్నువేసింది. తమ తీవ్రవాద సంస్థకు ప్రపంచ నలుమూలలా సానుభూతిపరులు ఉన్నారని నమ్ముతున్న ఐఎస్ సంస్థ కేరళ నుంచి కొంత మంది యువకులను ఎంపిక చేసి సిరియాకు పంపి తమలో విలీనం చేసుకున్నట్లు కేంద్ర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు గ్రహించారు. దీనిపై ఎన్ఐఏ తీవ్రస్థాయిలో విచారణ చేపట్టగా తమిళనాడు నుంచి సైతం యువత తరలిపోతున్నట్లు తెలియడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఐఎస్ తీవ్రవాదం వైపు యువతను చేరవేయడంలో కడలూరు జిల్లాకు చెందిన ఖాజా ఫక్రుద్దీన్ ప్రధానపాత్ర పోషించినట్లు కనుగొన్నారు. ఖాజా ఫక్రుద్దీన్ సిరియా దేశానికి వెళ్లి సాయుధ శిక్షణ కూడా తీసుకున్నాడు. సింగపూర్ పౌరసత్వాన్ని కలిగి ఉన్న ఖాజా ఫక్రుద్దీన్ కదలికలపై అధికారులు నిఘాపెట్టారు. గత ఏడాది జనవరిలో అతని ఢిల్లీకి వచ్చినçప్పుడు ఎన్ఏఐకి పట్టుబడగా, తమిళనాడులో తనకంటూ ఒక ప్రత్యేక తీవ్రవాద ముఠాను సిద్ధం చేసినట్లు, ఈ ముఠాలో 9 మంది తమిళులు ఉన్నట్లు అధికారుల వద్ద ఖాజా ఫక్రుద్దీన్ అంగీకరించాడు. ఈ 9 మందిపై 9 సెక్షన్లలో అనేక కేసులు పెట్టి గాలింపు ప్రారంభించారు. గత ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన అబ్దుల్లా ముత్తలీఫ్, 18వ తేదీన సాహుల్ హమీద్ అనే ఐఎస్ సానుభూతిపరులు చెన్నైలో అరెస్టయ్యారు. ఈ ముగ్గురిని ఎన్ఏఐ అధికారులు తీవ్రస్థాయిలో విచారించారు. మిగిలిన ఆరుగురు అజ్ఞాతంలో ఉంటూ ఐఎస్ కోసం నిధుల సమీకరణ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. ఐఎస్ తీవ్రవాద సంస్థకు మానవరవాణా, నిధుల సమీకరణతోపాటూ తమిళనాడులో విధ్వంసాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా పోలీసులు కనుగొన్నారు. ఏదో ఉపద్రవం జరిగేలోగా ఆరుగురిని పట్టుకోవాలని ఎన్ఏఐ అధికారులు గాలింపును తీవ్రతరం చేశారు. తమిళనాడులో ఐఎస్ తీవ్రవాదుల సంఖ్యలో కన్యాకుమారీ జిల్లా నాల్గవస్థానంలో ఉన్నట్లు అందిన సమాచారం ఎన్ఏఐ అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. కన్యాకుమారీ జిల్లా తిరువిదాంగేడు ఉత్తమన్ ప్రాంతానికి చెందిన అన్సార్ మీరన్ చెన్నైలో దాక్కుని ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఏఐ అధికారులు సోమవారం రాత్రి అన్సార్మీరన్ను చెన్నైలో అరెస్ట్ చేశారు. అన్సార్ మీరన్ తనపై ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు చెన్నైలో ట్రావెల్స్ ఏజెన్సీ నడుపుతూ ఐఎస్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తేలింది. తన ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారానే భారతదేశానికి చెందిన యువకులకు సిరియాకు విమాన టికెట్లు సమకూర్చాడు. అన్సార్ మీరన్‌ను రహస్య ప్రదేశంలో ఉంచి ఎన్ఏఐ అధికారులు విచారిస్తున్నారు. తమిళనాడు నుంచి సిరియాకు ఎంతమంది యువకులను పంపారనే వివరాలను రాబట్టుతూ గాలింపును తీవ్రతరం చేశారు. అన్సార్ మీరన్‌ను పూందమల్లిలోని ప్రత్యేక కోర్టులో మంగళవారం హాజరుపరిచి పుళల్ సెంట్రల్ జైలుకు పంపారు. అన్సార్ మీరన్‌ను పదిరోజుల పోలీసు కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ ఎన్ఏఐ అధికారులు మంగళవారం కోర్టులో పిటిషన్ వేశారు. -
విమానాశ్రయంలో కాల్పుల కలకలం
ట్రిపోలి: లిబియా రాజధాని ట్రిపోలిలో ఉన్న మిటిగ ఎయిర్‌పోర్టులో విమానాశ్రయ బలగాలైన స్పెషల్ డిటరెంట్ ఫోర్స్, స్థానిక బషిర్ అల్-బక్వర దళం మధ్య జరిగిన కాల్పుల్లో 20 మంది మృతి చెందగా మరో 63 మంది గాయపడ్డారు. దీంతో అధికారులు విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేశారు. ఘర్షణలో తమ సైనికులు నలుగురు మృతిచెందారని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని స్పెషల్ డిటరెంట్ ఫోర్స్ ప్రతినిధి అహ్మద్ బిన్ సలీమ్ చెప్పారు. మృతి చెందినవారిలో ప్రజలు, విమానాశ్రయ సిబ్బంది కూడా ఉన్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఘర్షణ నేపథ్యంలో ఉద్యోగులందరినీ బయటకు పంపించామని, 5 విమాన సర్వీసులు రద్దు చేశామని విమానాశ్రయ సిబ్బంది వెల్లడించారు. విమానాశ్రయానికి దగ్గరలోని జైలులో ఉన్న అల్-కాయిదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను విడిపించడానికి అల్-బక్వర ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని ట్రిపోలి పాలక సంస్థ ప్రెసిడెన్సీ కౌన్సిల్ పేర్కొంది. -
అఫ్గాన్‌లో ఐఎస్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి
-
అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. షియా ముస్లింలు లక్ష్యంగా గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో సుమారు 40 మంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఆఫ్గానిస్తాన్‌పై సోవియెట్ దాడిచేసి 38 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాబూల్‌లోని తయాబాన్ సాంస్కృతిక కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం జరుగుతుండగా ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో భవనంలో సుమారు 100 మంది ఉన్నట్లు తెలిసింది. బాధిత కుటుంబీకులు, బంధువుల ఆర్తనాదాలు, రోదనలతో స్థానిక ఆసుపత్రులు ప్రతిధ్వనించాయి. తయాబాన్ కేంద్రం ఉగ్రవాదులకు లక్ష్యంగా మారే అవకాశం ఉందని ఆఫ్గాన్ వాయిస్ ఏజెన్సీ అనే మీడియా సంస్థ ఇంతకుముందే హెచ్చరించింది. ఈ దాడి తమ పనేనని ఉగ్ర సంస్థ ఐఎస్ ప్రకటించింది. దుండగుడు ఆత్మాహుతికి పాల్పడిన తరువాత ప్రజలు భయంతో పరుగులు పెడుతున్న సమయంలో మరో రెండు తక్కువ తీవ్రత ఉన్న బాంబులు పేలిపోవడంతో 40 మంది చనిపోయారు. మృతులు, క్షతగాత్రులను తరలించిన స్థానిక ఇస్తిక్లాల్ ఆసుపత్రిలో భీతావహ వాతావరణం నెలకొంది. తీవ్ర గందరగోళం మధ్య తమ వారి కోసం వెతుకుతూ బాధితుల బంధువులు బోరున విలపించారు. -
‘అహ్మద్ పటేల్‌కు ఐసిస్‌తో సంబంధాలు’
న్యూఢిల్లీ/రాజ్‌కోట్: ఓ ఐసిస్ ఉగ్రవాది ఇన్నాళ్లూ గుజరాత్లో పనిచేసిన వైద్యశాలకు, ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ అగ్రనేత అహ్మద్ పటేల్‌కు సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. ఐసిస్ ఉగ్రవాదులుగా అనుమానిస్తూ గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం ఇద్దరిని అరెస్టు చేసింది. వారిలో కసీం స్టింబర్‌వాలా అనే వ్యక్తి భహ్రూచ్ జిల్లా అంకాలేశ్వర్‌లోని సర్దార్ పటేల్ వైద్యశాలలో పనిచేసేవాడు. అరెస్టవ్వడానికి ముందే రాజీనామా చేశాడు. ఈ ఆసుపత్రికి 2015 వరకు పటేల్ ధర్మకర్తగా ఉన్నారు. పటేల్‌పై ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. 2015 వరకు వైద్యశాలకు పటేల్ ధర్మకర్తగా ఉంటే, అరెస్టైన వ్యక్తి ఏడాది క్రితమే ఉద్యోగంలో చేరాడనీ, పటేల్‌పై ఆరోపణలు చేసి బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అన్నారు. -
ఐఎస్‌పై కుర్దిష్ మహిళల వీరోచిత పోరాటం..
డమస్కస్ : సిరియాలో నాలుగేళ్లపాటు తిష్టవేసి అనాగరికంగా, ఆటవికంగా పాలన సాగించిన ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను ఓడించినట్లు సైనిక వర్గాలు ఇటీవల ప్రకటించగానే టెర్రరిస్టులకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాడిన కుర్దిష్ మహిళా యోధులు వీధి వీధి తిరుగుతూ ఆనందోత్సవాలను చాటుకున్నారు. టెర్రరిస్టుల ఆధీనంలో ఉన్న రక్కాను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో వీరు కీలక పాత్ర పోషించారు. టెర్రరిస్టులు మహిళలను బానిసలుకన్నా అధ్వాన్నంగా చూడడమేకాకుండా వారిని, ముఖ్యంగా యాజిదీ మైనారిటీ మహిళలను సెక్స్ బానిసలుగా చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని కుర్దీష్ మహిళలు ఈ పోరాటంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వారిలో 30 మంది మహిళా యోధులు అమరులయ్యారు. తాము ఏ దేశంలో టెర్రరిజం ఏ మూలన ఉన్నా దానికి వ్యతిరేకంగా పోరాడుతామని ఈ సందర్భంగా మహిళాయోధులు శపథం చేశారు. ఈ సందర్భంగా మహిళలను తమ ఆలోచనలను మీడియాతో పంచుకున్నారు. వారిలో శాందా అఫ్రీన్ మాట్లాడుతూ ‘ నాయకుడు అబ్దుల్లా ఒకాలన్ మహిళల స్వేచ్ఛపై దష్టి పెట్టారు. అందుకనే మేము కూడా మహిళల స్వేచ్ఛ కోసం, మానసికంగా ప్రజల విముక్తి కోసం పోరాటం జరిపాం. మా పోరాటం ఒక్క ఐఎస్ఐఎస్కు వ్యతిరేకంగానే కాదు. అన్ని రకాల దుష్ట శక్తులపై మా పోరాటం కొనసాగుతుంది. ఒక్కోసారి మహిళల నుంచి కూడా చెడు ఎదురుకావచ్చు. అలాంటి ఆస్కారం లేకుండా వారు విద్యావంతులు కావాలి. మంచి సిద్ధాంతాన్ని అలవర్చుకోవాలి’ అని చెప్పారు. అబ్దుల్లా ఒకాలన్ కుర్దిస్ధాన్ వర్కర్స్ పార్టీ వ్యవస్థాపకుడు. ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయన పార్టీని కూడా టర్కీ, అమెరికా, యూరోపియన్ యూనియన్ కూడా టెర్రరిస్టు పార్టీగా గుర్తిస్తోంది. అయితే ఆయన్ని ఆదర్శంగా తీసుకున్న కుర్దిష్ మహిళా యోధులు మాత్రం ఒకాలన్ చిత్రంగల జెండాను ఎగరేస్తూ వారం క్రితం వీధుల్లో తిరిగారు. ఐఎస్ఐఎస్కు వ్యతిరేకంగా మూడేళ్ల క్రితం యుద్ధం ప్రారంభమైనప్పుడు అవ్రిమ్ డిఫ్రామ్ 17 ఏళ్ల అమ్మాయి. తమ పోరాటంలో ఎంతో మంది మరణించారని, ప్రతి మరణం కూడా తమను మరింత కతనిశ్చయంతో పోరాడేలా చేసిందని ఆమె చెప్పారు. అణచివేత నుంచి ప్రజలను విముక్తం చేసే వరకు, తమ నాయకుడు ఒకాలన్ను విడుదల చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆమె చెప్పారు. 24 ఏళ్ల వులత్ రోమిన్ గత ఏడాదిన్నరగా ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను వ్యతిరేకంగా పోరాటం జరుపుతున్నారు. ఆమె రక్కా, తబ్కా, హల్హోల్లో పోరాటం జరిపారు. ‘కుర్దిష్ ప్రజల స్వేచ్ఛ కోసం, ముఖ్యంగా మహిళల స్వేచ్ఛ కోసం నేను పోరాటం జరుపుతున్నాను. ప్రజలకు జరిగే ప్రతి అన్యాయంపైనా పోరాటం చేస్తాను’ అని ఆమె చెప్పారు. ఇక సోజ్దార్ డెరిక్ ఆరేళ్లుగా ఐఎస్ఐఎస్ టెర్రిరిస్టులను వ్యతిరేకండా పోరాటం చేస్తున్నారు. ‘మా మహిళలను, మా మాతభూమిపై కొనసాగిస్తున్న అణచివేతకు వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను. మహిళలను సెక్స్ బానిసలుగా, ఉప మానువులుగా చూస్తున్న టెర్రరిస్టులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాను’ అని ఆమె వ్యాఖ్యానించారు. -
మూడేళ్లైనా 39 మంది భారతీయుల జాడలేదు
న్యూఢిల్లీ: ఇరాక్‌లో ఆచూకీ దొరకని భారతీయులను వెతికి స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతశాఖల మంత్రి విజయ్ సంప్లా అన్నారు. మూడేళ్ల క్రితం ఐసిస్ ఉగ్రవాదులు అపహరించిన 39 మంది భారతీయులు ప్రస్తుతం బుదుష్‌లోని జైల్లో ఉండే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే బుదుష్‌లోని జైలు ఎప్పుడో నెలమట్టం అయిందన్న వార్తలు ప్రచారం కావడంతో బాధితుల కుంటుంబాల్లో ఆందోళన తీవ్రమైంది. ఇరాక్ రాయభారి కార్యాలయం ఆదేశానుసారం అధికారులు ఆచూకీ లేని భారతీయుల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇద్దరు ఉన్నతస్థాయి అధికారులను ఈ పని నిమిత్తం ఇరాక్‌కు పంపి చర్యలు చేపట్టిందని, త్వరలోనే బాధితులను భారత్‌కు తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. బుదుష్ జైలు గురించి పూర్తి వివరాలు తనకు తెలియదని, విదేశాంగశాఖకు దీనిపై సమాధానం చెబుతుందని కేంద్ర మంత్రి సంప్లా అన్నారు. మీడియా సహకారంతోనే భారతీయులను వెనక్కి రప్పించడం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. విదేశాల్లో తప్పిపోవడం, ఆచూకీ లేకుండా పోయిన భారతీయులు ఎక్కువగా పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారని మంత్రి విజయ్ సంప్లా తెలిపారు. రేపు (సోమవారం) ఇరాక్ విదేశాంగ మంత్రి భారత పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. -
ఆ 39 మంది జైల్లో ఉన్నారేమో!
-
ఆ 39 మంది జైల్లో ఉన్నారేమో!: సుష్మ
న్యూఢిల్లీ: ఇరాక్‌లో మూడేళ్ల క్రితం ఐసిస్ ఉగ్రవాదులు అపహరించిన 39 మంది భారతీయులు ప్రస్తుతం బుదుష్‌లోని జైల్లో ఉండే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. ఈ నెల 24న ఇరాక్ విదేశాంగ మంత్రి భారత పర్యటనకు రానున్నారనీ, ఆ 39 మంది గురిం ఏదైనా కొత్త సమాచారం ఇచ్చే అవకాశం ఉందని ఆమె అన్నారు. అపహరణకు గురైన వారి కుటుంబ సభ్యులతో సుష్మ ఆదివారం మాట్లాడారు. తూర్పు మోసుల్‌ను ఐసిస్ నుంచి ఇరాక్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వెంటనే విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్‌ను అక్కడికి పంపించి 39 మంది గురించి ఆరా తీయించామని సుష్మ వెల్లడించారు. అక్కడి అధికారుల సమాచారం ప్రకారం తొలుత వారిని ఐసిస్ ఓ వైద్యశాల నిర్మాణ పనిలో పెట్టిందనీ, అనంతరం తోటలోకి మార్చారనీ, అక్కడి నుంచి బదుష్ జైలుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. -
భీకరకాల్పులు.. 32 మంది తీవ్రవాదులు హతం
డమాస్కస్(సిరియా): సిరియా సైన్యానికి, ఐఎస్ తీవ్రవాదులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజుల క్రితం అలెప్పో సమీపంలోని అల్‌జర్రా మిలిటరీ స్థావరాన్ని ఐఎస్ తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. దానిని తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో ఆ దేశాధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్‌కు విధేయంగా ఉన్న దళాలు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఆర్మీ స్థావరాన్ని దక్కించుకునే క్రమంలో 49 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సిరియా అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్(ఎస్వోహెచ్ఆర్) ప్రకటించింది. 17మంది సైనికులు అమరులు కాగా, 32 మంది ఐఎస్ తీవ్రవాదులు అంతమయ్యారని పేర్కొంది. కాగా, సిరియా సైన్యం అల్ జిర్రా ఎయిర్‌బేస్ చుట్టుపక్కలున్న 12 పట్టణాలను తిరిగి వశం చేసుకోవడం శుభపరిణామం. అయితే ఐసిస్‌ను అంతం చేసేంతవరకు అక్కడ తమ పోరు ఆగదని ఆర్మీ ఉన్నతాధికారి తెలిపారు. -
మిలిటెంట్‌కు గన్ సెల్యూట్
శ్రీనగర్: ఇటీవల భద్రతా బలగాల చేతిలో హతమైన ఉగ్రవాది ఫయాజ్ అహ్మద్ అలియాస్ సేథా అంత్యక్రియల్లో అతని సహచర మిలిటెంట్లు పాల్గొన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఆదివారం జరిగిన అంత్యక్రియల్లో హాజరై తమ సహచరుడికి ఏకే–47 తుపాకులతో గన్ సెల్యూట్ చేశారు. దాదాపు నలుగురు మిలిటెంట్లు అంత్యక్రియలకు హాజరయ్యారని, పలు నినాదాలు ఇచ్చిన అనంతరం వారు పరారైనట్లు పోలీసులు తెలిపారు. కాగా ఫయాజ్ అంత్యక్రియలకు భారీగా ప్రజలు హాజరయ్యారు. గుంపులో కొందరు పాకిస్తాన్ జెండాలను ప్రదర్శించారు. 2015 ఆగస్టులో జరిగిన ఉధమ్‌పూర్ ఉగ్రదాడిలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఫయాజ్‌పై కేసు నమోదు చేసింది. ఇతని తలపై రూ.2 లక్షల రివార్డు ఉంది. శనివారం కుల్గామ్‌లోని మిర్ బజార్లో రోడ్డుప్రమాదం జరగడంతో అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలపై మిలిటెంట్లు కాల్పులు ప్రారంభించారు. ఈ దాడిలో ఫయాజ్‌తో పాటు ముగ్గురు పౌరులు, ఓ పోలీస్ అధికారి మృతి చెందారు. ఐసిస్ ఉగ్రవాదులతో కశ్మీర్ యువత చాటింగ్! కశ్మీర్ లోయలో స్థావరాన్ని ఏర్పాటుచేసుకునేందుకు ఐసిస్ ప్రయత్నిస్తోందన్న వాదనలను కొట్టిపారేయలేమని భద్రతా సంస్థలు చెప్పాయి. గత ఆరు నెలలుగా లోయలోని యువకులు సిరియా, ఇరాక్‌లోని ఉగ్రవాద గ్రూపులతో ఇంటర్నెట్ ద్వారా చాటింగ్‌లు చేయడం లాంటివి పెరిగాయని తెలిపాయి. -
సిరియా పాపం ఎవరిది?
వేల ఏళ్ల సిరియా చరిత్ర మొత్తం పరాయి దేశాలు, రాజుల పాలనలోనే గడిచిపోయింది. ఇక ఆధునిక సిరియా హఫెజ్ అల్ అసద్, అతని కొడుకు బషర్ అల్ అసద్‌ల నియంతృత్వ పాలనలో మగ్గిపోయింది. బషర్ నియంతృత్వానికి వ్యతిరేకంగా 2011లో మొదలైన అంతర్యుద్ధంతో సిరియా నాశనమైంది. ఐసిస్ ఉగ్రవాదుల ఆగడాలతో దేశంలోని సగం మంది చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు. ఎందుకీ అంతర్యుద్ధం? 2010 చివర్లో ఈజిప్ట్ సహా అరబ్ దేశాల్లో నియంతల పాలనపై అరబ్ స్ప్రింగ్ పేరిట ప్రారంభమైన తిరుగుబాట్లతో సిరియన్లు కూడా ఉత్తేజితులయ్యారు. అసద్ కుటుంబ అవినీతి, అణచివేతతో విసిగిపోయిన ప్రజలు 2011 మార్చిలో దేరా పట్టణంలో తిరుగుబాటు చేశారు. అక్కడ మొదలైన ఘర్షణలు 2012 నాటికి ప్రాచీన నగరం అలెప్పో, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించాయి. దేరాలో ప్రజాప్రదర్శనను అసద్ సర్కారు అణచివేయడంతో తిరుగుబాటుదారులకు ప్రవాసంలో ఉన్న అసద్ వ్యతిరేకులు మద్దతు అందించారు. అసద్ షియా కావడంతో షియా మెజార్టీ దేశం ఇరాన్ తోపాటు, సొంత ప్రయోజనాల మేరకు రష్యాలు సాయం చేస్తున్నాయి. ఇక రష్యా అంటే గిట్టని అమెరికా, సౌదీఅరేబియాలు సున్నీ తిరుగుబాటుదారులకు సాయం అందిస్తున్నాయి. ప్రచ్ఛన్నయుద్దకాలంలో అసద్ కుటుంబం అప్పటి సోవియెట్ యూనియన్ కు మద్దతుగా నిలిచింది. దీంతో సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక అమెరికా అసద్ సర్కారుకు వ్యతిరేకంగా తిరుగుబాటుదారులకు సాయమందిస్తుంది. ఫలితంగా రష్యాకు అసద్ సర్కారు మరింత చేరువైంది. సిరియా వేదికగా అమెరికా, రష్యాలు ప్రత్యక్షంగా తలపడడం ఈ అంతర్యుద్ధానికి మరింత ఆజ్యం పోసింది. ఒక్క అలెప్పోలోనే దాదాపు ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి అదుపు తప్పడంతో 2015 ఆగస్టు నుంచి మృతులను ఐక్యరాజ్య సమితి లెక్కించడం మానేసింది. దాదాపు అర కోటి మంది పశ్చిమ ఐరోపా దేశాలకు పారిపోయారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కాబుల్‌పై ఐసిస్ పంజా
ఆర్మీ ఆసుపత్రిపై దాడిలో 30 మంది దుర్మరణం ఆరుగంటల ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రమూకల ఏరివేత కాబుల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్ బుధవారం మరోసారి బాంబు పేలుళ్లు, తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఇక్కడి అతిపెద్ద మిలిటరీ ఆసుపత్రి సర్దార్ దౌడ్ ఖాన్ హాస్పిటల్లోకి వైద్యుల దుస్తుల్లో చొరబడిన ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 30 మందికి పైగా మరణించగా, సుమారు 50 మంది గాయపడ్డారు. బాధితుల్లో ఎక్కువ మంది రోగులు, వైద్య సిబ్బంది ఉన్నారు. ఆసుపత్రి వెనక ద్వారం వద్ద ఓ బాంబర్ తనను తాను పేల్చేసుకున్న తరువాత ముగ్గురు సాయుధులు రోగులు, వైద్య సిబ్బందిపై బుల్లెట్ల వర్షం కురిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో ఆసుపత్రిలో గందరగోళం నెలకొంది. ఆసుపత్రి పార్కింగ్ స్థలంలో కారులో బాంబు పేలుడుతో పాటు మరో భారీ పేలుడు జరిగినట్లు తెలిసింది. ఆ తరువాత అఫ్గాన్ ప్రత్యేక భద్రతా దళాలు చేపట్టిన ఆరుగంటల ఆపరేషన్‌లో ముష్కరులు హతమైనట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా భద్రాతా దళాలు ఆసుపత్రి పైకప్పుపై దిగి దుండగుల పనిపట్టాయని వెల్లడించారు. ఈ దాడికి బాధ్యత తమదే అని ఇస్లామిక్ స్టేట్ జిహాదిస్టులు టెలిగ్రాం అకౌంట్ ద్వారా ప్రకటించారు. ఇందులో తమ పాత్ర లేదని తాలిబన్ స్పష్టం చేసింది. అంతకుముందు..ఆసుపత్రి వార్డుల్లో చిక్కుకున్న వైద్య సిబ్బంది సాయం కోరుతూ ఫేస్బుక్లో పోస్టులు చేశారు. భయంతో కొంతమంది పై అంతస్తులోని కిటికీ చూరుపై దాక్కున్నట్లు టీవీ ఫుటేజీల్లో కనిపించింది. -
లక్నోలో ముగిసిన ఎన్కౌంటర్
-
లక్నోలో ఎన్కౌంటర్
► ఇంట్లో దాక్కొన్న ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు ► రంగంలోకి ఏటీఎస్, పారామిలటరీ కమాండోలు లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో శివారులో ఒక ఇంట్లో దాక్కొన్న ఇద్దరు ఐసిస్ అనుమానిత ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు మంగళవారం అర్థరాత్రి వరకూ ఆపరేషన్ కొనసాగింది. కేంద్ర నిఘా విభాగాలు అందించిన సమాచారం మేరకు లక్నో ఠాకూర్గంజ్ ప్రాంతంలో ఒక ఇంట్లో ఉగ్రవాది నక్కినట్లు గుర్తించిన పోలీసులు... మంగళవారం యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్)తో కలిసి ఆ ఇంటిని చుట్టుముట్టారు. కొద్దిసేపటి అనంతరం ఆ ఇంట్లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులున్నట్లు గుర్తించారు. వారి వద్ద భారీగా ఆయుధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం అర్థరాత్రి వరకూ ఏటీఎస్ సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగాయి. ఎటీఎస్ సిబ్బందికి సాయంగా పారామిలటరీ బలగాలకు చెందిన కమాండోల్ని సంఘటనా స్థలానికి తరలించారు. దాదాపు 20 మంది కమాండోలు ఈ ఆపరేషన్ లో పాలుపంచుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ఇంట్లో దాక్కొన్న ఒక వ్యక్తిని సైఫుల్‌గా అనుమానిస్తున్న పోలీసులు అతనికి భోపాల్–ఉజ్జయిన్ రైలు పేలుడుతో సంబంధాలు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ( భోపాల్ రైలులో పేలుడు ) ఉగ్రవాదులను పట్టుకునేందుకు అర్థరాత్రి వరకూ ప్రయత్నాలు కొనసాగించినా అవి విజయవంతం కాలేదు. ఏటీఎస్ ఆపరేషన్ కొనసాగుతుందని, ఐసిస్, దాని సాహిత్యంతో అనుమానితులు ప్రభావితమయ్యారని యూపీ అదనపు డీజీ దల్జీత్ చౌదరీ చెప్పారు. కాన్పూర్‌లో ఇద్దరు, ఇటావాలో ఒక అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాన్పూర్‌లో అరెస్టు చేసిన ఇద్దరితో లక్నో అనుమానితులకు సంబంధాలుండవచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. -
విధ్వంసం కుట్ర బట్టబయలు
ఇద్దరు అనుమానిత ఐసిస్ ఉగ్రవాదుల అరెస్టు రాజ్‌కోట్/అహ్మదాబాద్: భారత్‌లో విధ్వం సానికి ప్రణాళికలు రూపొందిస్తున్న ఇద్దరు అనుమానిత ఐసిస్ ఉగ్రవాదులను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ఏ సంస్థ సహాయం లేకుండా ఒంటరిగానే విధ్వంసం సృష్టించేందుకు వీరు సిద్ధమైనట్లు పోలీసు లు తెలిపారు. గుజరాత్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాలనుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌కోట్‌కు చెందిన వసీం రమోడియా (ఎంసీఏ విద్యార్థి), నయీమ్ (బీసీఏ)లు ఐసిస్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. ఈ ఇద్దరి నుంచి బాంబు తయారీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆధ్యాత్మిక ప్రాంతాలైన చోతిలా (దేవీ మందిరం)తోపాటు పలుచోట్ల దాడులకు వీరిద్దరూ ప్రణాళికలు రూపొందించారని.. పక్కా సమాచారంతోనే వీరిపై నిఘాపెట్టి అదుపులోకి తీసుకున్నట్లు గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) ఐజీ జేకే భట్ వెల్ల డించారు. రాజ్‌కోట్ నుంచి రమోడియాను, నయీమ్‌ను భావ్‌నగర్‌లో అరెస్టు చేశారు. ఉగ్రఘటనతో దేశమంతా కలకలం సృష్టించేందుకు విధ్వం సం వీడియోను రికార్డు చేసి దీన్ని సోషల్ మీడియాలో పెట్టాలని ప్లాన్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని భట్ తెలిపారు. బాంబులు పేల్చడంతోపాటు వాహనాలకు నిప్పుపెట్టడం ద్వారా భయాందోళనలు సృష్టించాలనేదీ వీరి ప్లాన్ లో భాగమన్నారు. రెండేళ్ల క్రితం జిహాదీ భావజాలంవైపు ఆకర్షితులైన వీరిద్దరూ.. ఆన్ లైన్ రా ఐసిస్‌తో సంబంధాలు నెరపుతున్నారు. అఫ్గాన్ లో కేరళ ఉగ్రవాది హతం: కేరళలోని పాలక్కడ్‌జిల్లాలో అదృశ్యమై ఐసిస్‌లో చేరి నట్లుగా అనుమానిస్తున్న 21 మందిలో ఒకరైన హఫీజ్ (26) హతమైనట్లు తెలిసింది. అఫ్గాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదులపై జరిపిన డ్రోన్ దాడుల్లో హఫీజ్ మృతిచెందాడు. -
భారత్‌కు చేరిన డాక్టర్ రామమూర్తి
18 నెలల క్రితం లిబియాలో కిడ్నాప్ చేసిన ఐసిస్ ఉగ్రవాదులు భారత్‌లో విస్తరించే ప్రణాళికతో ఐసిస్ ఉంది: రామమూర్తి న్యూఢిల్లీ: లిబియాలోని ఐసిస్ ఉగ్రవాదుల చెర నుంచి సురక్షితంగా బయటపడ్డ తెలుగు వైద్యుడు డాక్టర్ కోసనం రామమూర్తి శనివారం ఉదయం భారత్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన రామమూర్తి.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో స్థిరపడ్డారు. డాక్టర్‌గా పనిచేయడానికి లిబియా వెళ్లిన ఆయనను 18 నెలల క్రితం ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఐసిస్ నుంచి తప్పించుకునే క్రమంలో ఆయనకు బుల్లెట్ గాయమైంది. స్వదేశానికి సురక్షితంగా చేరిన రామమూర్తి ఢిల్లీలో మాట్లాడుతూ... భారత్‌లో విస్తరించాలనే ప్రణాళికతో ఐసిస్ ఉందని చెప్పారు. ఐసిస్ ఉగ్రవాదులతో సంభాషణల్ని బట్టి భారత విద్యావ్యవస్థ, ఆర్థిక వృద్ధి వారిని ఎంతగానో ఆకట్టుకుందనే విషయం అర్థమైందన్నారు. వారి ప్రణాళికలు ఏమిటో తనకు చెప్పలేదన్నారు. తనను మానసికంగా చిత్రహింసలకు గురి చేశారని, వాళ్ల చేసిన అకృత్యాలకు సంబంధించిన వీడియోలు చూడాలని ఒత్తిడి చేశారని చెప్పారు. ఐసిస్ కోసం పనిచేయమని వారు కోరారని, అయితే తనకు అలాంటి అనుభవంలేదని చెప్పానని వెల్లడించారు. తనను ఉగ్రవాదుల చెర నుంచి విడిపించిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి, జాతీయ భద్రతా సలహాదారుకు రామమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. -
సిరియాలో టర్కీ దాడులు
88 మంది పౌరుల మృతి బీరుట్/అలెప్పో: ఐసిస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న సిరియా పట్టణం అల్ బాబ్‌పై టర్కీ దళాలు 24 గంటలు పాటు జరిపిన విమాన దాడుల్లో 88 మంది సాధారణ పౌరులు మృత్యువాత పడ్డారు. గురువారం నాటి దాడుల్లో 72 మంది మృతి చెందగా.. శుక్రవారం కూడా కొనసాగిన ఆ దాడుల్లో మరో 16 మంది చనిపోయారని మానవ హక్కుల సంఘం ప్రకటించింది. ఆగస్టు నుంచి మొదలైన టర్కీ దాడుల్లో ఇదే అతిదారుణమైనదని పేర్కొంది. తమ జవాన్లను చంపిన ఐసిస్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని టర్కీ ప్రకటించిన తర్వాత.. గురువారం ఆ ఉగ్రసంస్థ మరో ఇద్దరు టర్కీ జవానులను సజీవంగా తగలబెట్టిన వీడియో ఒకటి విడుదల చేసింది.సిరియా దళాల చేతుల్లోకి అలెప్పో..రెబెల్స్‌కు కీలకమైన పట్టణంగా ఉన్న అలెప్పోపై సిరియా దళాలు పూర్తి పట్టు సాధించాయి. ప్రజలు కూడా తమ ఇళ్లకు తిరిగి వచ్చి శిథిలమైన వాటిని గుర్తిస్తున్నారు. సివిల్ వార్ మొదలైన తర్వాత అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు ఇదే అతిపెద్ద విజయం -
ఐసిస్ చెర నుంచి సురక్షితంగా..
