ఓపెనర్ మొహమ్మద్ హఫీజ్ (155 బంతుల్లో 97 బ్యాటింగ్; 9 ఫోర్లు; 3 సిక్సర్లు) అద్భుత ఆటతీరుతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న
షార్జా: ఓపెనర్ మొహమ్మద్ హఫీజ్ (155 బంతుల్లో 97 బ్యాటింగ్; 9 ఫోర్లు; 3 సిక్సర్లు) అద్భుత ఆటతీరుతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్తాన్ ప్రస్తుతం 74 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి పాక్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో మూడు వికెట్లకు 146 పరుగులు చేసింది. అజహర్ అలీ (115 బంతుల్లో 34) చక్కటి తోడ్పాటునందించడంతో తొలి వికెట్‌కు 101 పరుగుల భారీ భాగస్వామ్యం ఏర్పడింది.
షోయబ్ డకౌట్ కాగా సీనియర్ బ్యాట్స్‌మన్ యూనిస్ (14) విఫలమయ్యాడు. అంతకుముందు ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 126.5 ఓవర్లలో 306 పరుగులకు ఆలౌటయింది. టేలర్ (161 బంతుల్లో 76; 6 ఫోర్లు), బెయిర్‌స్టో (118 బంతుల్లో 43; 5 ఫోర్లు) రాణించారు. షోయబ్‌కు నాలుగు, యాసిర్‌కు మూడు, రాహత్‌కు రెండు వికెట్లు దక్కాయి.