Philippines President
-
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఫిలిప్పీన్స్ 17వ అధ్యక్షుడిగా జూన్‌లో బాధ్యతలు చేపట్టిన మార్కోస్ జూనియర్‌కు మోదీ అభినందనలు తెలిపారు. రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలపై ఇద్దరు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఫిలిప్పీన్స్ పాత్ర కీలకమైందిగా భారత్ భావిస్తోందన్నారు. ఫిలిప్పీన్స్ అభివృద్ధికి భారత్ సంపూర్ణంగా సహకరిస్తుందని ప్రధాని తెలిపారు. రొడ్రిగో డ్యుటెర్టే స్థానంలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా మార్కోస్ జూనియర్ జూన్ 30వ తేదీన బాధ్యతలు చేపట్టారు. -
చరిత్ర వింతల్లో ఇదొకటి!
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా ‘బాంగ్‌బాంగ్’ మార్కోస్ ఎన్నికవడం మామూలుగానైతే పెద్ద విశేషం కాదు. కానీ ఆయన ఆ దేశపు నియంత, అత్యంత క్రూరమైన పాలకుడిగా పేరుమోసిన ఫెర్డినాండ్ మార్కోస్ కుమారుడు కావడం వల్ల అది పెద్ద విశేషం అయికూర్చుంది. మూడున్నర దశాబ్దాల క్రితం ఫిలిప్పీన్స్ ప్రజలను ఎన్నో రకాలుగా హింసించి, వేలాది మందిని జైళ్లలో పెట్టి, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఫెర్డినాండ్ మార్కోస్ చివరకు ఎంతో సంపదతో దేశం వదిలి పారిపోయారు. సహజంగానే మార్కోస్ కుటుంబం పట్ల ఫిలిప్పీన్స్ ప్రజల్లో ద్వేషం, అనంగీకారం ఉంటుంది. కానీ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయన కుమారుడు అధ్యక్షుడిగా గెలవడం అనేది దిగ్భ్రమ కలిగించే వాస్తవం. ఏడాది క్రితం వరకూ మార్కోస్ పునఃపాలన ఊహించలేనిదీ, బహుశా ఊహకే అందనిదీ! అయితే ‘బాంగ్‌బాంగ్’ అనే ముద్దుపేరుతో ప్రసిద్ధులైన జూనియర్ మార్కోస్ దాదాపుగా అసాధ్యం అనుకున్న దానిని కళ్లెదుట సాక్షాత్కరింపజేశారు. ఆయన రాజకీయంగా ప్రజలకు ప్రియమైనవాడు కావడం అనేది ఒక ప్రత్యేకమైన అధ్యయనాంశం. ముప్పై ఆరేళ్లన్నది సుదీర్ఘమైన కాలం అని నాకు తెలుసు. ఫిలిప్పీన్స్ ప్రస్తుత జనాభాలో 70 శాతం మంది ప్రజలు 1986లో పుట్టే ఉండరు. ఆ ఏడాదికి ముందరి వరకు ఫిలిప్పీన్స్‌కి రెండు దశాబ్దాల పాటు అధ్యక్షుడిగా ఉన్న ఫెర్డినాండ్ మార్కోస్ అవినీతికీ, దోపిడీకీ, క్రూర త్వానికీ పేరు మోసిన పాలక నియంత. తన హయాంలోని ఇరవై ఏళ్లలో 14 ఏళ్లు సైనిక పాలనతోనే దేశాన్ని దడ పుట్టించేలా నడిపించాడు. ఇంత సుదీర్ఘకాలం తర్వాతే అయినప్పటికీ మళ్లీ ఇప్పుడు ఆ తండ్రి కుమారుడే భారీ మెజారిటీతో ఫిలిప్పీన్స్ ఎన్నికల్లో విజయం సాధించి, ఆ ద్వీప సమూహానికి కొత్త అధ్యక్షుడవడం చూసి నేను ఒక గొప్ప దిగ్భ్రమతో నిర్ఘాంతపోతున్నాను. చరిత్ర వింతల్లో ఇదొకటి అనుకోవాలి. ఏడాది క్రితం వరకూ మార్కోస్ పునఃపాలన ఊహించ లేనిదీ, బహుశా ఊహకే అందనిదీ. అయితే ‘బాంగ్‌బాంగ్’ అనే ముద్దు పేరుతో ప్రసిద్ధులైన జూనియర్ మార్కోస్ దాదాపుగా అసాధ్యం అనుకున్న దానిని కళ్లెదుట సాక్షాత్కరింపజేశారు. మొదట నేను 1986కి తిరిగి వెళ్లి, అక్కడి నుంచి ముందు కొస్తాను. నాలుగోసారి పదవిలో కొనసాగేందుకు మార్కోస్, అతడి ప్రత్యర్థిగా బరిలోకి దిగిన కొరజాన్ అక్వినో ఒకరితో ఒకరు తలపడుతున్న అధ్యక్ష ఎన్నికల సమయం అది. కొరజాన్ ప్రియనామం ‘కోరీ’. అప్పటికి మూడేళ్ల క్రితం కోరీ భర్త బెనిగ్నో... మార్కోస్‌ను ఎదుర్కొనేందుకు ప్రవాసం నుంచి ఫిలిప్పీన్స్‌లో దిగీ దిగగానే మనీలా విమానాశ్రయంలో రన్‌వే మీదే హత్యకు గురయ్యారు. భర్త వదిలిపెట్టి వెళ్లిన సవాలును కోరీ స్వీకరించి ఎన్నికల్లో నిలబడ్డారు. కోరీకి ప్రజాదరణ ఉన్నప్పటికీ భారీగా రిగ్గింగ్ జరిగి, మార్కోస్‌కు అనుకూలంగా మోసపూరితమైన ఫలితాలు వచ్చాయి. కొన్ని గంటల్లోనే ఫిలిప్పీన్స్ బద్దలైంది. మార్కోస్‌కు వ్యతిరేకంగా లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారు. ‘కార్డినల్ సిన్’గా ప్రసిద్ధులైన జైమ్ సిన్ ఆ ప్రజా నిరసనలకు నాయకత్వం వహించారు. మార్కోస్ రక్షణ మంత్రి, సైన్యాధినేత కూడా మార్కోస్ని విడిచి పెట్టారు. నాటి ప్రజా విప్లవం ‘పీపుల్స్ పవర్’గా గుర్తింపు పొందింది. ఉరుములా ఉరిమి, పిడుగులా దేశాన్ని దద్దరిల్లించిన తిరుగుబాటు అది. ఫిలిప్పీన్స్‌లో ఏం జరగబోతున్నదోనని ప్రపంచం మూడు రోజుల పాటు ఊపిరి తీసుకోవడం కూడా మాని ఆతురుతతో ఎదురు చూస్తూ ఉండిపోయింది. ఫిబ్రవరి 26న మార్కోస్ దేశం విడిచి, హవాయి పారిపోయి అక్కడ తల దాచుకున్నారు. ఆ కుటుంబం హవాయికి ఏమేం తీసుకెళ్లిందో, ఫిలిప్పీన్స్‌లో ఏమేం వదిలి వెళ్లిందో చూడండి. 22 చెక్క పెట్టెలు, 12 సూట్‌కేసులు, లెక్కలేనన్ని భోషాణాలతో వారు హవాయి వెళ్లినట్లు 23 పేజీల యు.ఎస్. కస్టమ్స్ రికార్డుల్లో నమోదై ఉంది. దుస్తులతో నిండిన 67 అరలు, 413 రకాల బంగారు ఆభరణాలు, అమూల్యమైన రాళ్లను పొదిగిన 70 జతల చెవి దద్దులు ఆ పెట్టెల్లో ఉన్నాయి. ఇంకా.. ‘మా 24వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా నా భర్తకు..’ అని రాసి ఉన్న 24 బంగారు ఇటుకలు, 717 మిలియన్ డాలర్ల నగదు, ప్యాంపర్స్ డైపర్ ప్యాకెట్లలో దాచిన 4 మిలియన్ల డాలర్ల విలువైన రత్నాలు, 65 సీకో, కార్టియర్ వాచీలు; యు.ఎస్., స్విట్జర్లాండ్, కేమాన్ దీవులలోని బ్యాంకు ఖాతాలలో జమ చేసిన 124 మిలియన్ డాలర్ల నగదు తాలూకు రసీదులు ఉన్నాయి. ఇక వదిలేసి వెళ్లినవి... భార్య ఇమెల్డా మార్కోస్‌కు చెందిన 3,000 జతల బూట్లు, మింక్ జంతువు చర్మంతో అల్లిన 15 ఖరీదైన కోట్లు, అత్యాధునికమైన 508 గౌన్లు.. ఒక్కసారైనా తీసి వాడని ఇవన్నీ కూడా మలాకాన్యాంగ్ ప్యాలెస్‌లో ‘బెర్గ్‌డోర్ఫ్ గుడ్‌మ్యాన్’ డిపార్ట్మెంట్ స్టోర్ లేబుళ్లతో సహా ఉండిపోయాయి. 1965 నుండి 1986 వరకు మార్కోస్ అధ్యక్షుడిగా ఉన్న 20 ఏళ్ల కాలంలో 70,000 మంది జైలు పాలయ్యారనీ, 34,000 మంది చిత్రహింసలకు గురయ్యారనీ, 3,240 మంది హతులయ్యారనీ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఫిలిప్పీన్స్‌లోని పరిశోధనాత్మక వార్తాపత్రిక ‘బులాత్లాట్’ వార్తాపత్రిక 1,20,000 మందిని నిర్బం ధించారని పేర్కొంది. మార్కోస్ 1989లో మరణించారు. ఇమెల్డా (92) ప్రస్తుతం జీవించి ఉన్నారు. మొత్తం 10 బిలియన్ డాలర్ల అక్రమ సంపాదనకు సంబంధించిన పలు నేరారోపణలు ఆమెపై ఉన్నాయని బి.బి.సి. నివేదించింది. మార్కోస్ వెనుక ఇంత చరిత్ర ఉన్నప్పుడు 1980లు, 90ల కాలంలో ఆయనపై, ఆయన కుటుంబంపై ఫిలిప్పీన్స్ ప్రజల్లో ద్వేషం, అనంగీకారం ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? అయితే ఈ రోజున ఆయన పేరున్న ఆయన తనయుడు రాజకీయంగా ప్రజలకు ప్రియమైనవాడు అయ్యారు. అదెలా జరిగింది? చాలామంది అడిగే ప్రశ్న, చాలాకాలంగా చర్చనీయాంశమైన ప్రశ్న. ఇందుకు నేను... తొందరపాటు, సంకోచం, అసంపూర్ణతలతో కూడిన మూడు సమాధానాలను సూచిస్తాను. మొదటిది – మార్కోస్ దశాబ్దాల నిరంకుశత్వ పాలనలో సైతం ఆయనకు వెన్నుగా ఉన్న ఇలోకోస్ నార్టే ప్రావిన్సు నేటికీ ఆ కుటుంబానికి పెట్టని కోటలా ఉంది. కాబట్టి ఆయన తనయుడు బాంగ్‌బాంగ్ మార్కోస్‌కు కూడా ఆ ప్రావిన్స్ ఎల్లప్పుడూ ఒక స్థావరంలా ఉంటుంది. అక్కడి నుంచి పని మొదలుపెట్టడం ఆయనకు సులభమైంది. రెండవది.. సోషల్ మీడియా, పూర్తి తప్పుడు సమాచారం గతాన్ని అక్షరాలా రూపు మాపేశాయి. ‘స్టాటిస్టా’ సర్వే ప్రకారం రోజూ కేవలం రెండు గంటలు మాత్రమే సోషల్ నెట్‌వర్క్‌లో ఉంటున్న బ్రిటన్ ప్రజానీకంతో పోలిస్తే ఫిలిప్పీన్ ప్రజలు అంతకు రెండింతలుగా నాలుగు గంటల పాటు సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. తత్ఫలితంగా మార్కోస్ నిరంకుశత్వం, దౌర్జన్యం, అవినీతి – అన్నీ నకిలీ కథనాలుగా పరి గణన పొందడానికి వీలైంది. అంతేనా, ఆయన నియంతృత్వానికి ‘స్వర్ణయుగం’ అనే పేరు కూడా సోషల్ మీడియాలో వచ్చేసింది. ఈ పునర్లిఖిత చరిత్రలో మార్కోస్ క్రూరపాలన వర్ణమయమైన ఆకర్షణగా కూడా మారింది. మూడవది – బాంగ్బాంగ్తో ఈ ఎన్నికల్లో కలిసి ఉపాధ్య క్షురాలిగా పోటీచేసిన అభ్యర్థి.. గద్దె దిగి వెళుతున్న అధ్యక్షుడు డ్యూటర్టే కుమార్తె సారా డ్యూటెర్టే కార్పియో. ఆమె వెనుక ఆమె తండ్రి ప్రజాదరణ ఉంది. అంటే పారంపర్యం పనిచేస్తోందని! ఇండియాతో ఫిలిప్పీన్స్‌కి ఏమైనా కాస్త పోలికను వెదకితే అది.. 1977–1979 మధ్యకాలంలో ఇందిరాగాంధీ ఉత్థాన పతనాల దశ కావచ్చు. బ్రిటన్ లోనూ ఇలాంటిదే జరిగింది. అయితే ఇందుకు విరుద్ధంగా జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గెలిచిన తర్వాత జరిగిన ఎన్నికల్లో చర్చిల్ ఓడిపోయారు. కానీ మార్కోస్ వీరోచిత, విస్మయగాథ ప్రత్యేకమైనది. దీన్నుంచి మనం గ్రహించగలిగింది ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేయడానికి వీల్లేదని! చెప్పలేం.. మరొక గాంధీ ప్రధాని అవొచ్చు. శ్రీలంకలో రాజపక్సేలు ఎప్పటికైనా మళ్లీ పుంజుకోవచ్చు! వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
'వాళ్ల లివర్ ఉప్పులో నంజుకుని తినేస్తా'
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టి మరోసారి సంచలన ప్రకటన చేశారు. ముస్లిం ఉగ్రవాదుల కంటే తాను 50 రెట్లు ఎక్కువ క్రూరుడినని, వాళ్లు తలలు మాత్రమే నరికితే తాను ఉగ్రవాదులు సజీవంగా దొరికితే వాళ్లను తినేస్తానని చెప్పారు. డ్రగ్స్ వ్యాపారం చేసేవాళ్లకు ఫిలిప్పీన్స్‌లో చోటు లేదని, అలాంటివాళ్లను చంపేసినా ప్రజలకు శిక్ష ఉండదని గతంలో ప్రకటించిన డుటెర్టి.. ఇప్పుడు మరింత దారుణంగా చెప్పారు. జాతీయ క్రీడా టోర్నమెంటు ప్రారంభోత్సవంలో ఆయనీ మాటలు చెప్పారు. ఉగ్రవాదులు ప్రజలను భయకంపితులు చేయడానికి తలలు నరికేస్తున్నారని, వాళ్లు జంతువుల లాంటివాళ్లు కాబట్టి సజీవంగా పట్టుకోవాల్సిన అవసరం లేదని, కాల్చిపారేయాలని తన సైనికులను ఆయన ఆదేశించారు. తాను కూడా జంతువులాగే మారాలనుకుంటే మారతానని, తనకు మూడ్ బాగోనప్పుడు ఎవరైనా ఉగ్రవాదులను సజీవంగా తనకు అప్పగిస్తే.. కాస్త ఉప్పు, వెనిగర్ ఇస్తే.. అందులో నంజుకుని వాళ్ల లివర్‌ను తినేస్తానని చెప్పారు. అధ్యక్షుడి మాటలు విని అక్కడున్నవాళ్లంతా పెద్దపెట్టున నవ్వారు. అయితే.. అది నిజమేనని, తనకు కోపం వస్తే అలాగే చేస్తానని డుటెర్టి అన్నారు. నేరాలు అరికట్టడంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని పేరున్న డుటెర్టి చాలాకాలం మనిలా నగర మేయర్‌గా ఉన్నారు. గత సంవత్సరం మే నెలలో జరిగిన ఎన్నికల్లో ఆయన అధ్యక్షుడిగా గెలిచారు. అక్రమ డ్రగ్స్ వ్యాపారం, అవినీతి, ఉగ్రవాదాలపై తాను పోరాడతానని, వాటిని ఉక్కు పాదాలతో అణిచేస్తానని చెప్పడంతో ప్రజలు ఆయనను గెలిపించారు. ఉగ్రవాదం చేతులు దాటితే ముస్లిం వేర్పాటువాద ఉద్యమం తీవ్రంగా ఉన్న దక్షిణ ఫిలిప్పీన్స్‌లో సైనిక పాపలన విధిస్తానని కూడా డుటెర్టి హెచ్చరించారు. బొహోల్ రాష్ట్రంపై దాడికి విఫలయత్నం చేసిన అబు సయ్యఫ్, ఇతర ఉగ్రవాదుల గురించి సమాచారం అందించిన వారికి పెద్ద ఎత్తున బహుమతి ఇస్తానని ఇటీవలే ప్రకటించారు. -
అవినీతికి పాల్పడితే విమానం నుంచి తోసేస్తా
-
అవినీతికి పాల్పడితే విమానం నుంచి తోసేస్తా
మనీలా: అవినీతి, మాదక ద్రవ్యాలపై యుద్ధాన్ని ప్రకటించిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డూటర్టీ మరో సంచలన ప్రకటన చేశారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిని మనీలా నుంచి విమానంలో ఆకాశంలోకి తీసుకెళ్లి దాని నుంచి కిందకుతోసి చంపేస్తానని హెచ్చరించారు. గతంలో తాను ఓసారి అలా చేశానని కూడా చెప్పారు. ఒకసారి అలా చేసిన వాడికి రెండోసారి అలా చేయడం పెద్ద కష్టమేమి కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల దేశాన్ని కుదిపేసిన తుపాను బాధితులకు ఆర్థిక సహాయం అందించేందుకు మంగళవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో డూటర్టీ మాట్లాడుతూ ఈ హెచ్చరిక చేసినట్లు దేశాధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన వీడియో క్లిప్పింగ్ వెల్లడిస్తోంది. అయితే ఆ తర్వాత ఏబీఎస్–సీబీఎన్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తాను చేసిన ఈ హెచ్చరికను ఖండించారు. ‘నేను అలా అన్నానా? నేను విమానం నుంచి ఒకరిని తోసి చంపేయగలనా’ అంటూ త్రోసి పుచ్చారు. ఆయన చేసిన హెచ్చరికలో ఉద్దేశాన్ని తీసుకోవాలేగానీ, యథాతథంగా వ్యాఖ్యల సారాంశాన్ని కాదని కూడా ఆయన కార్యాలయం సమర్థించింది. గత మే నెలలో దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి డూటర్టీ ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత వాటిని ఆయనే ఖండించడం ఆయనకు మామూలు విషయం అయిపోయింది. ఓసారి మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి మాట్లాడుతూ తాను దవావో మేయర్‌గా ఉన్నప్పుడు అమ్మాయిని కిడ్నాప్‌చేసి హత్య చేశారన్న అనుమానంతో ముగ్గురు వ్యక్తులను కాల్చి చంపానని చెప్పారు. ఆ తర్వాత మానవ హక్కుల సంఘాల నుంచి విమర్శలు రావడంతో తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. డ్రగ్ మాఫియాకు చెందిన సభ్యులు కనిపిస్తే కాల్చివేయమని ప్రజలకు డూటర్టీ నేరుగా పిలుపునిచ్చిన నాటి నుంచి నేటి వరకు దేశంలో చట్ట విరుద్ధంగా డ్రగ్ మాఫియా పేరిట ఆరువేల మంది హత్యలకు గురయ్యారు. వారిలో కొంత మందిని పోలీసులు కాల్చి చంపగా, మిగతా వారిని ప్రజలే కాల్చి చంపారు. -
‘ట్రంప్ వచ్చాడు... ఇక అమెరికాతో గొడవ పడం’
మనీలా: అమెరికాతో కయ్యాలు మానుకుంటామని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొట్రిగో డుటెర్టె ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఇటీవల కాలంలో అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా డుటెర్టె తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. అమెరికా తన గౌరవాన్ని కోల్పోయిందని, బరాక్ ఒబామా నరకానికిపోతాడని గతంలో దుయ్యబట్టారు. కౌలాలంపూర్ లో ఫిలిప్పీన్స్ వాసులను ఉద్దేశించి డుటెర్టె బుధవారం ప్రసంగించారు. ‘అమెరికాతో ఇక గొడవ పడాలనుకోవడం లేదు. ఎందుకంటే అక్కడ ట్రంప్ ఉన్నార’ని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్ కు ఆయన అభినందనలు తెలిపారు. తమ ఇద్దరికీ చాలా విషయాల్లో సామీప్యం ఉందని, ట్రంప్ చిరకాలం వర్ధిల్లాలని అన్నారు. విమర్శలు చేయడంలో తామిద్దరి తర్వాతే ఎవరైనా అని చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొదటి నుంచి ట్రంప్ ను డుటెర్టె సమర్థిస్తూ వచ్చారు. ట్రంప్ ను ముద్దుగా ‘ట్రంప్ ఆఫ్ ది ఈస్ట్’ సంబోధించారు. -
ఫిలిప్పీన్స్‌ను హడలెత్తిస్తున్న రోడ్రిగో
-
వారి కంటే పది రెట్లు క్రూరంగా వ్యవహరించగలను
మనీలా: ఫిలిప్పీన్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికను జారీ చేశారు. తాను తలుచుకుంటే ఉగ్రవాదుల కంటే పది రెట్లు కిరాతకంగా వ్యవహరించగలనని అన్నారు. ఉగ్రవాదులకు ఒక సిద్ధాంతం లేదని వారికి మతమంటే ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. ప్రజలను వికలాంగులుగా చేస్తూ, మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. అత్యంత కిరాతకంగా ప్రజల తలలను నరికేస్తున్నారని మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేశారు. -
జనరంజక ‘నియంత’!
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు దుతర్తే రూటే సెపరేటు - డ్రగ్ డీలర్లు కనిపిస్తే కాల్చేయండి - అధ్యక్ష హోదాలో దేశ ప్రజలకు పిలుపు దవావో(ఫిలిప్పీన్స్) నుంచి సాక్షి ప్రతినిధి ‘‘డ్రగ్ డీలర్లనే కాదు, వాటికి బానిసలైన వారిని కూడా కనిపిస్తే కాల్చేయండి. మీపై ఏ కేసూ లేకుండా చూసుకుంటా. ప్రక్షాళనకు ఏకైక మార్గం మారణకాండే. ఓ లక్షమందినైనా చంపించేస్తా. వారి శవాల్ని చేపలకు ఆహారంగా మనీలా అఖాతంలో పాతరేయిస్తా. మంచి లాభాలు కళ్లజూడాలనుకునేవారు శ్మశానవాటికల వ్యాపారం పెట్టుకోండి. బ్రహ్మాండంగా సాగుతుంది. నాదీ హామీ!’’ ఒక దేశాధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయగలరంటే నమ్మగలమా? కానీ ఫిలిప్పీన్స్ కొత్త అధ్యక్షుడు రోడ్రిగో దుతర్తే ఇలాంటి విస్ఫోటక వ్యాఖ్యలకు పెట్టింది పేరు! డ్రగ్ మాఫియాను తిట్టిపోసినంత అలవోకగా కేథలిక్ మత పెద్దలు మొదలుకుని సాక్షాత్తూ ఐక్యరాజ్య సమితిపైనా బూతు పదజాలంతో విరుచుకుపడటం దుతర్తేకు వెన్నతో పెట్టిన విద్య. గురువారం దేశాధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన, ఆ సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఇలాంటి వ్యాఖ్యతో చెలరేగారు. ‘పోలీసులతో పాటు అన్ని శాఖల్లోనూ అవినీతి పెచ్చరిల్లింది. దీన్ని ఇకపై సహించను. ఎవరైనా సరే, తాట తీస్తా’ అని హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యల వల్లే ఫిలిప్పైన్వాసులు మాత్రం దుతర్తే అంటే పడిచస్తుంటారు. మే 9నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా 60 లక్షల పై చిలుకు భారీ మెజారిటీతో ఆయనను తమ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. దుతర్తే సొంత పట్టణం దవావోలోని జనం బట్టల దగ్గరి నుంచి నడిపే వాహనాల దాకా అన్నింటిపైనా దుతర్తే ఫొటోలే! 71 ఏళ్ల దుతర్తే, ఫిలిప్పీన్స్ అధ్యక్షులుగా ఎన్నికైన వారిలో అత్యంత పెద్ద వయస్కుడు. కానీ రూపంలో గానీ, మాటల్లో గానీ, చివరికి చేతల్లో గానీ ఆ వయోభారం మచ్చుకైనా కనిపించదు! దవావో మేయర్‌గా రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన దుతర్తే... ఒకప్పుడు హత్యలకు, డ్రగ్స్ మాఫియాకు మారుపేరుగా ఉన్న నగరాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళించి ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత సురక్షిత నగరాల్లో టాప్ టెన్‌లో చేర్చారు. అయితే, అందుకోసం హంతక ముఠాలను నడిపారని, వందలాదిగా డ్రగ్ డీలర్లను చంపించారని అభియోగాలను ఎదుర్కొన్నారు! స్వయానా లా గ్రాడ్యుయేట్ అయ్యుండి కూడా ఇలా చట్టాలను అతిక్రమించడాన్ని, ప్రజలను కూడా అందుకు ప్రోత్సహించడాన్ని దుతర్తే స్టైల్ అని సరిపెట్టుకోవాల్సిందే.