Telangana Prisons Department
-
ఖైదీ కుటుంబాలకు గుడ్‌న్యూస్: ఇకపై నేరుగా
సాక్షి, హైదరాబాద్: ఖైదీ కుటుంబాలకు తెలంగాణ జైళ్ల శాఖ శుభవార్త తెలిపింది. ఆగస్టు 25వ తేదీ నుంచి జైళ్ల శాఖలో ములాకత్‌లు ఉంటాయని జైళ్ల శాఖ డీ.జి రాజివ్ త్రివేది శుక్రవారం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైళ్లల్లో, కేంద్ర కారాగారాల్లో ఖైదీలకు ములాకత్ ఇచ్చేందుకు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో రెండేళ్ల నుంచి ములాకత్‌లను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో ఖైదీలు తమ కుటుంబసభ్యులతో ములాకత్లో కలుసుకునేందుకు వీలు లేకుండాపోయింది. రెండేళ్లుగా కుటుంబీకులతో మాట్లాడలేకపోవడంతో ఖైదీలు కూడా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటివరకు ఖైదీలకు జైలులో వాట్సాప్ వీడియో ములాకత్‌లకు పరిమితం చేశారు. అయితే ఖైదీలు ప్రత్యక్షంగా తమ కుటుంబసభ్యులతో ములాకత్ లేకపోవడంతో మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయంపై ఖైదీలు జైలు శాఖ ఉన్నతాధికారుల ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. జైళ్లల్లో కూడా పరిస్థితులు ప్రశాంతంగా నెలకొనడంతో ములాకత్‌లు పునః ప్రారంభించనున్నారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులను ఖైదీలు ఇకపై నేరుగా కలుసుకోవడానికి అవకాశం లభించనుంది. -
కరోనాపై యుద్ధం... జైళ్ల శాఖ సైతం
చేనేత వస్త్రాలు, కుటీర పరిశ్రమల ద్వారా వస్తువులు, పెట్రోల్ బంకులు..ఇలా సమకాలీన అవసరాలకు తగ్గట్టు ఉత్పత్తులతో తమదైన ముద్ర వేసుకుంటున్న తెలంగాణ జైళ్ల శాఖ కరోనాపై జరిగే యుద్ధంలోనూ పాల్గొంటోంది. వెంటిలేటర్‌కు పూర్తి ప్రత్యామ్నాయం కాకపోయినా శ్వాస తీసుకోలేని కరోనా బాధితులకు కృత్రిమ శ్వాస అందించడానికి ‘మెకానికల్ రెస్పరేటరీ సపోర్ట్ సిస్టమ్’పేరుతో పరికరాన్ని రూపొందించింది. దీన్ని పరీక్షించిన నగరానికి చెందిన ఓ ఆస్పత్రి వైద్యులు సైతం సంతృప్తి వ్యక్తం చేయడంతో అప్రూవల్ కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు లేఖ రాయాలని నిర్ణయించింది. కరోనా బాధితులకు ప్రధానంగా ఊపిరితిత్తులు దెబ్బతిని శ్వాస తీసుకోలేని స్థితికి చేరుకుంటారు. అలాంటి వారికి వైద్యులు వెంటిలేటర్ ద్వారా శ్వాస అందిస్తుంటారు. మానవుడి శ్వాస అన్నివేళలా ఒకే విధంగా ఉండదు. అది తీసుకునే ప్రమాణంలో హెచ్చుతగ్గులు, సమయాల్లో మార్పులు ఉంటాయి. వెంటిలేటర్లో ఉండే మైక్రోప్రాసెసర్ వీటిని ముందుగానే గుర్తించి రోగికి అవసరమైన స్థాయిలో, ఆయా సందర్భాల్లో ఆక్సిజన్‌ను ఊపిరితిత్తులకు పంప్ చేస్తూ ఉంటుంది. – సాక్షి, హైదరాబాద్ ఎక్కువ ధర ఉండటంతో.. ఒక్కో వెంటిలేటర్ రూ.20 లక్షలకు పైగా ఖరీదు ఉండటంతో పాటు ఒకేసారి వీటి ఉత్పత్తిని పెంచేందుకు ఆస్కారం లేకపోవడంతో దిగుమతి చేసుకోవడం ఒక్కటే మార్గంగా మారింది. దీన్ని పరిగణనలోకి తీసుకుని తెలంగాణ జైళ్ల శాఖ ఈ మెకానికల్ రెస్పరేటరీ సపోర్ట్ సిస్టమ్‌ను రూపొందించింది. ఆ శాఖ డీజీ రాజీవ్ త్రివేది ఆలోచన మేరకు చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ దశరథరామిరెడ్డి నేతృత్వంలోని బృందం చర్లపల్లి కేంద్ర కారాగారంలోని స్టెయిన్లెస్ స్టీల్ వర్క్‌షాప్‌లో దీన్ని తయారు చేసింది. ఆదివారం నగరంలోని ఓ ఆస్పత్రిలో వైద్యుల సమక్షంలో దీన్ని పరీక్షించగా..సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఉపకరణం ఆక్సిజన్ సరఫరా వ్యవస్థకు, రోగికి మధ్య అనుసంధానించి ఉంటుంది. దీని ద్వారా రోగికి అందే ఆక్సిజన్ ఫ్రీక్వెన్సీతో పాటు పరిమాణాన్నీ మార్చుకోవచ్చు. రోగికి అందే గాలిలో ఎంతవరకు ఆక్సిజన్ ఉండాలి అనేది నిర్దేశిస్తుంది. ఒక్కో ఉపకరణం తయారీకి గరిష్టంగా రూ.20 వేలు మాత్రమే ఖర్చవుతుందని అధికారులు చెప్తున్నారు. ఐసీఎంఆర్ అప్రూవల్ లభించిన తర్వాత పూర్తిస్థాయిలో తయారీ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 30 ఏళ్ల క్రితం ఘటనే కారణమా? తెలంగాణ జైళ్ల శాఖ ఈ మెకానికల్ రెస్పరేటరీ సపోర్ట్ సిస్టమ్ తయారు చేయడం వెనుక డీజీ రాజీవ్ త్రివేదీకి 30 ఏళ్ళ క్రితం ఎదురైన అనుభవమే కారణం. అప్పట్లో ఆయన సన్నిహితులు ఒకరు చండీగఢ్ నుంచి సిమ్లాకు ప్రయాణించే క్రమంలో రైలు నుంచి పడిపోయారు. దీంతో ఆయనకు వెన్నుపూసలోని సీ4, సీ5 విరిగిపోవడంతో పాటు కార్డెరోపెల్జియాకు లోనయ్యారు. ఈ కారణంగా ఆయన మెడ నుంచి కింది భాగం పూర్తిగా చచ్చుబడిపోయి శ్వాస తీసుకోలేకపోయారు. ఆయనకు చికిత్స చేసిన చండీగఢ్ పీజీఐ వైద్యులు వెంటిలేటర్ అమర్చారు. ఓ దశలో వెంటిలేటర్ల కొరత ఏర్పడటంతో ఆయనకు ఆక్సిజన్ అందించే సిలిండర్‌ను యాంబుబ్యాగ్తో అనుసంధానించారు. బ్లాడర్ మాదిరిగా ఉండే ఆ బ్యాగ్‌ను నొక్కుతూ ఉండాలని పేషెంట్ సన్నిహితులు, అటెండర్లకు సూచించారు. ఇలా రెండ్రోజుల పాటు జరిగిన వ్యవహారంలో కొన్ని గంటల పాటు రాజీవ్ త్రివేది సైతం పాలుపంచుకున్నారు. ప్రస్తుతం కరోనా రోగులకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు, వెంటిలేటర్ల కొరత వార్తలు విన్న రాజీవ్ త్రివేదీకి నాటి యాంబుబ్యాగ్ అనుభవం గుర్తుకొచ్చింది. నిర్విరామంగా ఈ బ్యాగ్ నొక్కుతూ ఉండటానికి ఐసోలేషన్‌లో ఉన్న కరోనా రోగి సమీపంలో ఎవరూ ఉండరు గనుక ఆ పంపింగ్ కోసం డివైజ్‌ను సృష్టించి మెకానికల్ రెస్పరేటరీ సపోర్ట్ సిస్టమ్‌గా మార్చారు. మరో రెండు ఉపకరణాలు కూడా.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ జైళ్ళ శాఖ మరో రెండు ఉపకరణాలనూ తయారు చేసింది. ఇటీవల కాలంలో అనేక ప్రాంతాల్లో సేఫ్ టన్నెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఆయా కార్యాలయాల్లోకి వెళ్ళే వారు వీటి ద్వారానే వెళ్ళాలని స్పష్టం చేస్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు రసాయనాలు పిచికారీ చేస్తూ శరీరం, వస్త్రాలపై ఉన్న వైరస్లు, బ్యాక్టీరియాలు చంపేందుకు ప్రయత్నిస్తున్నారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత అనేక సినిమా హాళ్ళు, మాల్స్, షాపింగ్ సెంటర్లు తదితరాల్లో ఇవి ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న టన్నెల్స్ కేవలం మూడు వైపుల నుంచే రసాయనాలను పిచికారీ చేస్తాయి. వాటి నుంచి వస్తున్న వ్యక్తి చెప్పులు, బూట్లకు కింది భాగంలో అంటుకుని ఉన్నవి చావవు. ఈ నేపథ్యంలోనే పాదాలతో సహా 360 డిగ్రీల కోణంలో రసాయనం పిచికారీ చేసే టన్నెల్‌ను జైళ్ళ శాఖ రూపొందించింది. అలాగే చేతులతో పని లేకుండా, సెన్సర్లు వంటి ఆటోమేటిక్ పరిజ్ఞానాన్ని ఆపరేట్ చేసే శానిటరీ వాష్ బేసిన్లను తయారు చేసింది. కేవలం పెడల్స్ ద్వారానే నీరు, హ్యాండ్ వాష్లను విడుదల చేసే వీటిని ప్రస్తుతం కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సరఫరా చేసింది. వీటిని ఖరీదు చేయాలనే ఆసక్తి ఉన్న వారు తెలంగాణ జైళ్ళ శాఖకు సంప్రదించాలని జైల్స్ డీజీ రాజీవ్ త్రివేది కోరారు. -
కరోనా: ఖైదీలకు జైల్లోకి నేరుగా నో ఎంట్రీ!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ (కరోనా) వైరస్ దెబ్బకు అన్ని శాఖలతో పాటు జైళ్ల శాఖ కూడా అప్రమత్తమైంది. వందలాది మంది ఒకేచోట ఉండే ప్రాంతం కావడంతో వారి ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు జైళ్ల శాఖ ఖైదీల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను కేంద్ర (చంచల్‌గూడ, చర్లపల్లి, వరంగల్) కారాగారాలు, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లా కారాగారాలకు జారీ చేసింది. ముఖ్యంగా కోర్టు విచారణలకు వెళ్లి వచ్చే ఖైదీలకు ప్రత్యేకంగా మాస్కులు ఇస్తోంది. ఇటు ఖైదీతో పాటు వచ్చే ఎస్కార్టు సిబ్బందికీ మాస్కులు ఇస్తున్నారు. (చదవండి: వ్యక్తిగత పరిశుభ్రతతోనే వైరస్‌కు చెక్) కోర్టు వాయిదా అనంతరం వారిని నేరుగా జైలులోకి రానీయడం లేదు. వారికి ప్రత్యేకంగా సబ్బు ఇచ్చి, స్నానం చేసి, దుస్తులు మార్చుకున్నాకే లోపలికి అనుమతిస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ లాంటి సదుపాయాలు ఏర్పాటు చేయకపోయినా.. విపరీతమైన జ్వరం, విడవని జలుబు వంటి కోవిడ్ లక్షణాలను గుర్తించేందుకు జైలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు. అలాంటి లక్షణాలు ఇంతవరకూ ఏ ఖైదీలోనూ బయటపడనప్పటికీ.. ఒకవేళ వెలుగుచూస్తే.. వారిని వరంగల్ ఎంజీఎం లేదా గాంధీ ఆసుపత్రులకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు ముందే సిద్ధం చేసి ఉంచారు. (చదవండి: ‘వైరస్’ మోసుకొస్తున్నారు!) -
జైలు అధికారులకు నయీమ్‌తో సంబంధాలు లేవు
రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వినయ్ కుమార్ సింగ్ హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో జైళ్ల శాఖ అధికారులకు సంబంధాలున్నాయన్న ఆరోపణ ల్లో వాస్తవం లేదని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వినయ్ కుమార్‌సింగ్ అన్నారు. శుక్రవారం చంచల్‌గూడ లోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్(సీకా) కార్యాలయంలో ఏర్పాటు చేసిన 2016 వార్షిక సమా వేశంలో ఆయన పాల్గొని జైళ్ల శాఖ సాధించిన ప్రగతిని గురించి వివరిం చారు. 2014లో జైళ్లలో మరణించిన ఖైదీల సంఖ్య 54గా ఉండగా, గతేడాది 24కి తగ్గింద న్నారు. ఈ ఏడాది 100 పెట్రోల్‌బంక్‌ల ఏర్పాటు చేస్తున్నామ న్నారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో 100 ఫిజికల్ ఫిట్నెస్ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇటీవల రాష్ట్ర జైళ్లను సందర్శించిన బంగ్లాదేశ్, తీహార్ జైలు అధికారులు తెలంగాణ జైళ్ల శాఖ పనితీరును అభినందించారన్నారు. గత ఏడాది రూ. 296 కోట్ల టర్నోవర్ జైళ్ల శాఖ శిక్షణా సంస్థ నిర్వహిస్తున్న పరిశ్రమలు, పెట్రోల్ బంక్‌ల ద్వారా 2016లో సుమారు రూ. 296 కోట్ల్ల టర్నోవర్ సాధించామన్నారు. ఇందులో రూ. 7 కోట్ల 13 లక్షల లాభం పొందినట్లు తెలిపారు. పిల్లల విద్యా, వివాహాలకు సంబంధించి ఖైదీలకు రూ. 36 లక్షల రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఇన్చార్జ్ నర్సింహ, సూపరిం టెండెంట్ సైదయ్య, సీకా ప్రిన్సిపల్ మురళీబాబు తదితరులు ఉన్నారు. -
అదృశ్యం.. హైడ్రామా..!
-
అదృశ్యం.. హైడ్రామా..!
నల్లగొండ /ఖమ్మం క్రైం: నల్లగొండ జిల్లా భువనగిరి సబ్‌జైలు సూపరింటెండెంట్ శ్రీనివాస్ అదృశ్యం ఆద్యంతం హైడ్రామాను తలపించింది. జైళ్ల శాఖ ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక వెళ్లిపోతున్నానంటూ లేఖ రాసి మంగళవారం కనిపించకుండా పోరుున శ్రీనివాస్ బుధవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని బస్టాం డ్లో అపస్మారకస్థితిలో కనిపించాడు. ప్రస్తుతం శ్రీనివాస్ స్నేహితుల సాయంతో ఖమ్మంలోని ఏషియన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అసలేం జరిగింది.. శ్రీనివాస్ కొంతకాలంగా భువనగిరి సబ్‌జైలు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నా డు. ఓ కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలైన ఆలేరుకు చెందిన కిషోర్ వద్ద సబ్ జైలులో పనిచేస్తున్న ఇద్దరు వార్డర్లు నవీన్, కిరణ్‌కుమార్ రూ.