Dalit Bahujan party
-
మోదీ ఆదేశాల మేరకే నయీం హతం
హిమాయత్‌నగర్: దేశ ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకే టీఆర్ఎస్ ప్రభుత్వం నయీంను హతమార్చిందని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణస్వరూప్ అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా సోహ్రబుద్దీన్‌ను ప్రత్యక్షంగా బూటకపు ఎన్కౌంటర్ చేయించారని, ఆ ఘటనలో అమిత్‌షా దోషిగా ఉన్నట్లు నయీం ప్రత్యక్ష సాక్షి అన్నారు. అందుకే నయీంను హతమార్చినట్లు వడ్లమూరి ఆరోపించారు. హిమాయత్‌నగర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వడ్లమూరి మాట్లాడారు. రాజ్యాంగ వ్యవస్థను సవాల్ చేసే విధంగా నయీం పెరగడానికి పాలకవర్గాలే కారకులని ఆయన మండిపడ్డారు. నయీం హత్యపై సీబీఐ విచారణ జరిపించి ప్రజాప్రతినిధులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నయీం అక్రమంగా సంపాదించిన ఆస్తులను బాధితులకు అందజేయాలన్నారు. అంతర్జాతీయ మాఫియాతోనూ నయీంకు సంబంధాలు ఉన్నాయని, వాటిపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
ప్రత్యేక హోదాకు ‘దళిత బహుజన పార్టీ’మద్ధతు
- జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణసరూప్ హిమాయత్‌నగర్(హైదరాబాద్‌సిటీ) ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన బంద్ పిలుపునకు ‘దళిత బహుజన పార్టీ’ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణస్వరూప్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ బంద్‌లో పార్టీ శ్రేణులు, పార్టీ ప్రజాసంఘాల నేతలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బంద్ విజయవంతం చేయడం ద్వారా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్, బీజేపీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేశాయని మండిపడ్డారు. ప్రత్యేక హోదా పేరుతో టీడీపీ, బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు. ప్రజలు ఈ విషయాలను గమనించి బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
'చుండూరు హంతకులకు ఉరిశిక్ష వేయాలి'
కవాడిగూడ: చుండూరులో దళితులను ఊచకోత కోసిన హంతకులకు ఉరి శిక్ష వేయాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమాండ్ చేశారు. వేర్వేరు సందర్భాల్లో ఉరి శిక్షలు వేస్తున్నారు కానీ, దళితులపై అమానుషంగా హత్య చేసిన హంతకులకు ఈ న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ఎందుకు ఉరిశిక్ష వేయడం లేదని ప్రశ్నించారు. చుండూరు ఘటనకు 25 ఏళ్లు నిండిన సందర్భంగా ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ వద్ద గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చుండూరు హంతకులను శిక్షించాలని నినాదాలు చేశారు. వడ్లమూరి కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో చుండూరులోనే ప్రత్యేక న్యాయస్థానం వేసినా భాధితులకు న్యాయం జరగకపోవడం దుర్మార్గం అన్నారు. జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి 'కుల' దురహంకార పూరితంగా వ్యవహరించి ప్రత్యేక కోర్టులో వేసిన శిక్షణను హైకోర్టులో కొట్టివేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చుండూరు బాధితులకు న్యాయం జరగాలంటే హంతకులకు ఉరి శిక్ష వేయడమే సరైందని అన్నారు. కార్యక్రమంలో దళిత బహుజన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ భాషా, నాయకులు చేపూరి రాజు, సంకు శ్రీనివాస్, అర్షల రాజు, మాల మహానాడు గ్రేటర్ అధ్యక్షులు నక్కా దేవేందర్ రావు, ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్ ఫోరం నాయకులు పి. మురళి పాల్గొన్నారు. -
2015 లో నవ్యాంధ్ర పార్టీ స్థాపన
చంద్రబాబు రాజ్యాన్ని కూల్చడమే లక్ష్యం: కత్తి పద్మారావు కనిగిరి: దళిత బహుజన పార్టీగా 2015 ఏప్రిల్‌లో నవ్యాంధ్ర పార్టీని స్థాపించనున్నట్లు దళిత ఉద్యమ నేత కత్తి పద్మారావు తెలిపారు. రాజధానిలో అంబేద్కర్ 150 అడుగుల విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ప్రకాశం జిల్లా కనిగిరిలోని జూనియర్ కాలేజీ ఆవరణలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రానున్న కాలంలో చంద్రబాబు రాజ్యాన్ని కూల్చడమే లక్ష్యంగా దళిత బహుజన వర్గాలు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. -
'బాబు, కిరణ్ కనుసైగల్లో అశోక్ బాబు'
హైదరాబాద్ : ఏపీ ఎన్జీవో అఖిలపక్ష సమావేశం వద్ద దళిత బహుజన పార్టీ శుక్రవారం ఆందోళనకు దిగింది. చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి కనుసైగల్లో ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు పనిచేస్తున్నారని ఆపార్టీ కార్యకర్తలు ఆరోపించారు. సమైక్యం ముసుగులో డ్రామలు ఆడుతున్నారని వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోవైపు సమైక్యం విషయంలో రాజీపడేది లేదని అశోక్ బాబు స్పష్టం చేశారు. ఉద్యమ పంథాను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.