విధ్వంసం కుట్ర బట్టబయలు
ఇద్దరు అనుమానిత ఐసిస్ ఉగ్రవాదుల అరెస్టు
రాజ్‌కోట్/అహ్మదాబాద్: భారత్‌లో విధ్వం సానికి ప్రణాళికలు రూపొందిస్తున్న ఇద్దరు అనుమానిత ఐసిస్ ఉగ్రవాదులను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ఏ సంస్థ సహాయం లేకుండా ఒంటరిగానే విధ్వంసం సృష్టించేందుకు వీరు సిద్ధమైనట్లు పోలీసు లు తెలిపారు. గుజరాత్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాలనుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌కోట్‌కు చెందిన వసీం రమోడియా (ఎంసీఏ విద్యార్థి), నయీమ్ (బీసీఏ)లు ఐసిస్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. ఈ ఇద్దరి నుంచి బాంబు తయారీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆధ్యాత్మిక ప్రాంతాలైన చోతిలా (దేవీ మందిరం)తోపాటు పలుచోట్ల దాడులకు వీరిద్దరూ ప్రణాళికలు రూపొందించారని.. పక్కా సమాచారంతోనే వీరిపై నిఘాపెట్టి అదుపులోకి తీసుకున్నట్లు గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) ఐజీ జేకే భట్ వెల్ల డించారు. రాజ్‌కోట్ నుంచి రమోడియాను, నయీమ్‌ను భావ్‌నగర్‌లో అరెస్టు చేశారు.
ఉగ్రఘటనతో దేశమంతా కలకలం సృష్టించేందుకు విధ్వం సం వీడియోను రికార్డు చేసి దీన్ని సోషల్ మీడియాలో పెట్టాలని ప్లాన్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని భట్ తెలిపారు. బాంబులు పేల్చడంతోపాటు వాహనాలకు నిప్పుపెట్టడం ద్వారా భయాందోళనలు సృష్టించాలనేదీ వీరి ప్లాన్ లో భాగమన్నారు. రెండేళ్ల క్రితం జిహాదీ భావజాలంవైపు ఆకర్షితులైన వీరిద్దరూ.. ఆన్ లైన్ రా ఐసిస్‌తో సంబంధాలు నెరపుతున్నారు.
అఫ్గాన్ లో కేరళ ఉగ్రవాది హతం: కేరళలోని పాలక్కడ్‌జిల్లాలో అదృశ్యమై ఐసిస్‌లో చేరి నట్లుగా అనుమానిస్తున్న 21 మందిలో ఒకరైన హఫీజ్ (26) హతమైనట్లు తెలిసింది. అఫ్గాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదులపై జరిపిన డ్రోన్ దాడుల్లో హఫీజ్ మృతిచెందాడు.