తిరువనంతపురం: శ్రీలంక నుంచి లక్షద్వీప్ దీవులకు వస్తున్న ఓ బోట్‌లో పదిహేను మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారం కలకలం రేపింది. దీంతో కేరళ, లక్షద్వీప్ తీర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నేవీ, కోస్ట్ గార్డ్, కోస్టల్ పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. నిఘా వర్గాల సమాచారంతో తీర ప్రాంతాల్లో నౌకలను, విమానాలను సిద్ధం చేసినట్లు నేవీ అధికారి ఒకరు తెలిపారు. శ్రీలంకలో వరుస బాంబు దాడుల తర్వాత హెచ్చరికలు రావడం, కేరళలో ఐఎస్ ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేశారనే సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేరళకు చెందిన కొంతమంది ఐసిస్‌తో కలిసి పనిచేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. శ్రీలంకలో ఏప్రిల్ 21న జరిగిన బాంబు దాడుల్లో 250 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘాతుకానికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment