ఐఎస్ఐఎస్ 'టెలిగ్రామ్' కుదరిదిక!
బెర్లిన్: తమ యాప్ ద్వారా ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించకుండా అడ్డుకునేందుకు 'టెలిగ్రామ్' సంస్థ ఉపక్రమించింది. తమ యూజర్లను ఉగ్రవాదం వైపు దారి మళ్లించడానికి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు టెలిగ్రామ్ నిర్వాహకులు అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించారు. 12 భాషలకు సంబంధించిన సైట్లను ఐఎస్ఎస్ వినియోగిస్తుందని, ఉగ్రవాదులు తమ యాప్ వాడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. గత వారం రోజుల నుంచి తాము చేసిన ప్రయత్నాలు ఫలించి ఐఎస్ఐఎస్ సైట్లను బ్లాక్ చేసే కోడింగ్ విధానాన్ని కనుగొన్నామని వెల్లడించింది.
బెర్లిన్ కేంద్రంగా పనిచేస్తున్న టెలిగ్రామ్ యాప్ ద్వారా వ్యక్తిగత ఛాటింగ్ నుంచి గ్రూప్ ఛాటింగ్ వరకు 200 మంది ఒకేసారి మెసేజ్లు పంపుకోవచ్చు. అయితే ఈ యాప్ వాడి తమ యూజర్లను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వారి కార్యకలాపాల వైపు ఆకర్షించకుండా ఉండేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా కోడింగ్ విధానాన్ని అనుసరించినట్లు టెలిగ్రాఫ్ తెలిపింది. టెలిగ్రామ్ యూజర్ల సమాచారాన్ని ఐఎస్ఎస్ ఉగ్రవాదులు రిట్రీవ్ చేయకుండా వారి డేటాని ఎన్క్రిప్ట్ చేసే యోచనలో యాప్ రూపకర్తలు ఉన్నారు. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిచండటంతో పాటు తమ చర్యలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న యాప్ నిర్వాహకులపై దాడులు చేయాలన్న యోచనలో ఉన్నట్లు ఐఎస్ఐఎస్ హెచ్చరిక సంకేతాలు పంపించింది.
This week we blocked 78 ISIS-related channels across 12 languages. More info on our official channel: https://t.co/69Yhn2MCrK
— Telegram Messenger (@telegram) November 18, 2015