-
ఐసిస్ చెర నుంచి సురక్షితంగా..
14 నెలల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం బయటపడిన తెలుగు ప్రొఫెసర్లు తీవ్రవాద స్థావరాలపై భద్రతా దళాల దాడితో విముక్తి సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్/టెక్కలి : 14 నెలల కిందట ఐసిస్ తీవ్రవాదుల చేతుల్లో బందీలుగా చిక్కుకున్న హైదరాబాద్‌కు చెందిన తెలుగు ప్రొఫెసర్లు చిలువేరు బలరాంకిషన్, తిరువీధుల గోపీకృష్ణ ఎట్టకేలకు విడుదలయ్యారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తమ కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి తాము క్షేమంగా విడుదలయ్యామని, ప్రస్తుతం మిలటరీ రక్షణలో ఉన్నామని చెప్పారు. లిబియాలోని ట్రిపోలీకి 250 కి.మీల దూరంలో ఉన్న తాము భారత దౌత్య అధికారులను కలిశాక హైదరాబాద్ వస్తామన్నారు. వారిద్దరు సోమ లేదా మంగళవారాల్లో హైదరాబాద్ వచ్చే వీలుంది. ఊహించని రీతిలో గోపికృష్ణ, బాలరాం కిషన్ తమ కుటుంబసభ్యులకు ఫోన్ చేయటంతో ఆ రెండు కుటుంబాలు ఆనందంలో మునిగి తేలాయి. తమవారి విడుదలకు క ృషి చేసిన ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, కేంద్ర మంత్రి వెంకయ్య, తెలంగాణ సీఎం కేసీఆర్‌లకు కుటుంబసభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇండియాకొస్తూ ఐసిస్ చెరలోకి.. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ గోపీకృష్ణ, కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ఇంగ్లీష్ ప్రొఫెసర్ చిలువేరు బలరాంల కుటుంబాలు నగరంలోనే స్థిరపడ్డాయి. గోపీ భార్యపిల్లలు నాచారంలో, బలరాం భార్యాపిల్లలు ఆల్వాల్‌లో నివాసం ఉంటున్నారు. చాలా కాలంగా లిబియాలో పనిచేస్తూ, స్వస్థలానికి తిరిగి వస్తున్న క్రమంలో 2015 జూలై 29న ట్రిఫోలి సమీపంలో ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. దీంతో గోపీ భార్య కళ్యాణి, పిల్లలు జాహ్నవి, సాయికుమార్.. బలరాం కిషన్ భార్య శ్రీదేవి, పిల్లలు విజయభాస్కర్, మధుసూదన్ అనేక మార్లు కేంద్రమంత్రులు, మోదీని కలిసి విజ్ఞాపనలు చేశారు. ఇటీవల లిబియా దేశంలో అమెరికా సైనికులు ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట వీరు బందీలుగా ఉన్న స్థావరాలపై దాడులు చేయగా, వీరు సురక్షితంగా బయట పడినట్లు సమాచారం. గోపీ ఇంట్లో ఆనందం... ‘నేను గోపీకృష్ణను మాట్లాడుతున్నా. ఉగ్రవాదుల చేర నుంచి బయటపడ్డా. నేను క్షేమంగా ఉన్నా. మీరు క్షేమంగా ఉన్నారా?’ అంటూ గోపీకృష్ణ తన భార్య కళ్యాణితో బుధవారం అర్థరాత్రి ఫోనులో మాట్లాడారు. తాను అమెరికాకు చెందిన బలగాల ఆధీనంలో ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ కుటుంబ సభ్యుల్లో సంతోషం వెల్లివిరిసింది. గురువారం ఉదయం కళ్యాణి తన పిల్లలతో కలిసి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. గోపీకృష్ణ సోదరుడు మురళీకృష్ణ మాట్లాడుతూ.. ‘గోపీ క్షేమంగా ఉన్నాడన్న వార్త మా కుటుంబంలో పండుగ వాతావరణం తీసుకొచ్చింది. ఇది అతడికి పునర్జన్మగా భావిస్తున్నాం’ అన్నారు. బుధవారం రాత్రి 12 గంటలకు గోపీకృష్ణ తన భార్యతో పాటు తండ్రి నారాయణరావుతోనూ మాట్లాడినట్లు తెలిపారు. భర్త పలకరింపుతో ఉద్వేగానికి గురైన శ్రీదేవి: ‘హలో... శ్రీదేవి నేను బలరాంను మాట్లాడుతున్నాను. నేను క్షేమంగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు?’ అంటూ తెలియని నంబర్ నుంచి బుధవారం అర్ధరాత్రి వచ్చిన ఫోన్లో ఉద్వేగపూరితమైన గొంతుతో పలకరింపు ఇది. దీంతో ఒక్కసారిగా మూగబోరుున శ్రీదేవి గొంతు సంతోషంతో బదులిచ్చింది. తన భర్త దాదాపు అర నిమిషం సేపు అక్కడి సైన్యం ఇచ్చిన ఫోన్ ద్వారా తనతో మాట్లాడారని ఆమె చెప్పారు. ఇన్నాళ్లు అధికారులు, సహ ఉద్యోగులు బలరాం క్షేమంగా ఉన్నాడంటూ చెప్తున్నప్పటికీ గుబులుతోనే ఉన్న శ్రీదేవి మొఖంలో నిమజ్జనం రోజు ఆనందం వెల్లివిరిసింది. దీంతో ఇంటిల్లిపాదీ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టెక్కలిలో సంబరాలు గోపికృష్ణ ఉగ్రవాదుల చెర నుంచి బయట పడినట్లు సమాచారం రావడంతో శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నివాసముంటున్న ఆయన తల్లిదండ్రులు వల్లభ నారాయణరావు, సరస్వతి, అమ్మమ్మ మహాలక్ష్మి ఆనందం వ్యక్తం చేశారు. వెంటనే హైదరాబాద్ బయల్దేరుతామని ‘సాక్షి’కి చెప్పారు. సంకీర్ణ దళాలు కాపాడాయి: సుష్మా లిబియాలో ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన ఇద్దరు తెలుగు ఇంజినీర్లను రక్షించినట్లు విదేశీవ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ గురువారం ట్వీటర్లో తెలిపారు. ఐసిస్‌తో పోరాడుతున్న సంకీర్ణ బలగాలు సిర్త్ పట్టణంలో ఉగ్రవాదుల చెర నుంచి వీరిని విడిపించాయని.. ఇద్దరు ఇంజనీర్లూ క్షేమంగా ఉన్నారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్‌స్వరూప్ మీడియాకు తెలిపారు. అయితే డాక్టర్ రామమూర్తి ఇంకా ఉగ్రవాదుల చెరలో బందీగానే ఉన్నారని.. ఆయనను విడిపించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. తెలుగు ఇంజినీర్లు ఇద్దరినీ వారి కుటుంబ సభ్యులతో రాయబార కార్యాలయం అధికారులు మాట్లాడించారని ఆయన వివరించారు. మాకిది..మరో జన్మ ‘నెలలు గడిచాయి. ఆయన తప్పక తిరిగి వస్తారన్న నమ్మకమే మమ్మల్ని ముందుకు నడిపించింది. మాకిది పునర్జన్మ. నా భర్త క్షేమంగా విడుదలయ్యానని ఫోన్ చేశాడు. ఈ 14 నెలలు నరకయాతన అనుభవించాము. దేవుని దయకు తోడు, ప్రధాని, సుష్మాస్వరాజ్ ప్రయత్నాలు ఫలించాయి. అందరికీ ధన్యావాలు. - కళ్యాణి(గోపీకృష్ణ భార్య) మా పూజలు ఫలించాయి ‘మా వారి కోసం నేను చేయని పూజ, వ్రతం లేదు. వాటన్నింటికి తోడు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రయత్నాలు కలిసి రావటంతో నా భర్త క్షేమంగా తిరిగొస్తున్నారు. మంచివాళ్లకు మంచే జరుగుతుందన్న విశ్వాసమే నన్ను, నా పిల్లల్ని ముందుకు నడిపింది. గాడ్ ఈజ్ గ్రేట్.’ - శ్రీదేవి(బలరాం భార్య) -
వారి కంటే పది రెట్లు క్రూరంగా వ్యవహరించగలను
మనీలా: ఫిలిప్పీన్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికను జారీ చేశారు. తాను తలుచుకుంటే ఉగ్రవాదుల కంటే పది రెట్లు కిరాతకంగా వ్యవహరించగలనని అన్నారు. ఉగ్రవాదులకు ఒక సిద్ధాంతం లేదని వారికి మతమంటే ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. ప్రజలను వికలాంగులుగా చేస్తూ, మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. అత్యంత కిరాతకంగా ప్రజల తలలను నరికేస్తున్నారని మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేశారు. -
ఉగ్రజాడలు
♦ వికారాబాద్‌లో ఇబ్రహీం ముఠా కదలికలు ♦ పాస్‌పోర్టుల ఆధారంగా సిమ్‌కార్డుల కొనుగోలు ♦ స్థానిక జిరాక్స్ సెంటర్లో పాస్‌పోర్టుల జిరాక్స్‌లు ♦ వీటిని ఎక్కడైనా తస్కరించారా? ఎవరైనా సహకరించారా? అనే కోణంలో దర్యాప్తు చించోళి- వికారాబాద్ మధ్య రాకపోకలు సాగించినట్లు ఎన్ఐఏ విచారణలో వెల్లడి ఒకవేళ హైదరాబాద్‌లో దాడుల వ్యూహం ఫలిస్తే.. కొంతకాలం వికారాబాద్‌లోనే తలదాచుకోవాలని ఉగ్రవాడులు ప్రణాళిక రూపొందించుకున్నట్టు ఎన్ఐఏ విచారణలో వెలుగుచూసింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : మరోసారి జిల్లాలో ‘ఉగ్ర’మూలాలు బయటపడ్డాయి. వికారాబాద్‌లో ఐసిస్ తీవ్రవాదులు సంచరించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో వెల్లడైంది. హైదరాబాద్‌లో మారణహోమం సృష్టించే ప్రయత్నంలో పోలీసులకు చిక్కిన టైస్టులు ఇబ్రహీం యజ్దానీ, హబీబ్ పలుమార్లు వికారాబాద్, చించోళి పట్టణాల కు రాకపోకలు సాగించినట్లు స్పష్టమైంది. పోలీసుల కళ్లుగప్పి ఐసిస్ అగ్రనేతలతో మాట్లాడేందుకు వినియోగించిన సిమ్ కార్డులలో రెండు చిరునామాలు జిల్లాకు చెందినవే కావడంతో పోలీసు యంత్రాంగం నివ్వెరపోయింది. జిల్లాకు చెందిన ఇద్దరి వ్యక్తుల పాస్‌పోర్టుల ఆధారంగానే ఎయిర్టెల్ సిమ్ కార్డులను పొందినట్లు తేలింది. ఇబ్రహీం స్థానిక బీజేఆర్ చౌరస్తాలోని ఓ ఇంటర్నెట్ సెంటర్లో జిరాక్సులు తీసుకున్నట్లు విచారణలో బయటపడింది. రంజాన్ పండగ వేళ రాజధానిలో విధ్వంస రచనకు కుట్రపన్నిన ఇబ్రహీంతో సహా మరో నలుగురు ఐసిస్ తీవ్రవాదులపై ఎన్ఏఐ మెరుపు దాడులు చేసి చాకచక్యంగా పట్టుకుంది. ఈ నేపథ్యంలో సిమ్‌కార్డులు పొందడానికి ఎలాంటి ఆధారాలను సమర్పించారు? ఆ పాస్‌పోర్టులు ఎక్కడి నుంచైనా తస్కరించారా? ఎవరైనా సమకూర్చారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా స్థానికంగా వీరికి ఎవరైనా సహకారం అందించారా అనే విషయంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ సిమ్‌కార్డులతో ఎవరెవరితో సంభాషణలు జరిపారనే అంశంలోనూ విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు టవర్ లోకేషన్ అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది. వికారాబాద్‌లో బీఈ చదివి.. పాతబస్తీకి చెందిన ఇబ్రహీం యజ్దానీకి వికారాబాద్‌తో గతం నుంచే సంబంధాలు ఉన్నాయి. 2003లో స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన యజ్దానీ.. ఆ తర్వాత ఉద్యోగ నిమిత్తం సౌదీకి వెళ్లాడు. అక్కడే ఐసిస్ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ఇబ్రహీం.. ఇక్కడే ముఠా ఏర్పాటు చేశాడు. రాజధానిలో ఒకేసారి పలుచోట్ల బాంబు పేలుళ్లు, తుపాకులతో విరుచుకుపడేలా ప్లాన్ వేశాడు. అయితే, ఎన్ఐఏ అధికారుల అప్రమత్తంతో హైదరాబాద్‌కు ఉగ్రముప్పు తప్పింది. ఒకవేళ వారి వ్యూహం ఫలిస్తే.. దాడుల అనంతరం కొంతకాలం వికారాబాద్‌లోనే తలదాచుకోవాలని ప్రణాళిక రూపొందించినట్లుగా ఎన్ఐఏ విచారణలో వెలుగుచూసింది. వికారాబాద్‌లో సొంతంగా స్థావరం ఏర్పాటుచేసుకోవాలనుకున్నారా? ఎవరైనా సహకారం అందిస్తున్నారా అనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. సిమీ తీవ్రవాదులకు శిక్షణ గతంలో స్టూడెంట్ మూవ్మెంట్ ఆఫ్ ఇస్లామిక్(సిమీ) తీవ్రవాదులు కూడా వికారాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించారు. మధ్యప్రదేశ్ పోలీసులకు పట్టుబడిన సిమీ అగ్రనేత సప్ధర్ నగోరి కూడా వికారాబాద్ సమీపంలోని అనంతగిరిలో శిక్షణ పొందినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. ఆయుధాల వాడకంలో అటవీ ప్రాంతంలో శిక్షణ తీసుకున్నామని చెప్పారు. మరోవైపు గతేడాది వరంగల్ పోలీసుల చేతిలో ఎన్కౌంటరైన వికారుద్దీన్ కూడా చేవెళ్ల సమీపంలోని మదర్సాలో కొన్నాళ్లపాటు తలదాచుకున్నానని పోలీసుల ముందు అంగీకరించారు. తాజాగా ఐసిస్ ముఠా కదలికలు కూడా వికారాబాద్‌లో కనిపించడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. -
అజ్మీర్ నుంచి ‘ఉగ్ర’ నిధులు!
- నాలుగో రోజు ఎన్ఐఏ దర్యాప్తులో కీలక అంశాలు - ఒక్కో ఉగ్రవాదికి ఒక్కో బాధ్యత అప్పగించిన ఐసిస్ ముఖ్య నేత షఫీ ఆర్మర్ సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మారణహోమం సృష్టించడానికి ఐసిస్ ఉగ్రవాదులు చేసిన కుట్ర గుట్టును జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) విప్పుతోంది. పేలుళ్లకు సంబంధించి ఐసిస్ అనుబంధ సంస్థ ‘అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ)’ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు గుర్తించింది. హైదరాబాద్‌లో అరెస్టయిన ఐదుగురు ఉగ్ర సానుభూతిపరులను అధికారులు సోమవారం కూడా విచారించారు. వీరిలో కీలకమైన మహ్మద్ ఇబ్రహీం యజ్దానీని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లిన అధికారులు.. సోమవారం హబీబ్ మహ్మద్‌ను కూడా తీసుకెళ్లి దర్యాప్తు చేశారు. వారికి రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి హవాలా ద్వారా నిధులు అందినట్లు గుర్తించారు. అక్కడ వీరికి సహకరించినవారిపై ఆరా తీస్తున్నారు. మిగతా ముగ్గురిని హైదరాబాద్‌లో విచారిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన కౌంటర్ ఇంటలిజె న్స్ అధికారులు ఈ విచారణలో పాల్గొన్నారు. పేలుళ్ల కుట్రకు సంబంధించి ఉగ్రమూకలు వెల్లడించిన అంశాలను రికార్డు చేస్తున్నారు. ఎవరి పని వారిదే.. ఐసిస్ ముఖ్య నేత, భారత్ విభాగానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న షఫీ ఆర్మర్ పేలుళ్లకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగించాడు. పేలుళ్ల కోసం ఆయుధాల సేకరణ, బాంబుల తయారీ కోసం రసాయన పదార్థాల కొనుగోలు, టార్గెట్ చేసిన ప్రాంతాల్లో రెక్కీ, ఖర్చుల కోసం నిధుల సమీకరణ పనులుగా విభజించి అప్పజెప్పాడు. సిరియా నుంచి వీడియో కాలింగ్ ద్వారా మాట్లాడుతూ లక్ష్యాలపై మార్గనిర్దేశం చేశాడు. షఫీ ఆర్మర్ భారత్‌కు చెందిన వాడు కావడంతో హైదరాబాద్‌లో టార్గెట్ ప్రాంతాలను అతనే స్వయంగా నిర్దేశించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గూగుల్ మ్యాప్ ఆధారంగా ప్రదేశాలను ఎంచుకుని వాటిపై పరిశీలన బాధ్యతను ఒకరికి అప్పగించాడు. ఆ ఉగ్రవాది 15 ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి, పూర్తి సమాచారం అందించగా... అందులో మూడు ప్రాంతాలను ‘టార్గెట్’గా ఎంపిక చేశాడు. తర్వాత ఆ ప్రదేశాలపై మరోసారి క్షుణ్ణంగా రెక్కీ చేసినట్లు అధికారుల విచారణ వెల్లడైంది. ఈ మేరకు ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజీలను తీసుకున్న ఎన్ఐఏ అధికారులు.. వాటిని ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి పంపారు. ఇక బాంబులకు వినియోగించే రసాయన పదార్థాలు, ఆయుధాల కొనుగోలు కూడా షఫీ సూచించిన ప్రాంతాల్లోనే జరిగినట్లు సమాచారం. నిధుల వేటపై ప్రత్యేకంగా దృష్టి బాంబుల తయారీ కోసం, ఉగ్ర సానుభూతి పరుల ఖర్చుల కోసం సమీకరించిన నిధులపై ఎన్ఐఏ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఐదుగురు ఉగ్రవాదులకు దాదాపు ఆరు నెలలుగా నిధులు సమకూరుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. వారు డబ్బు సమీకరణ కోసం ఉపయోగించిన మార్గాలపై ఆరా తీస్తున్నారు. ఇందుకోసం ఇబ్రహీం యజ్దానీని, హబీబ్ మహ్మద్‌ను మహారాష్ట్రలోని నాందేడ్‌కు, రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు తీసుకెళ్లి దర్యాప్తు చేశారు. అజ్మీర్ నుంచి హవాలా ద్వారా వారికి నిధులు అందినట్లు గుర్తించారు. అక్కడ వీరికి ఎవరు సహకరించారనే దానిపై కూపీ లాగుతున్నారు. -
బాగ్దాద్‌లో నరమేధం
షాపింగ్ సెంటర్ వద్ద ఆత్మాహుతి దాడి.. 119 మంది మృతి.. 140 మందికిపైగా గాయాలు - రంజాన్ షాపింగ్‌లో ఘాతుకం - దాడి తామే చేశామన్న ఐసిస్ బాగ్దాద్ : ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరంలో ఐసిస్ ఉగ్రవాదులు మళ్లీ దారుణ మారణకాండకు తెగబడ్డారు. ఆదివారం జనసమ్మర్దమున్న వాణిజ్య ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 119 మంది అమాయక ప్రజలను బలితీసుకున్నారు. ఈ దాడిలో మరో 140 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో పలువురు చిన్నారులు, మహిళలు ఉన్నారు. అమెరికా, ఇరాక్ బలగాలతో పోరులో ఐసిస్ వరుస ఓటములతో భారీగా నష్టపోతున్నా.. ఇలాంటి దాడులకు పాల్పడే శక్తిసామర్థ్యాలు దానికి ఇంకా ఉన్నాయని తాజా నరమేధం హెచ్చరిస్తోంది. జన ం మధ్య ఆత్మాహుతి దాడి.. నగరంలోని కారాదా జిల్లాలో జనంతో కిటకిటలాడుతున్న షాపింగ్ సెంటర్ వెలుపల పేలుడు పదార్థాలున్న కారులో వచ్చిన ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ వారంలో రానున్న రంజాన్ పర్వదినం కోసం శనివారం అర్ధరాత్రి దాటాక ఉపవాసాలు ముగించుకుని షాపింగ్ కోసం వచ్చిన ప్రజలను బాంబర్ లక్ష్యంగా చేసుకున్నాడు. మృతుల్లో ఎక్కువ మంది బహుళ అంతస్తుల షాపింగ్, వినోదాల మాల్లో బలైన వారేనని పోలీసులు చెప్పారు. వీరిలో కొందరు మంటల్లో కాలిపోయి, కొందరు పొగతో ఊపిరాడక చనిపోయారని వెల్లడించారు. షాపింగ్ సెంటర్, చుట్టుపక్కల దుకాణాల్లో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. వాహనాలు గుర్తుపట్టలేనంతగా దెబ్బతిన్నాయి. మంటలు, పొగ, శిథిలాలు, మృతదేహాలు, బంధువుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం భీతావహంగా కనిపించింది. ఆదివారం పొద్దుపోయాక కూడా అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతూ కనిపించారు. షియాల లక్ష్యంగా దాడి: ఐసిస్ పేలుడు తర్వాత... ఇది తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) ఒక మిలిటెంట్ల వెబ్సైట్లో ప్రకటించింది. తమ భద్రతా ఆపరేషన్లలో భాగంగా షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఒక ఇరాకీ ఈ దాడి చేశాడంది. కాగా, కరాదా పేలుడు జరిగిన కాసేపటికి నగర ఉత్తర ప్రాంతమైన షాబ్‌లో శక్తిమంతమైన బాంబు పేలింది. ఒకరు మరణించగా నలుగురు గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్యపై స్పష్టత లేదు. ఈ దాడి కి సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ నుంచీ ప్రకటన వెలువడలేదు. బాగ్దాద్‌కు 50 కి.మీ దూరంలో ఉన్న ఫలూజా నగరాన్ని ఇరాక్ ప్రభుత్వ బలగాలు వారం కిందట ఐసిస్ నుంచి తిరిగి చేజిక్కించుకున్న నేపథ్యంలో కరాదా దాడి జరిగింది. ఇరాక్‌లో ఈ ఏడాదిలో ఉగ్రవాదులు భారీ మారణహోమానికి పాల్పడడం ఇది రెండోసారి. మే నెల 11న బాగ్దాద్‌లో ఐసిస్ మూడు చోట్ల జరిపిన కారు బాంబు దాడుల్లో 93 మంది మృతిచెందారు. ప్రస్తుతం ఇరాక్‌లో మోసుల్ నగరం ఒక్కటే ఐసిస్ అధీనంలో ఉంది. ఘటనా స్థలానికి ప్రధాని.. కరాదా షాపింగ్ ప్రాంతాన్ని ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాదీ, ఇతర ప్రజాప్రతినిధులు సందర్శించారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించి తీరతామన్నారు. అక్కడ గుమికూడిన జనం ‘అబాదీ దొంగ‘ అంటూ నినాదాలు చేశారు. భూకంపం అనుకున్నా.. ‘మొదట భూకంపం వచ్చిందేమో అనుకున్నా. నా సరుకులను మూటగట్టుకుని ఇంటికి వెళ్తుండగా భారీ శబ్దంతో మంటలు కనిపించాయి. వెనక్కి వెళ్దామంటే భయమేసింది. నా స్నేహితులకు ఫోన్ చేశాను. కానీ ఎవరి నుంచీ జవాబు రాలేదు. వారిలో ఒకతను చనిపోగా, మరొకతను గాయపడ్డాడు. ఒకరు గల్లంతయ్యాడు’ అని కరాదా పేలుడు సాక్షి, వ్యాపారి కరీం సమీ చెప్పాడు. తన కుటుంబం నడుపుతున్న షాపులో ఆరుగురు ఉద్యోగులు చనిపోయారని హుసేన్ అలీ అనే సైనికుడు చెప్పాడు. ‘నేను మళ్లీ యుద్ధానికి వెళ్తాను. అక్కడైనా శత్రువు ఎవరో తెలుసుకుని పోరాడతాను. ఇక్కడ ఎవరితో పోరాడాలో అర్థం కావడం లేదు’ అని పేర్కొన్నాడు. సోనియా సంతాపం బాగ్దాద్ బాంబు పేలుళ్లను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రంగా ఖండించి, బాధితులకు సంతాపం తెలిపారు. గత వారం మానవతకు భయోత్పాతంగా గడిచిందని ఈ దాడులను, బంగ్లా రాజధాని ఢాకాలో ఓ హోటల్‌పై ఉగ్రవాద దాడిని ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. -
పోలీసు అధికారులతో ముగిసిన దత్తాత్రేయ భేటీ
హైదరాబాద్: పోలీస్ ఉన్నతాధికారులతో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ భేటీ ముగిసింది. పోలీసు ఉన్నతాధికారులతో ఆదివారం దత్తాత్రేయ సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్ శాంతి భద్రతలపై పోలీసు అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐసిస్‌ను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దత్తాత్రేయ వెల్లడించారు. ఈ సమావేశానికి అడిషనల్ డీజీపీ అంజనీకుమార్, సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ కమిషనర్లు.. మహేశ్ భగవత్, నవీనచంద్, హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది తదితరులు హాజరయ్యారు. -
హైదరాబాద్ లో హై అలర్ట్
- శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బలగాలు -నగరంలో ఐఎస్ఐఎస్ ఏజెంట్లు పట్టుపడిన నేపథ్యంలో విస్తృత తనిఖీలు శంషాబాద్ : నగరంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ఏజెంట్లు పట్టుబడడం, టర్కీలోని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఉగ్రదాడుల నేపథ్యంలో హైదరాబాద్ నగరంతో పాటు, శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దేశీయ, అంతర్జాతీయ టెర్మినళ్ల వద్ద అక్టోపస్ బలగాలను మోహరించారు. అంతర్గత భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయానికి ఉన్న ప్రధాన రహదారుల్లో పోలీసు బలగాలను దించారు. సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలతోపాటు రక్ష సెక్యూరిటీ దళాలతో భద్రతను పెంచారు. ప్రధాన ద్వారం వద్ద వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గురువారం నుంచి జూలై 6వ తేదీ వరకూ హైఅలర్ట్ ప్రకటించారు. తనిఖీలు ముమ్మరం చేశారు. అన్ని రకాల పాసులు రద్దుచేశారు. సందర్శకులను అనుమతించడంలేదు. ఎయిర్‌పోర్టుకు వచ్చేవారు ఎయిర్ టికెట్లు, ఐడీ కార్డులు తెచ్చుకోవాలని అధికారులు విజ్ఢప్తి చేశారు. అలాగే నగరంలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. షాపింగ్ మాల్స్‌లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మాదాపూర్ ఇన్ఆర్బిట్ మాల్, సైబర్‌టవర్ సహా మరికొన్ని ప్రదేశాల్లో గురువారం తనిఖీలు నిర్వహించారు. వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు. -
మళ్లీ ఉగ్రజాడలు
► హైదరాబాద్‌లో ఆరుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్టు ► వారిలో కరీంనగర్ కశ్మీర్‌గడ్డకు చెందిన యువకుడు ► జిల్లాలో 92 మంది స్లిపర్సెల్స్ ఉన్నట్లు అనుమానాలు ► చొప్పదండి ఎస్బీఐ దోపిడీ కేసుతో సంచలనం కరీంనగర్ క్రైం : జిల్లాలో ఉగ్రజాడలు 1999లో బయటపడగా... అప్పటి నుంచి దేశంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా చాలాసార్లు కరీంనగర్ జిల్లాకు లింక్ ఉంటోంది. తాజాగా రాష్ట్రంలో పలుచోట్ల బాంబు పేలుళ్లు, విధ్వంసానికి ప్రణాళిక వేసిన ఆరుగురు ఐసిఎస్ స్లీపర్ సెల్స్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. వీరిలో కరీంనగర్‌లోని కశ్మీర్‌గడ్డకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ కూడా ఉన్నట్లు వారు ప్రకటించారు. హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్న ఇర్ఫాన్ 2014లో ఇంటినుంచి వెళ్లిపోయాడు. అప్పట్లో తల్లిదండ్రులు తమ కుమారుడు కనిపించడం లేదంటూ కరీంనగర్ టుటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇదే క్రమంలో కొంతమంది యువకులు ఐసిస్‌లో చేరడానికి వెళ్తూ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారత బలగాలకు చిక్కిగా, వారిని ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ తీసుకొచ్చి, కౌన్సెలింగ్ నిర్వహించి, కుటుంబసభ్యులకు అప్పగించినట్లు సమా చారం. వీరిలో ఇర్ఫాన్ కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తర్వాత సదరు యువకుల కదలికలను పెద్దగా పట్టించుకోని పోలీసులు.. ఇటీవల పక్కా సమాచారం రావడంతో నిఘా పెట్టారు. పలుచోట్ల బాంబుపేలుళ్లు, విధ్వంసానికి ప్రణాళికలు వేసిన ఆరుగురిని పట్టుకున్నారు. అయితే ఇర్ఫాన్ తండ్రి మాత్రం తమ కుమారుడు రెండేళ్ల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయూడని, ఇంతవరకు ఆచూకీ తెలియదని అంటున్నాడు. 92 మంది స్లీపర్ సెల్స్..? జిల్లాలో వివిధ ఉగ్రవాద సంస్థలు సుమారు 92 మంది స్లీపర్ సెల్స్‌ను తయారు చేసుకున్నాయని నిఘా వర్గాలు ఇప్పటికే ఎన్ఐఏ అధికారులకు నివేదిక అందజేసినట్లు తెలిసింది. తాజాగా పేలుళ్లు, విధ్వంసానికి పథక రచన చేసిన ఉగ్రవాద ముఠాలో కరీంనగర్ పేరు వినిపించడంపై పలువురు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సంఘట జరిగినప్పుడు హడావుడి చేసి చేతులు దులుపుకుంటున్న పోలీసులు.. ఉగ్ర మూలాలను అణచేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. సంచలనం సృష్టించిన చొప్పదండి బ్యాంక్ కేసు చొప్పదండి ఎస్బీఐలో 2014 ఫిబ్రవరి 1న జరిగిన దోపిడీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు మారణాయుధాలతో బ్యాంకు లోపలికి ప్రవేశించి సిబ్బందిని బెదిరిం చి, రూ.46 లక్షలు దోచుకెళ్లారు. మొదట ఇది దొంగలముఠా పని అని అనుమానించిన పోలీసులు ఎలాంటి ఆనవాళ్లను కనిపెట్టలేకపోయూరు. 2014 అక్టోబర్ 2న పశ్చిమబెంగాల్లోని బుర్ధ్వాన్ సమీపం లో జరిగిన పేలుడులో ఓ ఉగ్రవాది చనిపోగా, మరి కొందరు గాయపడ్డారు. అప్పుడక్కడ చొప్పదండి బ్యాంక్ లేబుళ్లు ఉన్న రూ.7.74 లక్షల నోట్లను కట్టలను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. దీంతో బ్యాంక్ చోరీ ఉగ్రవాదుల పనేనని పసిగట్టిన ఎన్ఐఏ ఆ దిశగా విచారణ చేపట్టింది. ఇందులో ఇద్దరు గతేడాది ఏప్రిల్ 4న నల్గొండ జిల్లాలో పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు భావిస్తున్నారు. స్థానికుల సహకారం లేకుండా దోపిడీకి పాల్పడటం సాధ్యం కాదనే వాదనలున్నారుు. కానీ పోలీసులు ఒక్క అనుమానితుడిని కూడా గుర్తించకపోవడం గమనార్హం. ఆజంఘోరీతో మొదలు... ఐఎస్ఐ కమాండర్ ఆజంఘోరీ జగిత్యాల కేంద్రం గా కార్యకలాపాలు సాగించడం అప్పట్లో సంచనం సృష్టించింది. వరంగల్ జిల్లాకు చెందిన ఆజంఘోరీ 1999 డిసెంబర్లో ఖిల్లాగడ్డలో ఓ గదిని అద్దెకు తీసుకుని సైకిల్‌పై దువ్వెనలు, పౌడర్లు అమ్ముకుంటూ ఐఎస్ఐ కార్యకలాపాలు నిర్వహించాడు. 2000 ఫిబ్రవరి 7న మెట్‌పల్లిలోని వెంకటేశ్వర థియేటర్లో ప్రయోగత్మాకంగా బాంబ్ పేల్చాడు. ఇదే తరహాలో నిజామాబాద్, నిర్మల్, హైదారాబాద్, ఆదిలాబాద్ లో పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లను నిశితంగా పరి శీలించిన అప్పటి నిజామాబాద్ ఎస్పీ రవిశంకర్ అయ్యన్నార్(ప్రస్తుతం ఎన్ఐఏ చీఫ్) ఆజంఘోరీ కదిలికపై నిఘాపెట్టి పట్టుకునే ప్రయత్నంలో జగిత్యాల పాతబస్టాండ్ ప్రాంతంలో 2000 ఏప్రిల్ 5న జరిగిన ఎన్కౌంటర్లో అతడిని మట్టుబెట్టారు. జిల్లాలో పలు సంఘటనలు ► కరీంనగర్ బస్టాండ్‌లో 2005 ఆగస్టు 9వ తేదీన టిఫిన్‌బాక్స్ బాంబ్ పేలి 26 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ► 2006 సెప్టెంబర్11న బస్టాండ్‌లోనే మరో బాంబ్ పేల్చారు. ఈ రెండు కేసులకు బాధ్యులు ఏవరనేది ఇంతవరకూ పోలీసులు తేల్చలేదు. ఈ కేసులను సీఐడీకి బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. ► లష్కర్ ఇ తోరుుబాతో సంబంధాలున్న హైదరాబాద్ మలక్‌పేటకు చెందిన మహ్మద్ ఇమ్రాన్ అలియాస్ ఇజాజ్‌ను దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబుపేలుడు జరిగిన కొద్ది రోజులకే కరీంనగర్ శివారు రేకుర్తి సమీపంలో 2002 నవంబర్ 24న ఎన్కౌంటర్లో హతమార్చారు. ► 2007 హైదరాబాద్‌లోని మక్కా మసీద్ పేలుళ్లలో సంబంధం ఉన్న గోదావరిఖనికి చెందిన ఓ యువకుడిని అరెస్టు చేశారు. ► 2008లో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో కరుడుగట్టిన దొంగలున్నారనే సమాచారంతో తనిఖీ చేయగా క్వార్టర్లో ఉంటున్న వారు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో ముగ్గురు దొంగలు చనిపోయారు. సిమీతో వీరికి సంబంధాలున్నాయని గుర్తించారు. ► 2010లో హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయం ఎదుట బాంబు పేలుడు జరుగగా దాని సూత్రధారి వికారుద్దీన్ ప్రదాన అనుచరుడు గోదావరిఖని చెందిన సయూద్గా గుర్తించి అతడిన్నికూడా అరెస్టు చేశారు. -
హైదరాబాద్ పాతబస్తీలో ఎన్ఐఏ జల్లెడ
నగరంలోని పాతబస్తీ ప్రాంతాన్ని ఎన్ఐఏ అధికారులు, తెలంగాణ పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే దాదాపు 13 మంది ఐసిస్ సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్న అధికారులు, మీర్ చౌక్, మొగల్ పురా, భవానీనగర్, చాంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా గాలిస్తున్నారు. వీటితో పాటు పలు ఇతర ప్రాంతాల్లో కూడా ఎన్ఐఏ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో పేలుళ్లు జరిపేందుకు ఐసిస్ కుట్ర పన్నిందన్న పక్కా సమాచారం అందడంతో ఎన్ఐఏ అధికారులు బుధవారం ఉదయమే హైదరాబాద్ చేరుకున్న అధికారులు బృందాలుగా విడిపోయి పలు ప్రాంతాలలో సోదాలు నిర్వహించారు. ఇంతకుముందే అరెస్టుచేసిన నిక్కీ జోసెఫ్ తదితరులు విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ముందునుంచి అనుమానించినట్లే వాళ్ల వద్ద భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. వీళ్లంతా ఐసిస్ కార్యకర్తలేనా.. లేక స్లీపర్ సెల్స్ సభ్యులా అన్న విషయం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. మామూలు రోజుల్లో ఏవో పనులు చేసుకుంటూ సాధారణ పౌరుల్లాగే జీవించే స్లీపర్ సెల్స్ సభ్యులు.. తమకు ఆదేశాలు అందిన మరుక్షణం ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టేందుకు సిద్ధమైపోతారు. తమకు హ్యాండ్లర్ల నుంచి అందే ఆదేశాలు, ఆయుధాలతో పని కానిస్తారు. ఇలాంటివాళ్లను ముందుగా గుర్తించడం కష్టం. కానీ సరైన టిప్ అందితే మాత్రం చివరి నిమిషంలో పేలుళ్లు చేపట్టడానికి ముందు కూడా పట్టుకునే అవకాశం ఉంది. -
అది ఐఎస్ఐఎస్ పనే: ప్రధాని
తమ విమానాశ్రయంపై దాడిచేసి, పలువురి ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాద దాడి వెనుక ఉన్నది ఐఎస్ఐఎస్సేనని ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తున్నట్లు టర్కీ ప్రధానమంత్రి బినాలీ యిల్డిరిమ్ అన్నారు. తమకు తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పటికి 36 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన ప్రకటించారు. దుర్ఘటన జరిగిన ఇస్తాంబుల్ విమానాశ్రయానికి వెళ్లి, అక్కడి పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఉన్న సాక్ష్యాలన్నీ డయేష్ అనే సంస్థకు సంబంధించి కనిపిస్తున్నాయని.. ఇది ఐఎస్ఐఎస్కు మరో పేరని ఆయన తెలిపారు. చాలామంది గాయపడ్డారన్న ప్రధాని.. ఆ సంఖ్యను మాత్రం చెప్పలేదు. ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు ఆటోమేటిక్ రైఫిళ్లతో ప్రయాణికులపై కాల్పులు జరిపి, తర్వాత తమను తాము పేల్చేసుకున్నారని ఆయన చెప్పారు. ఉగ్రవాదులు విమనాశ్రయానికి ఓ టాక్సీలో వచ్చినట్లు ప్రధాని వివరించారు. యూరప్‌లోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన ఇస్తాంబుల్‌లో భద్రతాపరమైన లోపం మాత్రం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఉదయం 6 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం) ఎయిర్ ట్రాఫిక్‌ను పునరుద్ధరించామన్నారు. -
ఐసిస్పైకి బాలీవుడ్ సంగీతాస్త్రం
బ్రిటిష్ సైనిక బలగాల యోచన లండన్: లిబియాలోని ఐసిస్ ఉగ్రవాదులపైకి బ్రిటిష్ సైనిక దళాలు కొత్త అస్త్రాన్ని ప్రయోగించనున్నాయి. వారిని మానసికంగా దెబ్బతీయడానికి బాలీవుడ్ సంగీతాన్ని అస్త్రంగా ఉపయోగించాలని పాక్ సంతతి నిఘా అధికారి బ్రిటిష్ సైన్యానికి సూచించారు. హిందీలో ఇస్లామిక్‌కు వ్యతిరేకంగా రూపొందించిన పాటలను విని ఉగ్రవాదులు తీవ్రంగా స్పందిస్తారని, అవి వారిని అవమానిస్తాయని, వారి బలమెంతో కూడా తెలుసుకునే వెసులుబాటు లభిస్తుందని బ్రిటిష్ సైనికవర్గాలు తెలిపాయి. ఐసిస్ వ్యతిరేక పాటలపై ఉగ్రవాదులు అక్కడి రేడియాలో తప్పకుండా ఫిర్యాదు చేస్తారని, అదే సమయంలో వారి స్థావరాలను కనుగొనడం సులువవుతుందన్నారు. -
‘ఐసిస్’ చికెన్ వ్యాపారం
కైరో: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన తీవ్రవాద సంస్థ ఐసిస్ లిబియాలోని సిర్త్ నగరంలో చాలా తక్కువ ధరలకు కోడి పిల్లలు, గుడ్లు అమ్ముతోందని ఓ మీడియా నివేదిక తెలిపింది. ఐసిస్ సిర్త్ను ఆక్రమించుకున్నపుడు ఆ ప్రాంతంలోని కోళ్ల ఫారాలు, ఇతర ఆస్తులను స్వాధీనపరుచుకుంది. ప్రజలపై అద్దెలు, పన్నులు కూడా విధించింది. ఐసిస్ తీవ్రవాదులు ముఖానికి నల్ల గుడ్డ కట్టుకుని కేవలం రెండు దినార్లకే కోడి పిల్లలు,గుడ్లు అమ్ముతున్నారని స్థానికులు చెబుతున్నారు. సొంత దుకాణాలు కలిగిన యజమానుల నుంచి కూడా ఐసిస్ బలవంతంగా అద్దెలు వసూలు చేస్తోంది. రోడ్ల శుభ్రత, చెత్త సేకరణ సేవల కింద ప్రజల నుంచి వారానికి 10 లిబియన్ దినార్లను డిమాండ్ చేస్తోంది. సిర్త నగర తీరానికి సమీపంలోని బీచ్ అపార్టుమెంట్లలో నివసించే ప్రజల నుంచి కూడా ఐసిస్ అద్దెలను అడుగుతోంది. ఈ అపార్టుమెంట్లు మాజీ అధ్యక్షుడు గడాఫీకి చెందినవిగా భావిస్తున్నారు. తమ అధీనంలో ఉన్న ప్రాంతంలోని సహజ వనరులు, పురాతన వస్తువులు, లైంగిక బానిసలను అమ్మడం తదితరాల ద్వారా ఐసిస్ కొంత కాలంగా ఆదాయం ఆర్జిస్తోంది. ఆర్థిక వనరుల అభివృద్ధికి గడాఫీ కాలం నాటి కరె న్సీ నోట్లను పునరుద్ధరించారు. -
ఎఫ్బీలో ఐసిస్ ఆయుధాలు
లండన్: ఐసిస్ ఉగ్రవాదులు ఫేస్బుక్లో అక్రమంగా ఆయుధాల వ్యాపారం చేస్తున్నారు. ఫేస్బుక్లో గ్రూపులు ఏర్పాటు చేసుకుని మిషన్గన్ల నుంచి భారీ క్షిపణుల వరకు క్రయవిక్రయాలు చేపడుతున్నారు. వీటిలో ఒక్కో దాని విలువ రూ.40 లక్షల వరకు ఉందని అమెరికా మీడియా పేర్కొంది. ట్రిపోలి, బెంఘాజీ, సబ్రతా లాంటి నగరాల్లో ఎక్కువ విక్రయాలు జరుగుతున్నాయి. వీటిని 20-30 ఏళ్ల మధ్య ఉన్న యువకులు పర్యవేక్షిస్తున్నారు. ఫేస్బుక్ గ్రూపులో 400 నుంచి 14 వేల మధ్య సభ్యులున్నట్లు భావిస్తున్నారు. -
బ్రస్సెల్స్‌లో బాంబులు ఎందుకు పేలాయి?
బ్రస్సెల్స్: ఒకప్పుడు ఐరోపా రాజకీయ, సంస్కృతికి కేంద్ర బిందువుగా భాసిల్లిన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ నగరంపై మంగళవారం ఐసిస్ టెర్రరిస్టులు ఎందుకు దాడి చేశారు? పారిస్ దాడుల్లో నిందితుడైన సలాహ్ అబ్దెస్లామ్ను అనే టెర్రరిస్టును అరెస్టు చేసినందుకు నిరసనగానే వారు ఈ వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారా? ఈ దాడి వెనక ఆర్థిక, సామాజిక కోణాలు ఏమైనా ఉన్నాయా? యాభై ఏళ్ల క్రితం టర్కీ, మొరొక్కా దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ముస్లిం కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. రానురాను నిరుద్యోగం పెరుగుతూ వచ్చింది. బ్రస్సెల్స్‌లో 40 శాతం మంది యువకులు నిరుద్యోగులే. వలసదారులకు ఫ్రెంచ్, అరబ్ భాషలు తప్ప ఇతర భాషలు రావు. ఉద్యోగం రావాలంటే ఫ్రెంచ్‌తోపాటు ఫ్లెమిష్ లేదా డచ్ తప్పనిసరిగా రావాలి. అంతో ఇంతో ఇంగ్లీషు వచ్చి ఉండాలి. నిరుద్యోగంతో బ్రస్సెల్స్ యువతలో అసహనం పెరుగుతూ వచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ముస్లిం మహిళలు బురఖాలు లేదా నికాబ్లు ధరించరాదంటూ బెల్జియం ప్రభుత్వం 2012లో నిషేధం తీసుకరావడంతో ముస్లిం కుటుంబాల్లో అలజడి మొదలైంది. సౌదీ అరేబియా నుంచి వస్తున్న నిధులతో ఇక్కడ ముస్లిం పాఠశాలలను నిర్వహిస్తున్నారు. వాటిల్లో ర్యాడికలిజంను నూరిపోస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. చాలా కాలంగా బ్రస్సెల్స్‌లో రాడికల్ గ్రూపులు క్రియాశీలకంగా ఉన్నాయని, వారెప్పుడైన దేశంలో అరాచకం సృష్టించవచ్చని మీడియాలో ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆత్మాహుతి తరహా దాడులు జరిపేందుకు ఓ తరానికి తరం సిద్ధంగా ఉందన్న వార్తలు కూడా స్థానిక మీడియాలో వచ్చాయి. ముఖ్యంగా బ్రస్సెల్స్‌లోని మొలెన్బీక్ ప్రాంతం ఎంతో సమస్యాత్మకమైంది. ఇక్కడే అబ్దెస్లామ్ పట్టుబడింది. అబ్దెస్లామ్ పుట్టింది బ్రెజిల్కాగా పారిస్ దాడుల్లో రింగ్ లీడర్‌గా వ్యవహరించి ఎన్కౌంటర్లో మరణించిన అబ్దెల్హమీద్ అబౌద్ కూడా బ్రెజిల్ పౌరుడే. ప్రపంచ టెర్రరిస్టులతో మొలెన్బీక్ ప్రాంతానికి సంబంధాలు ఉన్నాయి. సిరియా, ఇరాక్‌లో ఐసిస్ టెర్రరిస్టులతో కలసి పోరాడేందుకు ఇక్కడి నుంచి దాదాపు ఐదువందల మంది యువకులు వెళ్లారు. ఇంటెలిజెన్స్ వర్గాల కథనం ప్రకారం వారిలో వందమంది మాత్రమే వెనుతిరిగి వచ్చారు. మిగతా వారిలో కొంతమంది మరణించగా, మిగిలిన వారు ఐసిస్ టెర్రరిస్టులుగా మారిపోయారు. అబ్దెల్స్లామ్ అరెస్టుకు ఆత్మాహుతి దాడులకు సంబంధం ఉందా ? అన్న అంశాన్ని మాత్రం బ్రస్సెల్స్ పోలీసులు ఇంతవరకు తేల్చలేదు. -
ఇరాక్‌లో భారత బందీలు జీవించే ఉన్నారు
న్యూఢిల్లీ: ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదుల చేతుల్లో బందీలైన 39 మంది భారతీయులు జీవించే ఉన్నట్లు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. బుధవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సుష్మా మాట్లాడుతూ బందీలైన వారిని వె నక్కి రప్పించేందుకు ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ఇరాక్‌లో ఉన్న భారతీయుల కోసం ప్రయత్నిస్తున్న సుష్మను పలువురు సభ్యులు అభినందించారు. -
టెర్రరిస్టులపై పోరుకు డెల్టా ఫోర్స్
గుట్టుచప్పుడు కాకుండా ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించడంలో ప్రసిద్ధి చెందిన అమెరికా సైన్యంలోని 'డెల్టా ఫోర్స్' ఇరాక్‌లోని ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను తుద ముట్టించేందుకు రంగంలోకి దిగిందని అమెరికా సైనికవర్గాల ద్వారా తెలిసింది. డెల్టాఫోర్స్కు చెందిన దాదాపు 200 మంది సైనికులు ఇరాక్‌లో మకాం వేసి టెర్రరిస్టుల నాయకుల గురించి, వారి స్థావరాల గురించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇంతకాలం డ్రోన్ల ద్వారా ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులపై దాడులు జరిపిన డెల్టా ఫోర్స్ ఇప్పుడు టెర్రరిస్టులతో భూతల యుద్ధానికి సన్నద్ధమవుతోంది. గతంలో అఫ్ఘానిస్తాన్, ఇరాక్లలో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం ఉన్న ఈ ఫోర్స్ ఇప్పటికే ఆరు టెర్రరిస్టు స్థావరాలను గుర్తించినట్లు తెలిసింది. టెర్రరిస్టులను వీలైతే సజీవంగా పట్టుకోవడం, లేదంటే హతమార్చడం, వారి చెరలో ఉన్న బందీలను విడిపించడం ఇప్పుడు ప్రధాన లక్ష్యం. సామాన్య పౌరులకు ప్రాణ నష్టం జరగుకుండా అతి జాగ్రత్తగా ఆపరేషన్లను నిర్వహించడంలో డెల్టాఫోర్స్ దిట్ట. ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూడకుండా సమయానుకూలంగా ఆపరేషన్లు నిర్వహించే స్వేచ్ఛ ఈ ఫోర్స్‌కు ఉంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే అమెరికా అధ్యక్షుడిని అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను తుద ముట్టించేందుకు ప్రత్యేక దళాలను ఇరాక్‌కు పంపిస్తున్నామని, అమెరికా రక్షణ మంత్రి ఆష్ కార్టర్ గత డిసెంబర్లోనే ప్రకటించడం 'డెల్టా ఫోర్స్' ఇరాక్‌లో మకాం వేసిందన్న విషయాన్ని రుజువు చేస్తోంది. ప్రత్యేక దళం దాడులతో ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు ఎక్కడున్నా భయంతో చావాల్సిందేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. 2015, మే నెలలో సిరియాలోని ఓ ఐఎస్ఐఎస్ స్థావరాన్ని లక్ష్యాంగా చేసుకొని డెల్టా ఫోర్స్ జరిపిన దాడిలో వాంటెడ్ టెర్రరిస్టు అబు సయ్యద్ మరణించగా, ఆయన భార్య పట్టుబడింది. ప్రస్తుతం సిరియాలో దాడులు జరిపే ఉద్దేశం డెల్టాఫోర్స్కు లేదు. స్థానికంగా సహాయం చేసే స్థితిలో ప్రభుత్వ దళాలు లేవు. ఇరాక్‌లో ప్రభుత్వ సైనికులు, టెర్రరిస్టు వ్యతిరేక దళాలు డెల్టా ఫోర్స్‌కు సహకరిస్తున్నాయి. ఇరాక్‌లో దాడుల ఏర్పాట్లలో ఉన్న ఈ ఫోర్స్ ఎప్పుడు దాడులు ప్రారంభించేదీ ఇంకా తెలియదు. -
ఐసిస్ ఎక్కడున్నా అణచివేస్తాం
వాషింగ్టన్: ఐసిస్ ఉగ్రవాదులు ఏ దేశంలో ఉన్నా సరే వారిని అణచివేసే చర్యలను అమెరికా కొనసాగిస్తుందని ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. ఐసిస్‌ను నిర్మూలించే పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని ఆ దేశ భద్రతా దళాలను ఆదేశించారు. ఐసిస్ విస్తరణను అడ్డుకోవడం, దానిని నిర్మూలించడానికి చేపట్టే చర్యలపై అమెరికా జాతీయ భద్రతా మండలి అధికారులతో ఒబామా గురువారం భేటీ అయ్యారు. ఐసిస్ అనుబంధ, ఇతర ఉగ్రవాద సంస్థలు ప్రభుత్వపాలన బలహీనంగా దేశాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి త్నిస్తున్నాయన్నారు. అలాంటి చోట్ల పాలన బలోపేతానికి , ఉగ్రవాదంపై పోరాడేందుకు తోడ్పడాలని భద్రతా మండలిని ఆదేశించారు. ఐసిస్ అంటే ముస్లింలంతా కాదనే తన విధానాలను విమర్శిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేతలకు చురకలు ఆయన అంటించారు. ‘ముస్లింలను అవమానపరిచేందుకు రాజకీయ నాయకులకు అవకాశమివ్వడం కోసం మనం మన నాయకత్వాన్ని దృఢపర్చుకోవడం లేదు. అది మన విధానం కాదు. అది అమెరికాకు మంచిది కూడా కాదు..’ అని స్పష్టం చేశారు. -
ఐఎస్ఐఎస్ 'టెలిగ్రామ్' కుదరిదిక!
బెర్లిన్: తమ యాప్ ద్వారా ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించకుండా అడ్డుకునేందుకు 'టెలిగ్రామ్' సంస్థ ఉపక్రమించింది. తమ యూజర్లను ఉగ్రవాదం వైపు దారి మళ్లించడానికి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు టెలిగ్రామ్ నిర్వాహకులు అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించారు. 12 భాషలకు సంబంధించిన సైట్లను ఐఎస్ఎస్ వినియోగిస్తుందని, ఉగ్రవాదులు తమ యాప్ వాడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. గత వారం రోజుల నుంచి తాము చేసిన ప్రయత్నాలు ఫలించి ఐఎస్ఐఎస్ సైట్లను బ్లాక్ చేసే కోడింగ్ విధానాన్ని కనుగొన్నామని వెల్లడించింది. బెర్లిన్ కేంద్రంగా పనిచేస్తున్న టెలిగ్రామ్ యాప్ ద్వారా వ్యక్తిగత ఛాటింగ్ నుంచి గ్రూప్ ఛాటింగ్ వరకు 200 మంది ఒకేసారి మెసేజ్‌లు పంపుకోవచ్చు. అయితే ఈ యాప్ వాడి తమ యూజర్లను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వారి కార్యకలాపాల వైపు ఆకర్షించకుండా ఉండేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా కోడింగ్ విధానాన్ని అనుసరించినట్లు టెలిగ్రాఫ్ తెలిపింది. టెలిగ్రామ్ యూజర్ల సమాచారాన్ని ఐఎస్ఎస్ ఉగ్రవాదులు రిట్రీవ్ చేయకుండా వారి డేటాని ఎన్‌క్రిప్ట్ చేసే యోచనలో యాప్ రూపకర్తలు ఉన్నారు. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిచండటంతో పాటు తమ చర్యలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న యాప్ నిర్వాహకులపై దాడులు చేయాలన్న యోచనలో ఉన్నట్లు ఐఎస్ఐఎస్ హెచ్చరిక సంకేతాలు పంపించింది. This week we blocked 78 ISIS-related channels across 12 languages. More info on our official channel: https://t.co/69Yhn2MCrK — Telegram Messenger (@telegram) November 18, 2015 -
200మంది విద్యార్థులను పిట్టల్లా కాల్చారు!
-
ఇంకా ఉగ్రవాదుల చెరలోనే తెలుగు ప్రొఫెసర్లు
-
బందీలుక్షేమమే.. త్వరలోనే విముక్తి
ఉగ్రవాదుల చెర నుంచి బయటపడిన కర్ణాటక ప్రొ. లక్ష్మీకాంతం వెల్లడి తెలుగు ప్రొఫెసర్ల కుటుంబాలను పరామర్శించిన ప్రొఫెసర్ హైదరాబాద్: లిబియా దేశంలో వారం రోజులుగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు తిరువీధుల గోపీకృష్ణ, చిలువేరు బల రాం కిషన్ క్షేమంగానే ఉన్నారని, వారిద్దరూ త్వరలోనే విడుదల అవుతారని ఉగ్రవాదుల చెర నుంచి బయటపడిన కర్ణాటకకు చెందిన ప్రొఫెసర్ లక్ష్మీకాంతం చెప్పారు. గోపీకృష్ణ, బలరాం కిషన్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆయన మంగళవారం హైదరాబాద్ వచ్చారు. దౌత్య అధికారులతో కలసి ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్న లక్ష్మీకాంతం ఓల్డ్ అల్వాల్‌లోని బలరాం కిషన్ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా జూలై 29న రెండు కార్లలో బయల్దేరిన తమ బృందాలను ఉగ్రవాదులు అపహరించిన తీరు, ఆ తర్వాత పరిణామాలను వివరించారు. ఉగ్రవాదులు తమను మర్యాదపూర్వకంగా చూసుకున్నారని, వారి అధీనంలో ఉన్న గోపీకృష్ణ, బలరాంకిషన్‌లకు ఎలాంటి ఇబ్బందీ లేదని, త్వరలో వారు క్షేమంగా ఇళ్లకు చేరుకుంటారని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. బందీల విడుదలకు భారత విదేశాంగ శాఖ అధికారులతో పాటు లిబియాలోని విద్యార్థి బృందాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయని లక్ష్మీకాంతం చెప్పారు. ఇబ్బంది పెట్టొద్దు.. ప్రస్తుతం లిబియాలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, బందీలు విడుదలయ్యేంత వరకూ మీడియా కూడా తమకు సహకరించాలని ప్రొఫెసర్ లక్ష్మీకాంతం విజ్ఞప్తి చేశారు. అంతా మంచే జరుగుతుందని తాము భావిస్తున్నామని, అంతకు మించి ఏమీ మాట్లాడలేమని, మీడియా కూడా సహకరించాలని కోరారు. ఇదిలాఉండగా ఉగ్రవాదుల చెర నుండి విడుదలైన కర్ణాటక ప్రొఫెసర్లు లక్ష్మీకాంతం, విజయ్‌కుమార్ మంగళవారం అరబ్ న్యూస్ చానళ్లతో మాట్లాడుతూ తమను ఉగ్రవాదులు ఏ ఇబ్బంది పెట్టలేదని, మిగిలిన ఇద్దరు బందీలను సహృదయంతో విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. -
'టీచర్లు అంటే మాకెంతో గౌరవం... చంపం'
బెంగళూరు: లిబియాలో ఇద్దరు తెలుగు వారితో సహా నలుగురిని కిడ్నాప్ చేసింది ఐఎస్ఎస్ ఉగ్రవాదులేనని నిర్ధారయింది. అపహరణకు గురైన తర్వాత ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నామని ఉగ్రవాదుల చెర నుంచి విడుదలైన విజయ్ కుమార్(56) తెలిపారు. కర్ణాటకలోని కోలార్ ప్రాంతానికి చెందిన విజయ కుమార్ సిర్త్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. తమను చీకటి గదిలో బంధించారని తెలిపారు. కిడ్నాపర్లు తమ పేర్లు, మతం, ఉద్యోగాల గురించి అడిగారని చెప్పారు. తాము యూనివర్సిటీలో అధ్యాపకులుగా పనిచేస్తున్నామని చెప్పగానే తమ పట్ల వారి వైఖరిలో సానుకూల మార్పు కనబడిందని వివరించారు. కిడ్నాపర్ల నాయకుడు తన పేరు షేక్ గా పరిచయం చేస్తున్నాడని తెలిపారు. ఎవరికో ఫోన్ చేసి అరబిక్ మాట్లాడారని, తర్వాత అతడి వైఖరితో మార్పు వచ్చిందన్నారు. 'టీచర్లు అంటే మాకెంతో గౌరవం. మీ కారణంగానే లిబియాలో ఎంతోమంది పిల్లలు చదువుకుంటున్నారు. మీకు ఎటువంటి హాని తలపెట్టం' అని షేక్ తమతో చెప్పాడని వెల్లడించారు. సిర్త్‌యూనివర్సిటీ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెక్ పోస్టు వద్ద తమను నలుగురు దుండగులు తమను కిడ్నాప్ చేశారని లక్ష్మీకాంత్ చెప్పారు. తర్వాత తమను పెద్ద గోడ ఉన్న పెద్ద హాల్ లోకి తీసుకెళ్లి తమదగ్గరున్న డబ్బు, వస్తువులు తీసుకున్నారని తెలిపారు. 'లిబియాను ఎందుకు విడిచి వెళుతున్నారు, ఇస్లాం గురించి మీకేం తెలుసో చెప్పాలని షేక్ తమను ప్రశ్నించాడు. ఆరు నెలల వయసున్న నా కుమార్తెను చూసేందుకు వెళ్లాలని నన్ను విడిచి పెట్టాలని కోరాను. ఇస్లాం గురించి వివరించాను. ఇండియాలో హిందూ, ముస్లింలు ఐకమత్యంగా కలిసివుంటున్నారని, మతసామర్యంతో పండుగలు జరుపుకుంటున్నారని తెలిపాను. ఆ రాత్రి మాకు ఆహారం పెట్టలేదు' అని లక్ష్మీకాంత్ తెలిపారు. వీరిద్దరినీ శుక్రవారం విడుదల చేశారు. తెలంగాణ, ఏపీకి చెందిన బలరాం, గోపీకృష్ణ ఇంకా కిడ్నాపర్ల చెరలోనే ఉన్నారు. -
వచ్చినది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులా?
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా దీనానగర్ పోలీసు స్టేషన్ వద్ద కాల్పులు జరిపి ఏడుగురి మృతికి కారణమైనది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసు స్టేషన్లోకి చొరబడే ముందు వాళ్లు ఐఎస్ఐఎస్ అనుకూల నినాదాలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లష్కరే తాయిబా ప్రోద్బలంతో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాడిచేసే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాయి. -
భవనం మీదినుంచి తోసేశారు
డమస్కస్: సిరియాలోని పలు నగరాలను ఆక్రమించుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ప్రజలపై తమ పైశాచిక అకృత్యాలను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా హోమ్స్ నగరంలో స్వలింగ సంపర్కులుగా ఆరోపిస్తూ ఇద్దరు యువకుల చేతులను వెనక్కి విరచికట్టి ఓ భవనం పైనుంచి కిందకు తోసేశారు. తర్వాత కొన ఊపిరితోవున్న వారిని రాళ్లతో కొట్టి చంపారు. ఈ వీడియో దృశ్యాలను శుక్రవారం మధ్యాహ్నం సామాజిక వెబ్సైట్లలో పోస్ట్ చేశారు. ఇలాంటి బహిరంగ శిక్షల వీడియోలను విడుదల చేయరాదంటూ ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాది తన క్యాడర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన ఐదవ రోజే ఈ వీడియోను పోస్ట్ చేయడం గమనార్హం. స్వలింగ సంపర్కులను బహిరంగంగా భవనాల మీది నుంచి తోసేయడం, రాళ్లతో కొట్టి చంపడం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు కొత్తేమికాదు. గత ఏప్రిల్ నెలలో ఇద్దరు యువకులను కూడా దారుణంగా రాళ్లతో కొట్టి చంపారు. ఆ యువకులు ఒకరినొకరు కౌగలించుకున్న ఫొటోను మిత్రులతో తీయించుకున్న కొన్ని నిమిషాల్లోనే వారిని చంపేశారు. జూన్ నెలలో కూడా ముగ్గురు యువకులను ఇదే కారణంతో ఎత్తైన భవనం పైనుంచి తొసేసి చంపేశారు. -
ఐఎస్ఐఎస్పై 'రాంబో' పోరాటం
వాషింగ్ఘన్: రాంబో సిరీస్ సూపర్ హిట్ ద్వారా ప్రపంచ ప్రేక్షకులకు సుపరిచితుడైన ప్రముఖ హాలీవుడ్ స్టార్ సిల్వెస్టర్ స్టలోన్ అదే సిరీస్‌లో ఐదవ పార్ట్ తీయబోతున్నారు. సిరియా, ఇరాక్లలో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను తుదముట్టించడమే స్థూలంగా ఈ సినిమా ఇతివృత్తం. 2011 నుంచే రాంబో-లాస్ట్‌బ్లడ్ పేరిట ఐదో పార్ట్‌ను తీయాలనుకుంటున్న స్టలోన్.. కథాంశం విషయంలో మొన్నటి వరకు ఓ నిర్ణయానికి రాలేక పోయారు. తన మరో హిట్ సిరీస్‌లో భాగంగా తీసిన తాజా చిత్రం 'నెక్స్ట్రాఖీ' ప్రమోషన్లో భాగంగా ఇటీవల శాన్‌డియాగోకు వచ్చిన స్టలోన్ 'రాంబో:లాస్ట్‌బ్లడ్'కు కథ ఖరారైందని, తానే స్క్రీన్ ప్లే రాస్తున్నానని తెలిపారు. తాను హీరోగా నటించడంతో పాటు తానే దర్శకత్వం కూడా వహిస్తున్నట్టు చెప్పారని 'వాషింగ్ఘన్ టైమ్స్' పత్రిక వెల్లడించింది. షూటింగ్ కోసం అనువైన ప్రదేశాలను వెతకడం కోసం అప్పుడే తన టీమ్ సిరియా, ఇరాక్లలో పర్యటిస్తున్నట్టు స్టలోన్ తెలిపారు. అంతకుమించి ఈ సినిమాకు సంబంధించి వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. 'హంటర్' అనే నవల ఆధారంగా బల్గేరియాలో తాను రాంబో: లాస్ట్‌బ్లడ్ తీస్తున్నట్టు స్టలోన్ గతంలో తెలిపిన విషయం తెలిసిందే. అందులో డ్రగ్ మాఫియా తన కూతురిని కిడ్నాప్ చేస్తే వారిని వేటాడి, వారి నుంచి కూతురిని రక్షించుకోవడం అందులోని ఇతివృత్తం. ఇప్పుడు దక్షిణాసియాలో ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను తుదముట్టించడమే ఇతివృత్తం అని చెబుతున్నందున.. బహుశా ఇందులో కూడా తన కూతురిని కిడ్నాప్ చేసిన ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులపై ప్రతీకారం తీసుకోవడం ఇతివృత్తంగా ఉండొచ్చు. ప్రపంచ యుద్ధాల్లో అమెరికా విధానానికి అనుగుణంగానే ఎప్పుడు రాంబో పాత్ర ఉంటుందన్నది నిర్వివాదాంశం. ఐఎస్ఐఎస్పై అమెరికా ప్రస్తుత విధానానికి అనుగుణంగానే రాంబో పాత్ర ఉంటుందనడంలో సందేహం లేదు. సోవియట్-అఫ్ఘాన్ యుద్ధం సందర్భంగా తన వియత్నాం కమాండింగ్ ఆఫీసర్‌ను విడిపించే ఏకైక మిషన్‌పై అఫ్ఘాన్ వెళ్లడం, అక్కడ వీరోచితంగా పోరాడడం ఇతివృత్తంగా రాంబో-3 సినిమా 1988లో వచ్చిన విషయం తెలిసిందే. 'ఈ సినిమా అఫ్ఘానిస్తాన్‌లోని ముజాహిద్దీన్ ధీర యోధులకు అంకితం' అనే వ్యాక్యంతో ముగుస్తుంది. 2011 వరకు ఈ వ్యాక్యం ఇలాగే ఉండింది. ఎప్పుడైతే ముజాహిద్దీన్లు అల్‌ఖైదాలతో కలిసిపోయారో అప్పుడు 'అఫ్ఘాన్ ధీర యోధులకు అంకితం' అని మార్చారు. అంటే అమెరికా విదేశీ విధానానికి అనుగుణంగా వ్యాక్యంలోని ముజాహిద్దీన్ అనే పదాన్ని తొలగించారన్నమాట. ఈ విషయాన్ని పక్కనపెడితే 68 ఏళ్ల ప్రాయంలో పడిన స్టలోన్ గతంలోలాగా మెప్పించగలడా ?అన్నది ప్రశ్న. -
బతుకు బండిపై ఉగ్ర తూటా
* పాక్‌లో బస్సుపై ముష్కరుల దాడి.. 45 మంది మృతి * లోపలికి ప్రవేశించి ప్రయాణికులపై విచక్షణారహితంగా కాల్పులు * ఘటనకు తామే బాధ్యులమని ప్రకటించుకున్న ఐఎస్ఐఎస్ కరాచీ: వారంతా పేదలు.. రెక్కాడితే గానీ డొక్కాడని బీదాబిక్కీలు.. కూలీ పనులతో బతుకు బండిని లాగిస్తున్నవారు కొందరైతే.. చిన్నాచితకా వ్యాపారాలతో పొట్టుపోసుకునే వారు ఇంకొందరు.. అంతా బస్సులో పట్నానికి వెళ్తున్నారు.. ఇంతలో ఎక్కడ్నుంచి వచ్చారో రక్తంమరిగిన మానవ మృగాలు.. ఆ అమాయకులపై ఏకే 47 తుపాకులు ఎక్కుపెట్టారు.. అతి దగ్గర్నుంచి బుల్లెట్ల వర్షం కురిపించారు.. 16 మంది మహిళలు సహా మొత్తం 45 మంది ప్రాణాలను బలిగొన్నారు! పేదలను మోసుకెళ్తున్న ఆ బతుకు బండి క్షణాల్లో రక్తమోడుతూ ఆగిపోయింది!! బుధవారం పాకిస్తాన్‌లోని కరాచీలో షియా తెగకు చెందిన ఇస్మాయిలీ ముస్లింలు లక్ష్యంగా ఉగ్రవాదులు సాగించిన మారణకాండ ఇదీ. ఈ ఘటనకు తామే బాధ్యులమని అదే బస్సులో తమ సంస్థ పేరుతో కరపత్రాలను వేసి ఐఎస్ఐఎస్ ముష్కరులు ప్రకటించుకున్నారు. ‘అల్లాకు కృతజ్ఞతలు.. 43 మంది మతభ్రష్టులను చంపేశాం’ అని ఐఎస్ ఉగ్రవాదులు ట్విటర్లో పేర్కొన్నారు. పోలీసు దుస్తుల్లో వచ్చి..: అల్-అజార్ గార్డెన్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన బస్సుపై ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ సంస్థ ఇస్మాయిలీ వర్గానికి చెందిన పేదలకు సాయం చేస్తుంటుంది. ఇళ్లు లేనివారికి తక్కువ ధరకు ఇళ్లు కట్టిస్తుంది. బుధవారం ఈ సంస్థకు చెందిన బస్సు 60 మందికి పైగా ప్రయాణికులతో నగర శివారు నుంచి కరాచీలోని వివిధ ప్రాంతాలకు బయల్దేరింది. తొలుత బైక్‌లపై వచ్చిన ఆరు నుంచి ఎనిమిది మంది ముష్కరులు బస్సును ఆపాలంటూ డో మెడికల్ కాలేజీ సమీపంలో కాల్పులు జరిపారు. కొద్దిదూరం వెళ్లాక గులిస్తాన్-ఇ-జోహార్ ప్రాంతంలో బస్సు ఆగగానే అందులోకి ప్రవేశించి విచక్షణారహితంగా తూటాల వర్షం కురిపించారు. అతి దగ్గర్నుంచి కణతలపై గురిపెట్టి మరీ ప్రయాణికులను చంపేశారు. అనంతరం అవే బైక్‌లపై పారిపోయారు. ఇందులో 45 మంది అక్కడికక్కడే నేలకొరగగా.. 20 మంది గాయాలపాలయ్యారు. అనుమానం రాకుం డా ఉగ్రవాదులు పోలీసు దుస్తుల్లో వచ్చి ఈ దారుణానికి తెగబడడం గమనార్హం. ఉగ్రవాదుల కాల్పుల్లో డ్రైవర్ కూడా చనిపోవడంతో.. కండక్టర్ ఆ బస్సును నేరుగా సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. తాను గాయపడ్డా బస్సును ఆసుపత్రికి చేర్చిన కండక్టర్‌ను అధికారులు అభినందించారు. ఘటన లో చాలామంది తీవ్రంగా గాయపడ్డారని, మృతుల సంఖ్య పెరగొచ్చని పోలీసు ఉన్నతాధికారి గులామ్ జమాలీ చెప్పారు. బస్సులోంచి ఐఎస్ఐఎస్ కరపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని బెలూచిస్తాన్‌కు చెందిన జున్‌దుల్లా ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించుకుంది. దాడికి ఎవరు పాల్పడ్డారన్న విషయాన్ని ప్రభుత్వం వెల్లడించలేదు. ఖండించిన అధ్యక్షుడు, ప్రధాని బస్సుపై దాడిని పాక్ అధ్యక్షుడు మన్మూన్ హుస్సేన్, ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. -
లాటరీల పద్ధతిలో రేప్‌లు చేశారు!
► ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల అకృత్యాలపై హ్యూమన్ రైట్స్ నివేదిక సిరియా: వారిది ముక్కుపచ్చలారని వయస్సు, దేవుడెవరో, రాక్షసుడెవరో తెలియదు. అంతా ఎనిమిదేళ్ల నుంచి 12 ఏళ్ల ప్రాయం వారే. ఇస్లామిక్ ఉగ్రవాదులు వారిని వంతుల వారిగా రేప్ చేశారు. లాటరీ పద్ధతిలో ఎంపిక చేసుకొని మరీ దారుణాతి దారుణాలకు పాల్పడ్డారు. తమ కామకృత్యాల అనంతరం వారిలో కొందరిని గ్రామంలోని ఇతర కామాంధులకు వేలం కూడా వేశారు. ఆత్మహత్య చేసుకుందామనుకున్న వారికి ఆ దేవుడు కూడా సహకరించలేక పోయాడు. ఇస్లామిక్ రాజ్యం స్థాపన కోసం పోరాడుతున్నట్టు చెప్పుకుంటున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకుని బయటపడిన ‘యాజిది’ తెగకు చెందిన బాలికల దీనగాధ ఇది. అలా తప్పించుకున్న 20 మంది బాలికలు, యువతులను మానవ హక్కుల సంఘం ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ ఇంటర్వ్యూ చేసి ఈ వివరాలను వెల్లడించింది. ఓ 12 ఏళ్ల బాలికను కట్టేసి, చితక్కొట్టి ఏడుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వంతులువారిగి రేప్ చేసిన అంశాన్ని ఆ మానవ హక్కుల సంఘం ఓ నివేదికలో వెల్లడించింది. ‘నన్ను సిరియాలోని ఓ ఇంటిలో నిర్బంధించారు. నాతోపాటు మరికొంత మంది పిల్లలు ఉన్నారు. మేమున్న గదిలోని ఐఎస్ఐఎస్ ఫైటర్లు వచ్చారు. వారు చెప్పినట్టు చేయకపోవడంతో చెంపమీద కొట్టారు. స్నానం చేసి తయారవుతామని వారిని ఎలాగో ఒప్పించాం. ఈ గదిలో ఓ టాక్సిక్ ఆసిడ్ డబ్బా కనిపించింది. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదామనుకున్నా. నాతోపాటు గతిలోవున్న ఇతర అమ్మాయిలు కూడా చచ్చి పోదామనుకున్నారు. వారికి కూడా ఇచ్చాను. నేను కూడా తాగాను. కాని మేమెవరమూ చనిపోలేదు. అస్వస్థతకు గురయ్యాం’ జలీలా (పేరు మార్చారు) అమ్మాయి తెలిపింది. అయినా అనరోగ్యంతోవున్న వారిని కూడా తీవ్రవాదులు వదిలిపెట్టలేదని, అమెను, ఆమెతోపాటున్న మరో న లుగురు బాలికలను ఏడుగురు ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు పలుసార్లు రేప్ చేశారని హ్యూమన్ రైట్స్ వాచ్ వెల్లడించింది. యాజిది తెగకు చెందిన జలీలాను 2014, ఆగస్టు నెలలో సింజార్ గ్రామంలో ఓ ఇంటి నుంచి తీవ్రవాదులు ఎత్తుకెళ్లారని, ఆమెతోపాటు ఏడుగురు కుటుంబ సభ్యులను కూడా కిడ్నాప్ చేశారని ఆ సంఘం పేర్కొంది. తీవ్రవాదుల చెర నుంచి తప్పించుకున్న 20 మంది యువతుల అనుభవాలు దాదాపు ఇంతే దారుణంగా ఉన్నాయి. వారికి దేవుడెలా ఉంటాడో తెలియలేదుగానీ రాక్షుసులెలా ఉంటారో తెలిసింది. -
కళ్లముందే చికెన్ క్రేట్లు తగులబడుతుంటే...
సిరియా: అంతర్యుద్ధంతో రగిలిపోతున్న సిరియాలో ఓ పక్క లక్షలాది మంది శరణార్థులు ఆకలితో అలమటిస్తుంటే మరోపక్క అమెరికా లేబుళ్లతో వచ్చిన వందలాది చికెన్ క్రేట్లను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తగులబెట్టారు. అలెప్పో నగరం సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటనను వీడియోలుతీసి మరీ ఉగ్రవాదులు శుక్రవారం విడుదల చేశారు. ముస్లిం లా ప్రకారం హలాల్ చేసిన చికెన్ క్రేట్లను ఆకలితో అలమటిస్తున్న తమను పట్టించుకోకుండా తమ కళ్ల ముందే తగులబెట్టారని అక్కడికి సమీపంలోని శిబిరాల్లో తలదాచుకున్న శరణార్థులు తెలియజేశారు. అధికారిక అంచనాల ప్రకారం ఆరున్నర లక్షల మంది శరణార్థులు సిరియా శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకునేందుకు ఐక్యరాజ్య సమితి సహా పలు అంతర్జాతీయ సామాజిక సంస్థలు తమకు అందుబాటులోవున్న వనరుల ప్రకారం ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నాయి. అయితే అమెరికా లేబుళ్లుగల ఏ పదార్థాన్ని ఉగ్రవాదులు తమ దేశంలోకి అనుమతించడం లేదు. రోడ్డు మార్గాన వచ్చిన ఆహార పదార్థాలను కూడా వారు వదిలిపెట్టడం లేదు. వాటిని రవాణా వాహనాల నుంచి గోతుల్లోకి దొర్లించి అగ్నికి ఆహుతి చేస్తున్నారు. అలెప్పో రాష్ట్రంలోని అల్ హెస్బా చెక్‌పోస్టు వద్ద రవాణా వాహనాల నుంచి చికెన్ బాక్సులను అన్లోడ్ చేసి వాటిని గుంతల్లో పడేస్తున్న వీడియో దృశ్యాలను కూడా అలెప్పోలోని ఐఎస్ఐఎస్ ప్రచార విభాగం విడుదల చేసింది. -
ఇరాక్‌పై ముసుగు యుద్ధం
‘‘మీడియా ఎవరినైనా వెర్రివాళ్లను చేయగలదు- సాధారణంగా ఉద్దేశపూరితంగా, అప్పుడప్పుడు మరెవరి చేతిలోనో వెర్రిదిగా మారి.’’ ఇరాక్ పరిణామాలపై అంతర్జాతీయ మీడియా వడ్డిస్తున్న మూసపోత కథనాలను చూస్తే రెండూ ఒకేసారి జరుగుతున్నట్టుంది. పదిహేను వందల మంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇలా దాడి చేశారో లేదో 20 లక్షల జనాభాగల మొసుల్ నగరంలోని 50 వేల భద్రతా సిబ్బంది తుపాకులు పారేసి పరుగు లంకించుకున్నారని అది చెప్పింది. నోళ్లు తెరుచుకు విన్నాం. ఐఎస్ఐఎస్ ఎంతటి అరి వీర భయంకరమైనది కాకపోతే దాని ధాటికి వారం గడవక ముందే ఉత్తర ఇరాక్‌లోని పట్టణాలు, నగరాలు, చమురు కేంద్రాలు వారి వశమైపోతాయి? శ్వేత సౌధాధీశుడు బరాక్ ఒబామా ఐఎస్ఐఎస్ ఉత్పాతం అమెరికా ప్రయోజనాలకు సైతం ప్రమాదకరమని కలవరపడతారు? ఇరాక్‌ను ఆదుకోడానికి ఇవిగో ద్రోన్లు, అవిగో వైమానిక దాడులు, అల్లదిగో సైన్యం అంటూ కాకి గోలే తప్ప కదలడం లేదెందుకు? సీఐఏ ఏం చేస్తున్నట్టు? పేపరు చూస్తేగానీ అధ్యక్షుల వారికి మొసుల్ పతనం సంగతి తెలియలేదు! సీఐఏని మూసేసి, కాంట్రాక్టు కూలీలకు పేపర్లను తిరిగేసే పనిని అప్పగించి ఉంటే ఈ ‘హఠాత్పరిణామానికి’ ‘దిగ్భ్రాంతి’ చెం దాల్సి వచ్చేది కాదు. సిరియాలోని లతాకియా, ఇద్లిబ్ రాష్ట్రాలలోని తన ఉగ్రమూకలను ఐఎస్ఐస్ సిరియాకు తూర్పున ఉన్న ఇరాక్ సరిహద్దుల్లో మోహరిస్తోందని లెబనాన్ డైలీ మార్చిలో తెలిపింది. అయినా ప్రపంచ నేతకు తెలియలేదంటే నమ్మాల్సిందే, చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడూ లోకువే. సద్దాం పునరుత్థానం వారం రోజుల పాటూ మొసుల్, తదితర పట్టణాలను సందర్శించి వివిధ వర్గాల ప్రజలతో చర్చించి వచ్చిన జూడెన్ టోడెన్హాఫర్ 2,70,000 ఆధునిక సైన్యంపై ఐఎస్ఐఎస్ సాధించిన ‘అత్యద్భుత విజయాన్ని’ ఒక్క ముక్కలో చెప్పారు... ఈ యుద్ధంలో ఐఎస్ఐఎస్ ‘జూనియర్ పార్టనర్’ మాత్రమే. అసలు పాత్రధారి ఎవరు? మొసుల్‌లో ఇప్పుడు ఇంటింటా వేలాడుతున్న సైనిక దుస్తుల పెద్ద మనిషి... ఇజ్జత్ ఇబ్రహీం అల్-దౌరీ. ఆయన 2003లో అమెరికా సైనిక దురాక్రమణతో హతమార్చిన సద్దాం హుస్సేన్‌కు కుడి భుజం, బాత్ పార్టీ ప్రధాన సిద్ధాంత కర్త, మొసుల్‌లో పుట్టి పెరిగినవాడు. ఐఎస్ఐఎస్ వీరాధివీరులు కనిపించగానే ఇరాక్ సేనలు ‘మటుమాయమైపోవడం’ (మెల్టెడ్ ఎవే) అనే అద్భుతం ఎలా సాధ్యమో ఇప్పుడు తేలిగ్గానే అం తుబడుతుంది. తూర్పున ఉన్న కుర్దు ప్రాంతాల్లో, ఉత్తరాదిన షియా ప్రాం తాల్లో మాత్రం సంకుల సమరం జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న సున్నీ బాతిస్టు పార్టీ రహస్య నిర్మాణానికి తిరుగులేని నేత దౌరీయే. 2003 నుంచి అమెరికా సేనలకు వ్యతిరేకంగానూ, నేడు షియా నౌరి అల్ మలికి ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ సైనిక ప్రతిఘటనకు నేతృత్వం వహిస్తున్నాడు. ఆయన నేతృత్వంలో కనీసం 20,000 బలగాలు ఉన్నట్టు అంచనా. ఇక సద్దాం హయాంలో ఉన్నతోద్యోగాల్లో, పదవుల్లో వెలగిన సున్నీలు షియా మలికి ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారు. ఈ పరిస్థితిలో ఐఎస్ఐఎస్ ముసుగుతో ప్రారంభమైన దాడికి సున్నీ ప్రజల మద్దతు లభిస్తోంది. శతాబ్దాల షియా, సున్నీ శత్రుత్వం మిథ్య అంతర్జాతీయ మీడియా వ్యాపింపజేసిన మరో కట్టుకథ.. 1400 ఏళ్ల షియా, సున్నీ వైరం. ఇస్లాంలోని రెండు ప్రధాన శాఖల మధ్య విభేదాలు, కొంత సంఘర్షణ ఉన్నమాట నిజమే. కానీ నేడు ఐఎస్ఐఎస్ సాగిస్తున్న షియా ఊచకోత స్థాయికి అది చేరిన వైనం చరిత్రలో ఎక్కడా లేదు. సద్దాం పాలనలో సున్నీల పట్ల పక్షపాతం ఉన్నా... షియాలపై దాడులు, విద్వేషం ఎరుగరు. 2003లో సైనిక దురాక్రమణ తదుపరి అమెరికాయే మొట్టమొదటిసారిగా ఈ విద్వేషాలను రగిల్చింది. సున్నీలంతా, సద్దాం అనుయాయులేనని బావించి వారికి స్థానమే లేని షియా ప్రభుత్వాన్ని మాలికి నేతృత్వంలో ఏర్పాటు చేసింది. బాతిస్టు సైనిక నేతలు అమెరికా ఏర్పరిచే ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి సిద్ధపడినా అమెరికా వారిని వేటాడి చంపింది. (విమర్శకుల ప్రశంసలందుకుని, బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డ ‘గ్రీన్ జోన్’ (2010) చూడండి). సున్నీల పట్ల అమెరికా అనుసరించిన ఈ విద్వేషపూరిత వైఖరే ఇస్లామిక్ తీవ్రవాదం, అల్‌కాయిదాలకు ఊపిరులూదింది. బాతిస్టు పార్టీ, ఇతర సున్నీ మిలీషియాల ప్రతిఘటన తారస్థాయికి చేరడంతో అమెరికా పలాయనం చిత్తగించింది. కానీ అది రగిల్చిన మత విద్వేషాల కార్చిచ్చు రగులుతూనే ఉంది. 2003 ఇరాక్ దురాక్రమణ నుంచి నేటి వరకు మధ్య ప్రాచ్యంలో అమెరికా సాధించిన ఏకైక ఘనకార్యం ఏమిటి? ఇరాక్, లిబియా, సిరియాల్లో లౌకికవాదం సమాధులపై మతోన్మాద రక్కసులను ఆవిష్కరించడమే. ఇరాక్‌లోని బాతిస్టు పార్టీ లౌకికతత్వానికి కట్టుబడ్డ పార్టీ. సద్దాం హయంలో సైతం బాగ్దాద్‌లో కుర్దులు సురక్షితంగా ఉండగలిగారు! అలాంటి లౌకికవాద బాతిస్టు పార్టీకి. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంత్ (ఐఎస్ఐఎల్) వంటి సున్నీ ఉగ్రవాద సంస్థకు మధ్య అపవిత్ర కూటమి ఎలా సాధ్యమైంది? ఆ సూత్రధారి ఎవరో తెలియాలంటే... జోర్డాన్‌లోని సఫావీలో ఐఎస్ఐఎస్, జబాత్ అల్ నస్రా తదితర సిరియా ఉగ్రవాద మూకలకు సీఐఏ అధికారులు, సైనిక నేతలు శిక్షణ శిబిరాలను నిర్వహించారని జర్మన్ పత్రిక ‘దెర్ స్పెగెల్’ గత మార్చిలో వెల్లడించింది. అంతర్జాతీయ మీడియా వినిపిస్తున్న కథనాల ప్రకా రం ఇప్పుడు ఐఎస్ఐఎస్ వెనుక ఉన్న శక్తులు సౌదీ అరేబియా, ఖతార్‌లు. సౌదీకి, బాతిస్టులకు బద్ద వైరం. అంటే సౌదీ, దాని బద్ధ శత్రువైన బాతిస్టులు కూడా ఐఎస్ఐఎస్తో కుమ్మక్కయ్యారని అర్థమా? ఇరాక్‌లోని మలికి ప్రభుత్వానికి నమ్మకమైన మిత్రునిగా ఉన్న టర్కీ ప్రధాని ఎర్డోగాన్ మిత్ర ద్రోహా? అదృశ్య సూత్రధారి ఎవరు? ఐఎస్ఐఎస్ 2003లో అది పుట్టినప్పుడు ఉత్త ఐఎస్ఐ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్). దానికి సౌదీ, ఖతార్‌ల అండదండలున్నమాట నిజమే. షియా మలికి ప్రభుత్వాన్ని కూల్చడమే దాని లక్ష్యం. 2012లో జోర్డాన్, టర్కీలలోని సీఐఏ శిక్షణ శిబిరాల్లో అది శిక్షణను పొందినది మాత్రం సిరియాలోని అసద్ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం. అందుకే అది ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అండ్ ఇరాక్)గా మారింది. అప్పటికి అది సౌదీ, ఖతార్, టర్కీ, సీఐఏలకు ఉగ్రవాద సేన. ఒబామా సిరియా సమస్యపై రష్యాతో ఘర్షణకు సిద్ధపడక వెనకడుగు వేయడంతో కథ ఊహించని మలుపు తిరిగింది. ఐఎస్ఐఎస్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంత్ అంటూ ఇరాక్ సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, జోర్డాన్, సైప్రస్, దక్షిణ టర్కీలతో కూడిన ఖిలాఫత్ రాజ్యాన్ని ఏర్పాటు చేసే లక్ష్యాన్ని ప్రకటించింది. దీంతో టర్కీ దానితో తెగతెంపులు చేసుకుంది. అప్పటికే ఎర్డోగాన్ సహాయంతో దౌరీ ఐఎస్ఐఎస్తో సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఈ విషయాన్ని గ్రహించి సౌదీ దానితో సంబంధాలు పెంచుకుంది. అంతర్జాతీయ మీడియా ఆ విషయాన్ని మరచిపోయినట్టు నటిస్తోంది. సౌదీ, ఖతార్‌ల వైపు వేలెత్తి చూపుతోంది. ఎందుకు?దొంగే దొంగ అని అరిచేదెందుకో అందుకే? మలికి ప్రభుత్వం తప్పుకోవాలని, సున్నీలు, షియాలు, కుర్దులకు ప్రాతినిధ్యం ఉండే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తప్ప సహాయం అందించేది లేదని బుధవారం శ్వేత సౌధం చేసిన ప్రకటనను చూడండి. అమెరికా ఇప్పుడు సిరియాలోలా ప్రభుత్వం మార్పును కోరుతోంది. ఈ పాచిక తప్పక పారుతుందనే భావి స్తోంది. ఇరాక్‌లో అమెరికా సేనలు నిలిపి ఉంచనిచ్చేది లేదని, చమురు నిల్వలను ప్రైవేటు పరం చేసే బిల్లుపై సంతకం చేయనని నిరాకరించిన మలికి అందుకు అంగీకరించవచ్చు. లేకపోతే సున్నీ, షియా, కుర్దుల మధ్య ఇరాక్ మూడు ముక్కలవుతుంది. రెండు దశాబ్దాలుగా కలలుగంటున్న ఇరాక్, సిరియా, ఇరాన్‌లను ఒక్కొక్కదాన్ని మూడు ముక్కలుగా చేయాలన్న కలకు సిరియాలో పడాల్సిన నాంది ఇరాక్‌లో పడుతుంది. కొసమెరుపు ఏమిటంటే మలికితో సన్నిహిత సంబంధాలున్న ఇరాన్‌ను ఏకాకిని చే యాలనే ప్రధాన లక్ష్యంతో కదలుతున్న అమెరికా ఇరాక్ సంక్షోభ పరిష్కారం కోసం అదే ఇరాన్‌కు స్నేహ హస్తాన్ని చాస్తున్నట్టు నటించడం. - పిళ్లా వెంకటేశ్వరరావు