Home minister Nayini
-
జీవిత ఖైదీలకు క్షమాభిక్ష: నాయిని
జనవరి 26న కొంతమందికి క్షమాభిక్ష పెడతామని వెల్లడి చంచల్‌గూడ జైల్లో నూతన భవనాల ప్రారంభం హైదరాబాద్: జీవిత ఖైదు అనుభవిస్తున్న కొంతవుంది ఖైదీలకు వచ్చే ఏడాది జనవరి 26న క్షవూభిక్ష పెట్టనున్నట్లు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. చంచల్‌గూడ జైల్లో ఇటీవల నూతనంగా నిర్మించిన భవనాలను నారుునితో పాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వూట్లాడుతూ జైళ్ల శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన విద్యాదాన్ కార్యక్రమం ద్వారా 1,000 మంది ఖైదీలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దారన్నారు. తెలంగాణ జైళ్ల శాఖ ఇటీవల చేపట్టిన సైకిల్ యాత్రను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభినందించారన్నారు. రూ. 10 కోట్లతో నిర్మించిన ఈ భవనాల్లో ఖైదీల బ్యారెక్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జైళ్ల శాఖ ప్రతిష్టను పెంచేందుకు డీజీ వినయ్‌కుమార్ సింగ్ చేసిన కృషి అభినందనీయమన్నారు. మీడియాపై కేసులు పెట్టిస్తా: జైల్లో జరిగిన సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి సహనం కోల్పోయి విలేకరులపై చిందులు వేశారు. ఆయన మీడియా, జర్నలిస్టులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హోంమంత్రిని శాంతపరిచి సమావేశం మధ్యలోనే వెనుదిరిగారు. చంచల్‌గూడ జైలు తరలింపుపై మంత్రులు విభిన్న ప్రకటనలు చేస్తున్నారని, రూ. 10 కోట్లతో నిర్మించిన నూతన భవనాల టెండర్ల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయని ఓ చానల్ విలేకరి ప్రశ్నించగా.. ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆధారాలుంటే విచారణ జరిపిస్తామన్నారు. అనవసర ఆరోపణలు చేస్తే మీడియాపై కూడా కేసులు పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో డీజీ వినయ్‌కుమార్ సింగ్, డీఐజీ ఆకుల నరసింహ, సూపరింటెండెంట్లు సైదయ్య, వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ డీఐజీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మానుకోట బంద్ విజయవంతం
మహబూబాబాద్ : మానుకోటను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎనిమిది రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. విద్యా, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. బంద్‌కు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. బంద్ రోజునే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి పర్యటన కూడా ఉండటంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డారుు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సీపీఐ నాయకుడు రేశపల్లి నవీన్ ఆధ్వర్యంలో తెల్లవారుజామునే స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన చేశారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీపీఐ, బీజేపీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, టీడీపీ, బీఎస్పీ ఆధ్వర్యంలో పట్టణంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బి.విజయసారథి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి భూపతి మల్లయ్య, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి యాప సీతయ్య, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసి డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రవి, బీఎస్పీ డివిజన్ అధ్యక్షుడు దార్ల శివరాజ్, సీపీఐ (ఎంఎల్) డివిజన్ కార్యదర్శి హెచ్.లింగ్యానాయక్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మానుకోటను జిల్లాగా ప్రకటించకపోవడం దారుణమన్నారు. జిల్లా సాధించుకునేంత వరకు ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు బి.అజయ్, చుక్కల ఉదయ్‌చందర్, మార్నేని రఘు, దాస్యం రాంమూర్తి, పెరుగు కుమార్, పాండురంగాచారి, మేక వీరన్న, చింతకుంట్ల వెంకన్న, శ్యాం, సుబ్బారావు, లూనావత్ అశోక్, రాఘవులు, రాజశేఖర్ రెడ్డి, భద్రయ్య, కొత్తపల్లి రవి, ఎస్కె.బాబు, గుజ్జు దేవేందర్, తాజ్‌పాషా, ఆదిల్, మురళి, రేఖ రమేష్, తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు గుగులోత్ రాములు నాయక్, పట్టణ అధ్యక్షుడు సప్పిడి రంజిత్ మాట్లాడుతూ అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరన్నారు. అన్ని హంగులతో మానుకోటను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సోమ నరేందర్ రెడ్డి, రఫి (లడ్డు), శ్రీఖర్ (పటాన్), నవీన్, ఖాజాపాషా, బూర్గుల పాప య్య, రాజా, శ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి జెన్నారెడ్డి భరత్చందర్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు ముల్లంగి ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ భూక్య ఉమ, గుగులోత్ సుచిత్ర, గిరిధర్‌గుప్తా, బా నోత్ రవి నాయక్, బానోత్ ప్రసాద్, వాహెద్, సంపంగి రాంచంద్రు, చిదిరాల జ్ఞానేశ్వర్, సింగం మనోహర్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల బంద్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలను మూసివేరుుంచారు. కార్యక్రమంలో నాయకులు చింతకుంట్ల యా కాంబ్రం, పైండ్ల యాకయ్య, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో పట్టణంలో మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సూర్యప్రకాష్లోయ, జయప్రకాష్లోయ, శ్యాంలో య, పున్నంచంద్ మాల్పాని, బిజ్జుగోపాల్, శర్మ, షవర్తన్ కలంత్రి, వ్యాపారులు పాల్గొన్నారు. -
ఉద్వాసన ఎవరికో..!
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై చర్చలు ♦ కొత్తవారికి అవకాశాలపై ఊహాగానాలు ♦ అమాత్య పదవులపై ఆశలు రేకెత్తిస్తున్న సీఎం ♦ మొన్న రసమయికి.. నిన్న కొప్పులకు హామీ సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి మండలి నుంచి ఉద్వాసన ఎవరికి.. కొత్తగా మంత్రిమండలిలో అవకాశం ఎవరెవరికి, అసలు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు.. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు విస్తృతంగా జరుగుతున్న చర్చే ఇది. పార్టీ అధినేత, సీఎం చంద్రశేఖర్‌రావు ఒక్కో సందర్భంలో ఒక్కో కొత్త పేరును తెరైపైకి తెస్తూ.. మంత్రులను చేస్తానంటున్నారు. ఆయా వర్గాల ప్రజలను సంతృప్తి పరిచేందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాౄ.., లేక నిజంగానే మంత్రివర్గాన్ని విస్తరించి కొత్త వారికి అవకాశం కల్పిస్తారా అన్నదానిపై టీఆర్ఎస్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే సీఎం కేసీఆర్ బహిరంగ వేదికలపైనే ఈ ప్రకటనలు చేశారు కాబట్టి.. కచ్చితంగా త్వర లోనే కేబినెట్ విస్తరణ ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. సాంస్కృతిక సారథిగా ఉన్న కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను మంత్రిని చేస్తానని సీఎం గతంలోనే ప్రకటించారు. తాజాగా కరీంనగర్ జిల్లా ధర్మపురిలో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ .. ‘ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ మంత్రి అవుతారు..’ అని ప్రకటించారు. వాస్తవానికి టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కొప్పుల ఈశ్వర్ పేరును ఉప ముఖ్యమంత్రి పదవికి పరిశీలించారు. కానీ కరీంనగర్ జిల్లా నుంచి కేటీఆర్, ఈటల రాజేందర్‌లకు బెర్తులు ఖరారుకావడంతో కొప్పుల వెనుకబడిపోయారు. అనూహ్యంగా వరంగల్ జిల్లాకు చెందిన టి.రాజయ్య డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన ను బర్తరఫ్ చేసిన తర్వాత అదే జిల్లాకు చెందిన కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చారు. ఈ రెండు పరిణామాల తర్వాత ఇక కొప్పుల ఈశ్వర్‌కు మంత్రివర్గంలో స్థానం ఉండదన్న అభిప్రాయం వచ్చింది. కానీ తాజాగా కొప్పులకు మంత్రి పదవి ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు. ఎవరి పీఠం కిందకు నీళ్లు? నిబంధనల మేరకు సీఎం సహా మొత్తం మంత్రుల సంఖ్య 17కు మించకూడదు. ఈ కారణంగానే కేసీఆర్ ‘పార్లమెంటరీ కార్యదర్శు’ల పదవులకు ఊపిరి పోశారు. కానీ, హైకోర్టు తీర్పుతో అది తుస్సుమన్నది. ఇప్పుడు వారందరినీ ఎలా సర్దుబాటు చేయాలనే దానిపైనే స్పష్టత లేదు. ఈలోగానే రెండు కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. దీంతో మంత్రి వర్గం నుంచి ఎవరిని తొలగిస్తారన్న ప్రశ్న తలెత్తింది. జంట నగరాల నుంచి నలుగురు మంత్రి వర్గంలో ఉన్నారు. టీఆర్ఎస్లో, బయటా జరుగుతున్న ప్రచారం మేరకు హోంమంత్రి నాయిని, ఎక్సైజ్ మంత్రి పద్మారావుగౌడ్ల సేవలను పార్టీకి వాడుకుంటారని అంటున్నారు. అదే నిజమైతే వారి స్థానంలో కొత్త వారిని తీసుకునే అవకాశముంది. కాగా, ఇప్పటికే కరీంనగర్ నుంచి కేటీఆర్, ఈటలలు మంత్రివర్గంలో ఉన్నారు. ఇటీవల సీఎం పేర్కొన్న రసమయి, కొప్పుల కూడా కరీంనగర్ వారే. మరి ఒకే జిల్లా నుంచి కేబినెట్లో నలుగురికి అవకాశం దక్కుతుందా అన్నది సందేహాస్పదంగా మారింది. -
విశ్వ నగరంగా మార్చే క్రమంలోనే...
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్) : హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగానే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం బాగ్‌లింగంపల్లి డివిజన్లోని సుందరయ్య పార్కులో నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో నాయిని నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వచ్ఛ హైదరాబాద్‌లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.