జైలు అధికారులకు నయీమ్‌తో సంబంధాలు లేవు | There are no relations with nayim | Sakshi
Sakshi News home page

జైలు అధికారులకు నయీమ్‌తో సంబంధాలు లేవు

Published Sat, Jan 7 2017 12:34 AM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM

జైలు అధికారులకు నయీమ్‌తో సంబంధాలు లేవు

జైలు అధికారులకు నయీమ్‌తో సంబంధాలు లేవు

రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వినయ్‌ కుమార్‌ సింగ్‌

హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌తో జైళ్ల శాఖ అధికారులకు సంబంధాలున్నాయన్న ఆరోపణ ల్లో వాస్తవం లేదని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వినయ్‌ కుమార్‌సింగ్‌ అన్నారు. శుక్రవారం చంచల్‌గూడ లోని స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కరెక్షనల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌(సీకా) కార్యాలయంలో ఏర్పాటు చేసిన 2016 వార్షిక సమా వేశంలో ఆయన పాల్గొని జైళ్ల శాఖ సాధించిన ప్రగతిని గురించి వివరిం చారు. 2014లో జైళ్లలో మరణించిన ఖైదీల సంఖ్య 54గా ఉండగా, గతేడాది 24కి తగ్గింద న్నారు. ఈ ఏడాది 100 పెట్రోల్‌బంక్‌ల ఏర్పాటు చేస్తున్నామ న్నారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో 100 ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇటీవల రాష్ట్ర జైళ్లను సందర్శించిన బంగ్లాదేశ్, తీహార్‌ జైలు అధికారులు తెలంగాణ జైళ్ల శాఖ పనితీరును అభినందించారన్నారు.

గత ఏడాది రూ. 296 కోట్ల టర్నోవర్‌
జైళ్ల శాఖ శిక్షణా సంస్థ నిర్వహిస్తున్న పరిశ్రమలు, పెట్రోల్‌ బంక్‌ల ద్వారా 2016లో సుమారు రూ. 296 కోట్ల్ల టర్నోవర్‌ సాధించామన్నారు. ఇందులో రూ. 7 కోట్ల  13 లక్షల లాభం పొందినట్లు తెలిపారు.  పిల్లల విద్యా, వివాహాలకు సంబంధించి ఖైదీలకు రూ. 36 లక్షల రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్‌ నర్సింహ, సూపరిం టెండెంట్‌ సైదయ్య, సీకా ప్రిన్సిపల్‌ మురళీబాబు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement