మీ పెద్దన్నగా సమస్యలు పరిష్కరిస్తా | Solve problems as your elder brother | Sakshi
Sakshi News home page

మీ పెద్దన్నగా సమస్యలు పరిష్కరిస్తా

Published Sun, Jan 31 2016 12:52 AM | Last Updated on Fri, Aug 10 2018 6:45 PM

మీ పెద్దన్నగా సమస్యలు పరిష్కరిస్తా - Sakshi

మీ పెద్దన్నగా సమస్యలు పరిష్కరిస్తా

డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
కాంగ్రెస్, టీడీపీ-బీజేపీలకు ఓటేస్తే అది వ్యర్థమే
 
 గచ్చిబౌలి: ‘మీ పెద్దన్నగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తాన’ని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రజలకు భరోసా ఇచ్చారు. టీఆర్‌ఎస్ కొండాపూర్ డివిజన్ అభ్యర్థి హమీద్ పటేల్ తరఫున మార్తాండనగర్‌లో ఆయన శనివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్తాండనగర్‌లోని పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని హమీ ఇచ్చారు. ఇక్కడున్న గుడిసెలను ఎవరూ కూల్చివేయరని వారికి భరోసా ఇచ్చారు.

ఎన్నికల అనంతరం అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు, కరెంట్ మీటర్లు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. పేదల సంక్షేమమే అజెండాగా ముందుకు వెళ్తున్న టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీడీపీ, కాంగ్రెస్‌లకు ఓటేస్తే అది వ్యర్థమవుతుందని విమర్శించారు. ఉద్యమ పార్టీగా టీఆర్‌ఎస్‌కు ప్రజలు పట్టం కట్టారని, గ్రేట్‌ర్‌లోనూ ఘన విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హమీద్‌పటేల్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిపిస్తే డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, విజయరామరాజు, స్థానిక నాయకులు మమత, రాణి, అప్సరబేగం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement