
వారి కంటే పది రెట్లు క్రూరంగా వ్యవహరించగలను
మనీలా: ఫిలిప్పీన్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికను జారీ చేశారు. తాను తలుచుకుంటే ఉగ్రవాదుల కంటే పది రెట్లు కిరాతకంగా వ్యవహరించగలనని అన్నారు. ఉగ్రవాదులకు ఒక సిద్ధాంతం లేదని వారికి మతమంటే ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. ప్రజలను వికలాంగులుగా చేస్తూ, మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. అత్యంత కిరాతకంగా ప్రజల తలలను నరికేస్తున్నారని మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేశారు.