కేటీదొడ్డి: భార్య కాపురానికి రాకపోవడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఇర్కిచేడుకు చెందిన సంగీతను నీలహల్లికి చెందిన వీరేష్‌తో ఏడాది క్రితం వివాహమైంది. జీవనోపాధికి హైదరాబాద్‌లో పండ్ల వ్యాపారం చేసేవారు. దసరా సందర్భంగా నీలహల్లికి వచ్చారు. అక్కడ నుంచి సంగీతను తల్లిదండ్రులు ఇర్కిచేడుకు తీసుకెళ్లారు.
పండుగ అయిపోయింది.. హైదరాబాద్ వెళ్దామని భర్త అడగగా, వారు నిరాకరించారు. దీంతో మనస్తాపం చెంది అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా ఎంతకు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు వాకాబు చేసిన ఆచూకీ లభించలేదు. దీంతో తల్లి పుల్లమ్మ కుమారుడు కనబడటం లేదని కేటీదొడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బుధవారం మండలంలోని కొండాపురం రైల్వేస్టేషన్ పక్కన వ్యవసాయ పొలంలో కుర్వ వీరేష్ (25) చెట్టుకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్ధానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా కుర్వ వీరేష్‌గా గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment