PAK VS ENG 3rd Test Day 1: కరాచీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్లు అదరగొట్టారు. వీరి ధాటికి పాకిస్తాన్ తొలి రోజే ఆలౌటైంది. 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకోవడంతో నామమాత్రంగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
కెప్టెన్ బాబర్ ఆజమ్ (78), అఘా సల్మాన్ (56) అర్ధసెంచరీలతో రాణించగా.. ఓపెనర్ షాన్ మసూద్ (30), అజహార్ అలీ (45) పర్వాలేదనిపించారు. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (8), మహ్మద్ రిజ్వాన్ (19), సౌద్ షకీల్ (23), ఫహీమ్ అష్రాఫ్ (4), నౌమాన్ అలీ (20), అబ్రర్ అహ్మద్ (4) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 4 వికెట్లు పడగొట్టగా.. అరంగేట్రం బౌలర్ రెహాన్ అహ్మద్ 2, రూట్, మార్క్ వుడ్, రాబిన్సన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఓపెనర్ జాక్ క్రాలేను డకౌట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. బెన్ డకెట్ (4), ఓలీ పోప్ (3) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ పాకిస్తాన్ స్కోర్‌కు ఇంకా 297 పరుగులు వెనుకపడి ఉంది.
కాగా, 17 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. బజ్ బాల్ టెక్నిక్‌ను అమలు చేసి తొలి రెండు టెస్ట్‌ల్లో విజయం సాధించింది. ఫలితం తేలదనుకున్న తొలి టెస్ట్‌లో 74 పరుగుల తేడాతో విజయం సాధించిన స్టోక్స్ సేన.. ముల్తాన్ టెస్ట్‌లో 26 పరుగుల తేడాతో గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment