కవాడిగూడ: చుండూరులో దళితులను ఊచకోత కోసిన హంతకులకు ఉరి శిక్ష వేయాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమాండ్ చేశారు. వేర్వేరు సందర్భాల్లో ఉరి శిక్షలు వేస్తున్నారు కానీ, దళితులపై అమానుషంగా హత్య చేసిన హంతకులకు ఈ న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ఎందుకు ఉరిశిక్ష వేయడం లేదని ప్రశ్నించారు. చుండూరు ఘటనకు 25 ఏళ్లు నిండిన సందర్భంగా ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ వద్ద గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చుండూరు హంతకులను శిక్షించాలని నినాదాలు చేశారు.
వడ్లమూరి కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో చుండూరులోనే ప్రత్యేక న్యాయస్థానం వేసినా భాధితులకు న్యాయం జరగకపోవడం దుర్మార్గం అన్నారు. జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి 'కుల' దురహంకార పూరితంగా వ్యవహరించి ప్రత్యేక కోర్టులో వేసిన శిక్షణను హైకోర్టులో కొట్టివేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చుండూరు బాధితులకు న్యాయం జరగాలంటే హంతకులకు ఉరి శిక్ష వేయడమే సరైందని అన్నారు. కార్యక్రమంలో దళిత బహుజన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ భాషా, నాయకులు చేపూరి రాజు, సంకు శ్రీనివాస్, అర్షల రాజు, మాల మహానాడు గ్రేటర్ అధ్యక్షులు నక్కా దేవేందర్ రావు, ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్ ఫోరం నాయకులు పి. మురళి పాల్గొన్నారు.
'చుండూరు హంతకులకు ఉరిశిక్ష వేయాలి'
Published Thu, Aug 6 2015 6:43 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM
Advertisement