nayim
-
విధ్వంసం కుట్ర బట్టబయలు
ఇద్దరు అనుమానిత ఐసిస్ ఉగ్రవాదుల అరెస్టు రాజ్‌కోట్/అహ్మదాబాద్: భారత్‌లో విధ్వం సానికి ప్రణాళికలు రూపొందిస్తున్న ఇద్దరు అనుమానిత ఐసిస్ ఉగ్రవాదులను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ఏ సంస్థ సహాయం లేకుండా ఒంటరిగానే విధ్వంసం సృష్టించేందుకు వీరు సిద్ధమైనట్లు పోలీసు లు తెలిపారు. గుజరాత్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాలనుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌కోట్‌కు చెందిన వసీం రమోడియా (ఎంసీఏ విద్యార్థి), నయీమ్ (బీసీఏ)లు ఐసిస్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. ఈ ఇద్దరి నుంచి బాంబు తయారీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆధ్యాత్మిక ప్రాంతాలైన చోతిలా (దేవీ మందిరం)తోపాటు పలుచోట్ల దాడులకు వీరిద్దరూ ప్రణాళికలు రూపొందించారని.. పక్కా సమాచారంతోనే వీరిపై నిఘాపెట్టి అదుపులోకి తీసుకున్నట్లు గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) ఐజీ జేకే భట్ వెల్ల డించారు. రాజ్‌కోట్ నుంచి రమోడియాను, నయీమ్‌ను భావ్‌నగర్‌లో అరెస్టు చేశారు. ఉగ్రఘటనతో దేశమంతా కలకలం సృష్టించేందుకు విధ్వం సం వీడియోను రికార్డు చేసి దీన్ని సోషల్ మీడియాలో పెట్టాలని ప్లాన్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని భట్ తెలిపారు. బాంబులు పేల్చడంతోపాటు వాహనాలకు నిప్పుపెట్టడం ద్వారా భయాందోళనలు సృష్టించాలనేదీ వీరి ప్లాన్ లో భాగమన్నారు. రెండేళ్ల క్రితం జిహాదీ భావజాలంవైపు ఆకర్షితులైన వీరిద్దరూ.. ఆన్ లైన్ రా ఐసిస్‌తో సంబంధాలు నెరపుతున్నారు. అఫ్గాన్ లో కేరళ ఉగ్రవాది హతం: కేరళలోని పాలక్కడ్‌జిల్లాలో అదృశ్యమై ఐసిస్‌లో చేరి నట్లుగా అనుమానిస్తున్న 21 మందిలో ఒకరైన హఫీజ్ (26) హతమైనట్లు తెలిసింది. అఫ్గాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదులపై జరిపిన డ్రోన్ దాడుల్లో హఫీజ్ మృతిచెందాడు. -
జైలు అధికారులకు నయీమ్‌తో సంబంధాలు లేవు
రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వినయ్ కుమార్ సింగ్ హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో జైళ్ల శాఖ అధికారులకు సంబంధాలున్నాయన్న ఆరోపణ ల్లో వాస్తవం లేదని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వినయ్ కుమార్‌సింగ్ అన్నారు. శుక్రవారం చంచల్‌గూడ లోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్(సీకా) కార్యాలయంలో ఏర్పాటు చేసిన 2016 వార్షిక సమా వేశంలో ఆయన పాల్గొని జైళ్ల శాఖ సాధించిన ప్రగతిని గురించి వివరిం చారు. 2014లో జైళ్లలో మరణించిన ఖైదీల సంఖ్య 54గా ఉండగా, గతేడాది 24కి తగ్గింద న్నారు. ఈ ఏడాది 100 పెట్రోల్‌బంక్‌ల ఏర్పాటు చేస్తున్నామ న్నారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో 100 ఫిజికల్ ఫిట్నెస్ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇటీవల రాష్ట్ర జైళ్లను సందర్శించిన బంగ్లాదేశ్, తీహార్ జైలు అధికారులు తెలంగాణ జైళ్ల శాఖ పనితీరును అభినందించారన్నారు. గత ఏడాది రూ. 296 కోట్ల టర్నోవర్ జైళ్ల శాఖ శిక్షణా సంస్థ నిర్వహిస్తున్న పరిశ్రమలు, పెట్రోల్ బంక్‌ల ద్వారా 2016లో సుమారు రూ. 296 కోట్ల్ల టర్నోవర్ సాధించామన్నారు. ఇందులో రూ. 7 కోట్ల 13 లక్షల లాభం పొందినట్లు తెలిపారు. పిల్లల విద్యా, వివాహాలకు సంబంధించి ఖైదీలకు రూ. 36 లక్షల రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఇన్చార్జ్ నర్సింహ, సూపరిం టెండెంట్ సైదయ్య, సీకా ప్రిన్సిపల్ మురళీబాబు తదితరులు ఉన్నారు. -
నయీమ్ డైరీ ఏమైంది? : జీవన్‌రెడ్డి
-
నయీమ్ డైరీ ఏమైంది?
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జీవన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్, అతని అనుచరులు చేసిన అరాచకాలపై నమోదైన కేసుల విష యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అల సత్వం ప్రదర్శిస్తోందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. అసలు నయీమ్ వద్ద లభించిన డైరీ ఏమైందని, అతడు హతమైన తర్వాత వేల కోట్ల రూపాయల డంప్‌తో పాటు కిలోల కొద్దీ బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు దొరి కాయని వార్తలు వచ్చా యని, వాటి సంగతేంటని నిలదీశారు. సోమవారం శాసనసభలో నయీమ్ ఉదం తంపై జరిగిన లఘుచర్చను జీవన్ రెడ్డి ప్రారంభించారు. నయీమ్ లాంటి కరుడుగట్టిన నేరస్తుడిని హతమార్చడం మంచిదే అని అంటూనే ఈ కేసు దర్యాప్తు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిని ఆయన తప్పుపట్టారు. కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని, నయీం వద్ద లభించిన డైరీని బహిర్గతం చేయాలని, అతని వద్ద లభించిన సామాన్లన్నిం టినీ కోర్టులో డిపాజిట్ చేయాలన్నారు. నయీమ్ బాధితుల ఆస్తులను అసలైన యజమానులకు అప్పగించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నయీంను హతమార్చేందుకు రెండేళ్లు ఎందుకు పట్టింది? అన్ని రోజుల పాటు అతడ్ని ఎందుకు పట్టుకోలేకపోయారు? తనకు తగిలితే కానీ దెబ్బ తెలియదన్నట్టు మీ వరకు వస్తే కానీ నయీమ్‌ను పట్టుకోవాలన్న ఆలోచన రాలేదా? నయీమ్ అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత 2015లో ఇమామ్ గూడలో అతడి మేనకోడలు ఫంక్షన్ పెట్టి రాజకీయ నాయ కులను, పోలీసులను ఆహ్వానించిన విషయం ఇంటెలిజెన్స్ వర్గాలకు ఎందుకు తెలియలేదు? తెలిస్తే 2016 ఆగస్టు వరకు నయీమ్‌ను ఎందుకు ఉపేక్షించారు?’’ అని జీవన్‌రెడ్డి ప్రశ్నిం చారు. ‘‘నయీమ్‌తో సంబంధాలున్నాయని చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మంత్రి హోదాలో ఉన్న ఓ శాసనమండలి సభ్యుడి పేరును కూడా కేసులో ప్రస్తావించారు. అయినా నయీమ్ తో అంటకాగిన వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తోంది’’ అని ఆయన ప్రశ్నలు సంధించారు. సిట్ దర్యాప్తు చేయగలదా? నయీమ్ నేర సామ్రాజ్యం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, గోవా రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఉందని, అలాంటప్పుడు సిట్ ఈ కేసును ఎలా దర్యాప్తు చేయగలుగుతుందని జీవన్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. నయీం వద్ద లభించిన ఏకే 47 తుపాకులు పాకిస్తాన్‌కు చెందిన హిజ్బుల్ ముజాహిద్దీన్ అనే సంస్థ నుంచి వచ్చాయని చెపుతున్న నేపథ్యంలో రాష్ట్రస్థాయి అధికారులు ఈ కేసును ఛేదించగలరా అని ప్రశ్నించారు. ‘‘నయీమ్‌తో సంబంధాలున్నవారిలో మీ వాళ్లుంటే మీకు మొహమాటం. మా వాళ్లుంటే ‘మీరు కక్ష సాధిస్తున్నారు’ అని అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు నియమించిన సిట్ ఏం చేయగలుగుతుంది? 18 మంది ఐపీఎస్ అ«ధికారులు, 8 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, 42 మంది అధికారులకు సంబంధమున్న ఈ కేసును రాష్ట్ర పోలీసులు పూర్తి చేయగలుగుతారా? నిష్పాక్షికంగా విచారణ జరగాలంటే కేసును వెంటనే సీబీఐకి అప్పగించండి’’ అని ఆయన డిమాండ్ చేశారు. నయీమ్ ఎన్కౌంటర్ జరిగి నాలుగు నెలలు దాటినా అతడి కుడిభుజంగా వ్యవహ రించిన శేషన్న ఏమయ్యాడని, ఎందుకు పట్టుకోలేక పోయారని ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసు ఏమైంది? రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయంలోనూ గట్టిగా వ్యవహరించడం లేదని జీవన్‌రెడ్డి అన్నారు. ‘‘ఓటుకు నోటు కేసులో.. బాధ్యులైన వారు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని అన్నారు.. కానీ ఆ కేసు ఏమైంది? ఎవరు ఊచలు లెక్కపెట్టారు? సినిమా ట్రైలర్ లాగా వార్తలను బయటకు పంపిస్తారు. అసలు ఓటుకు నోటు కేసు మధ్యలో ఎందుకు ఆగిపోయిందో చెప్పాలి. నయీమ్ డైరీతో పాటు అతని వద్ద లభించిన ల్యాప్‌టాప్‌లు వీడియోటేపులన్నింటినీ బహిర్గతం చేయాలి. అప్పుడే వివరాలు పూర్తిగా వెలుగులోకి వస్తాయి. ఒకరిపై మరొకరు నెట్టుకోవడం కాదు: ప్రతిపక్షాలు నయీమ్ అంశంపై జరిగిన చర్చలో కౌసర్ మొయినుద్దీన్ (ఎంఐఎం), చింతల రామచంద్రారెడ్డి (బీజేపీ), సండ్ర వెంకటవీరయ్య (టీడీపీ), సున్నం రాజయ్య (సీపీఎం)లతో పాటు అధికార టీఆర్ఎస్ సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. నయీమ్ కేసుతో సంబంధమున్న వారందరిపై చర్యలు తీసు కోవాలని, నయీమ్‌ను హతమార్చిన పోలీసులకు రివార్డు ఇవ్వాలని కోరారు. మీరేం చేశారంటే మీరేం చేశారని నిందలు మోపుకోకుండా కేసును త్వరితగతిన దర్యాప్తు చేయాలన్నారు. నయీమ్ బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని, నయీమ్ డైరీని బయటపెట్టాలని సండ్ర డిమాండ్ చేశారు. నయీమ్ విషయంలో చర్యలు వేగవంతం చేయాలని సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. నయీమ్‌ను టీడీపీ పెంచి పోషిస్తే, ప్రోటీన్లు, విటమిన్లు అందించింది కాంగ్రెస్ పార్టీనని సోలిపేట ఎద్దేవా చేశారు. నయీమ్‌ను హతమార్చి సీఎం.. 100 నాగార్జునసాగర్ ప్రాజెక్టులు కట్టినంత మంచి పని చేశారని ప్రశంసించారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి పేరు ప్రస్తావనకు రావడంతో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని రేవంత్ కోరినా స్పీకర్ అంగీకరించలేదు. ఈ సమయంలో సీఎం కేసీఆర్ మాట్లాడేందుకు లేచి నిలబడగా.. తాను మాట్లాడతానని రేవంత్ పట్టుబట్టారు. అయినా స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడంతో ‘మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి..’ అంటూ రేవంత్ కూర్చోవడంతో సీఎం తన ప్రసంగాన్ని ప్రారంభించారు. -
మళ్లీ తెరమీదకు నయీం అనుచరులు
-
ఆ ఇద్దరిని చంపింది నయీమ్ ముఠానే
- 11 ఏళ్ల తర్వాత వీడిన జంట హత్యల మిస్టరీ - గ్యాంగ్‌లో చేరనందుకు జోడు ఆంజనేయులు,బెస్తా కిష్టయ్యలను మట్టుబెట్టిన వైనం - డైరీ ఆధారంగా వెలుగులోకి.. - పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు తూప్రాన్ : ఓ జంట హత్యల కేసు మిస్టరీ 11 ఏళ్ల తర్వాత వీడింది. మావోయిస్టుల సానుభూతిపరులుగా కొనసాగిన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్కి చెందిన జోడు ఆంజనేయులు, బెస్తా కిష్టయ్యను గ్యాంగ్‌స్టర్ నయీమ్ హత్య చేరుుం చినట్టు పోలీసులు నిర్ధారించారు. నయీమ్ డైరీ ఆధారంగా ఈ విషయం వెలుగుచూసింది. మంగళవారం సీఐ రమేశ్‌బాబు ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌కు చెందిన బెస్తా కిష్టయ్య, జోడు ఆంజనేయులు విప్లవపార్టీల సానుభూతిపరులుగా.. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నారుు. వారిని తన గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు నయీమ్ యత్నిం చాడు. తన అనుచరుడైన కుంట యాదగిరితో వారి కదలికలపై నిఘా పెట్టి వారిద్దరినీ కిడ్నాప్ చేశారు. గ్యాంగ్‌లో చేరనందుకు హత్య బెస్తా కిష్టయ్య, జోడు ఆంజనేయులు మావోయిస్టు సానుభూతిపరులుగా కొనసాగుతున్న విషయం తెలుసుకొని.. వారిని తన గ్యాంగ్‌లో చేరాల్సిందిగా నయీమ్ రాయబారం పంపాడు. వారు వ్యతిరేకించడంతో అంతమొందించాలని నిర్ణరుుంచాడు. ఈ క్రమంలో 2005 మార్చి 15న భూమి రిజిస్ట్రే ్టషన్ కోసం వారిద్దరూ వస్తున్న విషయం తెలుసుకున్న నయీమ్.. తన అనుచరులైన డ్రైవర్ జెల్ల సత్యనారాయణ, యాదగిరి గుట్టకు చెందిన నర్సింగం పురుషోత్తం, మరికొందరిని ప్రజ్ఞాపూర్ వద్ద ఉంచాడు. భోజనం చేసేందుకు వచ్చిన ఆంజనేయులు, కిష్టయ్యను తమ వాహనంలో ఎక్కించుకెళ్లారు. అక్కడి నుంచి మరికొందరు వేరొక వాహనంలో రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లోని నయీమ్ ఇంటికి తీసుకెళ్లారు. అదేరోజు రాత్రి నయీమ్ వారితో మాట్లాడాడు. గ్యాంగ్‌లోకి రావడానికి వారిద్దరూ వ్యతిరేకించడంతో హత్య చేయమని అనుచరులను ఆదేశించాడు. దీంతో నయీమ్ డ్రైవర్ జెల్ల సత్యనారాయణ, నర్సింగం పురుషోత్తం, నయీమ్ మేనకోడలు తనియా అలియాస్ సాజిదా షాహినా తర్వాత రోజు ఉదయం ఆంజనేయులు, కిష్టయ్యను ఓ వాహనంలో శ్రీశైలంలోని దట్టమైన అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే హత్య చేసి కాల్వలో పడేశారు. డైరీ ఆధారంగా వీడిన మిస్టరీ నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత తన డైరీలో రాసుకున్న అనేక విషయాల ఆధారంగా ఆంజనేయులు, కిష్టయ్య హత్య జరిగినట్టు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు అనుమతితో తూప్రాన్ పోలీసులు నయీమ్ డ్రైవర్ సత్యనారాయణ, పురుషోత్తంను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారిచ్చిన సమాచారంతో ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన కుంట యాదగిరిని అదుపులోకి తీసుకుని విచారించారు. త్వరలో నయీమ్ మేనకోడలు తనియా అలియాస్ సాజిదా షాహినాను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, నయీమ్ అత్త సుల్తానా పేరు మీద ఉన్న సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారంలోని సోమశిల టౌన్ షిప్‌లోని సుమారు 1000 చదరపు అడగుల వైశాల్యం గల ఇంటిని యాదగిరి తన భార్య శారద పేరుమీద రిజిస్ట్రేషన్ చేరుుంచాడు. -
నయీమ్‌తో శ్రీధర్‌బాబుకు లింకు: పుట్ట
మంథని: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు సంబంధాలు ఉన్నాయని పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. మంథనిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దీనిపై విచారణ కోసం సీఎం కేసీఆర్, డీజీపీ అనురాగ్‌శర్మకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మాజీ నక్సలైట్ జడల నాగరాజు ఆచూకీ లేకుండా పోయూడనిడన్నారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్యకేసులో సంబంధాలు ఉన్న వ్యక్తులను హతమార్చేందుకు శ్రీధర్‌బాబు నయీమ్‌తో దోస్తీ చేసినట్లు ఆరోపణలున్నాయని అన్నారు. తాను ఎమ్మెల్యే కాక ముందు హత్యకు కుట్ర జరిగిందని చెప్పారు. ఆరోపణలు సరికాదు : శ్రీధర్‌బాబు గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో తనకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేయడం సరికాదని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. తన తప్పులను కప్పి పుచ్చకోవడానికి ఎమ్మెల్యే పుట్ట మధు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. -
ఏ లాకైనా.. ఓపెన్ కావాల్సిందే!
►నల్లగొండలో హైటెక్ చోరీ ముఠా గుట్టు రట్టు ►యూట్యూబ్ సాయంతో సెన్సార్ లాకింగ్ వాహనాలు సైతం చోరీ సాక్షి, నల్లగొండ: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని హైటెక్ పద్ధతుల్లో కొంతకాలంగా కార్లను చోరీ చేస్తున్న ముఠా గుట్టును నల్లగొండ పోలీసులు రట్టు చేశారు. కారు పోయిందని ఫిర్యాదు వచ్చిన వారం రోజుల్లోనే కూపీ లాగిన పోలీసులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 100కు పైగా కార్లు, బైక్‌లను దొంగతనం చేసి జల్సాలు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్, మంచిర్యాల, నల్లగొండలకు చెందిన ఆరుగురిని నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు.. వారం, పది రోజులుగా ప్రశ్నిస్తున్నారని, దర్యాప్తులో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయని పోలీసు వర్గాలంటున్నాయి. సెన్సార్ లాక్.. చిటికెలో ఓపెన్: వాస్తవానికి ఈ నెల ఆరో తేదీన నల్లగొండ జిల్లా జైలు సమీపం నుంచి ఓ ఇన్నోవా కారును దొంగలు తీసుకెళ్లారు. సెన్సార్ లాక్ ఉన్న ఈ వాహనాన్ని అతి చాకచ క్యంగా తీసుకెళ్లిన వారు.. దాన్ని వేగంగా హైదరాబాద్‌కు తీసుకెళ్లాలన్న ఆదుర్దాలో చిట్యాల సమీపంలో యాక్సిడెంట్ చేశారు. ఇన్నోవా మూడు పల్టీలు కొట్టినా అత్యంత పకడ్బందీగా, ఎలాంటి గాయాలు లేకుండా బయటపడి తప్పించుకుని వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అయితే.. అదే రోజు తన వాహనం పోయిందని నల్లగొండ పోలీసులకు ఫిర్యాదు చేయడం, వాహనం ప్రమాదం జరగడంతో పోలీసులు ఈ కేసుపై దృష్టి సారించారు. తీగలాగితే డొంక కదిలినట్టు ఈ కేసు దర్యాప్తులో పెద్ద దొంగల ముఠానే బయటపడింది. హైదరాబాద్‌కు చెందిన మొయిద్, జహీర్, హాజీ, షెఫాహత్‌లతో పాటు మంచిర్యాలకు చెందిన ఆమీర్, నల్లగొండకు చెందిన అర్బాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అర్బాజ్ గ్యాంగ్‌స్టర్ నయీమ్ అల్లుడని పోలీసులు భావిస్తున్నాయి. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించడం లేదు. ఈ వాహనాల దొంగతనం కేసులో నల్లగొండ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆరుగురు కూడా 16 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కులేనని తెలుస్తోంది. ఈ దొంగలు జిల్లా జైలు సమీపం నుంచి వాహనాన్ని చోరీ చేసిన సమయంలో పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా హ్యాకింగ్ చేసినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. వారు వెళ్లిన ప్రదేశం గుండా ఉన్న సీసీకెమెరాలు మొత్తం బ్లర్ అయ్యాయని, వాటిని కూడా హ్యాకింగ్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘కార్ల దొంగతనం చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న మాట వాస్తవమే. పూర్తిస్థాయిలో విచారించి వీరిని కోర్టులో హాజరుపరుస్తాం’ అని నల్లగొండ డీఎస్పీ ఎస్.సుధాకర్ వెల్లడించారు. -
నయీం కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు
గ్యాంగ్‌స్టర్ నయీం కేసులోనల్లగొండ జిల్లా మిర్యాలగూడ కోర్టు ఆరుగురికి రిమాండ్ విధించింది. పోలీసులు ఈ కేసుకు సంబంధించి అయిదుగురిని జిల్లా జైలు నుంచి, ఒకరిని చంచల్‌గూడ జైలు నుంచి కోర్టులో హాజరుపరిచారు. వీరందరికీ కోర్టు రేపటి వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఇదిలా ఉండగా, ఇదే కేసులో నయీం సోదరి హసీనా, మరదలు సాజిదాలకు ఏడు రోజుల పోలీస్‌కస్టడీ ముగియటంతో రాజేంద్రనగర్ కోర్టు రిమాండ్‌కు పంపింది. -
మిర్యాలగూడ కోర్టుకు నయీం కేసు నిందితులు
గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో నిందితులను మంగళవారం మిర్యాలగూడ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. హజరైన వారిలో నయీం అత్త సుల్తానా, బావమరిది సాధిక్, అతడి భార్య ఫర్జానా ఉన్నారు. వీరికి న్యాయమూర్తి ఈ నెల 6 వరకు రిమాండ్ విధించారు. -
20న నయీం బాధితుల ధర్నా
- నయీంతో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేయాలి - టిపిఎఫ్ అధ్యక్షులు నలమాస కృష్ణ సుందరయ్య విజ్ఞాన కేంద్రం(హైదరాబాద్ సిటీ) నయీంతో సంబంధం ఉన్న రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులను వెంటనే అరెస్ట్ చేసి సమగ్రమైన న్యాయ విచారణ చేపట్టాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం టీపీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో టీపీఎఫ్ అధ్యక్షులు నలమాస కృష్ణ మాట్లాడుతూ దోషులు ఎంతటివారైనా అరెస్ట్ చేసి శిక్షించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. నయీంను చేరదీసి పెంచి పోషించిన చంద్రబాబు నాయుడు, ఆనాటి పోలీస్ ఉన్నతాధికారులపై కేసు నమోదు చేయాలన్నారు. అధికార పక్షంలో ఉన్న నేతలు నేతి విద్యాసాగర్, కర్నె ప్రభాకర్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, చింతల వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి డికే అరుణ లాంటి వారిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నయీం డైరీలో ఉన్న పేర్లు, వారు పాల్పడిన నేరాలను బయట పెట్టాలని కోరారు. నయీం బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 20న అన్ని ప్రజా సంఘాలతో కలిసి ఇందిరాపార్కు వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విలేకర్ల సమావేశంలో టిపిఎఫ్ ప్రధాన కార్యదర్శి మెంచు రమేష్, ఉపాధ్యక్షులు కె. రవిచందర్, టివివి అధ్యక్షులు మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. -
‘నయీండైరీ అంటూ మాపై బురద చల్లితే ఊరుకోం’
అసలు ఉందో లేదో తెలియని గ్యాంగ్‌స్టర్ నయీం డైరీని అడ్డం పెట్టుకుని తమ పార్టీకి చెందిన నేతలపై బురద చల్లి బెదిరించాలని చూస్తే సహించేది లేదని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఈ డైరీ గురించి పత్రికల్లో వార్తలు రావడమే తప్ప అతని డైరీ ఉందని కాని, అందులో కొందరి పేర్లు ఉన్నాయని కాని అధికారికంగా సిట్ అధికారులు ఎప్పుడూ చెప్పలేదన్నారు. డైరీ నిజంగానే ఉంటే దానిని ప్రభుత్వం సీజ్ చేసి, అందులో ఉన్న నిందితుల పేర్లను అధికారికంగాప్రకటించాలన్నారు. టీడీపీ నేతలపై బురదచల్లి, బెదిరించి, లొంగదీసుకునే ప్రయత్నాల్లో భాగంగానే కథనాలు వస్తున్నాయన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో కొందరు విలేకరుల ప్రశ్నలకు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు. -
నయీమ్ ముఖ్య అనుచరుల రిమాండ్
గ్యాంగ్‌స్టర్ నయీమ్ ముఖ్య అనుచరులు పాశం శ్రీనివాస్, సందెల సుధాకర్‌ను పోలీసులు గురువారం నల్లగొండ జిల్లా భువనగిరి కోర్టులో హాజరుపరిచారు. పీడీ యాక్ట్‌పై ఇప్పటికే వరంగల్ జైలులో ఉన్న వీరిని పలు ఫిర్యాదుల నేపథ్యంలో భువనగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాలతో వీరిని రిమాండ్ నిమిత్తం వరంగల్ జైలుకు తరలించారు. -
ఆర్డీఓకు నయీమ్ బాధితురాలి ఫిర్యాదు
భువనగిరి న యీమ్ అనుచరులు తన భూమిని ఆక్రమించుకున్నారని మండలంలోని హన్మాపురం గ్రామానికి చెందిన సాధినేని మంజు సోమవారం భువనగిరి ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వివరాలు ఆమె మాటల్లోనే.. మంజు ఆమె భర్త సాధునేని హరినాథ్‌కు హన్మాపురంలో 2.21 ఎకరాల భూమి ఉంది. ఆమె భర్త సాధినేని హరినాథ్ 26–06–2015న అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన బతికి ఉన్న సమయంలో (2.21) ఎకరాల భూమిని ప్రేమ్‌కుమార్ అనే వ్యాపారి కొనుగోలు చేశారు. అ వ్యాపారి పూర్తిగా డబ్బులు ఇవ్వకుండా వాయిదాల వారీగా కొన్ని ఇచ్చాడు. పూర్తిగా డబ్బులు ఇవ్వలేదు. ఇంకా రావాల్సిన డబ్బు గురించి ప్రేమ్‌కుమార్‌ను అడిగితే ఇంకా అతను రూ. 10,50,000 లక్షలు బకాయి ఉన్నట్లు చెప్పాడు.. మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తావని అడిగితే ఒక వారం తరువాత ఇస్తానని చెప్పాడు. మళ్లీ ఒత్తిడి చేస్తే ఢిల్లీ Ðð ళ్లి గిరిష్జాజు అనే వ్యక్తి నుంచి తీసుకవస్తానని వివరించాడు. ఈ సమయంలో మా బావ రఘు అనే వ్యక్తి మాకు డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పాడు. దీంతో వ్యాపారి మీకు డబ్బులు కావాలంటే మీ బావను కూడా తీసుకుని రావాలని వ్యాపారి చెప్పాడు. ఈ క్రమంలో రఘు కోర్టులో పిటిషన్ వేశాడు. నేను నీకు డబ్బులు ఇవ్వను కోర్టులోనే చెల్లిస్తాను అని వ్యాపారి చెప్పాడు. కానీ ఇంత వరకు ఇవ్వలేదు. అనంతరం వాయిదాలు వేస్తూనే ఓ రోజు భువనగిరిలో డబ్బు చెల్లిస్తానని చెప్పిన ప్రేమ్‌కుమార్ తన వద్ద పనిచేసే కంచుకుంట్ల లక్ష్మయ్యను పంపించాడు. ఆయన నేరుగా తనను నÄæూమ్ అనుచరుడు షకీల్ వద్దకు తీసుకెళ్లాడు. షకీల్ చంపుతానని బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని తెలిపింది. దీంతో ప్రాణభయంతో పుట్టింటికి వెళ్లి అక్కడే జీవనం సాగిస్తున్నానని తెలిపింది. అయితే ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో నÄæూమ్ బాధితులను ఆదుకుంటామని ప్రభుత్వ ప్రకటన చూసి న్యాయం చేయాలని అధికారులకు ఫిర్యాదు చేసినట్టు వివరించింది. -
నయీమ్‌తో కలసి మంచిరెడ్డి అకృత్యాలు
-
నయీమ్‌తో కలసి మంచిరెడ్డి అకృత్యాలు
విచారణ జరపాలంటూ డీజీపీకి మల్రెడ్డి రంగారెడ్డి విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్‌రెడ్డి కబ్జాలు, అకృత్యాలకు పాల్పడ్డారని.. దీనిపై విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి డీజీపీని కోరారు. ఈ మేరకు బుధవారం డీజీపీ అనురాగ్‌శర్మను కలసి పలు పత్రాలను అందజేశారు. మంచిరెడ్డి ఏడేళ్లుగా నయీమ్‌తో సంబంధాలు కొనసాగిస్తూ దళిత, గిరిజన రైతులను బెదిరిం చారని... కోట్ల విలువైన భూములను కబ్జా చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించారని ఆరోపించారు. రియల్ వ్యాపారుల నుంచి భారీగా వసూళ్లు చేశాడన్నా రు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భూములు కొన్నా, అమ్మినా మంచిరెడ్డికి తెలియకుండా జరగడానికి వీల్లేని విధంగా భయానక వాతావరణాన్ని నయీమ్ సృష్టించాడని ఆరోపించారు. ఆదిభట్లలో మంచి ఇన్ఫ్రా డెవలపర్స్‌లో ఉన్న 36.10 ఎకరాలను మంచిరెడ్డి, ఆయన అనుచరులు రైతులను బెదిరించి రిజిస్టర్ చేయించుకున్నారని.. తట్టిఖానా రెవెన్యూ పరిధిలో 325 ఎకరాల భూమిని పేదల నుంచి తక్కువ ధరకు సొంతం చేసుకున్నారన్నారు. మంచిరెడ్డి, నయీమ్ అకృత్యాలు, కబ్జాలపై సిట్‌తో విచారణ జరిపించి రైతులకు న్యాయం చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదిభట్లలోని మంచి ఇన్ఫ్రా డెవలపర్స్ డాక్యుమెంట్, నయీమ్, రాంరెడ్డి పట్వారీ కుమారుడు నర్సింహరెడ్డి డాక్యుమెంట్, ఖానాపూర్ 67/ఇ లోని నకిలీ పాస్‌బుక్ , ప్రొసీడింగ్స్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన వినతిపత్రం కాపీలను డీజీపీకి ఇచ్చినట్లు మల్రెడ్డి తెలిపారు. -
నయీంను పోషించింది రాజకీయ జోక్యమే
పంజగుట్ట: రాజకీయ జోక్యమే నయీంను పెంచి పోషించిందని,ఈ కేసునుహైకోర్టు చీఫ్ జస్టిస్‌చే విచారణ జరపాలని పలువురు పేర్కొన్నారు. ఆది వారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో చిక్కుడు ప్రభాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామాజిక ఉద్యమకారుడు సాంబశివరావు (ఉసా) మాట్లాడుతూ.. గతంలో చట్టం, రాజ్యాంగం, ప్రభుత్వ పరిధిలో నేరస్తులకు శిక్షవిధించేదని, ప్రస్తుతం బూటకపు ఎన్కౌంటర్లు అనే విచ్చిన్నకర కార్యక్రమాలు చంద్రబాబు సృష్టించాడన్నారు. గ్రేహౌండ్స్‌ను ఎలా తయారు చేశారో అందుకు సమాంతరంగా నయీంను కూడా అలానే తయారు చేశారని ఆరోపిచారు. ప్రజా ఉద్యమకారులను మట్టుబెట్టేందుకు 10 శాతం గ్రేహౌండ్స్ సిబ్బందిని నయీం గ్యాంగ్‌లో ఉంచారని ఆరోపించారు. సీపీఐ నాయకురాలు పశ్య పద్మ మాట్లాడుతూ.. కేవలం నయీం ఆస్తులు, స్థలాలపైనే విచారణ జరుగుతోందని, అతను హత్యలు చేసిన కుటుంబాల ఆవేదనను ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, పౌరహక్కుల సంఘం నాయకుడు నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే మంచిరెడ్డికి నయీంతో సంబంధాలు!
సైదాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీంతో కలిసి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి భూ దందాలు కొనసాగించాడని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. నయీం దాచిపెట్టిన నగదు మంచిరెడ్డి వద్దే ఉందని ఆ విషయాన్ని అతడిని అరెస్ట్ చేసి విచారిస్తే తెలుస్తుందని అన్నారు. అమాయక రైతులను బెదిరించి మంచి ఇన్ ఫ్రా పేరుతో లూటి చేశాడన్నారు. సైదాబాద్ డివిజన్ తిరుమలాహిల్స్‌లోని తన నివాసంలో ఆదివారం మల్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేతో పాటు అతని కుమారుడు ప్రశాంత్‌రెడ్డి చేసిన భూ దందాలు స్థానికులకు తెలుసన్నారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన వరకు కిషన్ రెడ్డి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడని అన్నారు. నయీంను అడ్డు పెట్టుకొని దందాలు సాగించడాని తెలిపారు. ఇబ్రహీంపట్నంలో సిట్ అధికారులు అరెస్ట్ చేసిన శ్రీహరితో కలిసి మంచిరెడ్డి భూ లావాదేవీలు సాగించారని అన్నారు. ఆదిభట్లలో సర్వేనెంబర్లు 165–197, 216–218, 292, 290, 209, 300 నెంబర్లలో గల భూములను నయీంతో కలిసి మంచిరెడ్డి కాజేశాడని విమర్శించారు. ఒకే డాక్యుమెంట్లో శ్రీహరితో పాటు మంచిరెడ్డి పేరు ఉంటే శ్రీహరిని మాత్రమే అరెస్ట్ చేసి ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని ఎలా వదిలేస్తారని ప్రశ్నించారు. నయీం కేసు నిష్పక్షపాతంగా సాగాలంటే మంచిరెడ్డిని అరెస్ట్ చేసి సీబీఐ చేత విచారించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తమ వద్ద ఉన్న ఆధారాలను సిట్ అధికారులకు అందించినట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌పార్టీ సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
నయీమ్ అనుచరులు నన్ను బెదిరించారు
నయీమ్ కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన ఫ్రైడ్ ఇండియా రియల్ ఎస్టేట్ సంస్థ జోలికొస్తే అంతం చేస్తామని అతని అనుచరులు నన్ను బెదిరించారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొలన్ శంకర్‌రెడ్డి ఆరోపించారు.మంగళవారం బడంగ్‌పేటలో ఆయన తన పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా శంకర్‌రెడ్డి మాట్లాడుతూ గత ఏడాది జూన్ 26న సాయంత్రం సరూర్‌నగర్ మండల కార్యాలయం వద్ద ఉన్న తన వద్దకు నల్లగొండకు చెందిన రియాజ్, ఫ్రై డ్ ఇండియా ఎండీ సానోవర్‌బేగ్, జుబేర్, మల్లెల శ్రీకాంత్‌గౌడ్ (న ల్లగొండ), ముజమిల్‌బాబా అలియస్ సీతారాంరెడ్డి (వరంగల్)తోపాటు మరో ఇద్దరు ప్రత్యక్ష్యంగా తనవద్దకు విచ్చేసి గన్ చూపించి బెదిరించినట్లు వెల్లడించారు. భయాందోళనకు గురై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి ఆ తర్వాత వారి సలహా మేరకు సీపీ ఆనంద్‌కు పిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అయిన అప్పుడు ఏలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. బడంగ్‌పేట నగర పంచాయితీ పరిధిలోని బాలాపూర్ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా ఫ్రై డ్ ఇండియా పేరుతో వెంచర్లు ఏర్పాటు చేశారని అన్నారు. అయితే చారిత్రక విలువలు కలిగిన దేవతల గుట్టపై ఉన్న దేవాలయాలను కనమరుగు చేస్తూ సీలింగ్, సర్ప్లెస్ ల్యాండ్లు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేస్తూన్నారని అన్నారు. దేవతల గుట్ట పరిరక్షణ కొరకు పోరాడుతున్న తనను అటాక్ చేసి బెదిరించినట్లు వెల్లడించారు. ఫ్రై డ్ ఇండియాలో నయీమ్ పెట్టుబడులు పెట్టినట్లుగా స్వయంగా నయీం అనుచరులే చెప్పారని తెలిపారు. కోటీ ఇస్తాం తప్పుకో, లేదా ప్రాణం మీద తీపి ఉంటే ఫ్రై డ్ ఇండియా జోలికి రావోద్దు అని తుపాకి గురి పెట్టారని అన్నారు. ఫ్రై డ్ ఇండియా సంస్థ దేశ వ్యతిరేఖ శక్తులతో చేతులు కలిపి గ్యాంగ్ స్టార్ నయీం తో పెట్టుబడులు పెట్టించి ఇల్లీగల్ దందాలు నడిపిస్తున్నారని ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు, సిట్ దర్యాప్తు సంస్థ నాగిరెడ్డికి కూడా తాను ఫిర్యాదులు చేసినట్లు వెల్లడించారు. వెంటనే ఫ్రై డ్ ఇండియా సంస్థపై సీబీసీఐడీ దర్యాప్తు జరిపించి నయీం అనుచరులను ఆదుపులోకి తీసుకొని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తన వద్ద ఆదారాలతో సహా పూర్తి సమాచారం ఉందని శంకర్‌రెడ్డి వెల్లడించారు. సమావేశంలో నాయకులు ఎన్.ప్రభాకర్‌రెడ్డి, గుర్రం మల్లారెడ్డి, నిమ్మల శ్రీకాంత్‌గౌడ్, పి.పుల్లారెడ్డి, ప్రభాకర్, భాస్కర్, నరేందర్‌గౌడ్, నాగార్జున మహేందర్‌రెడ్డి, విఘ్నేష్, చారి తదితరులున్నారు. -
రైతులపై నయీం ముఠా జులుం
తుర్కపల్లి : నయీం అకృత్యాలు, దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. బడాబాబులనే బెదిరించి డబ్బుల వసూళ్లు, ఆక్రమణకు పాల్పడిన అతడి ముఠా పేద రైతులపై కూడా జులూం ప్రదర్శించినట్టు వెలుగులోకి వచ్చింది. ‘‘ మేం నయీం భాయ్ మనుషులం.. ఈ భూమిని రిజిస్ట్రేషన చేయించుకున్నాం.. మీరు వెంటనే ఖాళీ చేసి వెళ్లి పోతారా.. లేకుంటే చస్తారా..? అంటూ బెదిరించారు. దీంతో తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న కన్నతల్లి లాంటి భూమిని వదిలి మిన్నకుండిపోయామని తుర్కపల్లి మండలం పరిధి పెద్దతండా గ్రామపంచాయతీ పరిధిలోని సుక్యతండాకు చెందిన భానోత్ వాల్య, భానోత్ రాములు, భానోత్ రవి వాపోయారు. నÄæూమ్ బాధితులు న్యాయం కోసం ఫిర్యాదు చేయమని సిట్ అధికారులు పిలుపునివ్వడంతో శనివారం వారు తుర్కపల్లి తహసీల్దార్‌తో పాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంబంధిత ఫిర్యాదు పత్రాన్ని జిల్లా ఎస్పీకి అందించనున్నట్లు తెలిపారు. వివరాలు వారి మాటల్లోనే.. సుక్యతండాలోని 302 సర్వే నంబర్లో 11.12 గుంటల ఖుష్కి భూమిని మా తాత సోమ్లనాయక్ పల్లెపహాడ్‌కు చెందిన పిన్నోజు చంద్రయ్య వద్ద ఖరీదు చేసుకున్నాడు. 90 సంవత్సరాల నుంచి మా తాత వారుసులు ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. అప్పట్లో అవగాహనలేక రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. సాదా దస్తావేజు మీద రాసుకుని భూమి కొనుగోలు చేశారు. నాటి నుంచి రికార్డులో మా తాత వారుసులమే కాస్తుగా ఉంటున్నాం. పది సంవత్సరాల క్రితం మాకు తెలియకుండా భూమికి సంబంధించిన (రికార్డులో) వారసులు పిన్నోజు ప్రేమ్‌రాజ్,పిన్నోజ్ సింహచారిలను తీసుకొని వెళ్లి 13–10–2006లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నయీమ్ అనుచరులమని చెప్పి భువనగిరికి చెందిన మహ్మద్ ఆరీఫ్, అబ్దుల్ నాసర్, మహ్మద్ మక్సూద్, మహ్మద్ యూనస్ మమ్ములను భయభ్రాంతులకు గురిచేసి మా భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చే సుకున్న తరువాత వారంతా అదే రాజు అర్ధరాత్రి మా భూమి వద్దకు వచ్చి కడీలు నాటారు. మా పై దౌర్జన్యం చేసి భూమిని వదిలేస్తారా.. చస్తారా అంటూ బెదిరించారు. భూమిలోకి ప్రవేశిస్తే చంపుతామన్నారు. మా తాత గారి ఆస్తి వల్ల వారి వారసులుమైన 8 కుటుంబాలు జీవిస్తున్నాయి. పది సంవత్సరాల నుంచి న యీమ్ అనుచరులమని చెప్పి మా ఇళ్లపై దాడిచేసి భయానక వాతావరణం సృష్టించారు. ఈభూమిలోని బోరు, బావి, పొలం అన్ని విడిచి పెట్టి పోవాలని హెచ్చరికలు చేశారు. భూమి కోల్పోయిన తరువాత అప్పులు భారం పెరిగి పోయి 2014 సంవత్సరంలో మా చిన్నాన్న భానోత్ పడిత్యా ఉరేసుకుని చనిపోయాడు. మా భూమిని అక్రమంగా చేసుకున్న రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి మాకు పట్టదారు పాస్‌పుస్తకాలు అందించాలి. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
భువనగిరిలో నయీం బెదిరింపుల దందా
-
నయీం కేసును సీబీఐకి అప్పగించాలి
నాంపల్లి : నయీం కేసును సీబీఐకి అప్పగించాలని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మండలకేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ 152 టీఎంసీలకు తీర్మానం చేస్తే టీఆర్ఎస్ పార్టీ 148 టీఎంసీలకు మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రాజెక్ట్‌లకు రీ డిజైన్ చేసి రాష్ట్ర ప్రజలకు నష్టం వాటిల్లేలా చేస్తుందని విమర్శించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల తీరు ఏమీ బాగాలేదని ముఖ్యమంత్రి వారిని సరైన దారిలో పెట్టాలన్నారు. జిల్లాలోనే వెనుకబడిన మండలం నాంపల్లికి బస్సుడిపో, డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. మండలంలో పైచదువుల కోసం విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. అనంతరం స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్‌గా ఎన్నికైన ఏదుళ్ల రాములును ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో కిసాన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుంభం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, మండల అధ్యక్షుడు నిమ్మల వెంకట్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నేర్లకంటి జంగయ్య, పానగంటి వెంకటయ్య, నాంపల్లి గ్రామ సర్పంచ్ పెరమాల్ల శైలజాశ్యామ్సుందర్, ఎంపీటీసీ కొరె ప్రమీలమురళి, సర్పంచ్‌లు గిరి లక్ష్మీవెంకటేశ్వర్లు, లక్ష్మవెంకట్రెడ్డి, కలకొండ దుర్గయ్య, కోన్‌రెడ్డి వెంకటయ్య, నెర్లకంటి రవి, కస్తూరి గోవర్ధన్, సుదర్శన్, ఏదుళ్ల రాములు, జంగయ్య, తదితరులున్నారు. -
నయీం కేసును సీబీఐతో విచారణ జరిపించాలి
నల్లగొండ టౌన్ : నయీం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నయీంతో సంబంధం ఉన్న అధికార పార్టీ నాయకులను కేసుల నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానం కలుగుతుందన్నారు. నయీం ఆస్తులను అతని బాధితులకు పంపిణీ చేయాలని, అతనితో సంబంధం ఉన్న వారందరి పేర్లను బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 2న దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెలో సీపీఐ ప్రత్యక్షంగా పాల్గొంటుందని తెలిపారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట ఉత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 11న బస్సుయాత్రను నిర్వహిస్తున్నారని. బస్సుయాత్ర కొలనుపాక గ్రామంలో ప్రారంభమవుతుందన్నారు. సమావేశంలో నాయకులు పల్లా దేవేందర్‌రెడ్డి, నెల్లికంటి సత్యం, కలకొండ కాంతయ్య, బి.వెంకటేశ్, లెనిన్ తదితరులు పాల్గొన్నారు. -
భువనగిరి కోర్టుకు పాశం శ్రీను
భువనగిరి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ప్రధాన అనుచరుడు పాశం శ్రీనును పోలీసులు బుధవారం నల్లగొండ జిల్లా భువనగిరి కోర్టులో హాజరుపర్చారు. పీడీ యాక్టు కింద ఇప్పటికే వరంగల్ జైలులో ఉన్న శ్రీనును.. పీటీ వారంట్లో భాగంగా భువనగిరి కోర్టుకు తీసుకువచ్చారు. అతడి హాజరును నమోదు చేసుకున్న న్యాయమూర్తి మరో 14 రోజులు రిమాండ్ పొడిగించారు. నయీమ్ ఎన్కౌంటర్ అనంతరం నమోదైన పలు కేసుల్లో పాశం శ్రీనును విచారించేందుకు సిట్ అధికారులు.. తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరుతున్నారు. పోలీసు కస్టడీకి ఫయీమ్ దంపతులు నయీమ్ సన్నిహితులు ఫయీమ్‌తో పాటు అతని భార్య షాజీదా షాహీన్‌లను రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ ఉప్పర్‌పల్లి కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నయీమ్ కేసులో మరింత సమాచారం రాబట్టాల్సి ఉందన్న పోలీసుల విజ్ఞప్తి మేరకు న్యాయమూర్తి కస్టడీకి అనుమతించారు. ఇక నయీమ్ వంట మనిషిగా పేర్కొంటున్న ఫర్హానా, అఫ్సాలను మరోసారి కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. వారిని ఇప్పటికే రెండు సార్లు కస్టడీకి ఇచ్చినందున మరోసారి ఇవ్వలేమని పేర్కొన్నారు. మరోవైపు నయీమ్ భార్య హసీనాతో పాటు అక్క సలీమాను ట్రాన్సిట్ వారంట్‌పై విచారించేందుకు అనుమతివ్వాలని ఉప్పర్‌పల్లి న్యాయస్థానంలో నార్సింగి పోలీసులు బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. వారిని కస్టడీలోకి తీసుకునేందుకు పీటీ వారంట్లు జారీ చేయాలని కోరారు. దీనిపై కోర్టు గురువారం నిర్ణయం తీసుకోనుంది. హసీనా, సలీమాలను ఇప్పటికే షాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేయగా.. మహబూబ్‌నగర్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. -
పోలీసు కస్టడీలోకి నయీమ్ అనుచరులు
వలిగొండ : గాంగ్స్టార్ నయీం అనుచరులైన మండల కేంద్రానికి చెందిన ముగ్గురిని మంగళవారం సిట్ అధికారులు విచారించినట్టు సమాచారం.lవలిగొండకు చెందిన కొనపూరి శంకర్, కొనపూరి శ్రీశైలం, గుండు వెంకటేశంల వద్ద మారణాయుధాలు లభించడంతో కొన్ని రోజుల క్రితం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయితే వారిని విచారణ నిమిత్తం సిట్ అధికారులు కోర్టు ద్వారా మూడు రోజుల కస్టడీకి తీసుకున్నట్లు సమాచారం. వారిని మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో సిట్ అధికారులు, రామన్నపేట సీఐ శ్రీధర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు విచారించినట్లు తెలిసింది. మరో రెండు రోజులపాటు విచారణ చేయనున్నట్లు సమాచారం. -
నెలలో సస్తననుకుంటున్నావ్రా?
-
మంత్రి అచ్చెన్నాయుడికి నయీమ్‌తో సంబంధాలు
-
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడికి నయీమ్‌తో సంబంధాలు
- సంచలన విషయాలు బయటపెట్టిన సినీ నిర్మాత నట్టికుమార్ - ఉమ్మడి రాష్ట్రంలోని టీడీపీ సర్కారే నయీమ్‌ను పోషించింది - నిర్మాతలు సి.కల్యాణ్, అశోక్‌కుమార్, శివరామకృష్ణలకు కూడా నయీమ్‌తో సంబంధాలు సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ను పెంచి పోషించింది తెలుగుదేశం ప్రభుత్వమేననీ, అతడి దుర్మార్గాలకు పలువురు టీడీపీ నాయకులు అండగా నిలిచారని సినీ నిర్మాత నట్టికుమార్ ఆరోపించారు. టీడీపీ నేత, ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుకి నయీమ్ గ్యాంగ్‌తో సత్సం బంధాలున్నాయన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నట్టికుమార్ సంచలన విషయాలు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలోని ఓ పవర్‌ప్లాంట్‌కు సంబంధించి నయీమ్‌తో అచ్చెన్నాయుడు చేతులు కలిపారన్నారు. కావాలంటే సీబీఐతో దర్యాప్తు చేయిస్తే.. నిజానిజాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ‘‘నర్సన్నపేటలోని నా థియేటర్ వెంకటేశ్వరా మహల్‌ను నయీమ్ అనుచరులు అజీజ్, అంజిరెడ్డిలు అక్రమంగా లాక్కున్నారు. ఓ స్థలం వివాదంలో రెండు నెలల క్రితం నయీమ్ గ్యాంగ్ నన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని నా మిత్రుడితోపాటు ఓ ఎమ్మెల్యే ద్వారా సమాచారం అందింది. దీంతో అలర్ట్ అయ్యాను. నన్ను నేను కాపాడుకోగలిగాను. ఓ రోజు ఫ్లైట్‌లో కలిసిన అచ్చెన్నాయుడితో ఈ విషయాలు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. నయీమ్‌తోనే సెటిల్ చేసుకోమన్నారు. నయీమ్ అండతో ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడు ప్రత్యేక పాలన కొనసాగించారు. మొన్నటివరకూ విశాఖ ఏసీపీగా పనిచేసిన రమణమూర్తి, నర్సన్నపేట సీఐ చంద్రశేఖర్, డీఎస్పీ, ఎస్పీల దగ్గరకు వెళ్లాను. న్యాయం చేయమని కోరాను. ఏం చేయలేమన్నారు. రివర్స్‌లో సీఐ చంద్రశేఖర్ నన్నే బెదిరించారు’’ అని నట్టికుమార్ చెప్పారు. థియేటర్లన్నీ నయీమ్ డబ్బుతోనే.. విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న థియేటర్లన్నీ నయీమ్ డబ్బుతోనే కడుతున్నారని నట్టికుమార్ పేర్కొన్నారు. ‘‘నయీమ్ అనుచరుడు జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఈ థియేటర్ల దందా నడుస్తోంది. అక్కడ థియేటర్లన్నిటిలో జగ్గిరెడ్డి క్యాంటీన్లను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ కనీసం రూ.5 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఒక్క రూపాయికి కూడా లెక్కలు ఉండవు. నిర్మాతలు సి.కల్యాణ్, అశోక్‌కుమార్, బూరుగుపల్లి శివరామకృష్ణ, తెలుగులో కొన్ని చిత్రాలు చేసిన బాలీవుడ్ నటుడు-నిర్మాత సచిన్ జోషిలతోనూ నయీమ్‌కు సంబంధాలున్నాయి. సచిన్ జోషి డబ్బుతో బండ్ల గణేశ్ సినిమాలు నిర్మించారు. తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వకపోతే నయీమ్ మనుషులతో వసూలు చేసేందుకు సచిన్ జోషి ప్రయత్నించారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నయీమ్ అండతోనే విశాఖలో కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను అశోక్‌కుమార్ సంపాదించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే కనకారెడ్డికి అల్వాల్‌లో ఓ గెస్ట్‌హౌస్ ఉంది. ఆయుధాలతో సహా నయీమ్ అనుచరులు అందులో ఉన్నారు. నయీమ్ ఒక్కడే మరణించాడు. అతడి అనుచరులు, సైన్యం మరణించలేదు’’ అని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నయీమ్ గ్యాంగ్‌పై కఠిన చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. సిట్‌పై తనకు నమ్మకం ఉందని చెప్పారు. నయీమ్ ఆగడాలపై ఏపీ సీఎం చంద్రబాబు నిజాయితీగా విచారణ జరిపించాలన్నారు. -
చంపేసి పాతిపెట్టారు
- నయామ్ చేతిలో హత్యకు గురైన వంట మనిషి నస్రీన్ మృతదేహం లభ్యం - మంచిరేవుల వద్ద గుర్తించిన పోలీసులు - నిద్ర మాత్రలిచ్చి చంపేశారు: సిట్ చీఫ్ నాగిరెడ్డి సాక్షి, హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీమ్ చేతిలో హతమైనవారి మృతదేహాలు బయటపడుతున్నాయి. తన సొంత అక్క భర్త నదీమ్ అలియాస్ విజయ్‌కుమార్‌ను మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దుల్లో పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు వెలుగు చూడగా.. తాజాగా వంట మనిషి నస్రీన్ (17) మృతదేహం బయటపడింది. నార్సింగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మంచిరేవుల గ్రామం వద్ద ఆమె మృతదేహం లభ్యమైనట్లు సిట్ ఛీప్ వై.నాగిరెడ్డి తెలిపారు. నయీమ్ సమీప బంధువుల ఫంక్షన్‌కు వారితో పాటు వస్తానని మారాం చేసినందుకే హత్య చేసినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఇంట్లో ఉండలేనంటూ ప్రాధేయపడినా వినకుండా నయీమ్ విచక్షణా రహితంగా కొట్టినట్లు ఆయన తెలిపారు. ఆ దెబ్బలకు తాళలేక సృ్పహ తప్పి పడిపోయిన నస్రీన్‌కు బలవంతంగా నిద్రమాత్రలు మింగించడంతో మృతి చెందిందని వివరించారు. ఆమె మరణించినట్లు నిర్ధారించుకొని మంచిరేవుల వద్ద పాతిపెట్టారన్నారు. అలాగే మిస్సింగ్‌గా భావిస్తున్న అలీముద్దీన్ భార్య, అతడి కూతురు ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. నస్రీన్ అస్థి పంజరం దొరికిన రోడ్డులోనే నెల రోజుల క్రితం నార్సింగ్ పోలీసులు ఐదెకరాల భూమిలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. శేషన్న కోసం గాలింపు గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు కుడిభుజంగా, గ్యాంగ్‌లో రెండో స్థానంలో కొనసాగిన శేషన్న కోసం సిట్ పోలీసులు గాలిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటకు చెందిన శేషన్న కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అతన్ని అదుపులోకి తీసుకుంటే నయీమ్‌కు సంబంధించిన అనేక విషయాలు వెలుగు చూడవచ్చని భావిస్తున్నారు. నయీమ్ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శేషన్న మూడో వ్యక్తికి తెలియకుండా పనిపూర్తి చేసేవాడు. అందుకే శేషన్న పట్టుబడితే అనేక అంశాలు వెలుగు చూస్తాయని పోలీసు లు భావిస్తున్నారు. అలాగే నయీమ్ గ్యాంగ్‌కు చెందిన మరో ఇద్దరిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగినట్లు సమాచారం. కుప్పలు తెప్పలుగా ఆస్తులు గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు సంబంధించిన ఆస్తులు కుప్పలు తెప్పలుగా వెలుగు చూస్తున్నాయి. సిట్ విచారణలో ఇప్పటి వరకు వెయ్యికి పైగా భూ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. డాక్యుమెంట్ ప్రకారమే వాటి విలువ దాదాపు రూ.143 కోట్లు ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. వీటి బహిరంగ మార్కెట్ విలువ దాదాపు పది రెట్లకు పైగానే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆస్తులన్నీ కూడా భార్య హసీనా, సోదరి సలీమా, ఇంట్లో పనిమనిషి ఫర్హానా పేరిట ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో భారీగా ఆస్తులున్నట్లు గుర్తించారు. త్వరలో వాటి విలువను మదింపు చేయనున్నారు. 34 మంది అరెస్టు రాష్ట్ర వ్యాప్తంగా నయీమ్‌పై నమోదవుతున్న కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా సోమవారం నల్లగొండలో మరో కేసు నమోదైంది. దీంతో ఇప్పటి వరకు నయీమ్‌పై నమోదైన కేసుల సంఖ్య 38కి చేరింది. అలాగే కేసుల దర్యాప్తులో భాగంగా పోలీసులు.. ఇప్పటి వరకు నయీమ్ అనుచరులను దాదాపు 34 మందిని అరెస్టు చేశారు. అతని భార్య హసీనా, సోదరి సలీమాతో పాటు సమీప బంధులు ముఖ్య అనుచరులందరినీ అరెస్టు చేస్తున్నారు. తాజాగా సోమవారం మరి కొందరిని అరెస్టు చేశారు. వీరిలో కరీంనగర్ జిల్లాకు చెందిన గోపి అలియాస్ నార్సింగ్ గోపి, అదే జిల్లాకు చెందిన రమేశ్ అలియాస్ రాంబాబు ఉన్నారు. -
నయీమ్ కోడలు కారు డ్రైవర్ అరెస్టు
పలు డాక్యుమెంట్లు స్వాధీనం మిర్యాలగూడ అర్బన్: ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన గ్యాంగ్‌స్టర్ నయీమ్ కోడలు సాజిదా బేగం కారు డ్రైవర్ మహ్మద్ మసూద్ అలీని సోమవారం అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ సీఐ భిక్షపతి తెలిపారు. మసూద్ ఆంధ్రా ప్రాంతానికి వెళ్తున్నట్లు తమకు విశ్వసనీయ సమాచారం అందడంతో ఈదులగూడ వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. మసూద్ అలీ నుంచి బొలేరో వాహనంతో పాటు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ భిక్షపతి తెలిపారు. ఆ డాక్యుమెంట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, విశాఖపట్నం, బాపట్ల, విజయవాడకు చెందినవిగా గుర్తించినట్లు భిక్షపతి వివరించారు. -
నెలలో సస్తననుకుంటున్నావ్రా?
నన్ను సంపిద్దామని ప్లాన్ చేస్తున్నవ్లే - చచ్చేది నువ్వో, నేనో చూద్దాం - సీఎం దగ్గరైనా కూర్చో.. నీకు దేవుడే గతి - వ్యాపారి గంపా నాగేందర్‌కు నయీమ్ బెదిరింపులు - ఫోన్ సంభాషణలు రికార్డు చేసి పోలీసులకిచ్చిన బాధితుడు సాక్షి, హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీమ్ నుంచి తీవ్రస్థాయిలో బెదిరింపులు ఎదుర్కొన్న తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, వ్యాపారి గంపా నాగేందర్ ఆ సంభాషణల్ని రికార్డు చేశారు. నయీమ్ ఉదంతంపై ఈ నెల 17న నల్లగొండ జిల్లా భువనగిరి పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. దాంతోపాటు సంభాషణల రికార్డునూ అందించారు. సోమవారం మీడియాకు చేరిన ఆ ఆడియో రికార్డులోని అంశాలు... నయీమ్: అన్నా నమస్తే అన్నా నాగేందర్: నమస్తేనే నయీమ్: ఏమన్నా, అన్ని ఫోన్లూ బంద్ చేసినవ్ నాగేందర్: హాస్పటల్లో ఉన్నా. మొత్తం కరువుంది. దాంతో అమౌంట్ అరేంజ్ కాలేదు. ఒక్క నెలలో, మే 31 వరకు చేయిస్తా నయీమ్: నువ్వు ఇట్ల మాట మార్సుడు మంచిదేనా అన్నా? నాగేందర్: నేనట్ల చెయ్యనే. మీకు మాటిచ్చినాక ఏ పరిస్థితుల్లోనూ మార. తప్పకుండా చేయిస్తా. 15 రోజుల నుంచి సన్‌స్ట్రోక్‌తో హాస్పటల్లో ఉన్నా నయీమ్: సరే. నువ్విచ్చినా ఇంక తీసుకోను కానీ నేను... నాగేందర్: అన్నా, నువ్వట్లనకే... నయీమ్: నీకు రెస్పెక్ట్ ఇచ్చినం. నువ్వు నిలబెట్టుకోలేదన్నా. నువ్వెఎట్లుంటవో మాకు తెల్వదు. రికార్డు చేసుకుంటే చేసుకో. నాకేం భయం కాదు. నా మీద ఓ కేసు అయితాది. అంతకంటే ఎక్కువ ఏం కాదు. నాగేందర్: నీకు దండం పెడుత. కాల్మొక్కుత. ఒక్క నెల టైమియ్యి నయీమ్: నీ కొడుకుల్లో ఒకరు దేవుని దగ్గరకు వెళ్తడు నాగేందర్: మే 31 వరకు 100 శాతం చేయిస్తా. దయచేసి ఈ ఒక్కసారీ నా మాట విను నయీమ్: నన్ను చంపిద్దామని ఏం ప్లాన్ చేస్తున్నావ్లే! నాకన్నీ తెల్సన్నా. నువ్వు చస్తవో, నేను చస్తనో చూద్దాం నాగేందర్: అన్నా, నేనలాంటి ప్రయత్నాలు చేయట్లేదు. ప్రమాణంగా చెప్తున్నా నయీమ్: ప్లాన్ వేస్తున్నావ్ కదా. సచ్చేదెవరో ఇప్పుడు చూస్తానింక నాగేందర్: నీకు దండ పెడతనే. అట్లేంలేదు. నయీమ్: నువ్వు ప్లాన్ వేస్తే వెయ్. నువ్వెక్కడికి పోతున్నవ్? ఏమేం చేస్తున్నవ్? నా పిల్లల (అనుచరుల) మీద హరాస్మెంట్లు చేయిస్తున్నావ్. పీడీ యాక్ట్ పెట్టిస్తున్నావ్. నువ్వేమేం చేసినవో అన్నీ నాకు తెల్సన్నా. నాగేందర్: అన్నా... అన్నా... అన్నా... నయీమ్: పో... సీఎం దగ్గరికి పోయి కూర్చో, ఎవరి దగ్గరైనా కూర్చో అన్నా. నీకింక దేవుడే గతి. నీ శక్తి సరిపోతే నువ్వు చేపియ్. నా శక్తి సరిపోతే నేన్ చేపిస్తా నాగేందర్: నేనట్లా చేసేటోణ్ణి కాదే. నీ మెసేజ్ రాంగానే నీకు ఫోన్ చేసినాను కదే నయీమ్: మెసేజ్ రాంగానే ఫోన్ చేసినానంటే నీ సద్ది ఇంతేనా అన్నా? తిక్క లెక్క ఉన్నదా నీకు? భయం లేదా నీకు? నాగేందర్: నన్ను అర్థం చేసుకుని నెల టైమివ్వు (వణుకుతున్న గొంతుతో). అప్పటికీ చెయ్యకపోతే నన్ను అడుగు. నయీమ్: వన్ మంత్ అని ఈ రోజు చెప్తున్నవ్. మరి ఆ రోజు. ఇక (అమౌంట్) నువ్విచ్చినా నేను తీసుకోను. నీకేమైనా అయితే నాకు తెల్వద్. కేసు పెట్టుకో, ఏమైనా చేసుకో నాగేందర్: అన్నా, నేను కేసు పెట్టేటోణ్ణి కాదు. పోలీసోళ్ల కాడికి పోయేదుంటే నీకెందుకు ఫోన్ చేస్తనే? అట్లైతే నీ ఫోనే ఎత్త కదే..! నయీమ్: నువ్వు అక్కడికి పోతే ఏం పీక్తరన్నా.. మాట్లాడితే... నాగేందర్: నాకన్న పెద్ద పెద్దోళ్లే భయపడ్తరు, దాంట్ల నేనెంతన్నా? వన్ పర్సెంట్ కూడా కాదు నయీమ్: మరి ఇప్పటివరకు నాకు మాటిచ్చి ఎవరైనా తప్పి ఉంటరా? అంత ధైర్యం చేసి ఉంటరా? నువ్వు చేసినవ్ మరి? నా బాధ్యత ఏందంటే, నీకు ఏం జరుగుతదో ముందో చెప్తున్నా. కాపాడుకోగలిగితే కాపాడుకో ఇంక నాగేందర్: నీకు దండం పెడ్తనే. కాల్మొక్తనే. వన్‌మంత్ టైమ్ ఇయ్యవే నయీమ్: ఎట్లా కన్పిస్తున్నా అన్నా నేను? (అమౌంట్) నువ్విచ్చినా నేను తీసుకోను నాగేందర్: అన్నా, ఈ ఒక్క... ఒక్క...సారికీ (భయపడుతూ) నన్ను కాపాడే నయీమ్: నువ్వు ఏమనుకుంటన్నవంటే, ‘వన్ మంత్‌లో ఈడు సచ్చిపోతాడు కదా, సచ్చిపోతే పోతాది అనుకుంటున్నావ్ కదా...’ అని. నేను చావన్రా అరేయ్! నాగేందర్: అన్నా... అన్నా... ప్రమాణంగా ఆ ఆలోచనే లేదన్నా నాకు. నేను భువనగిరికి రాక కూడా తొమ్మిది నెలలయితాందన్నా. నువ్వు చెప్పినావనే వచ్చిన. భువనగిరిల ఉంటలేను నయీమ్: నువ్వు ఇట్లా చేస్తే నీకు బాగుండదన్నా. నువ్వే పీడీ యాక్ట్, గీడీ యాక్ట్ అన్నీ ప్రెషర్ చేసి చేయించినావని డౌటుంది. కాబట్టి నీకు నెల టైమియ్యలేను. ఈ సాయంత్రం వరకు సగం పేమెంట్ చేసుకో. 15 రోజుల్లో మిగిలింది చేసుకో నాగేందర్: అన్నా అన్నా అన్నా నీ కాల్మొక్తనే. దండం పెడత. కనీసం వన్‌మంత్ ఇయ్యవే నయీమ్: ఇయ్యలేనన్నా. ఇయ్యలేను. ఈ రోజు సగం, 15 రోజుల్లో సగం నాగేందర్: నువ్వు ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదన్నా.. నీతో డెరైక్ట్‌గా మాట్లాడదామంటే నీ నెంబర్ నాకాడ లేక, ఎవరిని కాంటాక్ట్ చెయ్యాలో తెలుస్తలేదన్నా నయీమ్: ఎవరికియ్యాలేంది? నీకు పాశం అన్న (ఫోన్) చేస్తడని చెప్పినాను కదా. పిల్లలు వస్తరు, ఇయ్యాలని చెప్పినా కదా నీకు నాగేందర్: అన్నా నెల రోజుల ఆపన్నా. నీ కాల్మొక్తనే. నీకు దండం పెడతనే. ఈ ఒక్కసారీ కాపాడే (వణుకుతున్న గొంతుతో) నయీమ్: నెల రోజులైతే కాపాడలేనన్నా. నేను చెప్తన్నా చూడన్నా. నీకేమైనా ఇబ్బంది అయితే... ఫోన్ పెట్టేస్త నాగేందర్: అన్నా, నా జీవితంలో ఎవర్నీ ఇంతల్లా రిక్వెస్ట్ చెయ్యలేదు. వన్‌మంత్ ఆపే. నీ కాల్మొక్కుత. పువ్వుల్ల పెట్టిస్త. నాకు నువ్వు కాంటాక్ట్ అవ్వడమే నా అదృష్టం నయీమ్: 15 రోజుల టైమ్ తీస్కో. వన్ మంత్ ఇయ్యట్లేదు. నువ్వు ఫోన్ ఎందుకు లేప్తలేవ్ చెప్పు నాగేందర్: అన్నా, అన్నా. వన్ మంత్ నయీమ్: సరే. ‘పది రూపాయలు’ (అంటే రూ.10 లక్షలు) ఎక్కువియ్యాలె నాగేందర్: నాకేం పెట్టకే ఇంక. 31 వరకు టైమ్ ఇయ్యవే నయీమ్: నువ్వు మళ్ళీ 31వ రోజు కూడా కాల్మొక్తవ్ నాగేందర్: అన్నా, ఈసారి తప్పకుండా చేస్తనే. మొక్క ఇక నయీమ్: చెయ్యకపోతే నేనింక కాల్ చెయ్య మరి నాగేందర్: చెయ్యకన్నా నయీమ్: చెయ్యను. తర్వాత ఏం జెయ్యాల్నో జేస్కుంట నాగేందర్: సరే మంచిదన్నా. 31 లోపట చేయిస్తా. మంచిది. నయీమ్: 31 లోపట అంటే మన పిల్లలు (అనుచరులు) ఎప్పుడు (కాల్) చెయ్యాలె? నాగేందర్: కాల్ అవసరం లేదే. మనిషిని పంపియ్ ఇచ్చేస్త నయీమ్: 31 నాడు మనిషిని పంపియ్యాల్నా? నాగేందర్: అవ్ అన్నా నయీమ్: సరే నాగేందర్: నమస్తే నయీమ్: సరే అన్నా..31 నాడు ఎక్కడ పంపియ్యాలె మనిషిని? నాగేందర్: భువనగిరిలో అరేంజ్ చేస్తా నయీమ్: భువనగిరిల వద్దు. హైదరాబాద్‌ల అరేంజ్ చెయ్ నాగేందర్: సరే. నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ చేస్తనే నయీమ్: ఔనూ, నీకు ఫోన్ ఎప్పుడు చెయ్యాలె? నాగేందర్: ఫోనెందుకే? 31 నాడు చేపిస్తనే. టైమ్ ఇచ్చినవుగా నయీమ్: 31 నాడు చెయ్యద్దా ఫోన్ మరి? నాగేందర్: 31 నాడు చెయ్యవే నయీమ్: అప్పుడు మళ్ల ఫోన్లు బంద్ పెట్టుకుంటవా? నాగేందర్: ఇప్పుడు బంద్ ఏమీ పెట్టుకోలేదే నేను నయీమ్: సరే. ఒక నెలల నేను సచ్చిపోతే పైసలు మిగుల్తాయని అనుకుంటున్నావేమో! నువ్వు, శ్రీధర్‌బాబు ఎవడెవడు కల్సి ఏం చేస్తున్నరో గానీ, నేన్ చెప్తున్నా నువ్వు మంచిగుంటే నేను మంచిగుంటా. నువ్వు చెడ్డగుంటే నేను చేసేది నేను చెయ్యాల్సి వస్తది. నాగేందర్: అన్నా నీతోటి కల్సిన తర్వాత నేను ఎవర్నీ, శ్రీధర్‌బాబు అన్నను కూడా కల్వలేదు. నేతి విద్యాసాగర్‌ని కూడా నువ్వు కల్వద్దు అన్నాక నేను కల్వలేదు నయీమ్: సరే. నేను 31 తారీఖు ఫోన్ చేస్తా. నేను లేదా పాశం అన్న చేస్తడు. ఫోన్ ఆన్ పెట్టుకో (ఈ సందర్భంలో వాహనాల హారన్ శబ్దాలు వినిపించాయి. దీన్ని బట్టి ఆ సమయంలో నయీమ్ ఏదైనా హైవేపై ఉండి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు) నాగేందర్: మంచిదన్నా. ఉంటనే -
నయీమ్ ఆస్తులకు లెక్కేలేదు..
⇔ పోలీసులకు సైతం అంతుపట్టని నయీమ్ ‘ఖజానా’ ⇔ రాష్ట్రంలోని ఖరీదైన ప్రాంతాల్లో 1,015 ఎకరాల్లో వెంచర్లు ⇔ మరో లక్షన్నర గజాలకు పైగా విస్తీర్ణంలో ఇళ్లు, కాంప్లెక్సులు ⇔ ఈ మొత్తం ఆస్తుల విలువ రూ.వేల కోట్లలో.. ⇔ ఇక ఇతర రాష్ట్రాల్లో ఎన్నున్నాయో..! సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ జరిగి పదిరోజులవుతున్నా అతడి ఆస్తుల లెక్కలు పోలీసులకు అంతుపట్టడం లేదు. ఆస్తుల చిట్టా విప్పే కొద్దీ బయటకొస్తోంది.. ఎక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయో అధికారులు సైతం ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఇప్పటివరకు సిట్ గుర్తించిన ఆస్తులే దిమ్మ తిరిగిపోయేలా ఉన్నాయి. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న వందలాది డాక్యుమెంట్లను సిట్ క్షుణ్నంగా పరిశీలిస్తోంది. ఒక్క రాష్ట్రంలోనే నయీమ్ చెరలో ఖరీదైన ప్రాంతాల్లో 1,015 ఎకరాల భూమిలో వెంచర్లు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చిన సిట్.. రెవెన్యూ అధికారులతో కలసి ఈ స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలి స్తోంది. వీటితోపాటు రాష్ట్రంలోని ముఖ్య పట్టణాల్లోనూ లక్షన్నర గజాలకు పైగా విస్తీర్ణంలో ఇళ్లు, షాపింగ్ కాంప్లెక్స్, ఓపెన్ ఫ్లాట్లు ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. ఈ ఆస్తుల విలువను ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ ప్రకా రం కేవలం రూ.14.39 కోట్లుగా లెక్కగడుతున్నారు. అయితే మార్కెట్లో వీటి విలువ రూ.1,500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. హైదరాబాద్ పరిసరాల్లోని కొండాపూర్ ఏరియాలో నయీమ్ చెరలో ఉన్న 9 ఎకరాల స్థలమే దాదాపు రూ.200 కోట్లు ధర పలుకుతోంది. నయీమ్ ఆస్తులన్నీ హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటం తో వాటి విలువ వేలాది కోట్లలో ఉంటుందని స్పష్టమవుతోంది. ఇక మిగతా రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో ఇంకెన్ని ఆస్తులు ఉన్నాయనే విషయాలు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. సిటీలో షాపింగ్ కాంప్లెక్స్‌లు..? నయీమ్ ఇంటి వద్ద లభించిన పత్రాల్లో సిటీల్లోనూ షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఇళ్లు, ఫ్లాట్ల రూపంలో 1,67,117 గజాల భూమి ఉందని పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో మూడు షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయని గుర్తించిన సిట్ అధికారులు ఇప్పటికే అక్కడ తనిఖీలు చేసినట్లు సమాచారం. వీటితోపాటు ఓపెన్ ప్లాట్ల వివరాలను పూర్తిస్థాయిలో సేకరించారు. పుప్పాలగూడ పరిధిలోని నెక్నాంపూర్ గ్రామపంచాయతీ అల్కాపురి టౌన్‌షిప్‌లోని నయీమ్ ఇంటితోపాటు అతడి వంట మనిషి ఫర్హానా పేరిట ఉన్న అంజలీ గార్డెన్, తిరుమల గార్డెన్‌లోని ఇళ్లను కూడా పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారు. మిగతా ఐదు రాష్ట్రాల్లో ఆస్తులెన్నో..! రాష్ట్రంలోనే వేల కోట్ల ఆస్తులుంటే నయీమ్ దందా సాగిన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో ఎన్ని ఆస్తులు ఉంటాయన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే సైబరాబాద్ వెస్ట్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించిన నయీమ్ వంట మనిషి ఫర్హానా, అతడి డ్రైవర్ భార్య ఆఫ్సాలు వెల్లడించిన ప్రకారం ఆ ఐదు రాష్ట్రాల్లో ఆస్తులున్నట్టుగా తెలిసింది. వీటిని గుర్తించేందుకు న్యాయస్థానం ఆ ఇద్దరినీ బుధవారం నుంచి ఆరు రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వడంతో ఏపీతోపాటు మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు తీసుకెళుతున్నారు. అలాగే మహబూబ్‌నగర్‌లోని షాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేసిన నయీమ్ భార్య హసీనా బేగం, అక్క సలీమా బేగం, షాద్‌నగర్ ఇంటికి చెందిన వాచ్‌మన్ మతీన్, అతని భార్య ఖలీమా బేగంలను వారంరోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో వారిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. వీరి విచారణలో కూడా మరిన్ని ఆస్తుల వివరాలు పూర్తిస్థాయిలో తెలిసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. కన్ను పడిందంటే వదలడు.. ఏదైనా భూమిపై నయీమ్ కన్ను పడిందంటే అది అతడి చేతికి చిక్కాల్సిందే. నగరం, పట్టణం, గ్రామం అనే తేడా ఉండదు. ఆ భూమి ఎవరిదైనా వశం కావల్సిందేనన్నది నయీమ్ సిద్ధాంతం. ఇలా రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాల్లో పట్టణాలకు దగ్గరగా ఉండే వ్యవసాయ భూములను అనుచరగణంతో కలసి కబ్జా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వ్యవసాయ భూములను ఓపెన్ ప్లాట్లుగా చేసి రియల్ ఎస్టేట్ దందా సాగించాలనుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది అనుచరులను ఈ దిశగా రంగంలోకి దింపాడని తెలుస్తోంది. అలాగే హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, కరీంనగర్, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో 20 ఇళ్ల ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు. -
పాండురంగాపురంలోనూ నయీమ్ నీడలు
ఈ ఏడాదిలోనే రెండు దఫాలు వచ్చి వెళ్లినట్లు ప్రచారం తాళం వేసి అనుమానాస్పదంగా ఉన్న ఇంటిపై పోలీసుల ఆరా ఖమ్మం అర్బన్ : గ్యాంగ్‌స్టర్ నయీమ్ నీడలు రోజుకొకటైనా బయటపడుతున్నాయి. రెండో డివిజన్లోని పాండురంగాపురంలోనూ అతని స్థావరం ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. అప్పుడప్పుడు అక్కడికి వచ్చిపోతుండేవాడని అంటున్నారు. పాండురంగాపురంలోని గ్రామదేవత (బొడ్రాయి) వద్ద ఉన్న ఇంటిని సుమారు పదేళ్ల క్రితమే నయీమ్ కొత్తపల్లి ప్రసాద్ పేరుతో కొనుగోలు చేశాడని, తన సమీప బంధువు వరుసకు పెద్దమ్మ అయ్యే అత్తరున్నీసా, మేనల్లుడు మిన్ను దాంట్లో నివాసం ఉండేవారని చెబుతున్నారు. ఇంటిని కొనుగోలు చేసిన తర్వాత ప్రహరీ గోడ ఎత్తు పెంచి, అక్కడక్కడ రంధ్రాలు చేయించాడని, వెనుక వైపు భారీగా ఎత్తు పెంచించాడని అంటున్నారు. అప్పుడప్పుడు నయీమ్ కొంతమంది మహిళలతో వచ్చి రెండు, మూడు రోజులు గడిపి వెళ్లే వాడట. ఈ ఏడాది జనవరిలో, రంజాన్‌కు ముందు నయీమ్ ఇక్కడికి వచ్చి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. నయీమ్ మృతికి వారం రోజుల ముందునుంచే ఈ ఇంటికి తాళం వేసి ఉంటున్నట్లు చెబుతున్నారు. ఇక్కడి నుంచే సెటిల్మెంట్లు పాండురంగాపురంలో కొనుగోలు చేసిన ఇంటి నుంచే భూములు, ప్లాట్ల వివాదంలో సెటిల్మెంట్లు చేసేవాడని చెబుతున్నారు. ప్రస్తుతం తాళం వేసి, చుట్టూ చెత్తాచెదారంతో ఉన్న ఆ ఇల్లు నిర్మానుష్యంగా కనిపిస్తోంది. ఈ ఇంటిని నయీమ్ కొత్తపల్లి ప్రసాద్ పేరుతో కొనుగోలు చేశాడు. అసలు ఈ ప్రసాద్ ఎవరనేది తేలాల్సి ఉంది. స్థానికుడా, నకిలీ పేరును సృష్టించాడా? అనే దానిపై ప్రచారం సాగుతోంది. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ శ్రీధర్ బుధవారం ఆ ఇంటిని పరిశీలించారు. స్థానికంగా ఉన్న పరిస్థితులను ఉన్నతాధికారులకు వివరించినట్లు తెలిసింది. వాస్తవం ‘తాళం’ మాటున.. నయీమ్ స్థావరంగా చెప్పుకుంటున్న ఆ ఇంటి తాళం తీస్తేగానీ అసలు విషయం బయటకు రాదు. ఇంట్లో పెద్దమొత్తంలో బంగారు, డబ్బులు, విలువైన పత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఇంట్లో ఓ వృద్ధురాలు ఉండేది. మేము వెళ్లిన వెంటనే ఆమె పన్ను చెల్లించేది..’ అని పన్ను వసూలు అధికారులు చెబుతున్నారు. మూడు నెలల క్రితం ఇంటి లోపల ఎత్తు బేషన్ అమర్చినట్లు ప్లంబర్ పోలీసుల ఎదుట వివరించాడు. -
మోదీ ఆదేశాల మేరకే నయీం హతం
హిమాయత్‌నగర్: దేశ ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకే టీఆర్ఎస్ ప్రభుత్వం నయీంను హతమార్చిందని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణస్వరూప్ అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా సోహ్రబుద్దీన్‌ను ప్రత్యక్షంగా బూటకపు ఎన్కౌంటర్ చేయించారని, ఆ ఘటనలో అమిత్‌షా దోషిగా ఉన్నట్లు నయీం ప్రత్యక్ష సాక్షి అన్నారు. అందుకే నయీంను హతమార్చినట్లు వడ్లమూరి ఆరోపించారు. హిమాయత్‌నగర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వడ్లమూరి మాట్లాడారు. రాజ్యాంగ వ్యవస్థను సవాల్ చేసే విధంగా నయీం పెరగడానికి పాలకవర్గాలే కారకులని ఆయన మండిపడ్డారు. నయీం హత్యపై సీబీఐ విచారణ జరిపించి ప్రజాప్రతినిధులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నయీం అక్రమంగా సంపాదించిన ఆస్తులను బాధితులకు అందజేయాలన్నారు. అంతర్జాతీయ మాఫియాతోనూ నయీంకు సంబంధాలు ఉన్నాయని, వాటిపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
నయీం భూములను పేదలకు పంచుతాం
సీపీఐ జాతీయ సమితి కార్యదర్శి నారాయణ న్యూశాయంపేట : డకాయిట్ నయీం ఆక్రమించిన భూముల్లో ఎర్రజెండాలు పాతి పేదప్రజల కు పంచిపెడతామని సీపీఐ జాతీయ సమితి కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసి తగిన కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. హన్మకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నయీం చర్యలపైన సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపడితే ఆస్తులు కోల్పోయిన వారికి న్యాయం జరుగుతుందని, అలాగే అతనితో అంటకాగిన అధికారులు, అనధికారు లు, రాజకీయ నాయకుల బండారం బయట పడుతుందన్నారు. సిట్ అధికారులు సేకరించి న ఆధారాలను ప్రతీరోజు హైకోర్టు ముందుం చాలని చెప్పారు. మల్లన్న సాగర్ భూసేకరణ విషయంలో డకాయిట్ నÄæూంకు ప్రభుత్వాని కి తేడా ఏమీ లేదని విమర్శించా రు. ఒక టీ ఎం సీ నిల్వ సామర్థ్యం కలిగిన మల్లన్నసాగర్ ప్రాజెక్టును 50 టీఎంసీలకు పెంచి తన ఇష్టానుసారం గా చట్టాన్ని రూపొందించి రైతుల నుంచి భూసేకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజామోదంతో భూసేకరణ చేయాలే తప్ప బలవంతపు సేకరణ చేయెుద్దని సూచిం చారు. సీఎం కేసీఆర్ నీళ్ల పంపిణీ కంటే రానున్న ఎన్నికల నిధిపైనే మక్కువ చూపుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ, ఆంధ్రా సీఎంలు ప్రధాని నరేంద్ర మోదీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ప్రజలకు మెండి చేయిచూపుతున్నారని అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు అఖిల పక్షాన్ని పిలిచి నిధులు, నీళ్ల విషయంలో కేంద్రపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అధిక ధరలను నిరసిస్తూ ఈనెల 17న దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చామని, సెప్టెంబర్ 2న జరిగే దేశవ్యాప్త సమ్మెకు తమ సంఘీభావాన్ని ప్రకటించినట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి టి.శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, నాయకులు మేకల రవి, కరుణాకర్, విజయసారథి పాల్గొన్నారు. ప్రజా ఉద్యమంలో విజయం సాధించాం భీమారం : ప్రజా ఉద్యమంలో సీపీఐ విజయం సాధిం చిందని.. అయితే ఓట్లల్లో లక్ష్యాన్ని అధిగమించలేకపోతుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నా రు. నగరంలోని 57వ డివిజన్ సుందరయ్యనగర్‌లో శనివారం జరిగిన సీపీఐ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో మెరుగైన ఓట్లు సాధించేందుకు కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలన్నా రు. స్విస్ బ్యాంకులో మన దేశ నాయకులకు సంబంధించిన అవినీతి డబ్బులు రూ.70 లక్షల కోట్లు ఉన్నాయని.. వాటిని ఇక్కడికి తీసుకొస్తే 50 ఏళ్ల పాటు ప్రజలు ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించకుండా దర్జాగా బతుకుతారని చెప్పారు. తొలుత ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అలాగే సుందరయ్యనగర్ లో జరిగిన పార్టీ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్చీ ప్రారంభించారు. సీపీఐ నాయకుడు ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన మహాసభలో మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, నగర కార్యదర్శి సిరబోయిన కరుణాకర్, ఏఐఎస్ఎఫ్ జాతీయ నాయకుడు ఆంజనేయులు, రోహిత్, నాయకులు ప్రభాకర్, రాజేష్, సదానందం, శారద, రంజిత్, అశోక్ స్టాలిన్, సిరబోయిన సతీష్ పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాల దందాలోనూ నయీం?
సాక్షి, సిటీబ్యూరో: ‘ఎన్–కంపెనీ’ ఏర్పాటు కోసం దుబాయ్‌కు మకాం మార్చాలని పథకం వేసిన గ్యాంగ్‌స్టర్ నయీం వీలైనంత త్వరలో ఎక్కువ డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే మాదకద్రవ్యాల దందాలోనూ అడుగుపెట్టినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. గత శనివారం మహారాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ సెల్ (ఏఎన్సీ) అధికారులు కల్వా ప్రాంతంలో అరెస్టు చేసిన సర్దార్ వెల్లడించిన అంశాల ఆధారంగా ఈ కోణంలో దృష్టి పెట్టాడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ‘భాయ్’ తనకు మాదక ద్రవ్యాలను ఇచ్చినట్లు అతను తెలిపారు. కాగా సర్దార్ మాజీ నక్సలైట్‌గా ఏఎన్సీ విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు మహారాష్ట్ర వెళ్ళి సర్దార్‌ను విచారించాలని భావిస్తున్నాయి. ఏజెన్సీల్లోనూ మంచి పట్టు... మహారాష్ట్ర ఏఎన్సీ అధికారులు సర్దార్‌ను గత 6న అదుపులోకి తీసుకుని రూ.22 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అతను ఆయుర్వేద మందుల్ని నవీ ముంబైకు తరలించాలంటూ విశాఖపట్నంలో వాహనాన్ని అద్దెకు తీసుకున్నాడు. అక్కడే ప్లాస్టిక్ బ్యాగ్స్‌లో కట్టిన 150 కేజీల గంజాయిని అందులో పెట్టుకుని బయలుదేరాడు. గతంలో మావోయిస్టు పార్టీలో, ఆపై సుదీర్ఘకాలం పోలీసు ఇన్ఫార్మర్గా పని చేసిన నయీంకు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతంలోనూ మంచి పట్టుంది. అక్కడి ప్రస్తుత, మాజీ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి. వీటి ఆధారంగా గంజాయి సేకరిస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతూ ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరో పక్క నయీంను అతడి అనుచరులు భాయ్‌సాబ్ అనే పిలుస్తుండటం, ఈ అక్రమ రవాణాలో ఓ మహిళ కీలకపాత్ర పోషిస్తోందంటూ సర్దార్ వెల్లడించాడు. నయీం నేర సామ్రాజ్యంలోనూ ఫర్హానా, అఫ్షా, సమీర పేర్లతో ఎందరో మహిళా డాన్లు ఉన్న విషయం విదితమే. గంజాయిని తెలంగాణలో డెలివరీ చేసేందుకు కేజీ రేటు రూ.2 వేలు, హైదరాబాద్‌లో రూ.5 వేలు, మహారాష్ట్రలోని షోలాపూర్‌లో రూ.8 వేలు, ముంబైలో డెలివరీ ఇవ్వడానికి రూ.20 వేలు, నవీ ముంబై వరకు తెస్తే రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ‘భాయ్’ వసూలు చేస్తున్నట్లు ఏఎన్సీ విచారణలో సర్దార్ వెల్లడించాడు. పండిస్తున్నదీ మాజీ మావోయిస్టు... ఈ గంజాయిని విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఓ మాజీ మావోయిస్టు పండిస్తున్నట్లు సర్దార్ తెలిపాడు. ఓ రైతు నుంచి భూమిని లాక్కున్న సదరు మాజీ అందులో గంజాయి పండిస్తున్నాడని, ‘భాయ్’ ఆదేశాల మేరకు తాను విశాఖపట్నం నుంచి సరుకు తీసుకువచ్చి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడించాడు. తాను ‘భాయ్’ని ఎక్కువసార్లు చూడలేదని, ఫోన్లు, అతడి అనుచరుల ద్వారానే వ్యవహారం నడుస్తోందని తెలిపాడు. ఇదే తరుణంలో నయీం ఎన్కౌంటర్ విషయం తెలుసుకున్న మహారాష్ట్ర పోలీసులు సర్దార్ వ్యవహరంపై కేంద్ర నిఘా వర్గాల ద్వారా రాష్ట్ర అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మాదకద్రవ్యాల దందాలో నయీం పాత్రపై ఆరా తీస్తున్నారు. కేంద్ర నిఘా వర్గాలకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘ప్రాథమికంగా అందిన సమాచారం, సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ ప్రకారం ‘భాయ్’ నయీంగా భావిస్తున్నాం. అయితే అక్కడ పట్టుబడిన సర్దార్ మహారాష్ట్ర ముంబ్రాలోని అమృత్‌నగర్‌కు చెందినవాడు. కొంతకాలంగా డ్రగ్స్ దందాలోనే ఉండటంతో ఏఎన్సీ నిఘా ఉంచి పట్టుకుంది. జాతీయ స్థాయిలో నెట్వర్క్ ఉన్న నయీంకు సర్దార్తో పరిచయం ఏర్పడి ఉండే అవకాశాలు ఉన్నాయి. సర్దార్‌ను అన్ని కోణాల్లో విచారించిన తర్వాతే స్పష్టత వస్తుంది’ అన్నారు. -
నయీం అనుచరులు రిమాండ్
-
గోవాలోనూ నయీమ్ డెన్
హైదరాబాద్: నయీమ్‌కు గోవాలోనూ ఓ బంగ్లా ఉన్నట్లు తెలిసింది. నయీమ్ ఏడాదిలో నెలకుపైగా అక్కడే ఉండి సెటిల్మెంట్లు నిర్వహించేవాడని తెలిసింది. తాను టార్గెట్ పెట్టుకున్న వ్యక్తుల్ని అక్కడికి తీసుకెళ్లి బెదిరించి భూములు, ఆస్తులు విక్రయించినట్టు సంతకాలు తీసుకునేవాడని పోలీసులు అనుమానిస్తున్నా రు. రాజేంద్రనగర్ ఏసీపీ ఆధ్వర్యంలో ఓ బృందం గోవాలోని బంగ్లాకు వెళ్లింది. అక్కడి పనిమనిషి ఖాజా ఉద్దీన్‌ను బుధవారం అదుపులోకి తీసుకుంది. బొలేరోతో పాటు రూ. 4.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా.. నయీమ్ వద్ద రూ.50 వేల అప్పు తీసుకున్నందుకు తనను పనిమనిషిగా పెట్టుకున్నాడని పోలీసులకు చెప్పినట్టు సమాచారం. -
నయీం ఇంటి నుంచి వాహనాలు స్వాధీనం
షాద్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగరలోని మిలీనియం కాలనీలోని నయీం ఇంటి నుంచి పోలీసులు బుధవారం పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లు, ఒక స్కూటీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్లు, స్కూటీ రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్‌ను కలిగి ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న వాహనాలు ఎవరివి, ఎవరి పేరుమీద రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయన్న విషయమై పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు నయీం ఇంటినుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలకు కానీ, ఇతరత్రా అంశాలు బయటికి పొక్కనివ్వడం లేదు. -
ఏరియాకో గ్యాంగ్ గల్లికో డెన్
సాక్షి, సిటీబ్యూరో: జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాలు...విసిరేసినట్లు ఉండే కాలనీలు...జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఏరియాలు... సిటీలోని ఇలాంటి వాటినే ఎంచుకున్న నయీం అక్కడి ఇండిపెండెంట్ ఇళ్లల్లో డెన్లు ఏర్పాటు చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో సోమవారం ఎన్కౌంటర్ అయిన తర్వాత తొలుత నార్సింగి ఠాణా పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్లో తొలి డెన్ వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి పోలీసులు కూపీ లాగడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే గల్లీకో డెన్, ప్రాంతానికో గ్యాంగ్ బయటపడుతున్నాయి. రెండేళ్ళ వరకు శంషాబాద్‌లో... నయీం కేసుల్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులు బుధవారం నగరంలోని శంషాబాద్, అల్కాపూర్లతో పాటు హస్తినాపురం, వనస్థలిపురం, మన్సూరాబాద్, కుంట్లూర్‌లోని ఇళ్ళపై దాడులు చేసి సోదాలు నిర్వహించారు. వీటిలో నయీంకు అల్కాపూర్‌లో ఉన్న ఇంటితో పాటు శంషాబాద్‌లో మరో ఇల్లు ఉన్నట్లు గుర్తించారు. అదే ప్రాంతంలో తన అనుచరుల కోసం ఇంకో ఇంటిని వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం ఈ రెండూ ఖాళీగానే ఉన్నాయి. నయీం రెండేళ్ళ క్రితం వరకు దాదాపు మూడేళ్ళ పాటు శంషాబాద్‌లోని సాతంరాయిలో ఉన్న ఇంట్లోనే నివసించాడు. ఈ ఇల్లు ప్రస్తుతం అల్కాపూర్‌లోని నయీం ఇంట్లో సోమవారం పోలీసులకు చిక్కిన ఫర్హానా పేరుతో ఉంది. ఈ డెన్ ఏర్పాటు చేసుకోవడానికి అప్పట్లో ఆ ప్రాంతంలో నివసించిన ఓ పోలీసు అధికారి సహకరించాడని తెలిసింది. కబ్జా చేసి అనుచరులకూ నివాసాలు... రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ దందాలు చేసిన నయీం మొత్తమ్మీద గడిచిన ఐదేళ్ళుగా నగరం చుట్టుపక్కలే నివసించాడు. ప్రతి సందర్భంలోనూ తన నివాసానికి సమీపంలోనే ముఖ్య అనుచరులకు షెల్టర్లు ఏర్పాటు చేసే వాడు. అలాగే వారికి ‘గిఫ్ట్’గా ఇచ్చిన ఫ్లాట్స్, ఇళ్ళల్లోనూ ఇతడు షెల్టర్ తీసుకునేవాడు. ఈ డెన్స్‌లో అత్యధికం కబ్జా పెట్టినవే అని పోలీసులు చెప్తున్నారు. శంషాబాద్‌లోని ఎయిర్పోర్ట్ కాలనీలో కబ్జా చేసిన ఇంటిని అనుచరులకు అప్పగించాడు. వనస్థలిపురం, హస్తినాపురంతో పాటు మిగిలిన ప్రాంతాల్లోనూ ఇలాంటి డెన్స్ ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే నయీం ఎన్‌కౌంటర్‌తో అనుచరులంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో వీటిని గుర్తించడం కష్టసాధ్యంగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు. అనువైన ప్రాంతాలనే ఎంచుకుని... నయీం తనతో పాటు అనుచరులకూ డెన్స్ ఏర్పాటు చేసే విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎవరి దృష్టీ పడని ప్రాంతాలనే ఎంచుకున్నాడు. ప్రధానంగా అనేక ప్రాంతాలు, వర్గాలకు చెందిన వారు నివసించే ఏరియాలకు ప్రాధాన్యం ఇచ్చాడు. అలాంటి చోట్లలో ఏర్పాటు చేసుకుంటే ఇతరుల దృష్టి పడే అవకాశాలు తక్కువగా ఉంటాయనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఈ డెన్స్‌లో అత్యధికం ఇండిపెండెంట్ హౌస్‌లు కావడం గమనార్హం. అలాగే పైకి కనిపించకుండా ప్రాంతాల వారీగా ముఠాలను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. స్థానికంగా సెటిల్మెంట్లు తదితరాలను వీరి ద్వారా చేయించేవాడు. ఈ డెన్స్ అన్నీ ఎస్కేప్ రూట్స్‌కు సమీపంలోనే ఉండేలా చూసుకున్నాడు. మరోసారి ఫహీం ‘హంగామా’... నల్గొండ జిల్లా చిట్యాల మండలం నాగారం వీఏఓ, నయీం సమీప బంధువు ఎం.ఎ.ఫహీం మరోసారి కలకలం సృష్టించాడు. కొన్నేళ్ళ క్రితం వనస్థలిపురం ప్రాంతం నుంచి అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్‌కు చెందిన ఫహీం భార్య షాజేదా, కూతురు, తల్లితో కలసి మన్సూరాబాద్ సహారా ఎస్టేటులో నివసిస్తున్నాడు. 2009లో సీబీఐ అధికారులు సొహ్రాబుద్దీన్ కేసులో ప్రశ్నించడానికి కోఠిలోని తమ కార్యాలయానికి పిలిపించారు. నయీం సమాచారం ఇవ్వాలంటూ ఇతడిపై ఒత్తిడి సైతం తీసుకువచ్చారు. దీంతో ఫహీం అప్పట్లో హఠాత్తుగా కనిపించకుండా వెళ్లిపోయాడు. దీనిపై వనస్థలిపురం ఠాణాలో కేసు నమోదు కావడంతో పాటు తీవ్ర కలకలం రేగింది. అప్పట్లో నయీమే ఫహీంను తీసుకువెళ్ళి, వదిలినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా నయీం ఎన్కౌంటర్ తర్వాత ఫహీం సైతం ఓ గ్యాంగ్ నిర్వహించినట్లు తేలడంతో ఇతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. బుధవారం ఇతడి ఇంటిపై దాడి చేసి సోదాలు చేశారు. సిటీ నుంచి ముగ్గురు ‘సిట్టింగ్’... తెహరీఖ్ గల్బా ఏ ఇస్లాం (టీజీఐ) పేరుతో సంస్థను ఏర్పాటు చేసి, పోలీసుల పైనే తుపాకీ ఎక్కుపెట్టిన ఉగ్రవాది విఖార్ అహ్మద్ తన అనుచరులతో సహా గత ఏడాది ఏప్రిల్‌లో నల్లగొండ జిల్లా ఆలేరు వద్ద ఎన్కౌంటర్ అయ్యాడు. వరంగల్ జైలు నుంచి నగరంలోని కోర్టుకు తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌పై విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో సిటీకి చెందిన ఇన్స్పెక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు నయీం కార్యకలాపాలు, కేసుల దర్యాప్తు కోసం ఏర్పాటు చేసి సిట్‌లో ముగ్గురికి చోటు దక్కింది. మొత్తం ఎనిమిది మంది సభ్యుల్లో సైబరాబాద్ అదనపు డీసీపీ (క్రైమ్స్) శ్రీనివాస్‌రెడ్డి, బేగంబజార్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుధాకర్‌లు ఉన్నారు. -
నయీంకు కొండాపూర్‌లో రూ.1500 కోట్ల ఆస్తి
పోలీస్ కాల్పుల్లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం సేటిల్మెంట్లు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నయీం ఇంట్లో, అనుచరులు, బంధువుల వద్ద వందలాది డాక్యుమెంట్లు దొరుకుతుండడంతో శివార్లలో భూదందాలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కొండాపూర్‌లో అత్యంత విలువైన స్థలాల డాక్యుమెంట్లు వెలుగు చూశాయి. హఫీజ్‌పేట్ రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న కొండాపూర్ సర్వే నెంబర్ 86, 87లో ఏకంగా 69 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు పోలీసులకు లభించినట్లు తెలుస్తోంది. అక్కడ ఎకరం ధర రూ.20 కోట్లకు పైగానే ఉంటుంది. సర్వే నెంబర్ 86, 87, 88లో ఇప్పటికే లే అవుట్లు చేశారు. కొన్ని చోట్ల ఎకరాల కొద్ది కబ్జాలో ఉన్నాయి. నయీంతో తమ స్థలాలకు ఏలాంటి సంబంధం లేదని పొజిషన్లో ఉన్న వారు పేర్కొంటున్నారు. ఈ సర్వే నెంబర్లలో స్థలాలపై కోర్టులో కేసులున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వే నెంబర్లో బడాబాబులున్నట్లు తెలుస్తోంది. పొజిషన్లో ఉన్న వారిని ఢీకొనలేక ఎవరైనా నయీంను ఆశ్రయించి ఉంటారనే ప్రచారం సాగుతోంది. -
