
ఎఫ్‌బీలో ఐసిస్ ఆయుధాలు
లండన్: ఐసిస్ ఉగ్రవాదులు ఫేస్‌బుక్‌లో అక్రమంగా ఆయుధాల వ్యాపారం చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో గ్రూపులు ఏర్పాటు చేసుకుని మిషన్‌గన్ల నుంచి భారీ క్షిపణుల వరకు క్రయవిక్రయాలు చేపడుతున్నారు. వీటిలో ఒక్కో దాని విలువ రూ.40 లక్షల వరకు ఉందని అమెరికా మీడియా పేర్కొంది. ట్రిపోలి, బెంఘాజీ, సబ్రతా లాంటి నగరాల్లో ఎక్కువ విక్రయాలు జరుగుతున్నాయి. వీటిని 20-30 ఏళ్ల మధ్య ఉన్న యువకులు పర్యవేక్షిస్తున్నారు. ఫేస్‌బుక్ గ్రూపులో 400 నుంచి 14 వేల మధ్య సభ్యులున్నట్లు భావిస్తున్నారు.