ప్రత్యేక హోదాపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన బంద్ పిలుపునకు ‘దళిత బహుజన పార్టీ’ మద్దతు ప్రకటించింది.
- జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణసరూప్
హిమాయత్‌నగర్(హైదరాబాద్‌సిటీ)
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన బంద్ పిలుపునకు ‘దళిత బహుజన పార్టీ’ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణస్వరూప్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ బంద్‌లో పార్టీ శ్రేణులు, పార్టీ ప్రజాసంఘాల నేతలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బంద్ విజయవంతం చేయడం ద్వారా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్, బీజేపీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేశాయని మండిపడ్డారు. ప్రత్యేక హోదా పేరుతో టీడీపీ, బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు. ప్రజలు ఈ విషయాలను గమనించి బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.