అనుచరులతో నయీం ఏం చెప్పాడు
సాక్షి, సిటీబ్యూరో: ముంబై నుంచి దుబాయ్‌కు వెళ్ళిపోయి ‘డి–కంపెనీ’ పేరుతో దావూద్ ఇబ్రహీం చేస్తున్న దందా నయీంను ఆకర్షించింది. నగరం కేంద్రంగా ‘ఎన్–కంపెనీ’ ఏర్పాటు చేయాలని భావించాడు. దీనికోసం గత ఏడాది దుబాయ్ వెళ్ళిన నయీం అక్కడ దావూద్ అనుచరుల్నీ కలిశాడని తెలిసింది. వీలైనంత త్వరగా బేస్‌ను దుబాయ్‌కు మార్చేయడానికే టార్గెట్లు పెట్టుకుని మరీ వసూళ్ళకు దిగినట్లు సమాచారం. వారం రోజుల క్రితం నగర శివార్లలో అనుచరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇదే విషయాన్ని వారికి చెప్పినట్లు తెలుస్తోంది. మూడు రకాలైన ‘సైన్యం’... గ్యాంగ్‌స్టర్ నయీం నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోనూ మూడు రకాలైన వారితో ‘సైన్యాలు’ సిద్ధం చేసుకున్నాడు. ఆయా అవసరాలకు తగ్గట్టు వీరిని వాడుకోవడానికే ఇలా ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. ఓపక్క రాజకీయ అండదండల కోసం రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాడు. వీరికి డబ్బు ఇవ్వడంతో పాటు కోరిన సెటిల్మెంట్లు చేస్తూ తన చెప్పు చేతల్లో ఉంచుకున్నాడు. అలాగే పోలీసులకు ‘అవసరమైన పనులు’ చేసిపెట్టడం, కొన్ని రకాలైన సమాచారాలు ఇవ్వ డం తదితరాలు చేస్తూ వారితో సత్సంబంధాలు కొనసాగిం చాడు. శివారు జిల్లాలతో పాటు నగరంలోని కొన్ని ప్రాంతాలకు చెందిన రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులతోనూ నయీం సంబంధాలు కొనసాగించాడు. కొందరు యువకులకు నెలవారీ డబ్బులు ఇస్తూ తన ఆధీనంలో ఉంచుకున్నాడు. రెండు నెలల్లో వీలైనంత ఆర్జించాలని... ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌తో సంబంధాలు కొనసాగించిన నయీం గతంలో ఓసారి పాకిస్థాన్‌కు వెళ్ళి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌తోనూ పరిచయాలు ఏర్పడ్డాయి. గత ఏడాది దుబాయ్ వెళ్ళి వచ్చిన నయీం అక్కడ దావూద్ అనుచరుల్నీ కలిశాడు. హైదరాబాద్ సహా దక్షిణాదిలోని అనేక రాష్ట్రాల్లో తనకు ప్రైవేట్ సైన్యం ఉందంటూ వారికి చెప్పిన నయీం... దావూద్ మాదిరిగా ‘ఎన్–కంపెనీ’ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. దుబాయ్ కేంద్రంగా నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దందాలకు కుట్రపన్నాడు. దీనికోసం రెండు నెలల్లో దుబాయ్‌కి మకాం మార్చడానికి పథకం వేసిన నయీం అందుకు తగ్గట్లే జోరు పెంచి సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలుస్తోంది. తుక్కుగూడలో చివరి విందు... తన దుబాయ్ ఆలోచనల గురించి అనుచరులకు చెప్పడానికి నయీం గత ఆదివారం నగర శివార్లలోని తుక్కుగూడలో విందు ఏర్పాటు చేశాడు. అత్యంత సన్నిహితులైన 12 మందితో పాటు ఇతర గ్యాంగ్మెంబర్స్ సైతం హాజరయ్యారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే భారీ విందు ఇచ్చిన నయీం... తన ‘ఎన్–కంపెనీ’ విషయాన్ని వారికి చెప్పి, టార్గెట్లు ఇచ్చి పంపినట్లు తెలిసింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, రియల్టర్లు తదితరుల్ని టార్గెట్‌గా చేసుకున్నాడు. దీనికోసమే జర్మన్, రష్యా, బెల్జియంల్లో తయారైన అత్యాధునిక షార్ట్ వెపన్స్‌ను సైతం సిద్ధం చేసుకున్నాడు. సోమ–మంగళవారాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో ఇవీ ఉన్నాయి. అశోక్ పేరుతో కేరళలో చికిత్స... రెండేళ్ళ క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన నయీం కేరళలో చికిత్స చేయించుకున్నాడు. అక్కడకు అశోక్‌రెడ్డి పేరుతో వెళ్ళి వచ్చాడు. దీంతో నయీం ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేయడంతో తన బలాన్ని మరోసారి చూపించాలని భావించాడు. దీనికోసం ఎనిమిది నెలల క్రితం నగర శివార్లలో ఓ విందు ఏర్పాటు చేశాడు. దీనికి రౌడీషీటర్లు, మాజీ మావోయిస్టులతో పాటు అసాంఘికశక్తులు అంతా హాజరయ్యారు. ఈ విందు వేదికపైకి ఎక్కిన నయీం చుట్టూ ముగ్గురు యువతులు ఏకే–47 ఆయుధాలతో, మరో నలుగురు షార్ట్ వెపన్స్‌గా పిలిచే పిస్టల్స్‌తో కాపుకాశారు. ఈ విందుతో తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానంటూ అనుచరులకు సందేశం, ప్రత్యర్థులకు హెచ్చరికలు ఇచ్చాడు. ‘ఆలోచిస్తే’ అంతం చేసినట్లే... నయీం ఓ వ్యక్తిని టార్గెట్‌గా ఎంచుకుని, హతమార్చాలని నిర్ణయించుకుంటే వారికి హెచ్చరికలు పంపిస్తాడు. నేరుగా ఫోన్లు చేసే నయీం ఒక్కోసారి ఒక్కో సెల్‌ఫోన్, సిమ్‌కార్డు వినియోగిస్తాడు. అల్కాపురి టౌన్‌షిప్‌లోని అతడి ఇంట్లో 258 సెల్ఫోన్లు, వందల సంఖ్యలో సిమ్కార్డులూ లభించడానికి ఇదే కారణమని పోలీసులు చెప్తున్నారు. నయీం ఎవరినైనా హతమార్చాలని నిర్ణయించుకున్నప్పుడు ‘ఆలోచన’ ప్రస్తావన తీసుకువస్తాడు. ‘నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావ్... నేను నీ గురించి ఆలోచించాల్సి వస్తుంది’ అంటే అవతలి వ్యక్తిని హత్య చేయడానికి నిర్ణయించుకున్నాడని అర్థమని పోలీసులు చెప్తున్నారు. ఇవీ భూదందాలు.. బంజారాహిల్స్/మన్సూరాబాద్/గచ్చిబౌలి: పోలీస్ కాల్పుల్లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం సెటిల్మంట్ దందాలు సిటీలో భారీగానే జరిగాయి. సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్, గచ్చిబౌలితో పాటు ఎల్బీనగర్లోని మన్సూరాబాద్‌లో వివిధ భూములకు సంబంధించిన జిరాక్స్ పత్రాలు నయీం ఇంట్లో లభించడంతో వాటిపై పోలీసులు విచారణ చేపట్టారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లోని ఫ్లాట్ నెంబర్ 827 ఇంటి డాక్యుమెంట్లు, మన్సూరాబాద్ రాక్‌హిల్స్‌కాలనీలోని సర్వే నెంబర్ 66/10/బీ, శేరిలింగంపల్లి సర్వే నెంబర్ 87లో 9.37 ఎకరాల స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు లభించడంతో నయీం దందాలు సిటీలో బాగానే జరిగాయనే వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ ప్లాట్ కథ ఇదీ... జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లోని ఫ్లాట్ నెంబర్ 827 స్థలం 2005కు ముందు కొంత వివాదంలో ఉండగా సెటిల్మెంట్ భాధితులు నయీంను ఆశ్రయించి దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. 1982 సంవత్సరం ఏప్రిల్28వ తేదీన జూబ్లీహిల్స్ సొసైటీ జి. లక్ష్మమ్మకు ఈ ప్లాట్ అలాట్ చేసింది. 1983 మే 2వ తేదీన లక్ష్మమ్మ ఈ ప్లాట్‌ను నిర్మలకు విక్రయించగా, ఆమె దీన్ని 1983 మే 10వ తేదీన ఏవీ శ్రీనివాసరావుకు విక్రయించింది. అయితే లక్ష్మమ్మ దత్త కుమారుడు పూడురు అశోక్‌కుమార్ ఆమెకు తెలియకుండా ఈ ప్లాట్‌ను రామరాజ్ సీతారామరావు అనే వ్యక్తికి జీపీఏ చేశాడు. 2005, డిసెంబర్ 28వ తేదీన నెల్లూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బి.శ్రీనివాసులురెడ్డి ఈ ప్లాట్‌ను ఏవీ శ్రీనివాసరావు నుండి కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేశారు. ఆ సమయంలోనే జీపీఏ హోల్డర్ అంటూ రామరాజ్ సీతారామరావు ఇల్లు కట్టుకుంటున్న శ్రీనివాసులరెడ్డితో వివాదానికి దిగాడు. సీతారామరావు రిజిస్ట్రార్ ఆఫ్ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించాడు. గతేడాది డిసెంబర్ 28వ తేదీన ట్రిబ్యునల్ ఈ కేసును కొట్టివేసింది. అయితే ఈ పాత డాక్యుమెంట్లు నయీం వద్దకు ఎలా చేరాయన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ...2005లో ఏవీ శ్రీనివాసరావు దగ్గర నుంచి ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేశాననితెలిపారు. ఆ డాక్యుమెంట్లు నయీం వద్దకు ఎలా చేరాయో తనకు తెలియదని పేర్కొన్నారు. మన్సూరాబాద్‌లో... నాగోలు డివిజన్ రాక్‌హిల్స్‌కాలనీలోని మన్సూరాబాద్ గ్రామ సర్వే నెంబర్ 66/10/బీ స్థలంలో ఆడిటోరియం నిర్మాణానికి సంబంధిత యజమానులు నిర్మాణం చేపడుతుండగానే ఈ స్థలం మాదని నయీం మూఠా మనుషులు బెదిరించారు. ఏడాది క్రితం ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో యజమానుల్లో ఒకరైన ఎస్.గిరిప్రసాద్‌రెడ్డి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అలాగే ఎన్టీఆర్నగర్లో సర్వే నెం–9/1/1ఏ స్థలంలో నయీం అనుచరులు వెయ్యి గజాల స్థలాన్ని కబ్జా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శేరిలింగంపల్లి సర్వే నెంబర 87లో 9.37 ఎకరాల స్థలం ఉన్నట్లు సైబరాబాద్ వెస్ట్ పోలీసులు నయీం నివాసం వద్ద లభించిన డాక్యుమెంట్లలో గుర్తించారు. అక్కడ చదరపు గజం స్థలం విలువ 25 వేలు ఉంటుంది. ఆ స్థలం విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుంది. ఈ స్థలం వివరాలు తమకు తెలియవని రాజేంద్రనగర్ ఆర్డీఓ సురేష్ తెలిపారు. అనుచరుల కోసం వేట తుర్కయంజాల్: గ్యాంగ్‌స్టర్ నయీం మృతితో వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసముండే ఆయన అనుచరుల ఇళ్లపై పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా భవానీ ఎన్‌క్లేవ్‌లోని ప్లాట్ నెం–49లో నివాసమున్న శ్రీధర్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారణను ప్రారంభించినట్లు తెలుస్తోంది. శ్రీధర్‌గౌడ్ ఇచ్చిన సమాచారం మేరకు నయీం సన్నిహితులు, అనుచరుల కోసం వేటను మొదలుపెట్టినట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం జాయింట్ సీపీ శశిధర్‌రెడ్డి, డీసీపీ తఫ్సీర్‌ఇక్బాల్, ఏసీపీలు వేణుగోపాల్‌రావు, భాస్కర్‌గౌడ్, సీఐలు మురళీకృష్ణ తదితరులు చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ విచారణ ఒక్క రోజులో ముగిసేది కాదని ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి విచారణ చేపట్టనున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
పోషించింది పోలీసులే
సాక్షి, హైదరాబాద్: నక్సల్స్‌కు చెక్ పెట్టేందుకు నయీమ్‌ను పోలీసులే పెంచి పోషించారన్న ఆరోపణలున్నాయి. 1993లో ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ హత్య కేసులో అరె స్టయిన నయీముద్దీన్‌ను కొందరు పోలీసు అధికారులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. వారి కౌన్సిలింగ్ ఫలితంగా తన పంథా మార్చుకున్న నయీమ్.. నక్సల్స్‌ను నామరూపాలు లేకుండా చేస్తానంటూ ప్రకటన ఇచ్చాడు. దీంతో ఇతడిని కోవర్ట్‌గా మార్చుకున్న అధికారులు మావోయిస్టులకు సంబంధించిన కీలక సమాచారం సేకరిస్తూ వరుస ఎన్కౌంటర్లు చేశారు. కోవర్టుగా పోలీసు ఉన్నతాధికారుతో సంబంధాలు నెరిపాడు. మావోయిస్టు సంబంధిత ఆపరేషన్ల తర్వాత ఇతడి కన్ను ఉగ్రవాదులపై పడింది. ఉగ్రవాద కోణంలోనూ కీలక సమాచారం సేకరించి పోలీసులకు ఇచ్చాడు. ఉగ్రవాది ముజీబ్ 2005లో రాజస్థాన్ నుంచి అక్రమ ఆయుధాలు తీసుకు వస్తున్నాడనే విషయాన్ని పోలీసులకు ఉప్పందించింది నయీమే. అయితే దర్యాప్తులో ఆ నేరంలో ఇతడికి కూడా పాత్ర ఉందని, విభేదాల నేపథ్యంలోనే బయటపెట్టాడని తేలింది. ఉగ్ర కోణంలోనూ నయీమ్ సమాచారం ఇస్తుండటంతో పోలీసులు కూడా తమదైన ‘శైలి’లో సహకరిస్తూ వచ్చారు. అతడి అరాచకాలను చూసీ చూడనట్లు వదిలేశారు. ఇలా కొందరు రాజకీయ, పోలీసు పెద్దలకు నయీమ్ వాటాదారుడిగా మారారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఓ దశలో నయీమ్ పోలీసుల చేతిలో ‘ఆయుధం’గా మారాడు. పోలీసులు చట్ట పరిధిలో చేయలేని అనేక పనుల్ని అతడితో చేయించుకుంటారన్నది బహిరంగ రహస్యం. 2007 నుంచి పూర్తి అజ్ఞాతంలో ఉంటున్న నయీమ్‌కు ఉమ్మడి రాష్ట్రంలో ఓ పోలీసు అత్యున్నతాధికారి సహాయ సహకారాలు అందించారనే విమర్శలు ఉన్నాయి. ఇలా పోలీసులు, రాజకీయ నాయకుల కోసం పనిచేసిన నయీమ్ చివరకు వారికే ఎదురు తిరగడం ప్రారంభించాడు. ఓ సమాంతర శక్తిగా మారిపోవడంతో మళ్లీ పోలీసులు నయీమ్ కోసం గాలించి, షాద్‌నగర్‌లో గుర్తించి మట్టుపెట్టారు. సోహ్రాబుద్దీన్ కేసులో తేలని పాత్ర: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సోహ్రాబుద్దీన్ షేక్ బూటకపు ఎన్కౌంటర్ కేసులో నయీమ్ పాత్ర ఇప్పటికీ మిస్టరీనే. పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న సోహ్రాబుద్దీన్ 2005 నవంబర్ 20న తన భార్య కౌసర్ బీ, అనుచరుడు తులసీరాం ప్రజాపతిలతో కలిసి గుజరాత్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడి ఓ యునానీ వైద్యుడి వద్ద చికిత్స నిమిత్తం తన భార్యను తీసుకువచ్చాడు. నయీముద్దీన్ సమీప బంధువు వద్దే వీరు ఆశ్రయం పొందినట్లు అనుమానాలున్నాయి. రెండ్రోజుల తర్వాత వారంతా తిరుగు పయనమయ్యారు. రాష్ట్ర సరిహద్దులు దాటిన తర్వాత ఈ ముగ్గురినీ గుజరాత్ పోలీసులు బస్సులోంచి దించి అదుపులోకి తీసుకున్నారు. తర్వాత అహ్మదాబాద్ శివార్లలో సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కాగా... కౌసర్ బీ దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో సొహ్రాబుద్దీన్ పాత్ర నిర్ధారించడానికి నయీమ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు సీబీఐ కొన్నేళ్లపాటు యత్నించినా వారి వల్ల కాలేదు. -
