ట్రిపోలి: లిబియా రాజధాని ట్రిపోలిలో ఉన్న మిటిగ ఎయిర్‌పోర్టులో విమానాశ్రయ బలగాలైన స్పెషల్ డిటరెంట్ ఫోర్స్, స్థానిక బషిర్ అల్-బక్వర దళం మధ్య జరిగిన కాల్పుల్లో 20 మంది మృతి చెందగా మరో 63 మంది గాయపడ్డారు. దీంతో అధికారులు విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేశారు. ఘర్షణలో తమ సైనికులు నలుగురు మృతిచెందారని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని స్పెషల్ డిటరెంట్ ఫోర్స్ ప్రతినిధి అహ్మద్ బిన్ సలీమ్ చెప్పారు.
మృతి చెందినవారిలో ప్రజలు, విమానాశ్రయ సిబ్బంది కూడా ఉన్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఘర్షణ నేపథ్యంలో ఉద్యోగులందరినీ బయటకు పంపించామని, 5 విమాన సర్వీసులు రద్దు చేశామని విమానాశ్రయ సిబ్బంది వెల్లడించారు. విమానాశ్రయానికి దగ్గరలోని జైలులో ఉన్న అల్-కాయిదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను విడిపించడానికి అల్-బక్వర ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని ట్రిపోలి పాలక సంస్థ ప్రెసిడెన్సీ కౌన్సిల్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment