హైదరాబాద్: పోలీస్ ఉన్నతాధికారులతో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ భేటీ ముగిసింది. పోలీసు ఉన్నతాధికారులతో ఆదివారం దత్తాత్రేయ సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్ శాంతి భద్రతలపై పోలీసు అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు.
సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐసిస్‌ను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దత్తాత్రేయ వెల్లడించారు. ఈ సమావేశానికి అడిషనల్ డీజీపీ అంజనీకుమార్, సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్ కమిషనర్లు.. మహేశ్ భగవత్, నవీనచంద్, హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది తదితరులు హాజరయ్యారు.
పోలీసు అధికారులతో ముగిసిన దత్తాత్రేయ భేటీ
Published Sun, Jul 3 2016 7:26 PM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement
Advertisement