నయీం ఎన్కౌంటర్
చట్టానికి దొరక్కుండా తప్పించుకు తిరగడం, సుదీర్ఘకాలం అజ్ఞాతంలో ఉండటం వ్యక్తిమాత్రులకు సాధ్యం కాదు. జనాదరణగల ఉద్యమాల్లో పనిచేసేవారి పరిస్థితి వేరు. అలాగే అధికారంలో ఉన్నవారి అండదండలున్నవారి సంగతి వేరు. అలాంటి వారికి సైతం ఎప్పుడో ఒకప్పుడు సమస్యలు ఎదురుగాక తప్పదు. ఎందుకంటే ఉద్యమాలు నీరసించవచ్చు లేదా కోవర్టుల బెడద వచ్చిపడొచ్చు. ఇక అధికారం అండతో చెలరేగేవారు అది రచ్చకెక్కాక పెత్తనం చలాయించలేరు. సోమవారం వేకువజామున తెలంగాణలోని షాద్‌నగర్ సమీపంలో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించాడంటున్న నయీముద్దీన్‌పై అనేకానేక ఆరోపణలున్నాయి. అతను మావోయిస్టు పార్టీ పూర్వరూపమైన పీపుల్స్‌వార్‌లో పనిచేస్తూ హైదరాబాద్ నడిబొడ్డున ఐపీఎస్ అధికారి కె.ఎస్. వ్యాస్‌ను కాల్చిచంపిన కేసులో నిందితుడు. అది జరిగిన కొన్నాళ్లకే పోలీసులకు చిక్కాడు. అయితే అంతటి తీవ్రమైన కేసులో నిందితుడైన వ్యక్తి అనంతరకాలంలో పోలీసులకు సన్నిహితుడిగా మారాడని ఆరో పణలు రావడమే వింత అనుకుంటే... వారి కనుసన్నల్లోనే మావోయిస్టు సాను భూతిపరులను బెదిరించడం, పౌరహక్కుల సంఘాల నేతలను, మాజీ నక్సల్స్‌ను హతమార్చడంలాంటివి చేస్తున్నాడని పదే పదే ఆరోపణలు వెల్లువెత్తడం ఆశ్చర్య కరమైన విషయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఏ మూల ఏ నేరం జరిగినా నయీం పేరు బయటికొచ్చేది. కాకతీయ కోబ్రాస్, నల్లమల కోబ్రాస్, గ్రీన్ టైగర్స్ లాంటి పేర్ల వెనక నయీమే ఉన్నాడని, అతన్ని పోలీసులే నడిపిస్తున్నారని పౌరహక్కుల సంఘాల నేతలు అనేవారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన యువ గాయకురాలు బెల్లి లలిత మొద లుకొని పౌరహక్కుల సంఘం నేతలు పురుషోత్తం, ఆజం అలీ, నక్సల్ ఉద్యమంలో పనిచేసి బయటికొచ్చి టీఆర్ఎస్ నేతగా ఉన్న సాంబశివుడు వరకూ అనేక మర ణాల వెనక నయీం ముఠా హస్తమున్నదని ఆరోపణలొచ్చాయి. రాజకీయ నాయ కులను బెదిరించడం, భూకబ్జాలకు పాల్పడటం, సెటిల్మెంట్లు చేయడంవంటివి యధేచ్ఛగా జరుగుతున్నా అతనికి అడ్డూ ఆపూ లేకుండా పోయింది. దాదాపు 23 ఏళ్లనుంచి నయీం విషయంలో ఆరోపణలొస్తున్నా అవి నిజం కాదని చెప్పడమే తప్ప అతన్ని పట్టి బంధించడానికి, తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని రుజువు చేయడానికి పోలీసులు నిజాయితీగా ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఒక్క నయీం విషయంలోనే కాదు...అంతక్రితం జడల నాగ రాజు, కత్తుల సమ్మయ్య వంటి కరుడుగట్టిన నేరగాళ్ల విషయంలోనూ ఈ మాదిరి ఆరోపణలే వచ్చాయి. వీరిలో కత్తుల సమ్మయ్య అయితే దర్జాగా పాస్‌పోర్టు, వీసా సంపాదించుకుని విదేశాలకు కూడా వెళ్లిపోయాడు. బహుశా శ్రీలంకలో తాను ప్రయాణిస్తున్న విమానం ప్రమాదంలో చిక్కుకుందని భావించి దూకి చనిపోకపోతే సమ్మయ్య ఎక్కడున్నాడో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయేది. రాజధానికి కూతవేటు దూరంలో ఒక నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకుని, అనుచరుల ద్వారా హత్యలకూ, బెదిరింపులకూ, కబ్జాలకూ పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చిన వ్యక్తిని పట్టుకోలేకపోవడమంటే పోలీసు యంత్రాంగానికి సంబంధించిన సకల వ్యవస్థలూ నిరర్ధకంగా మిగిలిపోయినట్టు లెక్క. వ్యవస్థకు సవాలుగా మారిన ఉద్యమాలను, సంస్థలను నీరుగార్చడానికి, ఆ ఉద్యమ సారథులను మట్టుబెట్టడం ప్రపంచంలో కొత్తగాదు. అలాంటి ఆపరేషన్లలో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ఆరితేరింది. తాను శత్రువులని భావిం చినవారిని ఖండాంతరాల్లో ఉన్నా చేతికి నెత్తురంటకుండా చంపడం మొసాద్ ప్రత్యేకత. కశ్మీర్లో మిలిటెన్సీ జోరుగా ఉన్నప్పుడు దాని సారథులను హత మార్చడంలో కోవర్టులే కీలకపాత్ర పోషించారు. చట్టపాలనకు, నిబంధనలకు లోబడి వ్యవహరిస్తే కేసులు తెమలవని, నేర నిరూపణ కష్టమని అధికారంలో ఉన్నవారు అనుకోవడమే కోవర్టు ఆపరేషన్లకు మూలం. అందువల్ల తక్షణ ఫలితాలు రావొచ్చు. కానీ అది ప్రమాదకరమైన పర్యవసానాలకు దారితీస్తుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తుంది. ఎలాంటి నేరం చేసైనా తప్పించుకు తిరగవచ్చునన్న అభిప్రాయం సమాజంలో బలపడటానికి వీలు కల్పిస్తుంది. చట్టంపై సామాన్య పౌరుల్లో విశ్వాసాన్ని సడలిస్తుంది. ఏతావాతా పాలన కట్టుతప్పుతుంది. నయీం సజీవంగా పట్టుబడి ఉంటే అనేకమంది ఐపీఎస్ అధికారుల జాతకాలు వెల్లడయ్యేవని ఉన్నతస్థాయిలో పనిచేసి రిటైరైన పోలీసు అధికారి ఒక చానెల్ చర్చా కార్యక్రమంలో అనడం పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటైన విషయం. నయీం స్థావరంగా వినియోగించుకున్న భవంతిలో రెండున్నర కోట్ల రూపాయల కరెన్సీ, భారీయెత్తున బంగారం, పిస్టల్స్, ఇతర ఆయుధాలు దొరకడం దిగ్భ్రాంతికరం. నేరస్తుల కదలికలున్నాయని అనుమానం వచ్చినప్పుడూ, తాగి వాహనాలు నడుపుతున్నవారిని పట్టుకోవడానికీ పోలీసులు రాజధాని నగరంలోనూ, పట్టణాల్లోనూ తరచుగా రోడ్లపై తనిఖీలు నిర్వహిస్తుంటారు. ఇవిగాక పోలీసులకు సంబంధించిన నిఘా వ్యవస్థలు అనేకానేకం ఉంటాయి. నిరంతర సమాచార సేకరణే వీటి పని. అనేక హత్యలు, కిడ్నాప్‌లు, భూకబ్జాలవంటి వందకు పైగా కేసులున్న వ్యక్తి ఈ స్థాయిలో డబ్బు, మార ణాయుధాలు కోరుకున్నచోటకు చేర్చుకోగలిగాడంటే...ఆ సంగతి పోలీసు యంత్రాంగానికి తెలియలేదంటే వింతగాదా? నయీంకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని, అతని కోసం ఎన్ఐఏ గాలిస్తున్నదని వార్తలొచ్చాయి. అదే నిజమైతే ఈ ఆపరేషన్‌లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సింది. అలా చేయగలిగి ఉంటే అతని నుంచి ఎంతో విలువైన సమాచారం వెల్లడయ్యేది. ఇన్నాళ్లూ పట్టుకోలేకపోవడం ఎంత తప్పో, ప్రాణహాని లేకుండా అదుపులోకి తీసుకోలేకపోవడమూ అంతే దోషం. దేశ ప్రయోజనాలు, భద్రత పరిరక్షించ వలసినవారు అత్యంత మెలకువతో, చాకచక్యంతో వ్యవహరించి ఉండాల్సింది. కనీసం అతని అనుచరులనుంచి అయినా లోతైన సమాచారాన్ని రాబట్టగలిగితే మంచిదే. -
నయీం ఎన్కౌంటర్
విచిత్ర స్వభావం.. క్రూర మనస్తత్వం.. విద్యార్థి దశలోనే హింసావాదం వైపు అడుగులు.. పిపుల్స్‌వార్ అగ్రనాయకత్వంతో పరిచయాలు.. అంతలోనే అంతర్గత విభేదాలు.. బయటికొచ్చి ఖాకీలకు ఆయుధమై ‘వార్’తోనే వార్.. అజ్ఞాతంలో ఉంటూనే నేర సామ్రాజ్య విస్తరణ.. వ్యుహాత్మకంగా ఎన్నో నేరాలు.. మరెన్నో ఘోరాలు.. చివరకు పోలీసుల చేతిలోనే హతం. ఇదీ.. నÄæూం అలియాస్ భువనగిరి నÄæూం నేరప్రస్థానం. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో గ్యాంగ్‌స్టర్ నÄæూం మృతిచెందాడు. కూల్‌గా ఉంటూనే క్రూయల్‌గా వ్యవహరించే అతడి పీడ విరగడైందని జిల్లావాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. భువనగిరి నÄæూం భాయ్.. అండర్‌వరల్డ్ ముఠాలకు ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఏవైనా సెటిల్మెంట్లలో నయీం ఎంటరయ్యారా.. ఇక అంతే..ఇతడికి వ్యతిరేకంగా మాట వినకుండా ఎవరైనా వెళ్లే వారు.. దారుణ హత్యకు గురికావాల్సిందే.. జిల్లాలోనే కాదు.. పలు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న గ్యాంగ్‌స్టర్ ఆచూకీని పోలీసులు కనిపెట్టి మట్టుబెట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో సోమవారం పోలీసుల ఎన్కౌంటర్లో నÄæూం హతమయ్యాడు. భువనగిరి పట్టణం బీచ్‌మెుహల్లా దర్గా సమీపంలో నివాసముండే ఎండీ నిజాముద్దీన్,అయేషాబేగం దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. ఇందులో నయీం పెద్ద కుమారుడు. తమ్ముడు సలీం, అక్క సలీమాబేగం. నయీం పట్టణంలోని బీచ్‌మహలా ఉన్నతపాఠశాలలో చదువుతూ ఎన్ఎస్యూఐ విద్యార్థిసంఘంలో చురుకుగా పాల్గొనేవాడు. విద్యార్థి దశలోనే రాడికల్ భావాలతో పీపుల్స్‌వార్‌లో చేరిన నయీం 1989లో తొలిసారిగిగా యాదగిరిగుట్టలో పోలీస్‌లపై బాంబు దాడి చేసి అరెస్ట్ అయ్యాడు. దీంతో పోలీస్‌లు అతడిని జైలుకు పంపించారు. అక్కడి నుంచి బెయిల్‌పై వచ్చిన తర్వాత ఐపీఎస్ అ«ధికారి వ్యాస్‌ను హత్య చేశాడు. అయితే పార్టీలో వచ్చిన విభేదాలతో లొంగిపోయిన నయీం జైలు జీవితం గడుపుతూనే పోలీసులకు కోవర్టుగా మారాడు. అప్పటి నుంచి పోలీసుల కనుసన్నల్లో ఉంటూనే మావోయిస్టు ఉద్యమంలో చురుకుగా పనిచేస్తున్న ముఖ్యనేతలను, వారికి మద్దతు ఇస్తున్న పౌర హక్కుల నేతలను టార్గెట్ చేశాడు. దీంతో పలువురు పీపుల్స్‌వార్ ముఖ్యనేతల ఎన్‌కౌంటర్‌కు సమాచారం ఇచ్చాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పీపుల్స్‌వార్ నయీంను టార్గెట్ చేసి అంతమెందించడానికి టీంలను రూపొందించింది. అయితే వారికి చిక్కకుండా వారి అనుచరులను తనవైపుకు తిప్పుకుంటూ వారి ద్వారా సమాచారం రాబట్టి ముఖ్యనేతలను అంతమెందించే కుట్రలో భాగస్వామి అయ్యాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అప్పటి పోలీస్ ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఏర్పడడంతో నయీం నేర సామ్రాజ్యం ఏర్పాటు అయింది. పలు హత్య కేసుల్లో నయీం ముఠా సభ్యులు అరెస్ట్ కావడం, సాక్షులు లేక కేసులు వీగిపోవడం జరిగింది. సాంబశివుడి హత్య కేసులో నిందితులంతా పై విధంగానే నిర్దోషులుగా బయటపడ్డారు. పోలీసులల అండదండలతో నేరసామ్రాజ్యాన్ని విస్తరించాడు. మాజీలతో దండుకట్టి మావోయిస్టులపై యుద్ధం ప్రకటించిన నయీం తెలంగాణ వ్యాప్తంగా తన నేర సామ్రాజ్యాన్ని పెంచుకున్నాడు. ఇందులో ప్రధానంగా మాజీ నక్సలైట్లను, పార్టీతో విభేదాలు వచ్చి లొంగిపోయిన వారిని, మరికొందరు యువకులను చేరదీసి తాను టార్గెట్ చేసిన వారిని అంతమొందించాడు. దీంతో పాటు భువనగిరి నుంచి రంగారెడ్డి, వరంగల్, మెదక్, హైదరాబాద్,మహబూబ్‌నగర్, నిజామాబాద్ ఇలా తన అనుచరులు ఉన్న చోట్లా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అయితే ఇంత జరుగుతున్నా దేనికి సరైన సాక్ష్యాలు లేవని కేసులు కొట్టివేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రియల్ఎస్టేట్ వ్యాపారం లావాదేవీలు, వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లు, కిడ్నాప్‌లు, రాజకీయ బెదిరింపులు విపరీతమైయ్యాయి. ఇంత జరుగుతున్నా కొందరు అధికారుల తీరుతో పోలీసులు అప్పట్లో పట్టించుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యేలను బెదిరించడమే కారణమా? ఒక విధంగా సమాంతర వ్యవస్థను నడుపుతున్న నయీం అధికార పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు రాజకీయ బెదిరింపులతో భువనగిరితో పాటు నల్లగొండ నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ముందు పలువురిని అధికార పార్టీలో చేర్చే విధంగా వ్యవహరించాడన్న ఆరోపణలూ లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఒకరు శాసన మండలిలో నయీంపై ఫిర్యాదు చేశారు. దీంతో పాటు అధికార పార్టీకి చెందిన భువనగిరి,నకిరేకల్, దుబ్బాకా ఎమ్మెల్యేలు సీఎంకు ఫిర్యాదు చేశారు. అలాగే భువనగిరికి చెందిన ఓ వ్యాపారిని బెదిరించిన నయాం రూ.కోట్లలో డబ్బులు డిమాండ్ చేశారని సమాచారం. దీంతో అతను తన సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధి ద్వారా సీఎంకు ఫిర్యాదు చేయడంతో న యీంపై ప్రభుత్వం దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఎవరికి అనుమానం రాకుండా ప్రత్యేక పోలీసులను ఏర్పాటు చేసి నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఎన్కౌంటర్ జరుగడం పోలీసుల చేతిలో హతమైనట్లు తెలుస్తోంది. -
పోలీసుల అదుపులో నయీమ్ అత్త
- మిర్యాలగూడలో సోదాలు మిర్యాలగూడ (నల్గొండ జిల్లా) గ్యాంగ్‌స్టర్ నయీమ్ అత్త, బామ్మర్ది మిర్యాలగూడలో నివాసం ఉంటున్నారు. నయీమ్ ఎన్కౌంటర్ సంఘటన తర్వాత సోమవారం పోలీసులు మిర్యాలగూడ ప్రకాశ్‌నగర్, హౌసింగ్‌బోర్డులోని నయీమ్ అత్త, బామ్మర్ది నివాసం ఉంటున్న ఇళ్లలో సోదాలు నిర్వహించారు. నయీమ్ అత్త, బామ్మర్ది, అతని భార్యను అదుపులోకి తీసుకుని స్థానిక రెండవ పోలీసు స్టేషన్‌కు తరలించారు.