
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. ఢిల్లీ స్పెషల్ పోలీసులు ముగ్గురు ఉగ్రవాదులను గురువారం అరెస్ట్ చేశారు. ఐసిస్ సానుభూతిపరులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో కలకలం రేగింది. ఢిల్లీలోని వజీరాబాద్ ప్రాంతంలో గురువారం ఉదయం జరిగిన ఓ ఎన్‌కౌంటర్ తర్వాత ఐఎస్ఐఎస్‌తో సంబంధాలున్న ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడినట్టు ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. కాగా బుధవారం రాత్రి తమిళనాడు పోలీసులు జిహాదీ ఉగ్రవాద ముఠాను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే నేపాల్ నుంచి కొందరు అనుమానితులు అక్రమంగా దేశంలోకి ప్రవేశించినట్లు ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం. దీంతో సరిహద్దుల్లో రక్షణ సిబ్బంది అప్రమత్తమైంది.
Comments
Please login to add a commentAdd a comment