ఢిల్లీ: ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ ప్రాంతంలో ఉన్న బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన ఈ ఏడాది జూన్‌లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భావు గర్ల్ ఫ్రెండ్ అన్ను ధంకర్(19)ను ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసే సమయంలో నేపాల్ పారిపోవడానికి ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హిమాన్షు భావు ఆదేశాల మేరకు ఆమె దుబాయ్ మీదుగా అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. హిమాన్షు భావు గ్యాంగ్‌లోని సభ్యులు అన్ను ధంకర్ ‘‘లేడీ డాన్’’గా పిలుస్తారని పేర్కొన్నారు.హిమాన్షు భావు ఆదేశాల మేరకు ఆమె అమెరికా పరారు కాలన
ఇక.. జూన్ 18న పశ్చిమ ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్‌లోని బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌లో అమన్ జూన్ (26) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ హత్య తామే చేశామని గ్యాంగ్‌స్ట్‌ర్ హిమాన్షు భావు ప్రకటించించారు. శక్తి దాదా హత్యకు ప్రతీకారంగా అమన్ జాన్‌ను హత్య చేసినట్లు తెలిపాడు. అతని స్నేహితులు.. ఆశిష్, వికాస్, బిజేందర్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ హత్యలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. అందులో ఇద్దరు షూటర్లు ఉన్నట్లు గుర్తించారు. అమన్ హత్య అనంతరం కత్రా రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలో ధంకర్ చివరిసారిగా కనిపించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితురాలు అన్ను నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను ఉపయోగించి అమన్‌తో స్నేహం చేసింది. జూన్ 18న అతడిని బర్గర్ కింగ్ అవుట్‌లెట్‌కు పిలింపించింది. ఆమె కోసం అమన్ వేచిచూస్తుండగా.. ఆశిష్ , వికాస్ లోపలికి వెళ్లి అమన్‌పై 39 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. బిజేందర్ అనే మరో వ్యక్తి బైక్‌పై వచ్చి బయట వేచి ఉన్నాడు. కాల్పుల అనంతరం ముగ్గురు పరారయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment