మోదీ ఆదేశాల మేరకే నయీం హతం | Nayim death at the behest of Modi | Sakshi
Sakshi News home page

మోదీ ఆదేశాల మేరకే నయీం హతం

Published Wed, Aug 17 2016 2:45 AM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM

మోదీ ఆదేశాల మేరకే నయీం హతం - Sakshi

మోదీ ఆదేశాల మేరకే నయీం హతం

హిమాయత్‌నగర్‌: దేశ ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నయీంను హతమార్చిందని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణస్వరూప్‌ అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా సోహ్రబుద్దీన్‌ను ప్రత్యక్షంగా బూటకపు ఎన్‌కౌంటర్‌ చేయించారని, ఆ ఘటనలో అమిత్‌షా దోషిగా ఉన్నట్లు నయీం ప్రత్యక్ష సాక్షి అన్నారు. అందుకే నయీంను హతమార్చినట్లు వడ్లమూరి ఆరోపించారు.

హిమాయత్‌నగర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వడ్లమూరి మాట్లాడారు. రాజ్యాంగ వ్యవస్థను సవాల్‌ చేసే విధంగా నయీం పెరగడానికి పాలకవర్గాలే కారకులని ఆయన మండిపడ్డారు. నయీం హత్యపై సీబీఐ విచారణ జరిపించి ప్రజాప్రతినిధులను శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. నయీం అక్రమంగా సంపాదించిన ఆస్తులను బాధితులకు అందజేయాలన్నారు. అంతర్జాతీయ మాఫియాతోనూ నయీంకు సంబంధాలు ఉన్నాయని, వాటిపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement