జీవిత ఖైదీలకు క్షమాభిక్ష: నాయిని
జనవరి 26న కొంతమందికి క్షమాభిక్ష పెడతామని వెల్లడి
చంచల్‌గూడ జైల్లో నూతన భవనాల ప్రారంభం
హైదరాబాద్: జీవిత ఖైదు అనుభవిస్తున్న కొంతవుంది ఖైదీలకు వచ్చే ఏడాది జనవరి 26న క్షవూభిక్ష పెట్టనున్నట్లు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. చంచల్‌గూడ జైల్లో ఇటీవల నూతనంగా నిర్మించిన భవనాలను నారుునితో పాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వూట్లాడుతూ జైళ్ల శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన విద్యాదాన్ కార్యక్రమం ద్వారా 1,000 మంది ఖైదీలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దారన్నారు. తెలంగాణ జైళ్ల శాఖ ఇటీవల చేపట్టిన సైకిల్ యాత్రను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభినందించారన్నారు. రూ. 10 కోట్లతో నిర్మించిన ఈ భవనాల్లో ఖైదీల బ్యారెక్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జైళ్ల శాఖ ప్రతిష్టను పెంచేందుకు డీజీ వినయ్‌కుమార్ సింగ్ చేసిన కృషి అభినందనీయమన్నారు.
మీడియాపై కేసులు పెట్టిస్తా: జైల్లో జరిగిన సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి సహనం కోల్పోయి విలేకరులపై చిందులు వేశారు. ఆయన మీడియా, జర్నలిస్టులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హోంమంత్రిని శాంతపరిచి సమావేశం మధ్యలోనే వెనుదిరిగారు. చంచల్‌గూడ జైలు తరలింపుపై మంత్రులు విభిన్న ప్రకటనలు చేస్తున్నారని, రూ. 10 కోట్లతో నిర్మించిన నూతన భవనాల టెండర్ల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయని ఓ చానల్ విలేకరి ప్రశ్నించగా.. ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆధారాలుంటే విచారణ జరిపిస్తామన్నారు. అనవసర ఆరోపణలు చేస్తే మీడియాపై కూడా కేసులు పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో డీజీ వినయ్‌కుమార్ సింగ్, డీఐజీ ఆకుల నరసింహ, సూపరింటెండెంట్లు సైదయ్య, వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ డీఐజీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.