Deputy chief Mohammed Ali
-
పది కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లు
మైనారిటీలకు పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్ నియామక ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పలు నామినేటేడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. పది రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లకు చైర్మ న్లను నియమిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి నామినేటెడ్ పదవుల భర్తీలో మైనారిటీలకు పెద్దపీట వేశారు. ప్రకటించిన పది కార్పొరేషన్లలో ఐదింటిని మైనారిటీలకే కట్టబెట్టారు. ఇవన్నీ రాష్ట్ర స్థాయి పదవులు కావడం, కీలక పదవులు దక్కడంతో అధికార టీఆర్ఎస్లోని మైనారిటీ నేతల్లో ఆనందం వ్యక్తమైంది. తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న వారితో పాటు ముఖ్య నేతల అనుచరులకు కూడా పదవులు దక్కాయి. రాజ్యసభ ఎంపీ కేశవరావు కుమారుడు విప్లవ్కుమార్కూ పదవి దక్కడం గమనార్హం. కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పది కార్పొరేషన్ల చైర్మన్ పదవుల్లో సగం మైనారిటీలకు కేటాయించడం ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందంటూ.. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీలు సీఎం కేసీఆర్ వెంటే ఉంటారని ఎమ్మెల్సీలు ఫరీదుద్దీన్, ఫారూక్ హుస్సేన్, హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మైనారిటీలకు సరైన లబ్ధి కలిగిందని ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. -
రాష్ట్రాభివృద్ధి కోసం ప్రార్థించండి
- హజ్ యాత్రికులను కోరిన డిప్యూటీ సీఎం - మక్కాకు బయలుదేరిన తొలి విమానం సాక్షి, హైదరాబాద్ : పవిత్ర హృదయంతో రాష్ట్రాభివృద్ధి, సుఖశాంతుల కోసం మక్కాలో ప్రార్థించాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హజ్ యాత్రికులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ క్యాంప్ వద్ద ‘హజ్ యాత్ర-2016’ను ఆయన ప్రారంభించారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయంలోని హజ్ టెర్మినల్ వద్ద ఎయిర్ ఇండియా విమానానికి జెండా ఊపి యాత్రికులను సాగనంపారు. తొలి విమానంలో 340 మంది యాత్రికులు బయలు దేరారు. ప్రార్థనలు విజయవంతంగా ముగించుకొని సుఖ సంతోషాలతో తిరిగి రావాలని ఆకాం క్షించారు. మక్కా మదీనా లోని కాబా వద్ద ప్రపంచంలో ఎవరికీ దక్కని అతిథి మర్యాదలు హైదరాబాదీలకు లభిస్తాయన్నారు. నిజాం ప్రభువు కాబాకు సమీపంలో రుబాత్ అతిథి గృహాన్ని నిర్మించడంతో అప్పటి నిజాం స్టేట్‌లోని తెలంగాణ రాష్ట్ర యాత్రికులను అతిథులుగా గుర్తిస్తారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హజ్ యాత్రికుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుతం హజ్ యాత్ర కోసం రూ.3 కోట్లు కేటాయించామని, అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేసేందుకు సిద్ధమన్నారు. కార్యక్రమంలో ఆలిండియా హజ్ కమిటీ చైర్మన్ చౌదరి మహమూద్‌అలీ ఖైసర్, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్, ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ సలీమ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ పాల్గొన్నారు. -
రెవెన్యూ పనులకూ కాలపరిమితి!
♦ 12 అంశాలతో రెవెన్యూ పాలసీకి కసరత్తు ♦ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వెల్లడి సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక విధానం, ఐటీ విధానం మాదిరిగానే రెవెన్యూశాఖకు సంబంధించి కూడా కొత్త విధానాన్ని (పాలసీ) తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) మహమూద్ అలీ తెలిపారు. మొత్తం 12 అంశాలతో పాలసీకి త్వరలో రూపకల్పన చేయనున్నట్లు చెప్పారు. పారిశ్రామిక, ఐటీశాఖల తరహాలోనే రెవెన్యూశాఖలోనూ ప్రతి పనికీ నిర్దేశిత కాలపరిమితిని విధించాలని యోచిస్తున్నామని...గడువులోగా పనులు చేయకుంటే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకునే అంశాన్ని ఇందులో పొందుపరచాలనుకుంటున్నామన్నారు. రెవెన్యూ పాలసీ రూపకల్పన, విధానాల అమలుపై చర్చించేందుకు నెలాఖరులోగా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశ మవుతున్నట్లు మహమూద్ అలీ వివరించారు. నూతన పాలసీ ద్వారా రెవెన్యూ వ్యవస్థలో తీసుకురానున్న సంస్కరణల గురించి ఆదివారం ఆయన విలేకరులకు వివరించారు. ఇతర ప్రభుత్వ విభాగాలతో పోల్చితే రెవెన్యూ వ్యవస్థ పనితీరు మెరుగ్గానే ఉందన్నారు. ముఖ్యంగా సమగ్ర కుటుంబ సర్వే, ఆసరా పెన్షన్లు, భూముల క్రమబద్ధీకరణ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్.. తదితర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో రెవెన్యూ సిబ్బంది కీలకపాత్ర పోషించారని కితాబిచ్చారు. గత రెండేళ్లుగా తమ ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా ఈ శాఖలో ఉన్నత(అధికారుల) స్థాయిలో అవినీతిని పూర్తిగా అరికట్టగలిగామని...కానీ క్షేత్రస్థాయిలో అవినీతి పెరిగిందని ఫిర్యాదులు వస్తున్నాయని మహమూద్ అలీ పేర్కొన్నారు. కొత్త రాష్ట్రంలో ఉద్యోగులు పనితీరును మార్చుకునేందుకు కొంత గడువు ఇచ్చామని, ఇకపై ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. కాగా, భూ వివాదాలు, కుటుంబాల్లో ఆస్తుల విభజన సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి జిల్లాకు ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని మహమూద్ అలీ చెప్పారు. అలాగే తహ సీల్దార్లు, రెవెన్యూ డివిజన్ అధికారులకు సొంత వాహనాలు సమకూర్చే అంశం పరిశీలనలో ఉందని... వీఆర్ఏలకు కనీస వేతనం, ఇతర సదుపాయాలు కల్పించాలనుకుంటున్నామన్నారు. -
రెవెన్యూ అంటే సేవ.. వసూళ్లు కాదు
♦ బాగా పనిచేస్తే అవార్డులిస్తాం.. ప్రజలను ఇబ్బంది పెడితే శిక్షిస్తాం ♦ ‘మా భూమి’ పోర్టల్ ఆవిష్కరణలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ అంటే ప్రజలకు సేవ చేయడమేనని, వారి వద్ద నుంచి సొమ్ములు వసూలు చేయడం ఎంత మాత్రం కాదని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖా మంత్రి మహమూద్ అలీ చెప్పారు. బుధవారం భూ పరిపాలన కార్యాలయంలో ‘మా భూమి’ ప్రజా పోర్టల్‌తో పాటు మరో మూడు రెవెన్యూ వెబ్సైట్లు... ‘లోన్ చార్జ్ మాడ్యూల్, రెక్టిఫికేషన్ మాడ్యూల్, సీసీఎల్ఏ’లను ఆయన ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... ‘జననం నుంచి మరణం వరకు ప్రజల జీవితంలో ఎన్నో అంశాలు రెవెన్యూ శాఖతోనే ముడిపడి ఉన్నాయి. ఎంతో కీలకమైన ఈ వ్యవస్థలో బాగా పనిచేసే వారికి అవార్డులిస్తాం. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిని కఠినంగా శిక్షిస్తాం. ఆసరా, ఆహార భద్రత, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ , మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ.. తదితర ప్రభుత్వ పథకాలన్నీ రెవెన్యూ శాఖ సహకారంతోనే విజయవంతంగా అమలవుతున్నాయి. నూతన పారిశ్రామిక విధానం మాదిరిగానే రెవెన్యూ సేవలన్నీ ప్రజలకు నిర్ధేశిత సమయంలో లభించేలా నూతన రెవెన్యూ విధానాన్ని త్వరలో తెస్తాం. ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టిన భూముల రీసర్వేను రెండేళ్లలో పూర్తి చేస్తాం. దీని కోసం సర్వే విభాగంలో ఖాళీగా ఉన్న 2,500 సర్వేయర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆదేశాలిచ్చాం’ అన్నారు. ప్రతి వ్యక్తీ తన భూమి వివరాలను ఇంట్లో నుంచి తెలుసుకునేలా మా భూమి పోర్టల్, ఇతర వెబ్సైట్లు రూపొందించిన రెవెన్యూ, ఎన్ఆర్ఎస్ఏ అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు. సీసీఎల్ఎ రేమండ్ పీటర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, సీసీఎల్ఏ కార్యదర్శి రవీంద్రబాబు, హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ హోళీకేరి, డిప్యూటీ కలెక్టర్లు సత్యశారద, నిఖిల, రఘురామ్‌శర్మ, తహసీల్దార్ల సం ఘం అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి పాల్గొన్నారు. ఆవిష్కరించిన వెబ్సైట్ల వివరాలివీ... మా భూమి ప్రజాపోర్టల్ రాష్ట్రంలోని ఏప్రాంతంలో ఉండే రైతయినా తన భూమికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో చూసుకునేందుకు అవకాశం కల్పి స్తూ.. కొత్తగా‘మా భూమి’ప్రజాపోర్టల్ను సీసీఎల్ఏ రూపొందించారు. ఈ పోర్టల్‌లో సర్వే, ఖాతా, ఆధార్ నంబర్లు, పట్టాదారు పేర ు తదితర వివరాలను ఎంటర్ చేస్తే రైతుకు కావల్సిన వ్యక్తిగత పహాణీ ప్రత్యక్షమవుతుంది. అలాగే ఆర్వోఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) 1-బి, టిప్పన్ (సర్వే నంబరు కొలతలు) తదితర రికార్డులు డిజిటలైజ్డ్ కెడస్ట్రియల్ విలేజ్ మ్యాప్ (గ్రామ పట ం)లను కూడా ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. లోన్ చార్జ్ మాడ్యూల్ వ్యయ ప్రయాసలు లేకుండా రైతులు వ్యవసాయ రుణాలు పొందేలా లోన్ చార్జ్ మాడ్యూల్‌ను రూపొందించారు. రైతు లేదా కౌలు రైతు బ్యాంకుకు వెళ్లి తాను సాగు చేస్తున్న భూమి సర్వే నంబరును అధికారులకు చెబితే చాలు.. బ్యాంకు అధికారులు తమ వెబ్సైట్లో పరిశీలించి వెంటనే రుణం మంజూరు చేస్తారు. దీనికోసమని సీసీఎల్ఏ వెబ్‌ల్యాండ్ డేటాబేస్‌ను బ్యాంకులకు లింక్ చేస్తున్నారు. సర్వే నంబరును ఎంటర్ చేస్తే సదరు భూమి సొంతదారు/హక్కుదారు/కౌలుదారు, సాగుచేస్తున్న పంట, భూమి విస్తీర్ణం, గతంలో వేరే ఏవైనా ఇతర బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారా.. తదితర వివరాలన్నీ అందులోనే ప్రత్యక్షమవుతాయి. రెక్టిఫికేషన్ మాడ్యూల్ మా భూమి పోర్టల్‌లో తమ భూముల రికార్డులను చూసుకున్న యజమానులు వాటిలో (సర్వే నెంబర్లు, పట్టాదారు పేరు, విస్తీర్ణం తదితర వివరాలు) తప్పులున్నట్లు గమనిస్తే సరిచేసుకునేందుకు రెక్టిఫికేషన్ మాడ్యూల్‌ను రూపొందించారు. సీసీఎల్ఏ వెబ్సైట్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం వెబ్‌సైట్‌ను కొత్తగా రూపొందించారు. సీసీఎల్ఏ సమాచారంతో పాటు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, భూ భారతి, యూఎల్సీ విభాగాల సమాచారాన్ని కూడా ఇందులో పొందుపరిచారు. -
డిప్యూటీ సీఎం ఇలాకాలో పతంగి పాగా
మలక్‌పేట... దిల్సుఖ్నగర్: మలక్‌పేట్ నియోజకవర్గంలో ఎంఐఎం మరోసారి పట్టు నిలుపుకొంది. మొత్తం 6 డివిజన్లకుగాను నాలుగు డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. గత బల్దియా ఎన్నికల్లో ఎంఐఎం మూడు డివిజన్లు సాధించగా ఈ సారి మరో సీటును అదనంగా గెలుపొందడం విశేషం. కాగా ఇదే నియోజకవర్గ పరిధిలోని ఆజంపురా డివిజన్‌లోనే డిప్యూటీ సీఎం మహమూద్ అలీ నివాసం ఉంది. ఆయన తన సొంత ఇలాకాలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలమయ్యారు. గత బల్దియా ఎన్నికల్లో మూడు డివిజన్లలో ఎంఐఎం, మూడు డివిజన్లలో టీడీపీ, ఒక స్థానంలో ఎంబీటీ గెలుపొందింది. ఈసారి పునర్విభజనతో డివిజన్ల సంఖ్య ఆరుకు తగ్గినా ఎంఐఎం తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకుంది. కాగా గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకుంది. మూసారాంబాగ్‌లో తీగల సునారితారెడ్డి, సైదాబాద్ నుంచి సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి టీఆర్ఎస్ తరఫున ఘన విజయం సాధించడం విశేషం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ 11378 ఓట్లు సాధించగా, తాజా ఎన్నికల్లో 26 వేల పైచిలుకు ఓట్లు సాధించి ఓటు బ్యాంక్‌ను గణనీయంగా పెంచుకోగలిగింది. గతంలో నియోజకవర్గంలో తిరుగులేని తెలుగుదేశం పార్టీ ఈ సారి తుడుచుపెట్టుకుపోవడం గమనార్హం. పార్టీ తరఫున హేమాహేమీలు బరిలోకి దిగినా పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో అజాంపురా నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లాఖాన్ ఈ సారి అక్భర్భాగ్ డివిజన్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. -
మీ పెద్దన్నగా సమస్యలు పరిష్కరిస్తా
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కాంగ్రెస్, టీడీపీ-బీజేపీలకు ఓటేస్తే అది వ్యర్థమే గచ్చిబౌలి: ‘మీ పెద్దన్నగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తాన’ని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రజలకు భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ కొండాపూర్ డివిజన్ అభ్యర్థి హమీద్ పటేల్ తరఫున మార్తాండనగర్‌లో ఆయన శనివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్తాండనగర్‌లోని పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని హమీ ఇచ్చారు. ఇక్కడున్న గుడిసెలను ఎవరూ కూల్చివేయరని వారికి భరోసా ఇచ్చారు. ఎన్నికల అనంతరం అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు, కరెంట్ మీటర్లు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. పేదల సంక్షేమమే అజెండాగా ముందుకు వెళ్తున్న టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీడీపీ, కాంగ్రెస్‌లకు ఓటేస్తే అది వ్యర్థమవుతుందని విమర్శించారు. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్కు ప్రజలు పట్టం కట్టారని, గ్రేట్ర్లోనూ ఘన విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హమీద్‌పటేల్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిపిస్తే డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, విజయరామరాజు, స్థానిక నాయకులు మమత, రాణి, అప్సరబేగం పాల్గొన్నారు. -
జీవిత ఖైదీలకు క్షమాభిక్ష: నాయిని
జనవరి 26న కొంతమందికి క్షమాభిక్ష పెడతామని వెల్లడి చంచల్‌గూడ జైల్లో నూతన భవనాల ప్రారంభం హైదరాబాద్: జీవిత ఖైదు అనుభవిస్తున్న కొంతవుంది ఖైదీలకు వచ్చే ఏడాది జనవరి 26న క్షవూభిక్ష పెట్టనున్నట్లు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. చంచల్‌గూడ జైల్లో ఇటీవల నూతనంగా నిర్మించిన భవనాలను నారుునితో పాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వూట్లాడుతూ జైళ్ల శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన విద్యాదాన్ కార్యక్రమం ద్వారా 1,000 మంది ఖైదీలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దారన్నారు. తెలంగాణ జైళ్ల శాఖ ఇటీవల చేపట్టిన సైకిల్ యాత్రను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభినందించారన్నారు. రూ. 10 కోట్లతో నిర్మించిన ఈ భవనాల్లో ఖైదీల బ్యారెక్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జైళ్ల శాఖ ప్రతిష్టను పెంచేందుకు డీజీ వినయ్‌కుమార్ సింగ్ చేసిన కృషి అభినందనీయమన్నారు. మీడియాపై కేసులు పెట్టిస్తా: జైల్లో జరిగిన సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి సహనం కోల్పోయి విలేకరులపై చిందులు వేశారు. ఆయన మీడియా, జర్నలిస్టులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హోంమంత్రిని శాంతపరిచి సమావేశం మధ్యలోనే వెనుదిరిగారు. చంచల్‌గూడ జైలు తరలింపుపై మంత్రులు విభిన్న ప్రకటనలు చేస్తున్నారని, రూ. 10 కోట్లతో నిర్మించిన నూతన భవనాల టెండర్ల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయని ఓ చానల్ విలేకరి ప్రశ్నించగా.. ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆధారాలుంటే విచారణ జరిపిస్తామన్నారు. అనవసర ఆరోపణలు చేస్తే మీడియాపై కూడా కేసులు పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో డీజీ వినయ్‌కుమార్ సింగ్, డీఐజీ ఆకుల నరసింహ, సూపరింటెండెంట్లు సైదయ్య, వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ డీఐజీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.