వెయ్యి లంచం తీసుకున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. డీఎస్పీ స్థారుు అధికారితో విచారణ నిర్వహించడంతో ఆరోపణలు నిజమని తేలింది. ఈ క్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్‌ను ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట సబ్ జైలుకు, వార్డర్లలో ఒకరిని చంచల్‌గూడ, మరొకరిని వరంగల్ జిల్లా నర్సంపేట జైళ్లకు అటాచ్మెంట్ చేశారు. ఉద్యోగానికి వెళ్తున్నానని.. శ్రీనివాస్ ఉద్యోగానికి రిపోర్ట్ చేసేందుకు ఆదిలాబాద్ జిల్లాకు వెళుతున్నానని భార్య సరితతో చెప్పాడు. భార్యను పుట్టింటికి వరంగల్ జిల్లా కేసముద్రం పంపించి తాను మాత్రం లేఖ రాసి ఇంట్లోపెట్టి అదృశ్యమయ్యూడు. అరుుతే శ్రీనివాస్ సన్నిహితుడి ద్వారా విష యం వెలుగులోకి రావడంతో కలకలం రేపిం ది. విషయం తెలుసుకున్న అతడి భార్య బంధువులు భువనగిరికి వచ్చారు. కాగా, తనకు లక్సెట్టిపేట కాకుండా చంచల్‌గూడ జైలుకు బదిలీ చేయూలని ఉన్నతాధికారులను శ్రీనివాస్ కోరినట్లు సమాచారం. నాపై నింద మోపారు: శ్రీనివాస్ తనను అకారణంగా బదిలీ చేసి, అవినీతి ఆరోపణల నింద మోపారని, దీంతో తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని శ్రీనివాస్ చెప్పా రు. ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ భువనగిరి సబ్జైల్లో ఏడాదిగా పనిచేస్తున్నానని, ఈ క్రమంలో ఈనెల 9న ఆది లాబాద్ జిల్లా లక్సెట్టిపేట సబ్‌జైలుకు బదిలీ చేసినట్లు ఉత్తర్వులు ఇవ్వడంతో షాకయినట్లు చెప్పారు. తనతోపాటు మరో నలుగురు వార్డర్లను బదిలీ చేస్తూ జైళ్లశాఖ డీజీ వీకే.సింగ్ ఉత్తర్వులు జారీ చేశారని, ఉన్నట్టుండి తనను 350 కిలోమీటర్ల దూరం ట్రాన్స్ఫర్ చేయడాన్ని తట్టుకోలేకపోయానని తెలిపారు. ఇదే మనస్తాపంతో మంగళవారం ఇంట్లో లెటర్ రాసి ఎవరికీ చెప్పకుండా ఖమ్మం వచ్చానని, స్నేహితుడు రాఘవేంద్రరావు వచ్చి ఆస్పత్రిలో చేర్చాడని వివరించారు. తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో రాయలేదని, భువనగిరి సబ్‌జైలులో ఉన్న నయీమ్ ముఠా సభ్యులకు సహకరించారనడం అవాస్తవమని అన్నారు. అకారణంగా బదిలీ: శ్రీనివాస్ భార్య కేసముద్రం: ఆదిలాబాద్‌లో విధులకు హాజరవుతానని చెప్పి వెళ్లిన తన భర్త నోట్ రాసి వెళ్లిపోరుునట్లు ఫోన్ వచ్చిందని, సూసైడ్ నోట్ రాసి వెళ్లిపోయాడని వస్తున్న వార్తలను చూసి ఆందోళన చెందానని శ్రీనివాస్ భార్య సరిత అన్నారు. తన భర్తకు అకారణంగా ఏడాదిలోపే బదిలీ ఉత్తర్వులు ఇచ్చారని, అందుకే మానసికవేదనకు లోనై అదృశ్యమయ్యాడని సరిత చెప్పింది. జైళ్ల శాఖ డీఐజీ, ఇన్చార్జి ఐజీ నర్సింహా స్పందించి తిరిగి అదే స్థానంలో పని చేసే విధంగా చూస్తామని చెప్పినట్లు అతడి మామ గోవర్ధన్ చెప్పారు. అవినీతిని సహిం చేది లేదని ఆకుల నర్సింహా స్పష్టం చేశారు. బుధవారం భువనగిరి సబ్‌జైలును పరిశీలించి మీడియూతో మాట్లాడారు. అవినీతి అధికారులపై చర్యలు తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వీకేసింగ్ హైదరాబాద్: అవినీతి అధికారులు, సిబ్బం దిపై చర్యలు కొనసాగుతాయని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్ బుధవారం ‘సాక్షి’తో అన్నారు. డీజీ వేధిం పులకు గురి చేస్తున్నాడంటూ నల్లగొండ జిల్లా భువనగిరి సబ్ జైలు అధికారి శ్రీనివాస్‌రావు లేఖరాసి అదృశ్యమైన నేపథ్యంలో ‘సాక్షి’ ప్రతినిధితో డీజీ వినయ్‌కుమార్ మాట్లాడారు. అవినీతికి పాల్పడుతున్నాడంటూ శ్రీనివాస్‌రావుపై ఇద్దరు ఖైదీలు జైళ్ల శాఖ ప్రత్యేకటీమ్కు ఫిర్యాదు చేశారని, దీనిపై రంగారెడ్డి జిల్లా జైళ్ల శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ దశరథన్ను విచారణాధికారిగా నియమించి సమగ్ర నివేదిక తీసుకున్నట్లు చెప్పారు. శ్రీనివాస్‌రావుపై వచ్చిన ఫిర్యాదులు వాస్తవమని తేలడంతో అతనిని ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట్ సబ్ జైలుకు బదిలీ మాత్రమే చేశామన్నారు. -
జీవిత ఖైదీలకు క్షమాభిక్ష: నాయిని
జనవరి 26న కొంతమందికి క్షమాభిక్ష పెడతామని వెల్లడి చంచల్‌గూడ జైల్లో నూతన భవనాల ప్రారంభం హైదరాబాద్: జీవిత ఖైదు అనుభవిస్తున్న కొంతవుంది ఖైదీలకు వచ్చే ఏడాది జనవరి 26న క్షవూభిక్ష పెట్టనున్నట్లు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. చంచల్‌గూడ జైల్లో ఇటీవల నూతనంగా నిర్మించిన భవనాలను నారుునితో పాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వూట్లాడుతూ జైళ్ల శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన విద్యాదాన్ కార్యక్రమం ద్వారా 1,000 మంది ఖైదీలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దారన్నారు. తెలంగాణ జైళ్ల శాఖ ఇటీవల చేపట్టిన సైకిల్ యాత్రను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభినందించారన్నారు. రూ. 10 కోట్లతో నిర్మించిన ఈ భవనాల్లో ఖైదీల బ్యారెక్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జైళ్ల శాఖ ప్రతిష్టను పెంచేందుకు డీజీ వినయ్‌కుమార్ సింగ్ చేసిన కృషి అభినందనీయమన్నారు. మీడియాపై కేసులు పెట్టిస్తా: జైల్లో జరిగిన సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి సహనం కోల్పోయి విలేకరులపై చిందులు వేశారు. ఆయన మీడియా, జర్నలిస్టులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హోంమంత్రిని శాంతపరిచి సమావేశం మధ్యలోనే వెనుదిరిగారు. చంచల్‌గూడ జైలు తరలింపుపై మంత్రులు విభిన్న ప్రకటనలు చేస్తున్నారని, రూ. 10 కోట్లతో నిర్మించిన నూతన భవనాల టెండర్ల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయని ఓ చానల్ విలేకరి ప్రశ్నించగా.. ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆధారాలుంటే విచారణ జరిపిస్తామన్నారు. అనవసర ఆరోపణలు చేస్తే మీడియాపై కూడా కేసులు పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో డీజీ వినయ్‌కుమార్ సింగ్, డీఐజీ ఆకుల నరసింహ, సూపరింటెండెంట్లు సైదయ్య, వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ డీఐజీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.