నయీం ఎన్‌కౌంటర్
విచిత్ర స్వభావం.. క్రూర మనస్తత్వం.. విద్యార్థి దశలోనే హింసావాదం వైపు అడుగులు.. పిపుల్స్‌వార్ అగ్రనాయకత్వంతో పరిచయాలు.. అంతలోనే అంతర్గత విభేదాలు.. బయటికొచ్చి ఖాకీలకు ఆయుధమై ‘వార్’తోనే వార్.. అజ్ఞాతంలో ఉంటూనే నేర సామ్రాజ్య విస్తరణ.. వ్యుహాత్మకంగా ఎన్నో నేరాలు.. మరెన్నో ఘోరాలు.. చివరకు పోలీసుల చేతిలోనే హతం. ఇదీ.. నÄæూం అలియాస్ భువనగిరి నÄæూం నేరప్రస్థానం. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ నÄæూం మృతిచెందాడు. కూల్‌గా ఉంటూనే క్రూయల్‌గా వ్యవహరించే అతడి పీడ విరగడైందని జిల్లావాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
భువనగిరి
నÄæూం భాయ్.. అండర్‌వరల్డ్ ముఠాలకు ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఏవైనా సెటిల్‌మెంట్లలో నయీం ఎంటరయ్యారా.. ఇక అంతే..ఇతడికి వ్యతిరేకంగా మాట వినకుండా ఎవరైనా వెళ్లే వారు.. దారుణ హత్యకు గురికావాల్సిందే.. జిల్లాలోనే కాదు.. పలు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న గ్యాంగ్‌స్టర్ ఆచూకీని పోలీసులు కనిపెట్టి మట్టుబెట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో సోమవారం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నÄæూం హతమయ్యాడు.
భువనగిరి పట్టణం బీచ్‌మెుహల్లా దర్గా సమీపంలో నివాసముండే ఎండీ నిజాముద్దీన్,అయేషాబేగం దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. ఇందులో నయీం పెద్ద కుమారుడు. తమ్ముడు సలీం, అక్క సలీమాబేగం. నయీం పట్టణంలోని బీచ్‌మహలా ఉన్నతపాఠశాలలో చదువుతూ ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థిసంఘంలో చురుకుగా పాల్గొనేవాడు. విద్యార్థి దశలోనే రాడికల్ భావాలతో పీపుల్స్‌వార్‌లో చేరిన నయీం 1989లో తొలిసారిగిగా యాదగిరిగుట్టలో పోలీస్‌లపై బాంబు దాడి చేసి అరెస్ట్ అయ్యాడు. దీంతో పోలీస్‌లు అతడిని జైలుకు పంపించారు. అక్కడి నుంచి బెయిల్‌పై వచ్చిన తర్వాత ఐపీఎస్ అ«ధికారి వ్యాస్‌ను హత్య చేశాడు. అయితే పార్టీలో వచ్చిన విభేదాలతో లొంగిపోయిన నయీం జైలు జీవితం గడుపుతూనే పోలీసులకు కోవర్టుగా మారాడు. అప్పటి నుంచి పోలీసుల కనుసన్నల్లో ఉంటూనే మావోయిస్టు ఉద్యమంలో చురుకుగా పనిచేస్తున్న ముఖ్యనేతలను, వారికి మద్దతు ఇస్తున్న పౌర హక్కుల నేతలను టార్గెట్ చేశాడు. దీంతో పలువురు పీపుల్స్‌వార్ ముఖ్యనేతల ఎన్‌కౌంటర్‌కు సమాచారం ఇచ్చాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పీపుల్స్‌వార్ నయీంను టార్గెట్ చేసి అంతమెందించడానికి టీంలను రూపొందించింది. అయితే వారికి చిక్కకుండా వారి అనుచరులను తనవైపుకు తిప్పుకుంటూ వారి ద్వారా సమాచారం రాబట్టి ముఖ్యనేతలను అంతమెందించే కుట్రలో భాగస్వామి అయ్యాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అప్పటి పోలీస్ ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఏర్పడడంతో నయీం నేర సామ్రాజ్యం ఏర్పాటు అయింది. పలు హత్య కేసుల్లో నయీం ముఠా సభ్యులు అరెస్ట్ కావడం, సాక్షులు లేక కేసులు వీగిపోవడం జరిగింది. సాంబశివుడి హత్య కేసులో నిందితులంతా పై విధంగానే నిర్దోషులుగా బయటపడ్డారు. పోలీసులల అండదండలతో నేరసామ్రాజ్యాన్ని విస్తరించాడు.
మాజీలతో దండుకట్టి
మావోయిస్టులపై యుద్ధం ప్రకటించిన నయీం తెలంగాణ వ్యాప్తంగా తన నేర సామ్రాజ్యాన్ని పెంచుకున్నాడు. ఇందులో ప్రధానంగా మాజీ నక్సలైట్లను, పార్టీతో విభేదాలు వచ్చి లొంగిపోయిన వారిని, మరికొందరు యువకులను చేరదీసి తాను టార్గెట్ చేసిన వారిని అంతమొందించాడు. దీంతో పాటు భువనగిరి నుంచి రంగారెడ్డి, వరంగల్, మెదక్, హైదరాబాద్,మహబూబ్‌నగర్, నిజామాబాద్ ఇలా తన అనుచరులు ఉన్న చోట్లా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అయితే ఇంత జరుగుతున్నా దేనికి సరైన సాక్ష్యాలు లేవని కేసులు కొట్టివేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రియల్‌ఎస్టేట్ వ్యాపారం లావాదేవీలు, వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లు, కిడ్నాప్‌లు, రాజకీయ బెదిరింపులు విపరీతమైయ్యాయి. ఇంత జరుగుతున్నా కొందరు అధికారుల తీరుతో పోలీసులు అప్పట్లో పట్టించుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి.
ఎమ్మెల్యేలను బెదిరించడమే కారణమా?
ఒక విధంగా సమాంతర వ్యవస్థను నడుపుతున్న నయీం అధికార పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించాడన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు రాజకీయ బెదిరింపులతో భువనగిరితో పాటు నల్లగొండ నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ముందు పలువురిని అధికార పార్టీలో చేర్చే విధంగా వ్యవహరించాడన్న ఆరోపణలూ లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఒకరు శాసన మండలిలో నయీంపై ఫిర్యాదు చేశారు. దీంతో పాటు అధికార పార్టీకి చెందిన భువనగిరి,నకిరేకల్, దుబ్బాకా ఎమ్మెల్యేలు సీఎంకు ఫిర్యాదు చేశారు. అలాగే భువనగిరికి చెందిన ఓ వ్యాపారిని బెదిరించిన నయాం రూ.కోట్లలో డబ్బులు డిమాండ్ చేశారని సమాచారం. దీంతో అతను తన సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధి ద్వారా సీఎంకు ఫిర్యాదు చేయడంతో న యీంపై ప్రభుత్వం దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఎవరికి అనుమానం రాకుండా ప్రత్యేక పోలీసులను ఏర్పాటు చేసి నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఎన్‌కౌంటర్ జరుగడం పోలీసుల చేతిలో హతమైనట్లు తెలుస్తోంది.