Hafiz
-
చెప్పులు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, చెన్నై : ఖరీదైన పది జతల చెప్పులు పోయాయంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన ఘటన తమిళనాడులోని చెన్నైలో గతవారం చోటుచేసుకుంది. పాదరక్షల మాయంపై ఫిర్యాదుపై పోలీసులు విస్తుపోయినప్పటికీ, చివరికి కేసు నమోదు చేసి చెప్పుల దొంగ కోసం దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే... కీల్పాకం సెక్రటేరియేట్ కాలనీ దివాన్ బహుదూర్ షణ్ముగం రోడ్డుకు చెందిన అబ్దుల్ రఫిక్(46) నుంగంబాక్కంలోని ఓ ప్రైవేటు బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. తన ఇంటి ముందు ఉన్న ర్యాక్‌లో ఉంచిన రూ. 80 వేలు విలువైన 12 జతల షూలు, ఏడు జతల పాదరక్షలు మాయమైనట్టుగా సెక్రటేరియేట్ కాలనీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బ్రాండెడ్ పాదరక్షలను అపహరించుకు వెళ్లారని ఆయన ఇచ్చిన ఫిర్యాదును చూసి పోలీసులు విస్తుపోయారు. కాగా చెప్పులు మాయంపై అబ్దుల్ రఫిక్ ....పొరుగున ఉండే బ్యాచ్‌లర్స్‌తో పాటు తన ఇంట్లో పని చేసే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల చివరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరిన్ని ఆధారాల కోసం సీసీ కెమెరా ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా రఫిక్ పొరుగున ఉండే వాళ్లను కూడా ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. -
విధ్వంసం కుట్ర బట్టబయలు
ఇద్దరు అనుమానిత ఐసిస్ ఉగ్రవాదుల అరెస్టు రాజ్‌కోట్/అహ్మదాబాద్: భారత్‌లో విధ్వం సానికి ప్రణాళికలు రూపొందిస్తున్న ఇద్దరు అనుమానిత ఐసిస్ ఉగ్రవాదులను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ఏ సంస్థ సహాయం లేకుండా ఒంటరిగానే విధ్వంసం సృష్టించేందుకు వీరు సిద్ధమైనట్లు పోలీసు లు తెలిపారు. గుజరాత్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాలనుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌కోట్‌కు చెందిన వసీం రమోడియా (ఎంసీఏ విద్యార్థి), నయీమ్ (బీసీఏ)లు ఐసిస్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. ఈ ఇద్దరి నుంచి బాంబు తయారీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆధ్యాత్మిక ప్రాంతాలైన చోతిలా (దేవీ మందిరం)తోపాటు పలుచోట్ల దాడులకు వీరిద్దరూ ప్రణాళికలు రూపొందించారని.. పక్కా సమాచారంతోనే వీరిపై నిఘాపెట్టి అదుపులోకి తీసుకున్నట్లు గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) ఐజీ జేకే భట్ వెల్ల డించారు. రాజ్‌కోట్ నుంచి రమోడియాను, నయీమ్‌ను భావ్‌నగర్‌లో అరెస్టు చేశారు. ఉగ్రఘటనతో దేశమంతా కలకలం సృష్టించేందుకు విధ్వం సం వీడియోను రికార్డు చేసి దీన్ని సోషల్ మీడియాలో పెట్టాలని ప్లాన్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని భట్ తెలిపారు. బాంబులు పేల్చడంతోపాటు వాహనాలకు నిప్పుపెట్టడం