
న్యూయార్క్: అమెరికాలో తుపాకీ సంస్కృతిపై విపరీతమైన చర్చ నడుస్తున్న వేళ సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. మైనర్ల(18 ఏళ్లలోపు వారు) ఫేస్‌బుక్ ఖాతాల్లో తుపాకుల విడిభాగాలు, అనుబంధ ఉపకరణాల ప్రకటనలు ప్రదర్శించడంపై నిషేధం విధించింది. మైనర్ల ఖాతాల్లో ఆయుధాలు, బుల్లెట్ల అమ్మకాల ప్రకటనల్ని ఫేస్‌బుక్ ఇప్పటికే నిలిపివేసింది. ఫేస్‌బుక్ తాజా నిర్ణయం ప్రకారం తుపాకీలను నడుముకు పెట్టుకునేందుకు వాడే బెల్టులు, హోల్‌స్టర్లతో పాటు ఫ్లాష్‌లైట్ల ప్రకటనల్ని నిషేధించారు. ఈ విధానం జూన్ 21 నుంచి అమల్లోకి రానుంది.