నయీమ్ కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన ఫ్రైడ్ ఇండియా రియల్ ఎస్టేట్ సంస్థ జోలికొస్తే అంతం చేస్తామని అతని అనుచరులు నన్ను బెదిరించారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొలన్ శంకర్‌రెడ్డి ఆరోపించారు.మంగళవారం బడంగ్‌పేటలో ఆయన తన పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా శంకర్‌రెడ్డి మాట్లాడుతూ గత ఏడాది జూన్ 26న సాయంత్రం సరూర్‌నగర్ మండల కార్యాలయం వద్ద ఉన్న తన వద్దకు నల్లగొండకు చెందిన రియాజ్, ఫ్రై డ్ ఇండియా ఎండీ సానోవర్‌బేగ్, జుబేర్, మల్లెల శ్రీకాంత్‌గౌడ్ (న ల్లగొండ), ముజమిల్‌బాబా అలియస్ సీతారాంరెడ్డి (వరంగల్)తోపాటు మరో ఇద్దరు ప్రత్యక్ష్యంగా తనవద్దకు విచ్చేసి గన్ చూపించి బెదిరించినట్లు వెల్లడించారు. భయాందోళనకు గురై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి ఆ తర్వాత వారి సలహా మేరకు సీపీ ఆనంద్‌కు పిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
అయిన అప్పుడు ఏలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. బడంగ్‌పేట నగర పంచాయితీ పరిధిలోని బాలాపూర్ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా ఫ్రై డ్ ఇండియా పేరుతో వెంచర్లు ఏర్పాటు చేశారని అన్నారు. అయితే చారిత్రక విలువలు కలిగిన దేవతల గుట్టపై ఉన్న దేవాలయాలను కనమరుగు చేస్తూ సీలింగ్, సర్‌ప్లెస్ ల్యాండ్‌లు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేస్తూన్నారని అన్నారు. దేవతల గుట్ట పరిరక్షణ కొరకు పోరాడుతున్న తనను అటాక్ చేసి బెదిరించినట్లు వెల్లడించారు. ఫ్రై డ్ ఇండియాలో నయీమ్ పెట్టుబడులు పెట్టినట్లుగా స్వయంగా నయీం అనుచరులే చెప్పారని తెలిపారు. కోటీ ఇస్తాం తప్పుకో, లేదా ప్రాణం మీద తీపి ఉంటే ఫ్రై డ్ ఇండియా జోలికి రావోద్దు అని తుపాకి గురి పెట్టారని అన్నారు.
ఫ్రై డ్ ఇండియా సంస్థ దేశ వ్యతిరేఖ శక్తులతో చేతులు కలిపి గ్యాంగ్ స్టార్ నయీం తో పెట్టుబడులు పెట్టించి ఇల్లీగల్ దందాలు నడిపిస్తున్నారని ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు, సిట్ దర్యాప్తు సంస్థ నాగిరెడ్డికి కూడా తాను ఫిర్యాదులు చేసినట్లు వెల్లడించారు. వెంటనే ఫ్రై డ్ ఇండియా సంస్థపై సీబీసీఐడీ దర్యాప్తు జరిపించి నయీం అనుచరులను ఆదుపులోకి తీసుకొని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తన వద్ద ఆదారాలతో సహా పూర్తి సమాచారం ఉందని శంకర్‌రెడ్డి వెల్లడించారు. సమావేశంలో నాయకులు ఎన్.ప్రభాకర్‌రెడ్డి, గుర్రం మల్లారెడ్డి, నిమ్మల శ్రీకాంత్‌గౌడ్, పి.పుల్లారెడ్డి, ప్రభాకర్, భాస్కర్, నరేందర్‌గౌడ్, నాగార్జున మహేందర్‌రెడ్డి, విఘ్నేష్, చారి తదితరులున్నారు.