ద్వారా భయాందోళనలు సృష్టించాలనేదీ వీరి ప్లాన్ లో భాగమన్నారు. రెండేళ్ల క్రితం జిహాదీ భావజాలంవైపు ఆకర్షితులైన వీరిద్దరూ.. ఆన్ లైన్ రా ఐసిస్‌తో సంబంధాలు నెరపుతున్నారు. అఫ్గాన్ లో కేరళ ఉగ్రవాది హతం: కేరళలోని పాలక్కడ్‌జిల్లాలో అదృశ్యమై ఐసిస్‌లో చేరి నట్లుగా అనుమానిస్తున్న 21 మందిలో ఒకరైన హఫీజ్ (26) హతమైనట్లు తెలిసింది. అఫ్గాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదులపై జరిపిన డ్రోన్ దాడుల్లో హఫీజ్ మృతిచెందాడు. -
పాక్ క్రికెట్లో పంచాయతీ
► ఆమిర్ రాకపై సీనియర్ల ఆగ్రహం ► క్యాంప్‌ను బహిష్కరించిన హఫీజ్, అజహర్ లాహోర్: పేస్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ పునరాగమనం పాకిస్తాన్ క్రికెట్లో చిచ్చు పెట్టింది. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఐదేళ్ల నిషేధం పూర్తి చేసుకున్న అనంతరం ఆమిర్ ఇటీవలే మళ్లీ పోటీ క్రికెట్ బరిలోకి దిగాడు. అయితే అతని రాకపై ఆల్‌రౌండర్ మొహమ్మద్ హఫీజ్, వన్డే జట్టు కెప్టెన్ అజహర్ అలీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దాంతో వారిద్దరు పాక్ జట్టు జాతీయ శిబిరంకు తాము హాజరు కాలేమంటూ బహిష్కరించారు. న్యూజిలాండ్ సిరీస్ సన్నాహకాల్లో భాగంగా 26 మంది క్రికెటర్లతో పాక్ బోర్డు నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంప్‌కు ఆమిర్‌ను ఎంపిక చేశారు. సోమవారం ప్రారంభమైన ఈ క్యాంప్‌కు దేశవాళీ క్రికెట్ కారణంగా తొలి మూడు రోజులు హఫీజ్, అజహర్ రాలేదు. గురువారం జట్టుతో చేరాల్సిన వీరిద్దరు డుమ్మా కొట్టినట్లు మేనేజర్ ఆగా అక్బర్ నిర్ధారించారు. అజహర్ అలీ నేరుగా కారణం చెప్పేయగా, హఫీజ్ ఏమీ చెప్పకుండానే తన నిరసన ప్రకటించాడు. ‘ఆమిర్ అక్కడ ఉన్నంత వరకు నేను శిబిరానికి హాజరు కాను. దీనిపై అవసరమైతే పీసీబీతో చర్చిస్తా. హఫీజ్ గురించి నేను మాట్లాడను కానీ బహుశా అతను కూడా ఇదే కారణంతో తప్పుకొని ఉండవచ్చు’ అని అజహర్ స్పష్టం చేశాడు. -
ఆధిక్యంలో పాకిస్తాన్
షార్జా: ఓపెనర్ మొహమ్మద్ హఫీజ్ (155 బంతుల్లో 97 బ్యాటింగ్; 9 ఫోర్లు; 3 సిక్సర్లు) అద్భుత ఆటతీరుతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్తాన్ ప్రస్తుతం 74 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి పాక్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో మూడు వికెట్లకు 146 పరుగులు చేసింది. అజహర్ అలీ (115 బంతుల్లో 34) చక్కటి తోడ్పాటునందించడంతో తొలి వికెట్‌కు 101 పరుగుల భారీ భాగస్వామ్యం ఏర్పడింది. షోయబ్ డకౌట్ కాగా సీనియర్ బ్యాట్స్‌మన్ యూనిస్ (14) విఫలమయ్యాడు. అంతకుముందు ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 126.5 ఓవర్లలో 306 పరుగులకు ఆలౌటయింది. టేలర్ (161 బంతుల్లో 76; 6 ఫోర్లు), బెయిర్‌స్టో (118 బంతుల్లో 43; 5 ఫోర్లు) రాణించారు. షోయబ్‌కు నాలుగు, యాసిర్‌కు మూడు, రాహత్‌కు రెండు వికెట్లు దక్కాయి.